కను విప్పు - భాస్కర్ కాంటేకర్

reailise
మొబైల్ లో టైప్ చూస్తూ కూర్చుంది చిత్ర.
బస్ కుదుపులతో ముందుకు సాగిపోతోంది, మున్సిపాలిటీ వారి కార్య దీక్షతను ఎండగడుతూ.
బస్సులో అన్ని సీట్లు నిండి ఉన్నవి.ఒకరిద్దరు నిలబడి ఉన్నారు. లాక్ డౌన్ తరువాత పరిస్థితి. సామాజిక దూరం పాటించాలి, మాస్కులు కూడా ధరించాలి కానీ బస్సులో సాధ్యం అయ్యేది ఎలా? కానీ ఎవరి అవసరాలు వారివి.ఎవరి ప్రధాన్యతలు వారివి.
తాను కూర్చున్న సీటుకు ముందు ఉన్న సీటు వృద్దులకు మరియు వికలాంగులకై కేటాయించబడినది.ఆ సీటులో ఒక వయసు పైబడిన పెద్దాయన, చూడటానికి ముసలాయనలా కనిపిస్తున్నాడు. ఆయన పక్కన ఇంకో అబ్బాయి కూర్చొని వున్నారు.ఆ పెద్దాయన ఆ సీట్లో కూర్చున్నడంటే ఎదో అర్థం ఉంది కాని ఆ అబ్బాయి ఇక్కడేందుకు కూర్చున్నాడో అర్థం కాలేదు చిత్రకు.
ఇది హైద్రాబాదుల్లాంటి మహానగరంలో మాములే అనిసర్దుకుంది.
రెండు స్టాపుల్లో జనం ఎక్కేవరకు బస్సంతా చూస్తుండగానే నిండిపోయింది.నిల్చోవడానికి కూడా సాధ్యపడనంత జనం. తూలడాలు,తోసుకోవడాలు ,కసరింపులు, ఎబ్బెట్టు చూపులు అన్ని మొదలయ్యాయి.
సిటీ బస్ గోల ,అనుభవించేవారికే తెలుస్తుంది.
బస్సు ఒకో స్టాపు దాటుకుంటూ భారంగా వెళుతుంది.
చిత్ర మాత్రం తన స్మార్ట్ ఫోన్ టైపింగ్ లో నిమగ్నమయిపోయింది. టైపింగ్ తొందరగా పూర్తి చేసి, ఆధార్ అప్లోడ్ చేస్తే తన పని అయిపోతుంది .
తనది లాస్ట్ స్టాప్ కావడం వలన ,తనకు గమ్య స్తానం మిస్సవుతుందన్న భయం లేదు.
బస్సు ఏదో స్టాప్ లో ఆగింది.ప్రయాణికులు ఎక్కువయ్యారు.
ఒకావిడ జనాన్ని తోసుకుంటూ ముందుకుకి వస్తుంది.చేతిలో సంచి, ఒక సంకలో చిన్న పిల్లవాడు. పైగా చూడబోతే గర్భవతిలాగున్నది. ఎలాగో కష్టపడి ముందు డోర్ నుంచి జనాలని తోసుకుంటూ , నా వరకు వొచ్చింది. నాకు పాపం అనిపించింది.లేచి సీటు ఇవ్వాలనుకొన్నాను.కానీ నే పూర్తి చేయాల్సిన టైపింగ్,అప్లోడ్ చేయాల్సిన డాకుమెంట్స్ అవి గుర్తుకు వచ్చి ఆమెకు సీటీవ్వాలనుకున్న ఆలోచనను మానుకొన్నాను.
నిజానికి నేను ఆ అమ్మాయికి సీటు ఇచ్చేదానిని కానీ నే నిలబడి మొబైల్ లో పని చేసుకుందామంటే , ఆ బీడులో సాధ్యంకాని పని.అలా అని పని వదిలేసి ఇంట్లో రెండవ ప్రపంచ యుద్ధానికి స్వాగతము పలుకలెను.పొద్దున్నే ఆఫీస్ కి బయలుదేరినప్పుడు మా ఆయన చెప్పిన ప్రాసెస్ పూర్తి చేయల్సినదే!
####$$
"కోరానా సహాయం అని ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పదిహేను వందల రూపాయలను నేరుగా మన ఖాతా లో జమచేస్తున్నారట " అంది చిత్ర.
వర్క్ ఫ్రొం హోమ్ లో నిమగ్నమైఉన్న కిరణ్ , లాప్ టాప్ లోంచి తన దృష్టి మరల్చి 'అయితే ఏంటన్నట్ట్లు ' చిత్ర వైవుకు చిత్రంగా చూసాడు.
చిత్రంగా చూసాడే కానీ చిత్ర అంతరంగాన్ని గ్రహించలేదనుకోకండి.పరిస్థితి అర్థం చేసుకొని,తన బ్యాంక్ అకౌంట్ మరియు చిత్రది రెండు చెక్ చేసాడు ,ఎక్కడ ఖాతా లో నగదు జమ అయిన ఆనవాలు కనిపించలేదు.
'నగదు జమ తెల్ల రేషన్ కార్డ్ వాళ్ళకి మాత్రమే నట ' ఏదో ముక్తసరి సంజాయిషీ ఇచ్చాడు కిరణ్.
'మనకు తెల్ల రేషన్ కార్డ్ లేదు .అందుకని మన ఖాతా లో ప్రబుత్వం నుండి ఎలాంటి నగదు జమకాబడలేదు ' అన్న సంజాయిషీ తో ఏకీభవించని చిత్ర, "పక్కింటి ఆంటీకి పింక్ కార్డ్ ఉంది ,అయిన డబ్బులు జమ ఐనావట" అంది కిరణ్ తో.
చిత్ర వదిలేటట్టు లేదని కిరణ్ కి అర్థమయ్యింది.
'రేషన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేయాల్సి ఉంటుంది..మనం అది చేయలేదు. అందుకే మన ఖాతా లో నగదు జమ కాలేదు,ఇప్పుడు అది లింక్ చేస్తూ కూర్చునేంత సమయం నాకు లేదు, ఓపిక కూడా లేదు ' అని దురుసుగా అంటూ మళ్ళీ తన ప్రాజెక్ట్ లో లీనమైపోయాడు కిరణ్.
"కావాలంటే లింకు పంపినచాను చూడు.ఆధార్ లింకు చేసుకో.ముందు ఆధార్ కార్డ్ ను పిడిఎఫ్ చేసుకొని రెడి పెట్టుకో.తరువాత ఓటీపీ ఎంట్రీ చేసుకొని తరువాత ఆధార్ కార్డ్ లింక్ చేస్తే సరిపోతుందని, ప్రాసెస్ ని వివరించాడు కిరణ్.
ప్రస్తుతం ఆ పదిహేను వందల కంటే నా ఉద్యోగ అసైన్మెంటే నాకు ముఖ్యం అన్నాడు కిరణ్.
"అవును లే నీకు పదిహేనువందలంటే లోకువె.నాకైతే అవి మూడు నాలుగు వారాల కూరగాయలు.మేమంతగా బలిసినోల్లం కాములే" నిస్టూరపడుతూ అంది చిత్ర "అయిన పక్కింటి అంటి తో పోల్చుకుంటే మనకున్నది పెద్ద 'జీరో' అని గాలిలో జీరో గీస్తూ చెప్పింది చిత్ర. ఇంకా అంటూనే మనుషులకు ఎందుకంత మిడిసిపాటో.మనమొక్కరం తీసుకోక, నిక్కచ్చిగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వానికి కోట్లు కోట్లు వెనకపడవులే". అంటూ తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది.
"నేను నీతో ఏకీభవించలేను,నిన్ను సమాధానపరచనూలేను.నా అంతరాత్మ ఒప్పుకోని పని నే చేయలేను' తన అసలు కారణం వెళ్లబుచ్చాడు కిరణ్ , నేల చూపులు చూస్తూ.
ఆ నగదు కోసం విపరీతంగా వేచి చూసే వారు వేళల్లో ఉన్నారు.చేతిలో పని లేక,జీతంలో పెట్టుకున్న యజమాని తమని పట్టించుకోక,పూట గడవని వారెందరో వున్నారు.అలాంటి అభాగ్య జనుల నుద్దేశించి, ప్రభుత ఇచ్చే నగదును మనం ఆశించడం,నిజంగా కిరణ్ కు నచ్చలేదు.
ఏదో రెండక్షరాలు నేర్చుకున్నామని , ఏదో గారడి చేసి అన్నార్ధులకు చేరవలసిన 'అన్నపుముద్ద ' ని గ్రద్దలా తన్నుకుపోవడం నాకిష్టం లేదు. మనం చదువుకున్నది ,సంస్కారం నేర్చుకున్నది ఇలా వక్ర మార్గాలలో దండు కోవటానికేన? అని తనని తాను ప్రశ్నించుకొన్నాడు కిరణ్
"అవును మొన్న రెండు వేల రూపాయలు పీఎం కేర్ ఫండ్ కు డొనేట్ చేసేటప్పుడు ఉన్న ఉత్సాహం, ఆతృత దీని మీద చూపించలేరులే. ఎందుకంటే అవి పొయ్యేవి ఇవి వొచ్చేవి" అంటూ ఏటకారాన్నీ ప్రదర్శిస్తూ, అప్పటి మాటల యుద్ధానికి తెర దించింది చిత్ర.
**** ***** ****** *****
ఆఫీస్ చేరుకున్నా చిత్ర, తన ఆఫీసు పని మీద ధ్యాస పెట్టింది,అయిన కిరణ్ చెప్పినట్లు ప్రాసెస్ పూర్తి చేసి, ప్రభుత్వం నుండి వొచ్చే ఆ డబ్బులు తన ఖాతాలో జమ చేసి చూపించాలని ఒకటే తాపత్రయం.
నిజానికి చిత్ర ,కిరణ్ ఇద్దరు ఉద్యోగస్తులే. ఆ నగదు రానంత మాత్రాన ,వాళ్ళ పోయ్యిలో పిల్లి లేవని పరిస్థితి మాత్రం ఏమి లేదు. అయిన వచ్చే దాన్నీ ఎందుకు వదులుకోవాలి అని చిత్ర ఆరాటం. వేడి నీళ్లకు చన్నీల్ల తోడు అవసరమే కదా ,సంసార సాగరం ఈదాలంటే.
ఆఫీస్ లో తన ఆధార్ కార్డ్ ను కావాల్సిన సైజులో పిడిఎఫ్ చేసుకుని స్మార్ట్ ఫోనులోకి పంపుకుంది.
ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులో ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆధార్ లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేయాలని ప్లాను.లాక్ డౌన్ తరువాత రద్దీ ఉండదని అనుకొంది, కానీ దానికి భిన్నంగా ఉంది బస్సులో పరిస్థితి.
******* ******** ********
బస్సు లో చాలామంది దృష్టి ఆ మహిళ పైనే ఉంది.
అటు పిల్లవాన్ని సముదాయించ లేక,ఇటు చేతిలోని బ్యాగును పట్టలేక, పైగా గర్భిణిఅవస్తతో సతమతమవుతుంది.
కండక్టర్ కూడా అన్ని వైపులా పరిశీలించి చూస్తున్నాడు, ఎక్కడైనా ఆ అమ్మాయికి చోటు కలిపించవచ్చునేమో నని! కానీ ఎక్కడ ఆ అవకాశం కనిపించలేదు.
ఇంతలో,చిత్ర తన ముందున్న 'వృద్దులకు మరియు వికలాంగులకు' కేటాయించబడిన సీటులోంచి ఇంతవరకు కూర్చున్న ఆ పెద్దమిషిని లేవడం గమనించింది .తన గమ్య స్తానం వొచ్చిందనుకోంది చిత్ర .
కాని విచిత్రం.
అతను లేచి ఆ సీటును, సంకలో పిల్లాడు ఇంకో చేతిలో సంచిలో సతమతమవుతున్నా గర్భిణి- అందరిని తోసుకుంటూ వొచ్చిందనే సెప్పానే ,ఆమెకు ఆఫర్ చేసాడు.
అతను నిజానికి వృద్ధుడే.కాకుంటే ఆరోగ్యాంగా ఉన్నాడు. ఎంత అరోగ్యాంగాను ఉన్నపప్పటికిని వృద్ధాప్యసమస్యలు అంతర్గతంగా ఉండనే ఉంటాయి.
చిత్ర ఆ సంఘటన తో విస్మయానికి లోనయ్యిందీ. కొంచెం సిగ్గుగా అనిపించింది. తానే కల్పించుకొంటూ,' మీరు కూర్చోండి అంకుల్, మీ పక్క సీట్లో కూర్చున్న తన్నీ లెవమను.'అంది చిత్ర.
పక్క ప్రయాణికునిలో ఎలాంటి స్పందన లేదు.
ఇంతలో, పక్కనే ఉన్న కండక్టర్ కల్పించుకొంటూ, "అతన్ని కూర్చొనిండమ్మా, అది వికలాంగుల సీటు,అతను బదిరుడు. మాట రాదు మరియు విననూ లేడు" అన్నాడు.
అంతలో సదరు పెద్దాయన, "పర్లేదులే బాబు , నేను నిలబడతాను.చాలా సేపు కూర్చున్న గదా, కాల్లన్నీ పట్టినట్లున్నాయి అని సర్ది చెప్పుకుంటూ ఆ మహిళకు సీట్లోకి రావడానికి దారి ఇచ్చాడు.
ఆమె అక్కడ కూర్చున్న తరువాత అతను ముందుకి కదిలి నా సీటు ముందు నిలబడ్డాడు.అక్కడి నుండి పురుషుల కంపార్ట్మెంట్ లోకి వెలదామంటే అతనికి కుదరడం లేదు.
కూర్చున్నప్పుడు అతను సరిగ్గా కనిపించలేదు చిత్రకు. అందుకని అతని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయలేక పోయింది, కానీ మంచి బలిష్టమైన శరీరం, ఎత్తైన ఆకారం,ముసలి తనం మచ్చుకు కూడా కనిపించటం లేదు. అతని వయసుకు మాత్రమే ముసలితనం వచ్చినట్లుంది కానీ , అతని ఆలోచనలకు మాత్రం కాదనిపిస్తుంది.బహుశా ఆర్మీ రీటైరేమో! లోలోన అనుకుంది చిత్ర.
ఇంతలో చిత్ర తన మొబైల్ , బ్యాగు సరిది పట్టుకొంటు, అతని వైవుచుస్తూ 'అంకుల్ ఈ సీట్లో కూర్చొండి అంటూ తాను లేవబోయింది.
అతను ఆమె సహాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ,
"చూడమ్మాయ్ అది లేడీస్ సీట్.దాంట్లో వాళ్ళనే కూర్చోనిద్దాం" అన్నాడు. ఇంకా... " అక్కడ రాసి ఉన్న వృద్దులకు దివ్యాnగులకు అన్న అక్షరాలవైపు తన చూపుడు వేలు చూపిస్తూ " మనం మెదులు కోవాల్సింది, అక్కడ రాసి పెట్టిన బోర్డులు చూసి కాదమ్మ .మనం మనుషుల ముఖాలు చూసి మెదలు కోవాలి.మనం మనుషుల ముఖాలు చదవడం నేర్చుకోవాలి.వారి అవసరాలను గుర్తించి చేయుత నివ్వాలి. అదే నిజమైన అక్షర జ్ఞానం."
అతని మాటల్లో స్పష్టత ఉంది. లోతు ఉంది.వినాలనిపించే ఆకర్షణ ఉంది. ఆ కంఠం కూడా కంచు లాగా మొగుతుంది.
అతను ఇంకా చెపుతున్నాడు, "నేను ముసలోడినే కావచ్చు, కానీ నాలో నిలబడగలిగే శక్తి ,సహనం ఉన్నాయి.ఆ సీటు అవసరం నాకంటే ఆ మహిళకే ఎక్కువ. అంత అవసరమైన సమయంలో నేను ఆ వృద్దులకు కేటాయించిన సీట్లో నే ఎందుకు కూర్చోవాలి? వృద్దున్నయినంత మాత్రాన నే కూర్చోవాల్సిన అవసరం లేదుకదా!
వయస్సులో నాకన్నా చిన్నదయిన ఆ అమ్మాయి ప్రాకృతిక బాదలతో తాను నిలబడలేక పోతున్నప్పుడు, ఆ సీటు అమెకివ్వడంలోనే నా వార్ధక్యానికి గౌరవం ఉంది"
కొన్ని సందర్భాలలో మనకు అవసరం లేకపోయినా, మన పరిస్థితులు ,స్థితి గతులు మనల్ని కొన్ని సేవలకు అర్హులని చేయొచ్చు. అది సమర్థనీయమే కావచ్చు.
మనకున్న తెలివితేటలతో కొన్ని కంపోర్ట్స్ ని మనం హస్తగతం చేసుకోవచ్చు. అలా చేయడం వలన మనకు తాత్కాలిక సంతోషం తప్ప పెద్దగా ఏమి వొరగదు.
నిజానికి, వాటిని అవసరమైన వారికోసం వదలివేయడం, లేకుంటే అవసరమైన వారికి చేరేలా చూడటం వలన మన వ్యక్తిత్వ ఔన్నత్యం పెరుగుతుంది. మన మానసిక పరిపక్వత, వ్యక్తిగత విలువలు చూపించు కోవడానికి ఏవో పెద్ద పెద్ద సంఘటనలు మనకు తారసపడాల్సిన అవసరం లేదు.ఇలాంటి చిన్న చిన్న అవకాశాలే చాలు.వాటిని సద్వినియోగం పరచికొంటే అదే పదివేలు "
అతను చెపుతూ ఉంటే చాలా మంది ప్రయాణికులు శ్రద్ధగా వింటున్నారు.ఒక రకమైన మెస్మరిజానికి గురయ్యారు.
అయితే చిత్ర మాత్రం పూర్తిగా ఆ మాటల ట్రాన్స్ లోకి వెళ్ళింది.ఆమె ఆలోచన ధోరణి నే మార్చేసింది.
అవును పైవాడు అందరికి యిలాంటి అవకాశాలను కలిపిస్తాడు. ప్రస్తుత పరిస్థితి ని ఒక అవకాశంగా నేనెందుకు భావించకూడదు అనుకొంది చిత్ర.
అవును ఆ నగదు కావాల్సిన వాళ్లు, నిజంగా కావాల్సిన వారు చాలా మందే ఉంటారు.ప్రస్తుత పరిస్థితిని,నేను వారికోసం వదిలివేయడానికి దేవుడు కల్పించిన సదావకాశంగా భావిస్తే సరి అనుకుంది చిత్ర.
ఎక్కడో ఎద లోతుల్లో ,కను విప్పు కలిగిన భావన మనసును ఆహ్లాద పరూస్తుంటే ,ఆధార్ అప్లోడును విరమించుకొని బస్సు దిగి సంతృప్తిగా ఇంటి వైవు కు అడుగులు వేయసాగింది చిత్ర.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి