పుట్టింటి పట్టుచీర - మీగడ.వీరభద్రస్వామి

grand sari from mother house

“నీ పుట్టింటినుంచి తెచ్చిన బంగారు వజ్రాలేమీ తరిగిపోలేదు గాని నువ్వు కాస్తా తగ్గు, ఒక్కగానొక్క నా చెల్లిలుకి సంత్సరానికి ఒక చీర కొనిపెడదామంటే ఓ ఊరకే మొహం మాడ్చుతావెందుకు” “మొహం మాడ్చకుండా చిరునవ్వులు చిందిస్తూ ఆమె గారి కాలు కడిగి కానుకలిమ్మంటారా! నాకంత అవసరము లేదు. అయినా మీ చెల్లిలంటే మీకు వల్లమానిన పిచ్చి గాని, పెళ్ళై పదేళ్ళు అయ్యింది యింకా ఆమెగారికి పుట్టింటి పట్టుచీరలు కావాలా!” “చాలా అన్యాయంగా మాట్లడతున్నావు దానికి పెళ్ళై పదేళ్ళు అయినంత మాత్రన అది మనకి పరాయిధైపోయిందా! పుట్టింటి నుండి ఆమాత్రం చీర సారికి కూడా నోచుకోలేదా!” “అదిగో మీ బుద్దిపోనిచ్చుకున్నారు కాదు ముందేమో చెల్లికి చీర అన్నారు, ఇప్పుడేమో చెల్లికి చీర సారే అంటున్నారు” “యింతకీ యిప్పుడు ఏమంటావ్ మా చెల్లికి చీర కూడా యివ్వవద్దు అంటావ్ అంతే కదా!” “అంతే కదా కాదు అంతే”. “తల్లీ నీకో దండం నీ నోటికో దండం నీతో వాదించడం సుద్దదండగ అయినా పండకి యింకా టైముంది కదా అప్పుడు చూద్దాంలే ఏమి చెయ్యాలో” “పండకి టైము వున్నా లేకపోయినా నా మాట,నిర్ణయం ఒకటే ఎట్టి పరిస్తితిలోనూ ఆమెగారికి యీ యింటి నుండి పూతికపుల్ల యిచ్చినా నేను ఒప్పుకోను, అసలు ఆయమ్మ మనింటికి రాకపోతేనే నేను సంతోషిస్తాను, మీకేమైనా వీలైతే ఆమె ఎప్పుడూ యీ ఇంటికి రాకుండా చూసుకోండి, కాదు పోదు అని వచ్చిందనుకోండి మర్యాదగా మూడంటే మూడు రోజులే వుండి పోవలిసిందే” “చాలా అన్యాయం ఒక ఆడకూతురు తన పుట్టింటికొచ్చి అంత అవమానపడి వెళ్ళడం నేనెక్కడా చూడలేదు”. “ఎక్కడా చూడకపోతే యిక్కడ మనింటిలో చూడండి, అయినా అందరి ఆడపిల్లలాంటి ఆడపిల్లకాదు మీ ఆడపిల్ల, చెడిపోయిన ఆడది, అలాంటి దాని మొహమే చూడకూడదు మీ పోరు పడలేక దాన్ని పదేల్ల నుండి యీ యింటి గుమ్మం ఎక్కనిస్తున్నాను, మరో యిల్లాలైతే అలాంటి దాన్ని ఖాతరు చేయకపోను, యిక యీ వాదన వద్దు మీ చెల్లి విషయంలో, దానికి ఏ మర్యాదలు చెయ్యలో చెయ్యకూడదో నేను చెపుతాను మీరు పాటించండి కాదంటే మీకూ మర్యాదదక్కదు, దానికీ మర్యాదుండదు, గుర్తుంచుకోండి, ఆదివారం కాబట్టి మీతో యింతసేపైనా మాట్లాడేను మరో వారమైతే యీ చెత్త టాపిక్ ఉండనే వుండదు”. “నీతో వాదించే కన్నా నోరు మూసుకొని వుండడం బెటర్”. “మంచిది యిక మీ పని మీరు చూసుకొండి”. **** ****** ******** ******* ****** ****** సాంబశివరావు పాలకొండలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాదా సీదా మనిషి,గ్రూప్ 4 పరీక్షలు రాసి అతి కష్టం మీద స్థానిక తహసిల్దార్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ పోస్టు సంపాదించుకున్నాడు,వున్నంతలో గుట్టుగా సాగిపోయే కుటుంబం వారిది,అయితే అది గతం నేడు సాంబశివరావు ఉద్యోగం పోయిన బాపతు, అత్యంత దయనీయస్థితిలో తండ్రి తల్లి మరణించారు.ఉన్న ఒక్కగానొక్క చెల్లి ప్రేమ వివాహం చేసుకుంది,అయితే పెళ్లి కాకముందే ప్రియుడుతో సహజీవనం చేసి ఒక బిడ్డ పుట్టిన తరువాత పెళ్లి చేసుకుంది అదీ ఆమె చేసిన తప్పు,అందుకే సాంబశివరావు చెల్లిని నోటికొచ్చినట్లు మాట్లడతుంది సాంబశివరావు భార్య,ఇక సాంబశివరావు మర్యాదగా గుమస్తా ఉద్యోగం చేసుకోకుండా పెళ్ళాం మాటలు విని విధిలేక విచ్చలవిడిగా లంచాలకు అలవాటుపడి ఒకానొక రోజు ఏ.సి.బి.కి అడ్డంగా దొరికిపోయి అతి తక్కువ సర్వీసులోనే ఉద్యోగం ఊడిపోయి ఇంటికే పరిమితమైపోయి పెళ్ళాం చేత మాటలు కాస్తున్నాడు,ఇదిగో ఈ మద్యనే సొంతంగా నెట్ సెంటర్ పెట్టుకొని స్వయం ఉపాధి పొందుతున్నాడు,అటు తలి దండ్రులు కూతురు చేసిన పనిని అవమానంగా భావించి ఆత్మహత్యచేసుకున్నారు,తలి దండ్రులులేక అనాథగా వుండే చెల్లిని కనీసం పెద్దపండగకైనా పిలుపుచెయ్యకపోతే లోకం దృష్టిలో చులకనైపోతామని చెల్లిని మొక్కుబడిగా పిలుపు చేసి తూతూమంత్రంగా మర్యాదలు చేసి పంపివేస్తున్నాడు,పిలుపైతే చేస్తున్నడేగాని చెల్లి అచ్చటాముచ్చట చూసుకొనే భాగ్యానికే నోచుకోవడమే లేదు సాంబశివరావు,చెల్లి చేసిన పని,తలిదండ్రుల ఆత్మహత్య నిర్వాకం,తానులంచం తీసుకొని దొరికిపోయి ఏకంగా ఉద్యోగమే పోగొట్టుకోవడం,కొన్ని సంవత్సరాలు పాటు కేవలం భార్య సంపాదనమీదే ఆదారపడటం,ఇవన్నీ కలిసి సాంబశివరావుని పెళ్ళాం ముందు చేతకాని చవటను చేసి ఆడుకున్నాయి,తనకు ఉద్యోగం పోయి పైసా సంపాదన లేనప్పుడు భార్యా వెలుగు ఆఫీస్ లో టైలరింగ్ టీచర్ గా పనిచేస్తూ తనకుటుంబాన్ని పోసించుకుంటూ వచ్చింది అదీ అతని భార్యకి ప్లస్ పాయింట్,చిన్నకుటుంబం చింతలేని కుటుంబం,మంచికి మర్యాదకు మారుపేరులాంటి తన చిన్నప్పటి తన కుటుంబం నేడు ఇంత దురదృష్టకర స్థితిలో ఉండటానికి కారణాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు సాంబశివరావు,అంతే కాదు అసలు ఈ దుస్థితికి అసలు కారణం ఎవరు,తనకుటుంబానికి మంచిరోజులు రావడానికి, ముఖ్యంగా తనకి తన చెల్లికి తన భార్య నుండి తీవ్ర అవమానాలు రాకుండా చెయ్యాలంటే తను ఏమి చెయ్యాలి,భార్య తన తప్పు తాను తెలుసుకొని,వాస్తవలోకంలోకి వచ్చేటట్లు చెయ్యడం ఎలా అనే విషయాన్ని ఆలోసిస్తూ ఉన్నాడు. ******* ******** ******* ******* ******** భార్య మంచిగా వుంటే అతను అంతకన్నా మంచిగా ఉండటంలో అర్ధముంది, అసలు భార్యా అతని పరిస్థితిని అర్ధం చేసుకోకుండా నిత్యం అవమానం చేయడమే పనిగా పెట్టుకొని వేదిస్తే అతను రూటు మార్చి ఆమెకు తగిన బుద్ధి చెప్పడానికి కాస్తా కటువుగా ఉండటంలో తప్పులేదు కదా! కేవలం మేనమామ కూతురన్న కారణంతో ఆమె మాటతీరు బాగుండదు తలపొగరు ఎక్కవని తెలిసినా కూడా పెళ్ళిచేసుకోవడం, ఆమె తండ్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాబట్టి కాస్తా సంపాదన ఎక్కువుంటాది భవిష్యత్తులోనైనా సరే ఒక్కగానొక్క కూతురు కాబట్టి కట్నకానుకలు ఎక్కువ ఇస్తాడు అన్న సగటు మధ్యతరగతి మనుషులు స్వార్దబుద్ధితో ఆమెను పెళ్ళిచేసుకోవడం అతనిదే తప్పు అనిపిస్తుంది,భవిష్యత్తు మాట దేవుడెరుగు పెళ్ళికి రెండులక్షలే కట్నకానుకలు ఇచ్చాడు, ఆ తరువాత కట్నకానుకలు అంటే వరకట్న వేధింపులు కేసులో ఇరికించి సొంత మేనల్లుడు అనికూడా చూడకుండా కాటకటాలు లెక్కపెట్టిస్తాను అని మామగారు వార్నింగ్ ఇచ్చేసరికి నోరుమూసుకొని ఉండిపోయాడు సాంబశివరావు. ఇక ఆమె ఆగడాలు సాగనివ్వకూడదన్న నిర్ణయానికి వచ్చాడు అతడు. చెల్లిని పండగకి ఇంటికి పిలిచాడు వేరే కులస్తుడు అతడు మనింటికి రాకూడదు అని అంతకు ముందు భార్య విధించిన షరతులను పక్కనపెట్టి మొదటిసారి చెల్లి భర్తని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు సాంబశివరావు. భార్యా మండిపడింది,నేను వద్దన్నా మీకు ఎంతధైర్యం కాకపోతే ఆ దిక్కుమాలినదాన్ని మనింటికి తీసుకొని వస్తారు అంటూ భర్త ముందే అతని చెల్లి జుట్టు పట్టుకొని వీధిలోకి లాగేసి ఆమె లగేజ్ ని వీధిలో పడేసింది సాంబశివరావు భార్య,అన్నయ్య ముందే ఇచ్చిన సూచన ప్రకారం సాంబశివరావు చెల్లి వదినమీద తిరగబడింది “నన్ను పొమ్మనడానికి నువ్వు ఎవర్తివి నీకు ఎంత హక్కు వుందో నాకూ అంతే హక్కు ఈ ఇంట్లో వుంది నేను చుట్టం చూపుకి కూడా రావడం నీకు ఇష్టం లేకపోతే నువ్వే ఈ ఇంటి నుండి పో” అంటూ కాస్తా గట్టిగానే మాట్లాడింది శివరావు చెల్లి,వదిన అవాక్కయ్యింది,రోషం ఎక్కువై భర్తతో చెప్పాచెయ్యకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటిలో ఆమెకు బ్రహ్మరధం పట్టలేదు ఎవ్వరూ,తండ్రి రిటైర్ అయిపోయి కోరలు పీకేసిన పులిలా ఉన్నాడు, తల్లి ఆమె కోడలు అంటే సాంబశివరావు పెళ్ళాం తమ్ముడు భార్య ముందు కుక్కిన పేనిలా పడివుంది, ఎందుకంటే అప్పటికే సాంబశివరావు అత్తమామలు వరకట్నం వేధింపులు కేసులో కటకటాలు లెక్కించబోయి డిపార్టుమెంటు సెంటిమెంట్ తో పోలీసులు కనికరించి వదిలేస్తే కిక్కురు మనకుండా కోడలుచేప్పినట్లే వింటున్నారు,సాంబశివరావు పెళ్ళాంకి సీను అర్ధమయిపోయింది,ఇక్కడ నాకు పుట్టింటి పట్టు చీరలు కాదుకదా మరదలు కట్టివదిలేసిన చింకి చీరలు కూడా దొరకవని, మర్యాదగా మెట్టినింటికే పోయి పరువుదక్కించుకోవడం మంచిదని, మరునాడే తన మెట్టినింటికి చేరింది.. భార్య పరిస్థితి గమనించి ఆమెను ఇంకా భాధపెట్టడం ఇష్టం లేక మర్యాదగా పలకరించి“ఇప్పటికైనా భర్తకు మర్యాదిస్తూ వుండు, అతని తోబుట్టువు బాధ్యత కూడా అతనికి ఉంటుందని గ్రహించు”అని నిదానంగా చెప్పాడు.“నాకు బుద్ధివచ్చింది”అన్నట్లు భార్య తల ఊపగానే తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు సాంబశివరావు.అతని చెల్లి తన భర్త పిల్లలుతో కలిసి పుట్టింటిలో పదిరోజులుండి, అన్నయ్య వదినా మనస్పూర్తిగా తనకు తన భర్తకు పిల్లలకు పెట్టిన పట్టుబట్టలు పట్టుకొని మెట్టినింటికి బయలుదేరింది,మొదటి సారిగా అన్నయ్య వదినమ్మల్లో తన తలితండ్రులను చూసుకుంటూ తృప్తిగా.......

మరిన్ని కథలు

wife sri lakshmi
సతీ శ్రీలక్ష్మి (కామెడీ కథ)
- సరికొండ శ్రీనివాసరాజు‌
devadattudu Fairy tales told by dolls
బొమ్మలు చెప్పినీ కమ్మనికథలు
- బెల్లంకొండ నాగేశ్వరరావు.
singing donkey
గాన గంధర్వ ఈ గార్ధభం
- కందర్ప మూర్తి
ratnashekharudu(Fairy tales told by dolls)
బొమ్మలు చెప్పిన కమ్మనికథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Waves of life
జీవన తరంగాలు
- కందర్ప మూర్తి
jeemoota trayamu(Delicious stories told by toys)
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
rakrudu(Delicious stories told by dolls.)
బొమ్మలుచెప్పిన కమ్మని కథలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Surge
ఉప్పెన!
- రాము కోలా