మానవ సేవే - శ్రీధర శర్మ

manavaseve

రవి పక్క ఊరు రామాపురం గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు . ఆ రోజు కూడ యధావిధిగా క్యారేజీ తో స్కూల్కు బయలు దేరాడు. బస్సులు ఒక్కక్కటి బద్దకంగా డిపోలోంచి బయటకు వచ్చి పాయింట్ వద్ద నిలబడుతున్నాయి. రవికి సిగరెట్ తాగేవారన్న, అడుక్కునే వారాన్న పరమ చిరాకు. అందుకే వాళ్ళను చుస్తే ఒక రకమైన అలర్జీ అతనికి.

అప్పటికే ఒకరిద్దరు అడుక్కునే వాళ్ళను కేకలేసి పంపేసిన అతని దగ్గరకు పెద్ద తరహాగా ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చి పక్కన కూర్చుని ఒక బుక్కు అందిచాడు . మనిషి తెల్ల బట్టలు వేసుకొని చూడగానే మర్యాదస్తుడిలా కనిపిస్తున్నాడు. ఆయన ఇచ్చిన బుక్కు తీసి చూడసాగాడు రవి . అందులో మనుషుల పేర్లు, వారి అడ్రస్సులు , వారిచ్చిన డబ్బుల తాలూకు వివరాలు వున్నాయి . “బాబు మీకు తోచినంతా అందులో వ్రాయండి “ అన్నాడు. ఒక్కసారిగా రవికి కోపం పెరిగిపోయింది . “చుట్టానికి పెద్దమనిషిలా ఉన్నావు. ఇలా కొత్త స్టైల్ లో అడుక్కోవడానికి సిగ్గుగా లేదు . నీలాంటి వారికీ ఒక్క రూపాయి కూడా ధర్మం చేయను పో “ అన్నాడు . రవి వేసిన కేకలకు అక్కడ జనం పోగయ్యి ఆ పెద్దాయనను పంపించి వేసారు . అ పెద్ద మనిషి మాత్రం నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. రవి వెళ్ళాల్సిన బస్సు రావడంతో స్కూల్ కు వెళ్లి పోయాడు.

క్లాసులో వున్న రవికి ఇంటి నుంచి ఫోన్ రావటంతో బయటకు వచ్చి ఫోన్ తీసాడు . “ఏ మండి పొద్దున్న స్కూల్ కు వెళ్ళిన మన అమ్మాయి స్కూలు చేరలేదంట . ఇప్పుడే క్లాసు టిచర్ ఫోన్ చేసి చెప్పింది. మీరు వెంటనే రండి నాకు భయంగా వుంది”. ఎడుస్తూ చెప్పింది రవి భార్య సుజాత . వెంటనే హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని బయలు దేరాడు. బస్టాండ్ పార్కింగ్ లో పార్క్ చేసిన బండి తీసుకోని పాప స్కూల్ కు వెళ్ళిన దారి వెంట వెతుకుతూ బయలు దేరాడు. ఒక ఇంటి ముందు పాప సైకిల్ కనిపించిది. బైక్ స్టాండ్ వేసి గేటు తీసుకోని ఇంటిలోకి వెళ్ళాడు . హాల్లో మంచంపై పాప పడుకొని వుంది . పక్కనే ఒక పెద్దావిడ పాప తల నిమురుతూ కూర్చుంది. రవిని చూడగానే ఏమి మాట్లాడవద్దని సైగ చేసి వరండా లోకి తీసుకోని పోయింది . “బాబు మీరు ఆ పాప నాన్న?” అని అడిగింది. అవును అన్నట్లు తల వుపాడు రవి .

“పొద్దున్నే అమ్మాయి స్కూల్ కు వెళుతుంటే అటో ఒకటి గుద్దేసి పోయిందంట. మా ఇంటాయన చూసి తీసుకొచ్చాడు” అంది . “అయన ఎక్కడండి?” అని అడిగాడు రవి . “డాక్టరును తీసుకొస్తానని వెళ్ళాడు” అని చెప్పింది ఆవిడ . “అయన ఏం చేస్తుటాండు “ మళ్ళి అడిగాడు రవి.

“ మా అయన రిటైర్డ్ టిచర్ . మా పిల్లలిద్దరూ అమెరికా లో సెటిల్ అయ్యారు. మమ్ములను కూడా అక్కడకు వచ్చేయమన్నారు కానీ అయన మాత్రం వెళ్ళడానికి ఇష్టపడక ఇక్కడే వుండి సమాజ సేవ చెస్తూన్నాడు. ఆయన తన పెన్షన్ డబ్బులతో , దాతలు ఇచ్చిన డబ్బులతో సమాజ సేవ చేస్తు అందులోనే అనందాన్ని పొందుతున్నాడు . పైగా తనకు డబ్బులిచ్చిన వాళ్ళకు తప్పకుండ రసీదులు కూడ పంపటం ఆయనకు అలవాటు .” చెప్పుకొచ్చింది ఆ పెద్దావిడ.

ఇంతలో ఆ పెద్దావిడ భర్త డాక్టరుని తీసుకొచ్చాడు. ఆ పెద్దాయనను చుసిన రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను మరెవరో కాదు పొద్దున తను బస్టాండ్లో చీద రించుకొన్న ఆ పెద్దాయనే.

పాపను పరీక్ష చేసిన డాక్టర్ “ మరేమీ పరవాలేదు, కేవలం షాక్ కు గురికావడం వల్ల పాప స్పృహ కోల్పోయినది. మరొక రెండు గంటల్లో అంతా నార్మల్ అవుతుంది” అని చెప్పి వెళ్ళిపోయాడు.

“సార్ నన్ను మన్నిచండి. మీ గురుంచి తెలియక పొద్దున అలా మాట్లాడను. మీ గురించి అమ్మగారు చెప్పింది విన్నాక మిమ్ములను అలా మాట్లాడినందుకు సిగ్గు పడుతున్నాను” అన్నాడు రవి చెమర్చిన కళ్ళతో.

“చూడు బాబు నాకు ఇది మాములే. నేను ఈ సేవ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పటినుండి ప్రతి ఒక్కరు మొదట్లో నీలాగే మాట్లడి తర్వాత తమ తప్పు తెలుసుకొని మారిపోయిన వాళ్ళే. భిక్షగాళ్ళకు నీకు వీలైతే సాయం చేయి లేక పొతే మానేయి. అంతేగాని వాళ్ళని చులకనగా చూడవద్దు.” అన్నాడు.

ఇదిగో “మొన్నీమధ్య ఇదు వందల రూపాయిలు ఇచ్చిన అ అమ్మాయి అడ్రస్సు నా డైరీ లో వుంది అది నాకు చెప్పి మాకు కాఫీ తీసుకొనిరా” అన్నాడు పెద్దాయనను.

అలమరాలోంచి డైరీ తీసి ఆమె అడ్రస్సు చదవసాగింది. “ శ్రీమతి సుజాత, వైఫ్ ఆఫ్ రవి, గవర్నమెంట్ హైస్కూల్, రామాపురం”. పెద్దాయన చకచక అడ్రస్సు కవరు మీద రాసి పాప తాలుకు వైద్యానికి అయిన బిల్లుల తాలుకు రసిదులను అందులో పెడుతున్న ఆ పెద్దాయనను వారించాడు రవి. ఎందుకు అన్నట్లు చూసాడు ఆ పెద్దాయన. “సార్ మీరు పంపాల్సిన కవర్ నాకు చెందినదే ఆ సుజాత మరెవరో కాదు నా భార్యే. నా భార్య ఇచ్చిన ఇదు వందల రూపాయిలు నాకుతురికే ఉపయోగ పడింది” అంటూ ఆ పెద్దాయనను పట్టుకొని ఏడ్చాడు రవి.

ఏడుస్తున్న రవిని పెద్దాయన ఓదారుస్తూ అన్నాడు “ మానవసేవే మాధవ సేవ”

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల