మృగరాజు మనసు - - బోగా పురుషోత్తం

Mrugaraju manasu

చిత్రకూట దుర్గాన్ని పెద్ద సింహం పాలించేది. తన పాలనలో పారదర్శక పాలన సాగేది. ఓ రోజు సింహానికి నక్క పరిచయమయింది . దాన్ని మృగరాజు ఆర్ధిక శాఖ మంత్రిగా నియమించింది. ఇక నక్క అవినీతికి అంతే లేకుండా పోయింది. మృగరాజు ఖజానా ను అంతా ఖాళీ చేసింది. మాయమాటలతో మృగరాజు కొలువులో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి జంతువులందరివద్దా బాగా డబ్బులు సంపాదించింది. నక్క సంపాదించిన డబ్బుతో చిత్రకూటదుర్గంపై పెద్ద రాజకోటను నిర్మించింది. మృగరాజు పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం నిలిపివేసింది నక్క. దీంతో ఉద్యోగులందరూ మృగరాజుపై ద్వేషం పెంచుకున్నాయి. దీన్ని చూసిన నక్క ఉద్యోగులందరినీ తన రాజకోట వద్దకు తరలించింది..
అందులో తన మిత్రులను, అనుచరులను, పాలకులుగా నియమించింది.
ఓ రోజూ మృగరాజు తన రాజకోట అయిన పెద్ద గుహ నుంచి నిద్రలేచి బయటకు వచ్చింది. బయటకు తొంగిచూసి అవాక్కయింది.
పెద్ద చెట్టు నుండి తేనెటీగలు వచ్చి తనపై దాడి చేస్తుంటే బిత్తరపోయి చూసి ‘ ఎవరక్కడ? రాజుని నాపై ఈగ కూడా వాలకూడదు? అని తెలియదా? ఎక్కడ నా మిత్రుడు నక్క?’’ అని ప్రశ్నించింది.
ఎదురుగా వున్న సైనికుడు ఎలుగుబంటిని ‘‘ ఏం రారాజుని.. నాపై ఈగలు దాడిచేస్తుంటే కొంచెమైనా చలించరా? నా సొమ్ము తిని నన్నే మరిచిపోతావా’’ అని తేనెటీగల దాడి భరించలేక గట్టిగా అరిచింది మృగరాజు.
అక్కడి నుంచి దూరంగా తప్పించుకున్న సైనికాధిపతి ఎలుగుబంటి ‘‘ ఇంకెక్కడ మృగరాజా!. నీ పాలనలో అంతా అనినీతే కదా? నీ వద్ద వున్న ఉద్యోగులకు ఒక్కరికీ పది నెలలుగా జీతాలు అందలేదు. . ఇక ఎవరూ నీ మాట వినరు..! నీ మిత్రుడు నక్కకి అంతా పెత్తనం అప్పగించావు.. అది నీ సామ్రాజ్యాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసింది. అది నీ కన్నా గొప్ప రాజ భవనాన్ని నిర్మించి ఉద్యోగులందరినీ అక్కడికి తరలించింది. నీ ఖజానాన్ని మొత్తం ఖాళీ చేసింది..ఇకనైనా మేలుకో..దాన్ని వెంటనే తొలగించు..లేకుంటే నీ ప్రాణానికి కూడా హాని రావచ్చు..!’ దాని పన్నాగంలో భాగమే ఈ తేనె టీగలు వదలడంకూడా ..అని హెచ్చరించి అక్కడి నుండి కదిలింది ఎలుగుబంటి.
తేనెటీగల దాడి నుంచి తప్పించుకుని పరుగుపెట్టి గుహ నుంచి బయటపడింది మృగరాజు.
రోజూ తన మంచి చెడులు కనుక్కొని కంటికి రెప్పలా కాపాడుతున్న మంత్రి మర్కటం, సైనికులు కుందేళ్లు కనిపించకపోవడంతో చిర్రెత్తుకొచ్చింది మృగరాజుకి. ఆగ్రహంతో అడివిలో పరుగులు తీసింది. ఎక్కడా తన మనుసుల జాడ కనిపించకపోవడంతో చిత్రకూట దుర్గంపైకి గంతులేసి ఎక్కింది. అక్కడ దూరంగా ఇంద్రభవనం లాంటి రాజభవనం కనిపించింది. ఆశ్చర్యంతో అందులోకి ప్రవేశించడానికి ప్రయత్నించి భంగపాటుకు గురైంది.
రాజభవన ద్వారం వద్ద ‘‘ ఆగు.. ఎవరు నువ్వు? ఏం కావాలి? లోనికెళ్లాలంటే మా రాజు నక్క అనుమతి తీసుకోవాలి..!’’ అంటూ అడ్డుకుంది మర్కటం.
ఆ మాటకి మృగరాజు మతిపోయింది. నా రాజ్యంలో వుంటూ నన్నే ధిక్కరిస్తావా? చూడు నిన్నేం చేస్తానో..’’ అంటూ మంత్రి మర్కటంపై దాడి చేసింది.
మృగరాజు పంజా విసరక ముందే ఎగిరి గంతేసి రాజ భవనంలోకి వెళ్లి దాక్కుంది మర్కటం.
మరింత ఆగ్రహంతో వున్న మృగరాజు రాజ భవనం ద్వారాలు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించింది. అక్కడ పాలన లేదు.. పాలకులు లేదు.. ఓపెద్ద సింహాసనంపై కూర్చొని అన్ని జంతువులను ఆరగిస్తోంది నక్క.. అప్పటికే అడవి జంతవులను ఖాళీ చేసి వేసిన ఎముకల గూళ్ల గుట్టలు కనిపించాయి. ఇక నక్కని వదిలేస్తే తన రాజ్యంలో వున్న ఒక్క జంతువునూ మిగలనివ్వదు.. తన ప్రాణాలకు కూడా ముప్పు వస్తుంది’ అనుకుని సింహ గర్జన చేస్తూ పంజా విసిరింది.
మృగరాజు దాడికి బిత్తరపోయి నక్క ‘‘ క్షమించండి మహారాజా.. నీ రాజ్యంలో అవినీతిని పెంచింది నేనే.. అన్ని జంతువులకూ డబ్బు ఎరచూపి నీ ఖజానాను కొల్లగొట్టి ఈ రాజభవనం నిర్మించాను.. ఇక దీన్ని నువ్వే ఏలుకో.. దయచేసి నన్ను వదిలేయి..’’ అని దీనంగా వేడుకుంది.
అప్పటికే దాని చెర నుంచి తప్పించుకున్న మంత్రి మరక్కటం, సైనికులైన కుందేల్లు వచ్చి ‘‘ రాజా నక్క జిత్తుల మారి.. దాని మాటలు నమ్మొద్దు.. మాయ మాటలతో అందరినీ తన వైపునకు తిప్పుకుని ప్రాణాలు తీసి ఇబ్బంది పెట్టించింది..ఇక ఆలస్యం చేస్తే నిన్ను కూడా బతకనివ్వదు’’ అని వేడుకున్నాయి. అది విన్న మృగరాజు ఒక్క పంజాతో నక్కని చంపింది. ఆ తర్వాత అడవి జంతువులన్ని మృగరాజు చల్లని పాలనలో హాయిగా జీవించాయి.

మరిన్ని కథలు

Amma Koyila
అమ్మ కోయిల
- విజయ వాణి. జన్నాభట్ల
Kanuvippu
“కనువిప్పు”
- ప్రభావతి పూసపాటి
Aasha Peraasha
ఆశా -పేరాశా .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Bheemarao Tindi
భీమారావు తిండి
- మద్దూరి నరసింహమూర్తి
Aashrayam
ఆశ్రయం
- సి.హెచ్.ప్రతాప్
Parivartana
పరివర్తన
- డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు
Repati bhrama
రేపటి భ్రమ
- సి.హెచ్.ప్రతాప్