పద్దయ్య పట్టుపంచె - నిర్మలాదేవి గవ్వల

paddayya's towel
పని మీదపట్నం వెళుతున్న రాయుడి దగ్గరకి పద్దయ్యహడావుడిగా వచ్చి,
రాయుడూ పట్నంలొ నాకో పట్టుపంచె కొనుక్కరావోయ్, పైనెల్లొ ఇంట్లో ఓశుభకార్యం ఉంది ,అవతల ఇంట్లో ఉన్న పంచెలన్నీ పాత బడ్డాయ్,.. అంటూ రాయుడి చేతిలొ వెయ్యి రూపాయలు ఉంచి హడావుడీగా వెళ్లిపోయాడు.
పద్దయ్య రాయుడికి బాబాయివరస అవుతాడు. నిజానికి రాయుడుకి జీవితంలొజేబు రుమాలు కొన్న అనుభవంకూడాలేదు .అతనికి కావలిసిన సమస్తమూ అతని భార్య విమలే సమకూర్చిపెడుతుంటుంది.పైగా రాయుడు అంతా ఇంతా అనరానంత మొహమాటస్తుడు కూడాను.ఇంతలో బాడుగ బండివాడు కేక వేయడంతో లోపల పనిలో వున్నవిమలతొ పద్దయ్య గురించి చెప్పే సమయం లేకపోయింది. .ఏదయితెఅదవుతుందనిహుటాహుటిన బయలు దేరాడు.
పట్నంలొ తన పని ముగిసాక వస్త్ర దుఖాణం వైపు వెళ్లాడు. రాయుడ్ని చూస్తునె దుఖాణం యజమాని ,"రండి బాబుతమరికేం కావాలి ",,అంటూ మర్యాదగా ఆహ్వానించాడు.రాయుడు తనకు పట్టుపంచె కావాలనె సరికి,"మంచి సమయానికే వచ్చారు.ఈరోజె కంచిపట్నం నుండిపట్టుపంచెల బేళ్లు దిగాయి.నిఖార్సయిన జరీఅదీ ,మీరు ఆలోచించాల్సి పనెలేదు మొదటి బోణీ మీదె",అంటూ బేల్లలోనుండి ఒక పంచెను తీసి చూపించాడు. మెరుస్తున్న జరిఅంచుతొ పంచె బాగానె కనిపించింది రాయుడికి."మరి వెల ఎంతొ చెప్పండి ",అన్నాడు.
"మొదటి బేరం మీదె.అందుకని వెయ్యి రూపాయల పంచె మీకు ఎనిమిది వందలకె ఇస్తు న్నా " అంటూ టపా టపా పంచెను కాగితంలొ చుట్టి రాయుడి చేతిలొ పెట్టాడు.రాయుడు ఎనిమిది వందలు ఇస్తు రసిదు ఇవ్వండి,ఇది వేరొకరికోసం కొన్నది రసిదు వాళ్లకు చూపించాలికదా,అన్నాడు.అందుకు అంగడి వాడు రాయుడి దగ్గరకంటా వచ్చి గుసగుసగా,మాకు వ్యాపారంలొ పన్నులు గట్రా లావాదేవిలు ఉంటాయి అర్ధం చేసుకోండి అంటు సణిగాడు.చెసేది లేక పంచె తీసుకొని వూరికి తిరగు ప్రయాణమయ్యాడు. ఊరి మొగదల్లొనె ఎదురు చూస్తూ పద్దయ్యకనిపించాడు. రాయుడు పంచె ఉన్నపొట్లం మిగిలిన రెండువందలు పద్దయ్య చేతిలొ పెట్టి హమ్మయ్య అనుకున్నాడు.పద్దయ్యకూడా రెండు వందలు మిగిలినందుకు సంతొషించి పంచె తీసుకొని వెళ్ల పోయాడు.
రాయుడు ఇంటికకెళ్లాక భార్యకి విషయం చెప్పాడు. ఫర్వాలేదె పట్టు పంచె కొనె ఎత్తుకి ఎదిగిపోయారె అంటు ఎకసక్కాలాడింది. రాయుడిక్కూడా ఎక్కడలేని భరొసా వచ్చింది..ఇకనుండి నాదుస్తులు నేనెకొనుక్కొ గలను తెలుసా అన్నాడు విమలతొ నవ్వుతు...మరసటి రోజు పొద్దునే పొలానికి నీళ్ళు వదలడానికి వెళుతున్న రాయుడికిఅల్లంత వెనకాల నుండి,ఆగవయ్యా రాయుడు అంటు వగరుస్తు పరుగుపరుగున వస్తున్నపద్దయ్యకనిపించాడు.
పద్దయ్య రాయుడి దగ్గరికి వచ్చి,"రాయుడూ నువ్వు దుఖాణంలొ పంచె వెలిపించి చూసావా లేదా,ఒకచోట పోగు బయటికెళ్లింది..,అన్నట్టు రసీదు నీవద్ద ఉందిగా ఈసారి పట్నం వెళ్లి నపుడు పంచె తీసుకెళ్లి వాడికి చూపించి,మరొకటి తీసుకోవచ్చులె,అయినా ఏం మనిషి వయ్య అంగట్లోనె ఇలాటి వన్నీ చూసుకోవాలని తెలియక పోతె ఎలా..."అన్నాడుచిటపట లాడుతు. దారంట వెళు తున్న వాళ్లు కూడా ఆగి మరీ వేడుక చూసి వెళు తుండంతొ రాయుడికి తల కొట్టెసినంత పనయింది .ఇక తను రసీదు తిసుకోలెదన్న విషయం చెప్తె ఇంకెంత రాద్దాంతం చేస్తాడో అని రాయుడు భయపడు తుండగా అదృష్ట వశాత్తు పద్దయ్య మనమడొచ్చి బామ్మ పిలు స్తోంది రమ్మనిచెప్పడంతొ పద్దయ్య అక్కడ్నుంచి కదిలాడు.బ్రతుకు జీవుడా అని రాయుడు ఇంటికొచ్చివిమలకి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించాడు.
అంతా విన్న విమల అగ్గి మీద గుగ్గిలం అయింది."మగ్గంమీది పట్టు వస్త్రాలంటె ఒకటీ అరా పోగులు వెళ్లకుండా వుంటాయా,అక్కడకి పోగు కత్తిరిస్తే అయిపోయే దానికి బజార్లొ నిల పెట్టి ఇంతయాగీ చేస్తాడా. ఇప్పుడే వెళ్లి ఎనిమిది వందలు అతని ఎదాన కొట్టి ఆపంచె మీరు తె చ్చేసుకోండి",అన్నది.రాయుడు ఎనిమది వందలు తీసుకొని పద్దయ్య ఇంటకి వెళ్లాడు. కాని పద్దయ్య ఇంట్లో లేడు. అలా కాలికి బలపం కట్టుకొని మూడు రొజులు అతని ఇంటి చు ట్టూ తిరిగితె కాని పద్దయ్య దర్శనం కాలేదు రాయుడికి.
వసారాలొతీరిగ్గాపడక్కుర్చీలొ కూర్చుని దినపత్రిక చదువు తు కనిపించాడు పద్దయ్య.రాయుడ్ని చూస్తునె ,రావోయ్ ఇలా కూర్చొఏమిటిలా వచ్చావ్ అంటు సాదరంగా ఆహ్వానించాడు.పద్దయ్యమొహంలొ ఎక్కడలేని ప్రశాంతత కనిపించింది.రాయుడు తేలిక పడి,"మరేం లేదు నేను తెచ్చినపంచె నీకు నచ్చలేదుకదా విమల డబ్బు ఇచ్చి పంచె తెచ్చేసుకోమంది.ఇదిగో ఎనిమిది వందలు.,"అన్నాడు. దానికి పద్దయ్య పకపక నవ్వుతూ ఇంకెక్కడి పంచెయ్యా బాబు.. నిన్న పొరుగూరు చుట్టమొకడు చుట్టపు చూపుగా వచ్చాడు అతనికి పంచె చూపించాను,ఓతెగముచ్చటపడి ఎంతయినా ఇస్తాను తనకు ఆపంచె కావాలన్నాడు,ఏముంది వెయ్యి రుపాయలకి అతనికంటగట్టేసాను.మురిసిపోతు చంకనెట్టుకొని అదెపోత," అన్నాడు తిరిగి నవ్వుతూఅందుకురాయుడు, " అయ్యో అదేంటి మధ్యొ పోగేదొ వెళ్లిందన్నావుగా అతడు వెలిపించి చూపమనలేదా,అన్నాడు
.అసలు ఆపోగొ పెద్ద సమస్య కాదు,సుతారంగా కత్తి రించా ఆనవాలు తెలియకుండా పంచె భేషుగ్గా తయారయిందనుకొ.పంచె నేనేఉంచేఉంచేసుకుందామనుకున్నా కాని రెండొందలు వస్తున్నాయికదా ఎందుకొదులు కోవాలి.ఎలాగూ అడపాతడపా నువ్వుపట్నం వెళుతూనె ఉంటావు ఈసారి తెప్పించుకుంటె పోయె,ఏమంటావ్, " అనిఆపాడు.అంతావింటున్న రాయుడు,' అమ్మ బాబయ్ నీకంటె దుఖాణం వాడు వెయ్యరెట్లునయం న్యాయమైనధర కిచ్చాడు. ,' అని మనసులొ అనుకున్నాడు. తిరిగి పద్దయ్య అందుకున్నాడు.పెద్దవాడిగాచెప్తున్నావిను.అసలుఈఅనుభవంతో నువ్వు నెర్చుకొవల్సినగుణపాటాలురెండుఉన్నయ్ ,అదేమిటంటెఒకటి,ఏదయినా వస్తువు కొనాలని అంగడి కెళ్లి నపుడు దానిబాహొగులు అక్కెడే క్షుణ్ణంగా పరిశీలించాలి,ఇక రెండవగుణపాఠం ఏంటంటె,అంగడి వాడి మాయ మాటలు నమ్మకూడదు,అలాగేదబాయంచి రసీదు పుచ్చుకోవాలి.అర్ధమయందా,అని ఆగాడు.
అంత వరకు మౌనంగా ఉన్నరాయుడు ఒక్కసారిగా గొంతు సవరించుకొని గట్టిగా,"బాబాయ్ ఈ అనుభవంతో నేను నేర్చుకున్న గుణపాఠాలు రెండుకాదు మూడు , " అన్నాడు .పద్దయ్య పరమాశ్చర్యంతో , "మూడాఅదేంటది ," అన్నాడు.వెంటనె రాయుడు అందుకుని, "మూడొది ఏంటంటెఎవరేపని చెప్పినా మొహమాటం కొద్దితలకెత్తుకుని చేయ కూడదన్నది.ఇక వెళ్లస్తా",..అంటు వీధి వైపు ఠీవిగా అడుగు లేసాడు అలా నడుస్తున్న ప్పడు ఇన్నాళ్ళు తన్ను పట్టిపీడిస్తున్న మొహమాట మనె జాడ్యం అయిపు లెకుండా వదిలి పోయిందన్న తేలికభావం అతనిలొ కలిగంది.
అలా వెళిపొతున్న రాయుడ్ని చూసి అమాయకుడైన వీడ్ని ఉత్తి పుణ్యానికి ఎంత రొష్టు పెట్టానని,రెండొందలకి కక్కర్తిపడి బంగారంలాంటి పంచెను పోగొట్టుకొన్నాను అని నీరసం గా పడక్కుర్చీలొ కూలపడ్డాడుపద్దయ్య.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ