తాతయ్యా చదువు ముచ్చట్లు - కందర్ప మూర్తి

Taatayya chaduvu muchchatlu

హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో ఆంగ్ల మాద్యమంలో ఐదవ తరగతి చదువుతున్న శ్రీకాంత్ ఆదివారమైనందున ఊరి నుంచి తాతయ్య నాయనమ్మ తెచ్చిన చెరుకుముక్క నములుతూ మాటల మద్యలో నాయనమ్మ ద్వారా తాతయ్య తన చిన్న తనంలో పాకబడి (హట్ స్కూల్ )లో చదివారని తెలిసి ఆశ్చర్యంగా, వాలు కుర్చీలో తెలుగు దిన పత్రిక చదువుతున్న తాత సీతారామయ్యని అడిగి తన శంసయాన్ని వెలిబుచ్చాడు. తాతయ్యా దిన పత్రిక పక్కన పెట్టి మనవడి శంసయాన్ని తీరుస్తూ తెలుగు పదాలు అర్థం కావని మద్యలో ఆంగ్లంలో చెబుతూ " ఔనురా,మనవడా! మా చిన్నప్పుడు పాకబడి లోనే చదువు కున్నాను. ఇంటి దగ్గర నుంచి కాలినడకన చెప్పులు లేకుండా ఒక మైలు దూరం నడిచి పాఠశాలకు వెళ్ళేవాళ్ళం. మాకు యూనిఫాం ఉండేది కాదు. నిక్కరు కమీజు వేసుకునే వారిమి. మగపిల్లలు ఆడపిల్లలు కలిసి చదువు కునేవాళ్లము. వెల్తూనే మేమే పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి చుట్టూ పూలమొక్కలు పెంచి నీళ్ళు పోసి పచ్చగా ఉంచే వారిమి. ఉదయం పాఠశాలకు రాగానే పరిసరాలు శుభ్రమైన తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు వందేమాతరం సరస్వతీ నమస్తుభ్యం వరదే కమరూపిణీ ప్రార్థన గీతం , జనగణమణ జాతీయ గీతం ఆలపించిన తర్వాత తరగతులు మొదలయేవి.ప్రాధమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండేవి. మట్టి దిమ్మల మీద కూర్చుని చదువునేర్చుకునే వాళ్లము. ఐదు సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాతే అక్షరాభ్యాసం చేసి పాఠశాలకు పంపేవారు. ప్రథమంగా తెలుగు అక్షర మాల అఆ ఇఈ లు మెత్తటి ఇసుకలో కుడి చేతి వేలుతో దిద్దించిన తర్వాత పలక( స్లేట్) మీద బలపం( చాక్) తో రాయించేవారు.ఐదవ తరగతి ( ఫిఫ్తు క్లాస్) వరకు తెలుగు మాద్యమంలో జరిగేది.చిన్న గుడ్డ సంచిలో అన్ని సబ్యక్టుల పుస్తకాలు సరిపోయేవి.తరగతి క్లాసుల విరామంలో చెట్ల కింద ఆటలు పాటలు జరిగేవి. " మరి టీచర్సు పనిష్మెంటు ఇచ్చేవారా? "అనుమానం వెలిబుచ్చాడు శ్రీ కాంత్. " పనిష్మెంట్లు ఉండేవి.సరిగ్గా చదవకపోతే నెత్తిమీద మొట్టికాయలు , అల్లరి చేస్తే గుంజీలు గోడకుర్చీ ఒంటి కాలిమీద నిలబెట్టే వారు. బెత్తం ( స్టిక్ )తో అరచేతి మీద కొట్టేవారు." 😊 " స్టూడెంట్సుని పనిష్ చేస్తే మీ పేరెంట్సు టీచర్సుని ఏమీ అనరా " అమాయకంగా అడిగాడు. " చదువులు బాగా రావాలంటే స్టూడెంట్సుకి పనిష్మెంటు ఉండాలి అంటారు." " ఇంట్లో మీ పెద్దవాళ్లు మిమ్మల్ని ఏమీ అనరా ?" మళ్ళీ మరొట డౌటు వెలిబుచ్చాడు. " మా నాన్నగారు అంటే బిగ్ గ్రాండ్ పా మేము అల్లరి చిల్లర పనులు చేస్తే వీపు మీద పిడి గుద్దులు వేసేవారని శ్రీ కాంత్ ని దగ్గరకు పిలిచి వాడి వీపు వంచి పిడికిలి బిగించి ఇలా అని డెమో ఇచ్చారు. వాడు నవ్వుతూ పక్కనే ఉన్న నాయనమ్మ ఒళ్ళో ఒదిగిపోయాడు. మళ్ళీ తాతగారు చెబుతూ మా చేత గుంజీలు తీయించేవారని కప్పగంతులు" ఫ్రాగ్ జంప్సు "చేయించే వారని అందువల్ల మాకు నాన్నంటే భయమనీ అమ్మ దగ్గరే చనువు " ఫ్రీ డమ్ "ఎక్కువ అన్నారు. ఇంకొక డౌటు అడుగుతూ " మీకు స్కూల్లో ఇంగ్లిష్ నేర్ప లేదా ?" " ఆరవ తరగతి అంటే సిక్త్సుక్లాస్ హైస్కూల్ నుంచి ఎ బి సి డి లు ఇంగ్లిష్ అలాగే హిందీ అక్షరాలు మొదలు పెట్టే వారు." ఆ మాటలు విన్న శ్రీకాంత్ నోటి దగ్గర చెయ్యి పెట్టుకుని నవ్వసాగాడు. తాతయ్య తన ప్రసంగం ముందుకు సాగుతూ మేము పదవతరగతి అంటే టెన్త్ క్లాస్ వరకు మాతృభాష తెలుగు లోనే చదువు కున్నాము. చందమామ బాలమిత్ర బొమ్మరిల్లు బుజ్జాయి లాంటి పిల్లల బొమ్మల పుస్తకాలు గ్రంథాలయం ( లైబ్రరీ )లో చదివే వాళ్ళం.ఎక్కాల పుస్తకం పెద్ద బాలశిక్ష వేమన శతకం సుమతీ శతకం భాస్కర శతకం వల్లె వేసే వాళ్ళం. తెలుగు వారాలు నక్షత్రాలు నెలలు సంవత్సరాలు కంఠస్తం చేసే వారిమి. తాతయ్య చెప్పే కబుర్లు ఏవో అద్భుత విషయాలు విన్నట్టు ఆశ్చర్య పోతూ " తాతయ్యా ! నాకు తెలుగు అక్షరాలు నేర్పండి. నేను తెలుగు బొమ్మల కథల పుస్తకాలు చదువుతాను.నా దగ్గర ఇంగ్లిష్ కామిక్సు బుక్సు కార్టూన్ బుక్సే ఉన్నాయి. అగ్రహారం విలేజ్ కి వచ్చి నప్పుడు బుల్లక్ కార్టు ( ఎడ్ల బండి ) ఎక్కుతా "అన్నాడు. " అలాగే లేరా, ఈ సారి వేసంగి శలవుల్లో నీకు తెలుగు నేర్పుతాను "అన్నారు. ఉద్యోగ రీత్యా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న కొడుకు కోడలు మనుమడు హైదరాబాదుకు వచ్చినందుకు ఆనందించారు సీతా రామయ్య దంపతులు. * * *

మరిన్ని కథలు

Lalitha
లలిత
- BHADRI RAJU THATAVARTHI
Manavataku spoorthi
మానవతకు స్ఫూర్తి
- కందర్ప మూర్తి
Anaatha saranalayam
అనాథ శరణాలయం
- సిహెచ్.వి.యస్. యస్. పుల్లం రాజు
Call vachchindi
''కాల్ ''వచ్చింది!
- కొత్తపల్లి ఉదయబాబు
Kanuvippu
కనువిప్పు
- శింగరాజు శ్రీనివాసరావు