భాయ్ కేరాఫ్ భాగ్యనగర్ - వెంకట్ దండుగుల

Bhai co Bhagyanagar

ఓల్డ్ సిటీలో ఇంకా జన సంచారం మొదలు కాలేదు. శీతాకాలం ఉదయం 6 గంటల సమయం. చుట్టూ మసీదులు, ఎటు చూసినా ఆకు పచ్చ వర్ణం లో జెండాలు, రోడ్లపై నల్లటి పొడవాటి కార్లు ఒక రకంగా చెప్పాలంటే పాత బస్తి పరిసరాలు పాకిస్థాన్ ని తలపించేలా ఉంటాయి. అర్ధరాత్రి వరకు సందడిగా సందడిగా ఉండే ఏరియా అది అయినప్పటికీ ఈ సమయం లో నిశ్శబ్దంగానే ఉంటుంది. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్.. అల్లా హుస్సమ్మద్ తన ఇంట్లో నమాజ్ చేస్తున్న సిరాజుద్దీన్ మొబైల్ అదే పనిగా మోగుతోంది. పాత బస్తీ పహిల్వాన్ గా సిరాజుద్దీన్ ను బస్తీ వాసులు పిలుస్తారు.

అతని గురించి పూర్తిగా తెలిసిన వారికి మాత్రం అతను సిరాజ్ 'భాయ్'. అస్సలామ్ వాలేకుం భాయ్... అవతలి గొంతు ఆత్రంగా పలకరించింది. హ్మ్.. బోలో సిరాజుద్దీన్ ఆలోచనలు, మనస్సు ఒక్కసారిగా మార్చేసాయి అవతలి వ్యక్తి మాటలు. ఒంట్లో రక్తం ప్రవాహలై ప్రవహించింది.. కళ్ళు ఎర్రబాడ్డాయి.. టీక్ హై.. మై జారూర్ మదత్ కారూంగ యే సిరాజ్ భాయ్ కా వాధా హై.. ఫోన్ కాల్ కట్ చేసి హడావిడిగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు సిరాజ్.

**************

కరాచీకి దాదాపు 50 km దూరంలోని అటవీ ప్రాంతం . చేతుల్లో AK 47 లతో కొందరు, ఖాళీ చేతుల్లో కొందరు తిరుగుతున్నారు. అందరూ పాతిక, ముప్పై సంవత్సరాల లోపు యువకులే, పాకిస్థాన్ లోని రహస్య ఉగ్రవాద శిక్షణా కేంద్రం అది. అక్కడ మూడు నెలలుగా ఉగ్రవాదులు ఉంటున్నట్లుగా ఆ దేశ రక్షణ దళాలకు కూడా తెలియదు. శిక్షణలో వారికీ అవసరం ఆయుధాలు, సామాగ్రి చాలా రహస్యంగా చేర్చాబడతాయి. కొన్ని రోజుల తర్వాత తమ స్థావరాలను మారుస్తూ ఉంటారు. ఆ రోజే కొందరు ఉగ్రవాదులు శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఉగ్రవాదులకు ఇచ్చే శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో అంతకంటే కఠినంగా, దుర్భరంగా వారి శిక్షణ తరువాతి జీవితం ఉంటుంది. నిజానికి కఠినంగా మారేది వారి జీవితం కాదు, శిక్షణ వల్ల మారిన వారి ఆలోచనలు. పేదరికం, పరిపక్వత లేని యువకుల మనసులో ఇస్లాం పట్ల చెడు భావాలను నింపి ఉసి గొల్పడమే వారికి ఇచ్చే శిక్షణ.

కొద్ది సేపటికి గుడారం లోపలి నుంచి పొడవాటి మాసిన గడ్డం, నల్లటి కుర్తా పైజామా తో మధ్య వయసు యువకుడు ఒకడు బయటికి వచ్చాడు. శిక్షణ పూర్తయిన ఉగ్రవాదుల ఎదురుగా వచ్చి గర్వoగా నవ్వాడు గడ్డం సవరించు కుంటూ.. ఘాబ్రానేకి కోయి బాత్ నహి.. నేను మనవాడి మదత్ అడిగాను. మన పని పూర్తయ్యేంత వరకు మీకు అన్నీ వాడే చూసుకుంటాడు. మీరు రేపే హైదరాబాద్ బయలు దేరండి, మనమేంటో హిందూస్తాన్ కి తెలియజేయండి అంటూ అందరి భుజాలు తట్టాడు. కరాచీ నుంచి హైదరాబాద్ కి అన్ని ఏర్పాట్లతో అదే రోజు రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు ఐదుగురు ఉగ్రవాదులు.

*************

చేతికున్న గడియారాన్ని పదేపదే చూసుకుంటుంది పావని కాలేజీ కి దగ్గర్లో ఉన్న బస్టాప్ లో నిలబడి. ఆరోజు ఆదివారం ప్రైవేట్ క్లాస్ పేరుతో ఇంట్లో అబద్దం చెప్పి వచ్చింది. మళ్ళీ ఒకసారి గడియారం వంక చూడబోయింది... తనకు బాగా పరిచయం ఉన్న పరిమళం అది, మనసంతా ఒక్కసారిగా ఉత్సాహభరితమైపోయింది, ఆనందం తో వచ్చిన చిరునవ్వుతో తలెత్తి పక్కకు చూసింది. తాను గత కొంత సేపటినుంచి వేచి చూస్తున్న కళ్ళే అవి, క్షణాలు యుగాలుగా గడిపి చూడాలనుకున్న చిరునవ్వే అది. పక్కనే నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడు రహీం... రహీం, పావని చిన్ననాటి స్నేహితులైనప్పటికీ మారిన కాలం తో పాటు వారి స్నేహం కూడా ప్రేమగా మారింది. చాలా కాలంగా ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామనుకున్నప్పటికీ వారి రెండు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపలేదు. అయినప్పటికీ చాలాసార్లు పావని తల్లి దండ్రులని అడిగి విఫలమయ్యాడు రహీం. అతను పోరు భరించలేక పావనికి ఇంకో మంచి సంభందం చూసి పెళ్లి చేసారు ఆమె తల్లి దండ్రులు.

***************

సిటీలో దిగిన ఐదుగురు ఉగ్రవాదులు ఒక హోటల్ లో దిగారు. అనుకున్నట్లు గానే వారికి యే ఇబ్బందులు లేకుండా చూసుకున్నాడు తమ కోసం నియమించ బడ్డ వ్యక్తి. ఇంకా రెండు రోజుల గడువు ఉంది. నగరం లోని ప్రసిద్ధ దేవాలయాన్ని కూల్చి వేసి ఆతంకం సృష్టించడమే వారి లక్ష్యం. ఐదుగురిలో నలుగురు భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక్కరు మాత్రం ఒంటరిగా , చేతిలో ఉన్న ఫోటోని చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు కక్ష సాధించాలన్న కసి తో ఉన్నాయి.

మరుసటి రోజు రాత్రి భుజానికి హ్యాండ్ బాగులు తగిలించుకొని హోటల్ రూమ్ లోంచి బయటకి వచ్చి రోడ్డెక్కరు ఐదుగురు. తాము అనుకున్న గుడి రాగానే అక్కడే ఆగి పరిసరాలను గమనించసాగారు.. సమయం అర్ధరాత్రి దాటి పోవస్తుంది. ఇంకొద్ది సేపైతే భక్తులు వచ్చేస్తారు. గుడి ముఖ ద్వారాన్ని కసిగా చూసాడు రహీం. 'పావని వెడ్స్ రమేష్' అనే బోర్డు ఇంకా మనసులో మెదులుతూనే ఉంది. కోపం కట్టలు తెంచుకుంది , రెండు సంవత్సరాల క్రితం పావని వివాహం జరిగిన గుడి అది. ఈరోజు కోసమే తాను ఇన్ని రోజులనుంచి ఎదురు చూస్తోంది. ఈ గుడి ద్వారమే తనను రాక్షసునిగా మార్చింది. భుజానికున్న బాగు తీస్తుండగా గుడి ముఖ ద్వారం ఒక్కసారిగా తెరచుకుంది.

ఎం జరిగిందో ఊహించే లోపే ఐదుగుర్ని చుట్టు ముట్టారు పోలీసులు. ఐదుగురు ఉగ్ర వాదుల్ని అదీనం లోకి తీసుకున్న తర్వాత కొడుకు వంక దీనంగా చూస్తూండి పోయాడు పోలీసులతో పాటుగా వచ్చిన రహీం తండ్రి. రెండు సంవత్సరాల క్రితం ఇంట్లోనుంచి చెప్పా పెట్టకుండా పారిపోయిన తన కొడుకు తనకు ఫోన్ చేసినందుకు సంతోషించాలో.. లేక తానొక ఉగ్రవాదిగా మారి, తమకు నిలువ నీడనిచ్చిన తల్లి వంటి ఈ భాగ్య నగరం లోనే విధ్వంసం సృష్టించ బోతున్నాడనీ తెలుసుకొని బాధ పడాలో తెలియక.. స్నేహితుడు సిరాజుద్దీన్ సహాయం తీసుకొని, అతని సలహా మేరకు పోలీసులకు సమాచారం అందించాడు రహీం తండ్రి. పెద్దగా సైరన్ శబ్దం చేసుకుంటూ ఐదుగురు ఉగ్రవాదులతో పోలీసు వాహనం కదలగానే.. తన కొడుకు చేసిన తప్పును క్షమించమని వేడుకున్నాడు.. యే అల్లా మేరె బేటేకో మాఫ్ కర్ దో.... 'అలాగే' అన్నట్లుగా గర్భ గుడిలో గంట మ్రోగింది.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి