అరే జానీబాయ్..గాదిక్కు జూసిసనవా..అమ్మాయిలు మస్తుగున్నరు’ జర్దాపాన్ నముల్తూ కసిగా కామెంట్ చేశాడు ఆటోవెనుకసీట్లో వున్న జాఫర్. జానీ ఆ అమ్మాయిలిద్దరినీ చూస్తూనే ..ఔబయ్ మస్తుదినాలాయె ..బకరాల్లెక్క వున్నరు పటాయించుడే..ఆటోని అమ్మాయిల ముందు ఆపాడు. ఆటోదిగిన జాపర్ –ఏడకు బోవాలె.. అడిగాడు.అమ్మాయిలిద్దరూ బెదురుకళ్లతో చూశారు. రాన్రి ఎక్కున్రి ..జాఫర్ తొందర పెట్టాడు. అమ్మాయిలు మాట్లాడలేదు.
జాఫర్జానీలిద్దరూ క్రిమినల్సే.ఆటోని అడ్డం పెట్టుకుని దోపిడీ మానభంగాలు చేయడం వాళ్ల వృత్తి ప్రవృత్తికూడా. వస్తరా రారా..అసహనంగా అడిగాడు జాని. మా అన్నస్తనన్నడు.. ఒకమ్మాయి చెప్పింది. జాఫర్ జానీకి కన్ను కొట్టాడు.జానీ ఆటోని కదిలించాడు. బస్టాపులోవున్న మిగతా ప్రయాణికులందరూ సిటీబస్సుల్లో వెళ్లిపోయారు.అమ్మాయిలిద్దరే మిగిలిపోయారు.అరగంట గడిచిపోయింది. మళ్ళీ అటో తెచ్చి అమ్మాయిలముందు ఆపారు.మీ అన్నపతాలేడు.. .?యాడకుబోవాలె?ఓ అన్నలాగ అడిగాడు. మల్కాజిగిరి పోవాలె.ఒకఅమ్మాయి నోరిప్పింది. మాది భీ ఆడనే!నమ్మ బలికాడు జాఫర్. రెండో అమ్మాయి తన చేతిలోవున్న కాగితాన్నిజాఫర్ చేతికి అందించింది. ఓ.. అనుటెక్స్ ..మాది యిల్లు భీ ఆడనే.ఎక్కున్రి.. హుషారు చేశాడు జాఫర్.. డ్రైవర్ సీట్లోవున్న జానీకి సిగ్నల్ యిస్తూ. ఎంతయితదన్నా? మొదటి అమ్మాయి అడిగింది. తీన్సౌ..జానీ చెప్పాడు. గంతనా ?గుడ్లు తేలేసింది. మాఅన్న ఏక్ సౌ అయితదని చెప్పిండు ..మరీ గింతనా?చీటీ యిచ్చిన అమ్మాయి ..మావల్లకాదన్న లెవెల్లో బేరం చేసింది. దేడ్ సౌ ..ఓకెనా ?జాఫర్ బేరానికొచ్చాడు. మాతాన గంతలే..మాఅన్నొస్తడని అ చ్చినం.మాతాన గన్ని పైసల్లే...తన నిస్సహాయతను వ్యక్తం చేసిందో అమ్మాయి. జానీ ..జాఫర్ని గిల్లాడు...జాఫర్ ప్లేటు మార్చాడు ! మేంసుత ఆడికే బోతున్నం..మల్కాజిగిరి చేరినంక మల్లీ బేరంగిట్ట చేయకున్రి..మస్తు టైం వేస్టయిపాయె..ఎక్కున్రి...
అమ్మాయిలిద్దరూ ఇక అన్న రాడని కన్ఫం చేసు కున్నారు. నెమ్మదిగ కదిలి ఆటో ఎక్కారు. జాఫర్ ఒక్కసారిగా ఆటోని ముందుకు దూకించాడు. అన్నా జర తుకారాం గేట్ రాంగనే చెప్పున్రి ..ఆడ మా అన్నుంటడు..
రిక్వెస్ట్ చేసిందో అమ్మాయి . అయ్యో!మీకెరిక లేదా ? గాదారి బంద్ బెట్టి మస్తు దినాలాయె..రాంకిస్టాపూర్ బిడ్జి మీంచి బోవాలె..చాలా రెక్లెస్ గా చెప్పాడు జానీ.
గట్లైతే మల్కాజిగిరొద్దు తుకారాంగేట్ తాన దించేయున్రి..ఇద్దరూ ఒక్కసారే గట్టిగా అరిచినంత పనిచేశారు. ఇంకెక్కడ తుకారాంగేటు ? బిరిడిజి తానకొచ్చినం లొల్లిసేయకున్రి ,,గదమాయంచాడు జాఫర్. మేం మాఅన్నను కలవాలె ..గీడ ఆపున్రి ...గుక్క పెట్టేశారు అమ్మాయిలు ..జాఫర్ సైగతో హేండిల్బార్ యిచ్చి
రన్నింగ్ లోనే వెనుక సీట్లోకి జంప్ చేశాడు జానీ అమ్మాయిలకి అర్దమై పోయింది తాము ట్రాప్ చేయబడ్డామని..గట్టిగా ఏడుపు మొదలు పెట్టారు. ఖామోష్ ! లొల్లి బెట్టిన్రా ముకాన యాసిడ్ పోస్త..జేబులోంచి యాసిడ్బాటిల్ ,చాకు బయటకు తీశాడు. వాటిని చూస్తూనే పైప్రాణాలు పైనే పోయినట్లు కళ్లు తేలేశారు.
జాఫర్ ఆటోని బ్రిడ్జి దాటించి లెఫ్ట్ కు కట్చేసి నిర్మానుష్యంగా వున్నతుమ్మపొదల్లోకి దూసుకుపోయి, ఓ పాడు పడిన బిల్డింగ్ ముందు ఆపేశాడు. అమ్మాయిలిద్దరూ ఆటో సీట్లకే అతుక్కుపోయారు. జాఫర్ జానీలు జేబుల్లోంచి లిక్కర్ బాటిల్స్ తీసుకొని ..రా..కొట్టేసి బూతుప్రేలాపనలతో పేట్రేగి పోయారు.
ఆటో దిగి రండే! అరదగంటలో యిడిచేస్తం..నయీంగాని గ్యాంగు లెక్క రేప్ చేసినంక బ్లూ సిన్మాగిట్ట తీసెటోళ్లంగాదు ..రవూఫుగానిలెక్క సిన్మా తీసినంక పాతబస్తిలో అమ్మెటోల్లంగాదు..గిది మాఅడ్డ.గీడ కాలుబెట్టుడంటే పోలీసులే పరేషానైతరు .ఇద్దరూ తూలుకుంటూ వచ్చి అమ్మాయిల్ని ఆటోలోంచి బయటకు లాగేయబోతూ ఒక్కసారిగా వెనక్కి విరుచుకు పడిపోయారు.
స్ర్కీన్ బ్లాంకై పోయింది . లైట్సు ఆనయ్యాయి.
************* ****** **********
కోటీ విమెన్స్ కాలేజి ఇండోర్ స్టేడియం . డయాస్ మీద ప్రిన్సిపాల్తోబాటు
సిటీ పోలీస్ కమీషనర్, సిటీ షీ టీం అధికారి ఆసీనులై వున్నారు. సిటీలోవున్న అన్ని విమెన్స్ కాలేజీల నుండి వచ్చిన స్టూడెంట్ డెలిగేట్స్ తో ఆడిటోరియం క్రిక్కిరిసి పోయింది .అందరి హర్షధ్వానాలమధ్య
షీ టీం అధికారిణి మైకుముందుకొచ్చి అందరినీ విష్ చేసింది.
ఇప్పటి వరకు జరిగిన కథ చూశారు .ఈకథకు నాందీ ప్రస్తాపన చెప్పి ముగింపును కూడా చెప్తే తప్ప ప్రయోజనముండదు! పోయినవారం అపాయింట్మెంటు తీసుకొని ఈ కాలేజీ అమ్మాయిలు యిద్దరు నన్ను
కలిసి షీ టీం గురించి అడిగారు. వివరంగా చెప్పాను .వాళ్లు ఉపయోగించే సి సి కెమేరాలగురించి ఆత్మరక్షణకు వాడే పెప్పర్ స్ర్పే క్లోరోఫాం స్ర్పే ల గురించి వివరించాను . అప్పుడు వాళ్లు జి పి యస్ గరించి అడిగారు. ఆశ్చర్య పోయాను . ఇప్పటికీ ఆ సివ్టం గురించి మా డిపార్టుమెంటు వాళ్లల్లోచాలా మందికి అవగాహనే లేదు .
హౌ డు యు నో అని అడిగాను. నెట్ అన్నారు . దటీజ్ యూత్ అనుకున్నాను .
ఇంత సెక్యూరిటీ డివైజ్ లు వున్నాయి..కదా ..మేడం! మేమూట్రై చేస్తాము అంటూ మరో మాట అన్నారు.. అదేమిటో మీలో ఎవరైనా వూహించగలరా ? నో..ఐ నో..! కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది.
ఇందు గలడందు లేడను సందేహము వలదు ఎందెందు వెదికి చూసిన అందందే కలడు ..అంటారు కదా మేడం ! అతడెవరో చెప్పగలరా? ప్రశ్నించారు. తెలీదన్నాను..
చిరునవ్వు నవ్వారు . స్టూడెంట్.. అన్నారు. షేక్ హ్యాండిచ్చాను.
మేడం! మన షీ టీం మెంబర్స్ ఓ వందమంది . వాళ్లూ మాలా ఆడపిల్లలే .మాకూ వాళ్లకూ తేడా ట్రైనింగ్..
మాకూ కొంచెం ట్రైనింగిచ్చి సర్వాంతర్యాములమైన మమ్ముల్ని కూడా ఉపయోగించుకుంటే లా అండ ఆర్డర్ కుఉపయోగ పడకపోయినా ర్యాగింగ్ ,విమెన్ ట్రాఫికింగ్ ,ఆటోవాలాలు చేసే అట్రాసిటీస్ వంటి వాటిని అరికట్టడానికిమేం కూడా మాశక్తిని డొనేట్ చేయడానికి సిధ్దం అన్నారు. అవాక్కయ్యాను.పబ్బుల్లో, ఫేస్ బుక్కుల్లో జీవితాలువేష్ట్ చేసుకుంటున్న నేటి యూతే వీళ్లంటే నమ్మశక్యం కాలేదు..చూద్దాం అనుకున్నాను.డిపార్టుమెంటుఅనుమతితో ట్రైనింగ్ యిప్పించాను. రిజల్టు మీరే చూశారు.జానీ జాఫర్లను మాదైన శైలిలో సత్కరిస్తే దాదాపుపాతికమంది దోస్తుల అడ్రస్ లు చెప్పాడు. అందరిమీదా ..రౌడీషీట్ ఓపెన్ చేశాం ..యిప్పుడందరూచెర్లపల్లి జైల్లోఊచలు లెక్కబెడుతున్నారు. లెటజ్ వెల్కం హీరోయిన్స్ ఆఫ్ ద ఫంక్షన్...
కరతాళధ్వనులమధ్య సత్య..సిరి..డయాస్ మీదకొచ్చి అందర్నీ విష్ చేసి మైకు ముందుకొచ్చారు.మా ట్రైనింగ్ అయిపోయింది .కొండంత ధైర్యం వచ్చింది .ఈమధ్య యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాలేజీఅమ్మాయిలదగ్గర సెల్ ఫోన్లతోబాటు సేఫ్టీగేడ్జట్సు వుంటున్నాయని భయపడు తున్నారని న్యూస్ లో చెప్పారు..అందుకే పల్లెటూరిపిల్లలమయ్యాం. రెండోసారి ఆటో రాగానే మాకు అనుమానం వచ్చింది.బేగ్ లో వున్న సిసి కెమేరాతో బాటు జీపియస్కనెక్టివిటి ఆన్ చేశాం. ఆన్ చేయగానే మేం ట్విన్ సిటీస్లోవున్న అన్ని పోలీస్ స్టేషన్లతోబాటు షీ టీంమెంబర్ల స్మార్ట్ పోనుల్తోనూ కనెక్ట్ అవుతామని షీ టీం మెంబర్స్ మమ్మల్ని వెపన్స్ తో షాడోలా ఫాలో అవుతారని మేడం చేప్పినట్లే జరిగింది.ఆ బద్మాషులు మమ్మల్ని ఆటో దింపాలని టచ్ చేయబోతుండగానే క్లోరోఫాం స్ర్పే ఆన్ చేశాం. ఇద్దరూ క్షణాల్లోవిరుచుకు పడిపోయారు,,తిరిగి చూస్తే షీ టీం మెంబర్లు కమ్మేశారు. ఇందులో మా గొప్పదనం ఏమీ లేదు.ఎవ్విరితింగ్ గోస్ టూ మేడం అండ్ టెక్నాలజీ...జై హంద్...హాలంతా చప్పట్లేచప్పట్లు! కమీషనర్ ఆఫ్ పోలీస్ షేక్ హ్యాండిచ్చి డిపార్టుమెంటు తరఫున ఫ్రశంసా పత్రాలతోబాటు షీల్డులిచ్చారు.షీ టీం మేడం పొంగి పోతూ మైకు ముందుకొచ్చారు. డియర్ స్టూడెంట్స్! ఇదీ కధ. వీరు చూపినధైర్యం..ఒరవడి మా షీ టీం కొక నూతన ఉత్తేజాన్ని కలిగించాయ్ . .వీళ్ల సూచనప్రకారం స్టూడెంట్స్ వింగ్ ప్రారంభిస్తున్నాం..దానికి వీళ్లిద్దరి పేర్లతో ..సత్యసిరి ప్రొటెక్షన్ వింగని ..నామకరణం చేస్తున్నాం. మీలో ధైర్యసాహసాలున్న ప్రతి ఒక్కరినీ సభ్యులుగా ఆహ్వానిస్తున్నాము. స్వఛ్చభారత్ అంటే చెత్త లేని దేశం కాదు! జానీజాఫర్ల వంటి చెత్తగాళ్లు లేని దేశం అని అర్దం. స్వఛ్చభారత్ సాధనకు ..ఆర్యూ రెడీ ?
యస్ మేం.!.వియార్ రెడీ .!..ముక్త కంఠంతో నినదించారు ..విధ్యార్దినులు.