హతవిధీ!!! కరోనా.... - లత పాలగుమ్మి

OMG corona

ఏమండీ!! నేను స్నానం చేసొచ్చేలోగా మీరు లంచ్ బాక్సులు సర్దేయండి, వెంటనేబయలుదేరిపోవచ్చు, ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకుంటూ టవల్ భుజం మీద వేసుకునిబాత్ రూమ్ వైపు వెళుతున్న సుజాత భర్త రాజేష్ ని చూసి ఆశ్చర్య పోతుంది అతను ఇంకా నైట్డ్రెస్ లోనే ఉండటంతో. అదేమిటండీ, కొంపతీసి ఈ రోజు లీవ్ పెడుతున్నారా ఏమిటి?? అంటుంది.

అవును సుజీ! ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను అంటాడు రాజేష్ విపరీతమైన జలుబు, దగ్గుఉండటంతో భారమైన గొంతుతో. ముందే చెప్పొచ్చు కదండీ!! నేను కూడా “వర్క్ ఫ్రొం హోమ్” పెట్టుకునేదాన్ని, లాస్ట్ మినిట్ లో చెపితే ఏడుస్తాడు మా బాస్, అనవసరంగా క్యాబ్ కి బోలెడుడబ్బులు ఖర్చు పెట్టాలి ఇప్పుడు నేను అంటుంది సుజాత కొంచెం కోపంగా. రోజూ సుజాతనుఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు రాజేష్.

నా బాధలు ఏం చెప్పను సుజీ!! వారం రోజులుగా ఆఫీసులో నా పరిస్థితి దారుణంగా ఉంది. మీటింగ్ కోసం కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. నేను “హచ్ హచ్ “ అనితుమ్మటం, అందరు ఉలిక్కి పడి నన్నొక విలన్ లాగా చూడటం జరుగుతోంది. అబ్బా!! “వీడెందుకు వచ్చాడ్రా బాబు ఆఫీసుకి, ఇంట్లో కూర్చోకుండా” అన్నట్లు చూస్తున్నారు.

సంవత్సరంలో సగం రోజులు నాకు జలుబేనని అందరికీ తెలుసు. అయినాసరే, కరోనా నేమోననిభయపడుతున్నారు. నిన్నటికి నిన్న మా బాస్ “ఎందుకైనా మంచిది ఒకసారి కరోనా టెస్ట్చేయించుకో రాజేష్” అని ఒక ఉచిత సలహా పడేశాడు. ఈ కరోనా కాదుగాని నా ప్రాణంమీదకొచ్చిందే సుజీ... అంటాడు రాజేష్ మళ్ళీ తుమ్ముకుంటూ.

నాతొ కార్ పూల్ చేసుకునే వినయ్ కూడా ఏదో వంక చెప్పి తప్పించుకొని, ఇంకెవరినో లిఫ్ట్అడిగాడని తెలిసింది. ఆఖరికి మా ఆఫీస్ బాయ్ కూడా మీకు కరోనా ఏమోనని భయంగా ఉందిసార్, టెస్ట్ చేయించుకోలేక పోయారా?? అని నేనేదో రేపో మాపో పోతున్నట్లు నా కేసి జాలిగాచూశాడు. కరోనా టెస్టులో నెగిటివ్ అని వచ్చింది, ఆ రిపోర్ట్ మేడలో వేసుకుని తిరగమన్నావా అనికావాలని అందరికీ వినపడేలా గట్టిగా అరుస్తాడు రాజేష్ అతని మీద.

నా కాబిన్ కి వచ్చి వెళ్ళాక అందరూ హ్యాండ్ శానిటైజర్ వాడటం నేను గమనిస్తూనే ఉన్నాను. అందరూ నన్ను అంటరానివాడిగా చూస్తున్నారు సుజీ అని తన బాధని వెళ్ళగక్కుతాడు రాజేష్. అయ్యో!! అని భర్త కేసి బాధగా చూస్తుంది సుజాత ఏం చెయ్యాలో పాలుపోక. అతని గురించేఆలోచిస్తూ ఆఫీస్ కి వెళ్ళక తప్పదని బయలు దేరుతుంది సుజాత,

రోజంతా లాప్టాప్ దగ్గర కూర్చుని వర్క్ చెయ్యడంతో బుర్ర వేడెక్కిపోయి కాసేపు చల్లగాలికి బయటకూర్చుందామని లిఫ్ట్ లోకి వెళతాడు రాజేష్. వాళ్ళు ఉండేది ఎయిటీన్త్ ఫ్లోర్ కావడంతో బాల్కనీలోకూర్చోవడం రాజేష్ కి అస్సలు ఇష్టం ఉండదు. హైట్స్ అంటే భయం చిన్నప్పటి నుండి. ఇంతమంచి వ్యూ కోసమే కదా ఎక్కువ డబ్బులు కూడా కట్టాము, అయినా ఎప్పుడు బాల్కనీలో కూర్చునిఎంజాయ్ చెయ్యము అని సుజీ ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది.

లిఫ్ట్ లోకి వెళ్ళగానే మళ్ళీ తుమ్ములు “హచ్ హచ్” అంటూ. ఏంటి రాజేష్!! ఒంట్లో బాలేదా!! కరోనాటెస్ట్ ఒకటి కొట్టించేయక పోయావా? అంటూ పక్కింటి అంకుల్. “ఓ గాడ్!! నాట్ అగైన్” అనుకుంటూ లిఫ్ట్ లోనే తల గోడకేసి కొట్టుకోవాలన్నంత ఉక్రోషం వచ్చేసింది రాజేష్ కి.

పార్క్ లో చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు బెంచెస్ మీద కూర్చుని కబుర్లుచెప్పుకుంటున్నారు. జనాలు ఎక్కువగా లేని చోటుకి వెళ్ళి ఒక పక్కగా కూర్చున్నాడు రాజేష్. మళ్ళీతుమ్ములు మొదలైనాయి పాపం రాజేష్ కి. ఎదురుగుండా బెంచ్ మీద కూర్చున్నపెద్దవాళ్ళందరూ మెల్లగా ఖాళీ చేసేసారు. మిగిలిన కొంతమందేమో ఇతనికేసే గుర్రుగాచూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ పెద్ద మనుషులే తుమ్మితే “చిరంజీవ” అనో, బ్లెస్స్ యు అనోదీవించేవారు. “వారెహ్ వాహ్!! కరోనా!! ఏమి నీ లీల” అనుకున్నాడు రాజేష్ కచ్చిగా.

“ఇంట్లోనే రెస్ట్ తీసుకోవలసిందమ్మా” అని అన్నారు ఒకాయనైతే. వాళ్ళందరూ చెప్పేది ప్రస్తుతపరిస్థితుల్లో కరెక్టే అయినా అందరూ చెప్పడంతో రాజేష్ కి విసుగ్గా ఉంది. సుజాత ఆఫీస్ నుండివచ్చిన తర్వాత ఇదంతా చెప్పి కనీసం చల్లగాలి పీల్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళడానికిలేకుండా పోయిందని వాపోయాడు రాజేష్.

ఇదంతా విన్న సుజాత వాళ్ళ పుట్టింటికి వెళదామని ప్రపోజల్ పెడుతుంది. రాజేష్ కి పెద్దగాఇష్టం లేకపోయినా చుట్టు పక్కల వాళ్ళనించి తప్పించుకోవడనికి సరేనన్నాడు. ఇద్దరు 15 రోజులు లీవ్ పెట్టి సుజాత వాళ్ళ ఊరు వెళతారు.

ఎంతో బ్రతిమలాడినా రానివాళ్ళు వాళ్ళంతట వాళ్ళే రావడంతో సుజాత తల్లి తండ్రులు చాలాసంతోషంగా ఆహ్వానం పలుకుతారు. రాజేష్ పరిస్థితి చూసి అయ్యో, అల్లుడు గారూ, మీకు బాగాజలుబు చేసేసింది అని ఒక పెద్ద గ్లాస్ వేడి వేడి పాలలో అప్పుడే ఫ్రెష్ గా కొట్టిన మిరియాల పొడి, పసుపు వేసి ఇస్తారు రాజేష్ కి వాళ్ళ అత్తగారు. అప్పుడే పితికిన పాలు, పొయ్యి మీద కాగపెట్టారు, అదొక రకమైన రుచి. కాదనకుండా తాగేసి మంచం మీద వాలతాడు రాజేష్. ప్రతిసారి పండక్కివచ్చినప్పుడు ఎన్ని రకాల పిండివంటలు చేసినా, కొన్ని ఫాట్ అని, కొన్ని స్వీట్ అని కొంచెం టేస్ట్ చేసివదిలేస్తాడు రాజేష్. వచ్చిన దగ్గర నుండి “కరోనా” అనే పదం వినపడనందుకు, అత్తగారి ఇంట్లోఅందరూ తనని శ్రద్ధగా చూసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అతనికి. చల్లని ఫ్రెష్ ఎయిర్కోసం మంచం పక్కనే ఉన్న కిటికీ తీసిపెడుతుంది సుజాత. మంచి నిద్ర పట్టేస్తుంది రాజేష్ కి. లేచేటప్పటికి అతని బావమరిది హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చి సిద్ధంగాఉంచుతాడు. సాయంత్రం బయట కూర్చుంటే చాలు మంచి గాలి, చక్కని కాలక్షేపం. ఇక్కడ నాతుమ్ములకి భయపడి పారిపోయేవాళ్ళు కానీ, నాకు కరోనా ఉందని అనుమానం గా చూసేవాళ్ళుకానీ లేరు. ఎంతో హాయిగా అనిపించింది రాజేష్ కి.

రోజంతా ప్రక్కనే ఉండి కబుర్లు చెపుతూ, సాయంత్రం అయ్యేసరికి రాజేష్ ని పొలం దగ్గరికితీసుకువెళుతుంది సుజాత. పెళ్ళి అయ్యాక ఆఫీస్ హడావిడులు లేకుండా ఇంత ప్రశాంతంగాసమయం గడపడం ఇదే మొదటసారి కావడంతో ఇద్దరికీ చాలా సంతోషంగా ఉంది.

రాజేష్ కి పూర్తిగా సరి అవుతుంది. వాళ్ళు వెళ్ళే ముందు రోజు పొలం గట్టున కూర్చుని ఉండగా“అందరూ మిమ్మల్ని విలన్ లా చూస్తున్నారని మీరు బాధ పడుతున్నారని నేనేమీ అనలేకపోయాను కానీండి, ప్రస్తుత పరిస్థితులలో కరోనా వైరస్ కాకపోయినప్పటికీ భయపడటం సహజం. ఎదుటి వారిని అపార్ధం చేసుకోకుండా ఆరోగ్యం సరిగా లేనప్పుడు, మనకి మనమే అందరికీదూరంగా ఉండాలి. ఐసొలేషన్ అని చెపితే మీరు హర్ట్ అవుతారేమినని, మీకు ఎక్కడ నా మీదకోపం వస్తుందేమోనని చెప్పకుండా మా ఊరు ప్రపోజల్ పెట్టాను. ఒక రకంగా చెప్పాలంటే మీరుసెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నట్లే ఈ పదిహేను రోజులు అని నవ్వుతు ముగిస్తుంది సుజాత.

సుజాత చెప్పిన మాటల్లో ఎంతో నిజం ఉందని, తనకి ఒంట్లో బాగుండక పోవడంతో తానేఅనవసరంగా అందరినీ అపార్థం చేసుకున్నాడని బాధ పడతాడు రాజేష్. ఆఫీస్ కి వెళ్ళాక తనమిస్ బిహేవియర్కి అందరికి “సారీ” చెప్పాలనుకుంటాడు.

ఇలాంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు అందరూ సహనంతో, సంయమనంతో, కలిసిగట్టుగాదానిని ఎదుర్కొన్నప్పుడు ఏది అసంభవం కాదు అని “హతవిధీ!! కరోనా... అని నవ్వుకుంటారు ఇద్దరు.

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల