కుక్క దొరికింది - కందర్ప మూర్తి

kukka dorikindi

ప్రసాద్ నర్సింగ్ హోమ్ వద్ద పేషెంట్లతో కోలాహలంగా ఉంది. బయట వైటింగ్ హాల్లో జనం వైధ్యం కోసం నిరీక్షిస్తున్నారు. " కుక్క కావాలి , నాకు జిమ్మీ కావాలి" హాస్పిటల్ బెడ్ మీద కలవరిస్తున్నాడు పదేళ్ల కిరణ్. " ఎలా ఉంది డాక్టర్ ?" ఆత్రుతగా అడుగుతున్నాడు తండ్రి శంకరం.

కొడుక్కి ఏమైందోనని బెదిరిపోతోంది అరుణ. అన్నయ్య పరిస్థితి అర్థం కాక బిక్కమొహంతో నిలబడింది కమల. కిరణ్ ని పరిక్షించిన డాక్టరు ప్రసాదు " హై ఫీవర్ ఉంది. మానశికంగా షాక్ కి గురయ్యాడు.మైకంలో 'కుక్క కావాలి' అంటు కలవరిస్తున్నాడు.నీర్సంగా ఉన్నాడు.

సలైన్ పెట్టి ఇంజక్షన్ చేసింది సిస్టర్. నిద్ర పోతాడు. ఆందోళన పడాల్నిన అవుసరం లేదు." దైర్యం చెబుతు , ఈ కుక్క సంగతేంటి? అన్నారు. శంకరం, డాక్టరు శంసయం తీరుస్తూ " అదా , మా ఇంట్లో జిమ్మీ పేరుతో ఒక జూలు కుక్క పెంచుతున్నాం.

నాలుగు సంవత్సరాల క్రితం పిల్లగా ఉన్నప్పుడు మా ఇంటి గుమ్మంలో కొచ్చింది.దాన్ని చూసిన మా అబ్బాయి కిరణ్ పాలు పోసి చేరదీసాడు. ఎవరిదో ఏమిటో బయట వదిలేయ మన్నా విడిచి పెట్టలేదు. దాని ముద్దు మొహం , చలాకితనం చూసి మేమూ కాదనలేక పోయాం. అప్పటి నుంచి జిమ్మీ మా ఇంటి సబ్యురాలైంది.

కిరణ్ స్కూల్ నుంచి వస్తూనే దాంతో ఆటలు పరుగులు పెట్టేవాడు. తినడాని కేమిచ్చినా ముందు జిమ్మీకి పెట్టిన తర్వాతనే తను తినేవాడు.రాను రాను స్కూల్లో కడుపు నొప్పి అని ఏదో వంకతో ఇంటి కొచ్చి దాంతో కాలక్షేపం మొదలెట్టాడు. జిమ్మీని గొలుసుతో కట్టనిచ్చేవాడు కాదు.రాత్రి పక్కలో పడుకో బెట్టుకునే వాడు.

ఇలా జిమ్మీతో వాడి అనుబంధం పెరిగింది. వాడి ప్రవర్తనతో చిరాకు పుట్టి జిమ్మీని మా బంధువుల కిచ్చేస్తే దాన్ని తిరిగి తెచ్చేవరకు అన్నం తిననని మొండిపట్టు పట్టేడు. జిమ్మీ గట్టిగా అరుస్తోందని , మలమూత్రాలు వాళ్ల గుమ్మాల ముందు చేస్తోందన్న కారణంగా ఇరుగుపొరుగు వారితో వాగ్వివాదాలు జరిగి మా మధ్య మపస్పర్దలు వచ్చాయి. వాళ్లు చివరకు పోలిసు కంప్లైంటు ఇచ్చారు.

కిరణ్ చదువు పాడవుతోందని విసుగెత్తి , హైదరాబాదు బంధువుల ఇంట్లో పంక్షన్ ఉంటే వాడు మమ్మీతో వెళ్లినప్పుడు జిమ్మీని జీవకారుణ్య సంస్థ వారికి అప్పగించి వచ్చాను. వారం రోజులు గడిచి పోయాయి. కిరణ్ హైదరాబాదు నుంచి వస్తూనే జిమ్మీని వెతకడం మొదలెట్టాడు. చదువు పాడవుతోందని తలిచి దాన్ని దూరంగా విడిచి పెట్టామని చెప్పగానే , ఇంట్లో హంగామా మొదలెట్టాడు. ఎన్ని విధాల నచ్చ చెప్పినా వాడు వినలేదు. తిండి మానేసాడు.

ఆఖరికి ,మాకు ఇష్టం లేకపోయినా వాడి బాధ చూడలేక జీవకారుణ్య సంస్థ వారిని సంప్రదిస్తే , వారు జిమ్మీని ఎవరికో దత్తత ఇచ్చినట్లు తెల్సింది. దత్తత తీసుకున్న వార్ని ఎంత ప్రయత్నించినా అందుబాటులో లేరు. రెండు రోజుల్నుంచి అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేక జిమ్మీ ఫోటోతో పరిస్థితి వివరిస్తూ దినపత్రికలో ప్రకటన ఇచ్చాము. పేపరు ప్రకటన చూసి జిమ్మీని దత్తత తీసుకున్న వారు ఫోన్లో సమాచారమిస్తు తీసుకెళ్లమని చిరునామా వివరాలు ఇచ్చారు. నిన్నటి నుంచి కిరణ్ ప్రవర్తనలో సడన్ మార్పు వచ్చి పిచ్చి పిచ్చిగా కేకలేస్తూ కింద పడిపోయాడు.వెంటనే మీ హాస్పిటల్ కి తీసుకు వచ్చాము." అని జరిగిన సంగతంతా డాక్టరుకి వివరించి ఈరోజే వెళ్లి మా ఇలవేలుపు జిమ్మీని తీసుకు వచ్చి కిరణ్ కి చూపించి మామూలు మనిషిని చేస్తాను " అన్నాడు శంకరం.

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ