బొమ్మలు చెప్పిన కమ్మని కథలు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

బొమ్మలు చెప్పిన కమ్మని కథలు

ఓ శుభముహుర్తాన పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలుకుతుండగా తన పరివారంతో రాజసభలో ప్రవేసించి విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి దానికి ఉన్న మెట్లు ఎక్కుతూ ఇరవై నాలుగో మెట్టుపై కాలు మోపబోయాడు భోజమహారాజు.ఆ మెట్టుపై ఉన్న మనోరంజితవళ్లి అనే బంగారు సాలభంజికం' ఆగురాజా సాహసింపక విక్రమార్కుని గురించి తెలిపే కథ చెపుతానువిను....

ఉత్తరదేశనుండి వచ్చిన వేగు విక్రమార్కునిదర్శించి'మహారాజా ఉత్తర దేశంలో మకరపురి అనే రాజ్యాన్ని సోమప్రతాపుడు అనేరాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య పేరు నందిని వీరికి కాళీమాత వరాన జన్మించిన చంద్రవదన అనే అందాల రాశి అయిన కుమార్తెఉంది.మౌనవ్రతం పూని ఉన్న తన కుమార్తెను పరదా చాటుగా ఉండి ఎవరు మాట్లాడించగలరో వారికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించి తనరాజ్యం కూడా అప్పగిస్తానని ప్రకటించాడు సోమప్రతాపుడు'అన్నాడు వేగు.రాజ్యాన్ని భట్టికి అప్పగించి,మకరపురిచేరి తను రాజకుమారిని మాట్లాడించగలనని కానీ అందుకు తనుచెప్పే కథ వినాలనే నిభంధన విధించాడు విక్రమార్కుడు.అందుకు సమ్మతించింది రాజకుమారి.తమఇరువురిమధ్య ఏర్పాటు చెస్తే పరదాను ఆవహించి ఉండమని బేతాళునికి చెప్పి, రాజమందిరం చెరుకున్నాడు.అక్కడ విక్రమార్కునికి రాజకుమారికి మధ్య పల్చని పొరవంటి పరదా ఏర్పాటు చెసారు.దాన్ని బేతాళుడు ఆవహించి ఉన్నాడు.

ప్రారంభించమని తన చెలికత్తెలకు సైగ చేసింది రాజకుమారి.వెంటనే విక్రమార్కుడు 'రాజకుమారికి నాకు మధ్యలో ఉన్నఓపరదా రాజకుమారి మెచ్చే బదులిచ్చే కథ ఓకటి చెప్పు'అన్నాడు.పరదా కథ చెప్పడమా! అని విస్తుపోయిన రాజకుమారి పరదా చెప్పేకథ శ్రధ్ధగా వినసాగింది. 'కుందన రాజ్యాన్ని కోయిలవర్మ అనేరాజు పరిపాలిస్తుండేవాడు.అతని మంత్రి పేరు కోలా హలుడు.ఆరాజ్యంలో మాదకిపురం అనేఊరిలో కార్తికేయ అనే గజదొంగ ఉన్నాడు.అతనికి మార్తాండుడు,మహాశూరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.తనకుమారులలో పెద్దవాడైన మార్తాండుడిని పిలిచి 'నువ్వు ఈరోజు రాజథానివెళ్ళి పగటి పూట దొంగతనం చేసిరా'అని పంపించాడు.

అలా బయలు దేరిన మార్తాండుడు,మంగలివద్ద గడ్డం గీయించుకుని 'నావద్ద మెహిరీ ఉంది, చిల్లరలేదు మీపిల్లవాడిని నాతో పంపించు వాడికి నీచిల్లర యిచ్చిపంపుతాను'అన్నాడు.అలాపిల్లవాడిని వెంటపెట్టుకుని పక్కవీధిలో వస్త్రదుకాణానికివెళ్ళి కొన్నిబట్టలు మూటకట్టించుకుని'మేము బాటసారులం నాభార్య గర్బవతి సత్రంలో ఉంది.ఇవిచూపించి నచ్చినవి తీసుకుంటాను.మిగిలినవి ఇచ్చెస్తాను నేను తిరిగి వచ్చేవరకు నాకుమారుడు జాగ్రత్త'అని బట్టల మూట నెత్తిన పెట్టుకుని తన యిల్లు చేరాడు. విషయం అర్ధమైన బట్టల వ్యాపారి, మంగలి అంగడి వ్యెక్తి రాజు గారికి తము ఎలా మోస పోయింది ఫిర్యాదు చేసారు. మరు దినం తన చిన్నకుమారుడు మహాసూరుని రాజథాని కి వెళ్ళి దొంగతనం చెసి రమ్మన్నాడు అతని తండ్రి.మహాసూరునికి దొంగలను పట్టి బంధించేందుకు సైన్యాధికారి ప్రయత్నిస్తున్నాడని, అతని కూతురుకు అయిదవ ఏటనే పదేళ్ళ తన మేనల్లుడికి ఇచ్చి వివాహం జరిపించగా అప్పుడే అతను దేశాలు పట్టి వెళ్ళి పోయాడని తెలిసి, వాళ్ళ యింటి అల్లుడిలా వెళ్ళేందుకు సిధ్ధపడి పండ్లు, పూలు, చాలా రంగు రాళ్ళు తీసుకుని సైన్యాధికారి యింటి కి వెళ్ళి 'మావయ్య నేను నీ మేనల్లుడి ని ఇల్లు వదలి వెళ్ళిన నన్ను ఓ రత్నాల వ్యాపారి పెంచాడు. నేను పెద్ద వ్యాపారిగా మారాను ఇవిగో కోట్ల రూపాయల ఖరీదు చేసే రత్నాలు' అని తన వద్ద నున్న రంగు రాళ్ళ మూట విప్పి చూపించాడు.అందరూ సంతోషించారు. రాత్రి భోజన సమయంలో తను దొంగలను పట్టడానికి వెళుతున్నాను అన్నాడు సైన్యాధికారి.' నేను వస్తాను' అని మహాసూరుడు అతనితో బయలు దేరాడు.కొంత దూరం ప్రయాణం చేసాక దారిలో భూమిలో కొన్ని కొయ్య ముక్కలు పాతి ఉన్నాయి.'మామయ్య ఇవి ఏమిటి 'అన్నాడు మహా సూరుడు.' అవి దొంగను పట్టి బంధించిన అనంతరం పారి పోకుండా కట్టి వేసే కొయ్యలు 'అన్నాడు.దొంగను ఎలి కట్టి వేస్తారో చూపించు' అన్నాడు. మహాసూరుడు కొయ్యలతో తన కాళ్ళు,చేతులు లను బంధించుకున్నాడు సైన్యాధికారి. 'అయ్యో ఇప్పుడు ఎలా? అన్నాడు మహా సూరుడు. భయ పడక ఇంటికి వెళాళి సుత్తి తీసుకురా' అన్నాడు సైన్యాధికారి. యింటికి వెళ్ళిన మహాసూరుడు 'దొంగల భయం ఎక్కువగా ఉన్నదని ఇంట్లోని ధనం, బంగారం, విలువైన వస్తువులు మూట కట్టి తీసుకు రమ్మన్నాడు మామయ్య' అని అన్ని మూట కట్టుకుని తెల్ల వారే సరికి తన ఊరు చేరాడు మహాశూరుడు. అప్పటి వరకు కథ చెప్పిన పరదా 'దొంగలు ఇరువురులో ఎవరు గొప్ప వారో చెప్పండి' అన్నది. 'ఆ రాజ్య మహ రాజు చాలా గొప్పవాడు' అన్నాడు విక్రమార్కుడు. అతని మాటలకు వళ్ళుమండిన రాజకుమారి 'దొంగల్లో ఎవరు గొప్ప వాడో చెప్పండి అంటే ఆ దేశ మహా రాజు గొప్ప వాడు అంటావు ఏమిటి?' అంది కోపంగా. ఆ విధంగా ఆమెకు మౌన భంగం కావడంతో విక్రమార్కుని వివాహం ఆడింది. భోజరాజా అంతటి వివేకం నీలో ఉంటే ముందుకు వెళ్ళు అంది సాల భంజకం.అప్పటికే ముహుర్త సమయం మించి పోవడంతో తన పరివారంతో వెను తిరిగాడు.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ