ఋణానుబంధం - రాంకూరు లక్ష్మీ మణి

runanubhandham by Ramakuru Lakshmi Mani

ఆ రోజు క్షీరాబ్ది ద్వాదశి ... కమలమ్మ ముందు రోజు ఉపవాసం చేసింది ...పొద్దున్నే లేచి పూజ చేసుకుని వంట హడావిడిలో ఉంది. కొడుకు కోడలు ఇంకా లేవలేదు.

కార్తీక మాసం మొత్తం ఆవిడ చాలా నిష్ఠగా పూజలు చేస్తుంది. ఉపవాసాలు ఉంటుంది.భర్త కేశవయ్య కూడా నియమంగా ఉంటాడు.

కేశవయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారి. స్థలాలు అమ్మడం, ఇళ్ళు కట్టించి పెట్టడం చేస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో ఒక మోస్తరు పేరు తెచ్చుకున్నాడు.పెద్దగా మోసాలు చేయటం లాంటివి చెయ్భ డు .

ఎదో కొంత లాభం వేసుకుని మాత్రం తన వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. తండ్రి చేసే కుల వృత్తి అయిన మగ్గం పని వద్దనుకుని పట్టణానికి వచ్చి వ్యాపారం లోకి దిగాడు.

భక్తి పరుడు. భార్య ఏదన్న పూజలు అంటే కూడా కాదనడు.

ఆ నెల రోజులు కమలమ్మ మాంసాహారం వండదు ఇంట్లో మద్యం తాగడం, సిగరెట్టూ అన్ని నిషేధం. రోజు లానే ఆరోజు కూడా పొద్దున్నే లేచింది. స్నానం చేసి పూజాదికాలు మొదలు పెట్టాలని అనుకుంది.

శివన్న కోసం చూసింది. ఈ పాటికే లేచి బయట తుడిచి నీళ్లు చల్లు తాడు. కమలమ్మ వెళ్లి ముగ్గులు వేస్తుంది. శివన్న లేచిన జాడ లేదు. .తన కన్నా ముందే లేచే శివన్న ఇంకా లేవలేదేమిటా అనుకుంది.

శివన్న గత ముఫై ఐదు ఏళ్లుగా వాళ్లింట్లోనే ఉంటున్నాడు. నమ్మిన బంటు. ఒకరోజు ఇంటిముందుకు వచ్చి అయ్యా ఏదన్నా పని ఇప్పించండి. తల్లి తండ్రుల్ని కోల్పోయిన వాణ్ణి అంటూ బ్రతిమాలాడు.

కమలమ్మ , కేశవయ్యలు సంశయించారు. అసలే ఆ ఊరికి కొత్తగా వచ్చారు పల్లెటూరినుంచి. వాళ్ళు కూడా సంసారాన్ని కొత్తగా మొదలెట్ట బోతున్నారు. పిల్లాడు చూస్తే చిన్నగా ఉన్నాడు, గట్టిగా ఇరవై ఏళ్ళు కూడా ఉండవు. ఏమో ఎలా ఉంటాడో....నమ్మి ఇంట్లో పెట్టుకున్న వ్యాపారం లో పన్లో పెట్టుకున్నా సరిగ్గా చేస్తాడో లేదో, ఏమన్నా దోచుకు పోతాడో నని ఒకటే అనుమాన పడ్డారు.

సరేలే పిల్లాడిని చేస్తే అమాయకం గా కనిపిస్తున్నాడు చూద్దాం కొన్ని రోజులు అని ఒప్పుకున్నారు భార్యాభర్తలు. అప్పటికి ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు.

వేరేవాళ్ళ దగ్గర చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మెళకువలు తెలుసుకుంటూ ఉన్నాడు కనకయ్య

కమలమ్మ కి ఇంటి పనులు చెయ్యటంలో ఎంతో సహాయ పడుతున్నాడు శివన్న. పనిమనిషి ఎందుకమ్మా నేను ఉండంగా అని తానే ఆ పనులు కూడా చెయ్యడం మొదలు పెట్టాడు.

శివన్నకి ఆ పేరు వాళ్ళే పెట్టారు .. అసలు పేరు యాదయ్య...ఆ పేరు బాగ లేదని శివన్న అనడం మొదలు పెట్టారు.శివన్న ఆ పని ఈ పని అని లేదు అన్ని పనులు తానే చేస్తానంటాడు.

కమలమ్మ కి చాల విశ్రాంతిగా ఉంది వాడు వచ్చిన దగ్గర్నుండి. వాడి నిజాయితీ, పనులు చెయ్యడంలో నేర్పరి తనం, వాళ్ళకి ఏ కష్టం కలిగినా తాను ఉన్నానంటూ ముందుకు రావడం...వీటిల్తో వాళ్ళని ఆకట్టు కున్నాడు. వాళ్ళ ఇంట్లోనే పక్కగా ఒక రూమ్ కట్టి వాడ్ని అక్కడ ఉండ మన్నారు.

కమలమ్మ కి వరుసగా ఒక అమ్మాయి, తర్వాత ఒక అబ్బాయి పుట్టారు. పుట్టింటినుండి చంటి బిడ్డల్ని ఎత్తుకుని వచ్చిన దగ్గర్నుండి ఇక పిల్లల బాధ్యత తానే తీసుకున్నాడు.వాళ్ళని స్కూల్ దగ్గర దింపిరావడం తీసుకురావడం తయారు చెయ్యడం అన్ని తానే చేసేవాడు. వాడికి కూడా పెళ్లి చెయ్యాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు కనకమ్మ, కేశవయ్యలు. కానీ వాడు వద్దంటే వద్దని మొండి పట్టుతో ఉన్నాడు.

“నాకే పెళ్ళీ వద్దు. నన్ను మీ ఇంట్లో పడి ఉండనివ్వండి చాలు మీ సేవ చేసుకో నిండి ...నాకది చాలు” భార్యాభర్త లిద్దరు ఎంతో చెప్పి చూసారు వినలేదు...పైగా బెదిరించాడు.. నాకు పెళ్ళీ చేస్తానంటే నేను ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతా అని. వాళ్లకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వాడిని వదిలి వాళ్ళు ఉండలేరు.

పిల్లలు కూడా శివన్న మామా అంటూ చంక నెక్కుతారు. వాళ్లకి కూడా పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్ళ పిల్లలు కూడా శివన్న తాతా అంటూ వెంట వెంట తిరుగుతారు.

శివన్న తన గదికి రాత్రి పూట నిద్ర పోవడానికి మాత్రమే వెడతాడు. కనకమ్మ తెల్లారి పోతోంది అనుకుంటూ బయటకు వచ్చి శివన్న గది వేపు చూసింది. లేచిన జాడ లేదు. తలుపు వేసి ఉంది.లైట్ కూడా వెలగటం లేదు. ఇంతసేపటివరకు లేవకుండా ఉండడే అనుకుంటూ గట్టిగా “శివన్న శివన్నా...” అంటూ పిలిచింది లోపలనించి ఏమీ శబ్దం వినపడలేదు. తలుపు మీద గట్టిగా కొడుతూ మళ్ళీ పిలిచింది.

ఈలోపున కేశవయ్య కూడా అక్కడికి వచ్చాడు..

”ఏమిటి కనకా, శివన్న ఇంకా లేవలేదా” అంటూ

“ఏమోనండీ, లేవ లేదు పిలుస్తున్నా..ఒక్కసారి చూడండి..” అంది కమలమ్మ

కేశవయ్య తలుపు నెట్టాడు...తీసేఉంది..లోపల .గడియ వేసిలేదు.

మంచం మీద పడుకుని ఉన్నాడు శివన్న

ఎందుకో అనుమానం వచ్చింది కేశవయ్యకు. దగ్గరకు వెళ్లి చేతులు పట్టుకుని ఊపుతూ శివన్నా శివన్నా అని పిలిచాడు.చల్లగా తగిలాయి చేతులు.. అనుమానం వచ్చి ముక్కు దగ్గర వేలు పెట్టి చూసాడు.శివన్నా అంటూ గట్టిగా అరిచాడు.

నిద్రలోనే ప్రాణాలు విడిచినట్లు ఉన్నాడు

“ఏమిటండి” అంటూ కనకమ్మ లోపలి కి వచ్చింది గాభరా పడుతూ ఇద్దరు ఘొల్లు మన్నారు కట్టెగా మారిన శివన్నని చూసి..

“ఋణం తీర్చుకున్నాడు కనకా, ఇవాళ్టి తో ఋణం తీరిపోయింది వాడితో”

ఇద్దరి కి దుఃఖం ఆగటం లేదు.

ఎక్కడ పుట్టాడో, ఎక్కడ్నించి వచ్చాడో తెలియదు. ఋణానుబంధం తీర్చుకుని శివ సాయుధ్యానికి వెళ్ళిపోయాడు , శివన్న

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం