లక్షలు... అక్షరాలు - మీగడ.వీరభద్రస్వామి

Millions ... letters

పూర్వం ఒక పండితుడుకి ఇద్దరు కొడుకులు వుండేవారు.ఇద్దరు కొడుకులకూ ఆస్తిని పంచుతూ "నాదగ్గర వెయ్యి బంగారు నాణేలు,వెయ్యి గ్రంథాలు ఉన్నాయి,ఇద్దరూ సమానంగా పంచుకోండి,ఒక్కటి మాత్రం తెలుసుకోండి ధనం ఖర్చు పెడితే తరిగిపోతుంది, విద్య వినియోగిస్తే పెరుగుతుంది"అని సూచన చేసాడు. పండితుని పెద్దకొడుకు నాకు గ్రంథాలు,పుస్తకాలు వద్దు ఎలాగూ విద్య వినియోగిస్తున్నంత కాలమూ దాని విలువ పెరుగుతుంది,ధనం ఖర్చుచేస్తే తరిగిపోతుంది అని మీరే అంటున్నారు కదా కష్టమో నష్టమో నేనే భరిస్తాను తమ్ముడికి గ్రంథాలు ఇచ్చేసి నాకు బంగారు నాణేలు ఇచ్చేయండి"అని వ్యంగంగా అన్నాడు. "ధనం ఇవ్వకుండా కేవలం గ్రంథాలు మాత్రమే ఇస్తే చిన్నకొడుకు బాధ పడతాడు"అనుకుంటూ మనసులో మధనపడుతున్న తండ్రిని చూసి"నాన్నగారూ నాకు గ్రంథాలు ఇవ్వండి చాలు అన్నయ్యకు ధనం ఇచ్చేయండి, అన్నయ్య లక్షలను నమ్ముకుంటే నేను అక్షరాలను నమ్ముకుంటాను"అని లౌక్యంగా అన్నాడు చిన్నకొడుకు. కొడుకులు కోరిక ప్రకారమే బంగారు నాణేలును పెద్దకొడుక్కి,గ్రంథాలను చిన్నకొడుక్కి ఇచ్చి,"తెలివిగా వినియోగించుకోండి"అని సూచన చేసాడు పండితుడు. వెయ్య బంగారు నాణేలతో పెద్దకొడుకు పెద్ద పెద్ద హంగు ఆర్భాటాలుతో వస్త్రాల దుకాణం పెట్టగా,వెయ్య గ్రంథాలు పట్టుకొని ఒక చిన్న చెట్టుక్రింద వేద పాఠాశాల పెట్టుకున్నాడు చిన్న కొడుకు. పండితుని కొడుకుగా ఏ మాత్రమూ అనుభవం లేని వ్యాపారం కావడంతో పెద్దకొడుకు మూడు సంవత్సరాలలోనే నష్టాలపాలై వెయ్య బంగారు నాణేల ఆస్తిని పొగుట్టుకున్నాడు,అభ్యాసం కూసు విద్య అన్నట్లు కేవలం అక్షరజ్ఞానం మాత్రమే మదుపుగా పెడుతూ అందరికీ అందుబాటులో ఉంచి నడిపిన చిన్న కొడుకు చిన్న చెట్టుక్రింద పాఠశాల పండితుల పామరుల ఆధరణ పొంది అతని కుటుంబ కూడు గుడ్డ గూడుకి ఏ లోటు లేకుండా ఆదుకుంది. "తాను అతి తెలువి చూపించి తమ్ముడికి అన్యాయం చెయ్యాలనుకున్నాను,చివరికి ఇలా జరిగింది"అని పెద్ద కొడుకు తండ్రి వద్దకు పోయి చింతించాడు,విషయం తెలుసుకొని అన్నయ్య దగ్గరకు వెళ్లి"విరివిగా వినియోగించడం వల్ల మన ధనం పోయింది మన అక్షర సంపద పెరిగింది,ఇక మన పాఠశాలను ఇద్దరమూ నడుపుకుందాం"అని అన్నయ్యను తన పాఠశాలలో భాగస్వామిని చేసి తలిదండ్రుల ఆశీస్సులకు పాత్రుడయ్యాడు. ....మీగడ వీరభద్రస్వామి 7893434721

మరిన్ని కథలు

Taage neellu
తాగే నీళ్ళు
- అఖిలాశ
Dustabuddhi
దుష్టబుద్ధి
- కందర్ప మూర్తి
Naga
నగ
- Kanuma YellaReddy
Athadu aame section 497
అతను ... ఆమె .. సెక్షన్ 497
- వారణాసి భానుమూర్తి రావు
Agni Baba
అగ్ని బాబా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Samayaspoorthi
సమయస్ఫూర్తి
- ఎం బిందుమాధవి
Tikamaka
తికమక..!! చిన్న కథ
- డా. కె.ఎల్. వి.ప్రసాద్