శ్రావణ మేఘాలు - మంత్రిప్రగడ రామకృష్ణ శర్మ

Pliers clouds

శ్రావణ మాసం. సాయం సంధ్యా సమయం.
ఆకాశం మేఘావృతంగా వుంది. ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


అప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి.
కామేశ్వరరావు రేడియోలో పాటలు వింటున్నాడు. సమయానుకూలంగా 'చిట పట చినుకులు పడుతూ ఉంటే 'అన్న పాట వచ్చింది. తర్వాత 'జోరుగా హుషారుగా షికారు పోదామా ' అన్న పాట వచ్చింది.


ఈ పాటలు విన్నాక కామేశ్వరరావుకు బాగా ఉషారొచ్చింది. ఇలాంటి వాతావరణంలో అలాంటి పాటలు వస్తుంటే ఎవరైనా ఉషారుగా వుంటారు . కామేశ్వరరావు సహజం గానే ఉషారైన వాడు. ఇప్పుడు కొంచెం స్టెప్పులు కూడా వేస్తున్నాడు.


ఇంతలో అతని భార్య కామాక్షి వచ్చింది. 'ఏమిటి
శ్రీవారు బాగా ఉషారుగా ఉన్నారు ' అన్నది.


'ఏమీ లేదే ఈ వాతావరణం మత్తెక్కిస్తుంది'.
అన్నాడు కామేశ్వరరావు


'ఆ మత్తుకు గమత్తు తోడవుతుంది కొంచెం వేడిగా కాఫీ తెమ్మంటారా ' కామాక్షి అడిగింది.


' నువ్వు దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ
వేడి వేడి కాఫీ తాగుదామంటే సరే' కామేశ్వరరావు
చమత్కరించాడు.


'ఈ భోగం ఎంత సేపు లెండి, డ్రాయింగ్ రూంలోకి
మీనాక్షి రాగానే ఈ కామాక్షి వంక చూడరు ' నసిగింది కామాక్షి.


'భలే దానివి . అది సీరియల్. అది నాటకం. అమె ఒక పాత్ర .కధ చాలా బాగుంది. అందుకే పరికించి చూస్తాను'. కామేశ్వరరావు సంజాయిషీ .


' అంతే అంటారా ? ' కామాక్షి ప్రశ్న.


'అంతే కాకపోతే ఇంకేముంది ' కామేశ్వరరావు సమాధానం.


'మీ చిలిపి పనులు నాకు తెలుసు ' కామాక్షి వెటకారం .


'అదంతా పెళ్ళికి ముందే అదికూడా నీ ఒక్క దానితోనే' కామేశ్వరరావు సర్ది చెప్పాడు.


'నిజంగా ' ? సంసయాత్మకంగా అన్నది కామాక్షి


' నీ మీద ఒట్టు ' ప్రమాణం చేస్తూ అన్నాడు కామేశ్వరరావు.


'మా ఆయన బంగారం' అంటూ కాఫీ కప్పు అందించింది కామాక్షి.


కామేశ్వరరావు మరియు కామాక్షి దంపతుల
పరిచయం హైదరాబాదులో, రామచంద్రాపురంలో
బి. హెచ్. ఇ. ఎల్ గృహ సముదాయంలో
మొదలైంది.


కామాక్షి మేనమామ బి. హెచ్. ఇ . ఎల్ లో
ఇంజనీర్ గా పని చేసేవాడు. కామాక్షి తల్లిదండ్రులు పసితనం లోనే భగవంతునికి ప్రియమైనారు. అప్పటినుంచి కామాక్షిని సొంత కూతురులాగా పెంచాడు.


దైవానుగ్రహం లోపించి కామాక్షి అత్తయ్యకు కాన్సర్ రావటంతో వివాహమైన తొలి రోజుల్లో బిడ్డ సంచి తొలగించారు. దాంతో కామాక్షికి
ఏలోపం రాకుండా కన్న బిడ్డ కన్నా ఎక్కువ ప్రేమతో పెంచారు.


కామేశ్వరరావు నాన్నా గారు హైదరాబాదులో, శ్రీనగర్ కాలనీ లో మూడు పడక గదుల ఫ్లాట్ ,ఐదు అంతస్తుల భవనంలో నివాసం .


కామేశ్వరరావు నాన్నా గారి ప్రాణ స్నేహితుడు రామకృష్ణ కూడా బి. హెచ్. ఇ. ఎల్. లో
ఇంజనీర్ గా పని చేస్తున్నాడు .


ఇంచు మించు అన్ని సెలవు దినాలు కామేశ్వరరావు కుటుంబం రామకృష్ణ కుటుంబం
కలసి ఆనందంగా గడుపుతారు.


రామకృష్ణ మరియు కామాక్షి మామయ్య వాళ్ళవి
పక్క పక్క క్వార్టర్స్. దాంతో వాళ్ళ మధ్య సద్భావ సంబంధాలు ఏర్పడ్డాయి.


ఆవి కామాక్షి డిగ్రీ చదివే రోజులు. ఒక ఆదివారం కామాక్షి పూల మొక్కలకు గొట్టంతో నీల్లు పోస్తుంది. అదే సమయంలో కామేశ్వరరావు కంచెకు ఇవతల నిలబడి ఆమె సొగసులు చూస్తున్నాడు. అది గమనించిన కామాక్షి కంగారుపడి నీల్ల గొట్టం అటు ఇటు తిప్పింది. అనుకోకుండా కామేశ్వరరావు బట్టలు తడిసాయి. కామాక్షి సిగ్గుతో తల దించుకుని ఇంట్లోకెళ్లింది. కామేశ్వరరావు మరియు కామాక్షిల పరిచయం అలా మొదలైంది.


సోమాజిగూడలో అమ్మాయిలకు ప్రత్యేకమైన కళాశాల వుంది. ఆ కళాశాలలో కామాక్షి
బి. బి. ఏ. డిగ్రీ చదువుతోంది. అని సబ్జక్ట్స్ లో
మంచి మార్కులు వస్తున్నాయి. కానీ ఒక ఆర్థిక శాస్త్రంలో వెనకబడింది .


ఒక రోజు కామాక్షి మేనమామ మరియు రామకృష్ణ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మాటల మధ్యలో కామాక్షి ప్రస్తావన వచ్చింది. కామాక్షి ఆర్థిక శాస్త్రంలో వెనకబడిందని కామాక్షి మేనమామ, రామకృష్ణతో చెప్పాడు. వెంటనే రామకృష్ణకు మెరుపులా ఒక ఆలోచన వచ్చి ఇలా అన్నాడు. ' నా మిత్రుని కుమారుడు ఆర్థిక శాస్త్రం లో పి. హెచ్. డి. చేసి విశ్వవిద్యాలయంలో లెక్చరరుగా పనిచేస్తున్నాడు.
మనింటికి తరుచుగా వస్తాడు. బహుశా నీవు
చూసుండాలి.'


ఈ మాటలకు కామాక్షి మేనమామకు శిరోభారం
తగ్గినట్లనిపించింది. ' ఐతే ఈ మాటు
అతనొచ్చినప్పుడు పరిచయంచేయి' అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.


ఒక సెలవు రోజు కామేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి రామకృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చాడు. కామాక్షితో పాటు కామాక్షి మేనమామ కూడా అక్కడికి చేరుకున్నారు. కామాక్షిని పరిచయం చేసాడు రామకృష్ణ . అన్ని సంగతులు
తెలుసుకున్న కామేశ్వరరావు ఆమె సందేహాలు తీర్చటానికి అభ్యంతరం లేదన్నాడు. కానీ
బట్టలు తడపకూడదన్నాడు. ఈ పరిహాసం కామాక్షికి మాత్రమే అర్థమయింది.


తర్వాత ఆదివారం కామేశ్వరరావు యథాప్రకారం
బి. హెచ్. ఇ. ఎల్ వచ్చాడు. ఈ రోజు ఒక్కడే వచ్చాడు. పాఠం చెప్పినప్పుడు ఏకాగ్రత కుదరదు అనే వంకతో.


కామాక్షి ఇంట్లో ఆర్థిక శాస్త్ర పాఠం మొదలైంది.
కామేశ్వరరావు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం
వస్తున్నాడు. అది అతని క్రమశిక్షణకు తార్కాణం.
కామాక్షికి ఆర్థిక శాస్త్రం బాగా అర్థమవుతుంది. ఇది కామేశ్వరరావు బోధనా ప్రజ్ఞకు మచ్చుతునక .


రోజులు గడుస్తున్నాయి. రామకృష్ణ చాలా సంతోషంగా వున్నాడు. తన సలహాలు ఉపయుక్త మైనందుకు.


అది ఆదివారము అనురాధ నక్షత్రము దశమి
అభిజిత్ లగ్న శుభసమయం శ్రావణ మాసము. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులు. పాఠం సగంలో వున్నది. ముందు జాగ్రత్తగా విద్యుత్తు సరఫరా నిలిపి వేసారు. పట్టపగలు చిమ్మచీకటి.
దూరంగా పెద్ద పిడుగు పడింది. భయంకరమైన
ధ్వని. కామాక్షి ఒక్కసారిగా ఉలిక్కిపడి యాదృచ్ఛికంగా కామేశ్వరరావును తన చేతుల్తో చుట్టేసింది. ఆ మృదు హస్త బంధం వివాహ
బంధంగా మారి కామాక్షి మరియు కామేశ్వరరావుల మధ్య భార్య భర్తల అనుబంధం ఏర్పడింది


ఇదంతా గతం. ఇప్పుడు కామాక్షి, మరియు కామేశ్వరరావు వర్తమానానికొచ్చారు. వాళ్ళ చేతుల్లో ఖాళీ కాఫీ కప్పులలానే వున్నాయి.


ఇలాంటి వాతావరణంలో కామాక్షి
కామేశ్వరరావులు గత స్మృతుల్లోకి జారుకొవటం
వాళ్ళకలవాటే.


భార్య భర్తలు తమ మధుర అనుభవాలు తలుస్తూ
వర్తమాన మాధుర్యం అనుభూతి పొందుతూ
కాలక్షేపం చెస్తే సంసారం మనోరంజకంగా ఉంటుంది.


శ్రావణ మేఘాలు కామాక్షి మరియు కామేశ్వరరావుల నిత్య జీవితంలో అనుక్షణం గుర్తుకొస్తాయి.

మరిన్ని కథలు

Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు