Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
janvi entry

ఈ సంచికలో >> సినిమా >>

బయో పిక్ ల కోసం ఎదురుచూస్తోందట..!

pooja hegde waiting for bio pics

కథల్లేవు కథల్లేవు అంటూ కలవరిస్తోన్న తెలుగు సినిమా పరిశ్రమకి జీవిత కథలు వరంలా దొరికాయి..చరిత్రలో కలిసి పోయిన వారి జీవిత కథలను వెలికి తీసి, ఆసక్తికరమైన కథనాన్ని, స్క్రీన్ ప్లేన్ జోడించి అద్భుతంగా అందించడం గొప్ప ప్రతిభ. ఇప్పుడు దర్శక నిర్మాతల దృష్టంతా బయోపిక్ ల పైనే....అందులో వాస్తవాలకు కొంత కల్పనను జోడించి అందిస్తున్నారు. దృశ్య పరంగా బాగుండాలనో, కథనం మరింత ఆసక్తి కరంగా ఉండాలనో ఇలా చేస్తున్నామంటున్నారు. ప్రేక్షకులు కూడా వీటిని బాగానే ఆదరిస్తున్నారు. మనకు చరిత్ర సృష్టించిన వారికేం కరువు లేదు...రాజకీయాలు, సినిమాలు, క్రీడలు, సామాజిక సేవలు, ఇలా అనేక రంగాల నుంచి ఎందరో మహానుభావులున్నారు....ఒకరి బయోపిక్ తీస్తున్నారంటే, అందులో ప్రధాన పాత్రతో పాటు మిగతా పాత్రలకూ నటీ నటులు కావాలి...వారందరూ ఆనాటి వారి పోలికలతో సరి పోయిన వారు కావాలి...వారి హావ భావాలను పలికించ గలగాలి....అందుకే బయోపిక్ అంటే ఒక పెద్ద సాహసమే...ఎన్ టీ ఆర్, ఏ ఎన్నార్ లాంటి వారి కథలైతే వారి వారి వారసులు ఉండనే ఉన్నారు...ఆ పాత్రలలో వారిని చూడడం మరింత ఆనందం ప్రేక్షకులకి...
అవకాశం వచ్చినవారు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తూంటే, రాని వారు ఎలాంటి బయోపిక్ లో అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు..

అరవింద సమేత లో అందాలు ఆరబోసి, ప్రేక్షకులకు కనువిందు చేయనున్న పూజా హెగ్డే కూడా ఏదో ఒక బయోపిక్ లో అవకాశం కోసం ఎదురు చూస్తోందట.. సింధు, సానియా, సైనా, మిథాలీ రాజ్ ఇలా యువ క్రీడాకారులకు స్పూర్తి నిచ్చే ఎంతో మంది క్రీడాకారిణులున్నారు...వారి బయోపిక్ లు తీస్తే వాటిలో పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది...అందాలారబోతకే పరిమితమై పోయారు మన హీరోయిన్లు అనే పేరు పోవాలంటే ఇలాంటి చాలెంజింగ్ పాత్రలు కూడా చేసి ఒప్పించాలని ఎదురు చూస్తున్న ముద్దుగుమ్మల అభిలాష నెరవేరాలని ఆశిద్దాం....

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam