పరస్పర సాయం - కందర్ప మూర్తి

Mutual aid

చెట్ల కింద కూర్చున్న కోతుల గుంపు కొండ మీదున్న రేగుచెట్ల గురించి మాట్లాడుకుంటూ ఆ చెట్ల రేగుపళ్లు తియ్యగా పుల్లగా ఉంటాయని కాని అక్కడికి వెళ్లడానికి రాతి కొండ గుండ్రంగా పాకుడు పట్టి ఎక్కడానికి వీలుగా లేదని అనుకున్నాయి. ఒకసారి రామ చిలక కొన్ని రేగుపళ్లు తెచ్చినప్పడు వాటి రుచి గురించి మాట్లాడు కోవడం వింది కోతిపిల్ల చింకూ.దానికి నోట్లో నీళ్లూరాయి.

ఎలాగైనా ఆ గుండ్రటి కొండెక్కి తనివితీరా రేగు పళ్లు తినాలనుకుంది.మరి ఆ కొండ ఎలా ఎక్కడమా అని ఆలోచనలో పడింది. ఒక రోజు చింకూ ముగ్గిన మామిడి పండు చేత్తో పట్టుకుని తింటోంది.పక్కనే కొమ్మ మీదున్న గెద్ద ఆశ్చర్యంగా చూస్తూ 'అదేంటని' అడిగింది. " దీన్ని మామిడి పండు అంటారు.ఎంతో తియ్యగా రుచిగా ఉంటుంది. వీటినే మేము ఆహారం గా తీసుకుంటాము.నువ్వూ రుచి చూడు " అంది.

" మేము మాంసాహారులం.అలాటి ఫలాలు తినం" అంది. 'రుచి చూడు' అని తన చేతిలోని మామిడి పండు ముక్క గెద్ద నోటికి అందించింది చింకూ. పసుపు రంగులో మెత్తగా ఉన్న మామిడి పండు ముక్క నోటికి తగలగానే గెద్దకి పామును పట్టుకుని తిన్నంత రుచి అనిపించింది. అలా కోతి పిల్ల రెండు మూడు ముక్కలు తినిపించగానే కడుపు నిండి పోయింది గెద్దకి. నేను మాంసాహారినైనా ఈ మామిడి పండు ముక్కలతో నన్ను శాకాహారిని చేసావని మెచ్చుకుంది. అప్పుడు చింకూ కోతిపిల్లకి తన మనసులోని రేగుపళ్లు తినాలన్న కోరిక గుర్తుకు వచ్చింది.

" గెద్ద మిత్రమా ! నాకు ఎదురుగా ఉన్న కొండమీది రేగుపళ్ల చెట్ల ఫలాలు తినాలనుంది.కానీ అక్కడికి నేను వెళ్లలేను. నువ్వు సాయం చేస్తే అక్కడికి చేరుకుని రేగుపళ్లు తినగలను" అంది. " ఓస్ ,అంతేనా! నేను ఆ కొండ మీదే నివాశ ముంటాను.నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టి రేగుచెట్ల దగ్గరకు చేరుస్తాను. తనివితీరా పళ్లు తిను "అంది. చింకూ కోతిపిల్ల గెద్ద వీపుమీద కూర్చొని మెడను గట్టిగా పట్టుకుంది. గెద్ద తిన్నగా ఎగిరుతూ కొండ మీదికి చేర్చింది.

కడుపు నిండా రేగుపళ్లు తిని తన చిరకాల కోరిక తీర్చుకుని గెద్దకు ధన్యవాదాలు చెప్పింది చింకూ. నీతి : పరస్పర సాయంతో సమస్యల్ని పరిష్కరించుకోవాలి.

మరిన్ని కథలు

Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం
Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.
Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు
Ati Garabam
అతి గారాబం (బాలల కథ)
- మద్దూరి నరసింహమూర్తి
Kotta kathalu kaavaali
కొత్త కథలు కావాలి
- తాత మోహనకృష్ణ