పెదనాన్న - ఏ. కృష్ణమోహన్

Pedanaanna

“రేయి – పిండాలు అక్కడ పెట్టేసి వెనక్కి చూడకుండా వచ్చేయండి.” చిన్నాన్న చెప్పినట్లుగా చేయడానికి లేచాము. అయ్యోరు వచ్చి మంత్రాలు చదివి, గోడ మీద నీళ్ళు చల్లి. బాగా ఎత్తుగా, అందరికీ దూరంగా విస్తరాకు పెట్టించాడు. విస్తరాకులో లడ్డు, వడ, పాయసం, పప్పు, అన్నం, కూర,పెరుగు అన్నీ కలిసి పోయి ఉన్నాయి. లడ్డు పచ్చగా, వడ ఉబ్బుగా, కనబడతాయి కాబట్టి కాకి వచ్చి తింటాదిలే అని అనుకున్నాము.

గోడ మీద పెట్టి వచ్చేసరికి కాళ్ళు కాలిపోయాయి. మిట్ట మధ్యాహ్నం ఎండ మాడిపోతా ఉంది. గోడ మీద పెట్టిన విస్తరాకుని కాకి ఎప్పుడు తింటుందా అని ఎదురు చూస్తూ దూరంగా నిలబడ్డాము. కాకి వచ్చి ముట్టితే చనిపోయిన ఆయన ఆత్మ తృప్తిపడినట్లు, కర్మకాండ సఫలం అయినట్లు అని మా వాళ్ళు అనుకున్నారు. 5 నిమిషాలు గడిచింది, ఒక కాకి ఉంది కానీ అది రావడం లేదు. అంతకు ముందు కర్మ చేసిన వాళ్ళు పెట్టిన విస్తరి కూడా అక్కడే నిండుగా ఉంది. వాళ్లెవ్వరో చూసి చూసి ఎళ్లిపోయారంట. “రేయ్ – అరవబాకండిరా – దూరంగా వచ్చెయ్యండి.” చిన్నాయన కోప్పడ్డాడు. కాకి ఇంత దాకా రాలేదు. చనిపోయిన ఆయనకి కోపమా లేక అలకనా, మన ఏర్పాట్లు బాగాలేవేమో. ఇంకో కాకి ఏమైనా రాక పోతుందా అని చూస్తూ కూర్చున్నాము. పచ్చటి చిలుకల గుంపు ఒకటి వచ్చి విస్తరి చుట్టూ మూడు సార్లు తిరిగి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది.

“ఏమిరా- మంచినీళ్లు కూడా లేవే. ఎవరైనా నీళ్ళు తెచ్చారా?” స్వామి అడిగాడు. ఆ మాట అనగానే చిన్నాన్న లేచి “ రేయ్ సురేశ్ – సెంటరుకి పోయి 50 మజ్జిగ పాకెట్లు తీసుకురా” అని పురమాయించాడు. కాకి మేము పెట్టిన విస్తరి వైపు తిరిగి కూడా చూడడం లేదు. కాసేపటికి అది కూడా దూరంగా ఎగిరిపోయింది. “రేయ్ బాబయ్య ఇప్పుడు కూడా నానుస్తున్నాడు” అని రాజు అందుకున్నాడు. చనిపోయిన మా పెదనాయన గురించి ఆలోచనలు మళ్ళాయి. పెదనాయన బిడ్డలం మాకు కూడా ఈ ఆలస్యం అంతగా రుచించడం లేదు. “అన్నిటికీ నాన్చి పెట్టేవాడు. ఉండేది ఇద్దరు కొడుకులం. మాకిద్దరికీ ఒక దారి చేయమంటే తేల్చకుండా పోయాడు. ఖర్చు కోసం డబ్బులు అడిగితే తూచి తూచి కొద్దిగా ఇచ్చేవాడు. పోతా పోతా ఏమైనా మూటగట్టుకు పోయాడా? ఏం చేసాడు?”

“తెలిసిన వాళ్ళకి , స్నేహితులకీ కార్యం గురించి చెప్పండి నాయన. రేపు చెప్పలేదంటారు.” అని అమ్మ అన్నా పట్టించుకోలేదు. “రేయ్ మీ పెదనాయన ఆత్మ ఈడే తిరుగుతా ఉంటాదిరా. కర్మకాండలు సరిగ్గా చేయించండి రా.” అని అమ్మ మొత్తుకుంటా ఉండినది. అయినా అన్నీ కార్యక్రమాలు సాదాసీదాగా జరిపేసాము. జంగం దేవర ఎక్కువ అడిగితే వద్దనేసాము. చనిపోయిన ఆయన స్మృత్యర్థం అందరికీ ఏదైనా వస్తువు ఇద్దామని అమ్మ అంటే పెదనాయన కూతురు వద్దనేసింది. “ఆసుపత్రికే చాలా ఖర్చు అయిపోయింది. ఇంకా ఇదంతా ఆర్భాటం ఎందుకు” అని ఎదురు అడిగింది. “మా దగ్గర డబ్బు లేదమ్మ, మేము తేలేము. నువ్వు ఇస్తే చేస్తాము “ అని మేము చెప్పేము. “నేనైనా మా ఆయన్ని అడగకుండా ఏమీ ఇవ్వలేను . కొంత డబ్బు సర్దుబాటు చేస్తాను . కర్మకాండ సింపుల్ గా జరిపించండి.” అని కవిత ఆనింది. “ అయినా, మీరు ఇదంతా చెయ్యాలి , ఇన్నాళ్ళూ మా నాయన చుట్టూ ఉండి గడిపారు . ఇప్పుడు చనిపోయినాక ఈ ఇల్లు మీకే ఇచ్చాడు. కొండ క్రింద ఐదు ఎకరాల పొలం కూడా మీకు ఇచ్చాడు. ఇంత చేసిన మా నాయనకి మీరు కర్మంతరాలు చేయడం బాధ్యత కాదా?” అని ఆనింది “అది ఎందుకూ పనికిరాదు కవితా, దాన్ని చదును చెయ్యడానికే ఏళ్ళు పడతాది” అని మా అన్న అన్నాడు. “ ఎవరి చేతిలో పెట్టినా ఆ భూమికి సంవత్సరానికి పది వేల రూపాయలు ఇస్తారు. మీరు ఇంత కాలం పని లేకుండా ఉన్నారు కదా. అందుకే మా నాయన అది మీకు అప్ప చెప్పాడు .” కవిత వెటకారంగా అన్నా అది మాకు తగిలే తట్టు ఆనింది.

ఎంతసేపటికీ కాకి తాకే పరిస్థితి కనపడటం లేదు. “మధ్యాహ్నం అయిపోయింది, నేను ఇంకో కార్యానికి ఏర్పాట్లు చేసుకోవాలి.” అని అయ్యోరు వెళ్లిపోబోయాడు. “స్వామీ – ఏట్టా చెయ్యాలి – వదిలేసి వెళ్లిపోవచ్చా? భోజనాల టైమైంది . ఇంటి కాడ అందరూ ఎదురు చూస్తా ఉంటారు.” అని అడిగాము స్వామి బయల్దేరుతూ దక్షిణ తీసుకున్నాడు. “కుక్కకైనా పెట్టండి- లేకపోతే ఏటి నీళ్ళలో కలిపేయండి. పంచభూతాలలో కలిసి పోయినట్లే అనుకోండి.” స్వామి చెప్పినట్లే విస్తరాకు దించేసి, ఏటి కాలువ నీళ్ళలో కలిపేసి చెంబులో నీళ్ళు తీసుకొని వెనుకకు బయల్దేరాము. “రేయ్ చెంబులో నీళ్ళు జాగ్రత్తగా పట్టుకో. ఇంటికి పోయి తొట్టిలో పొయ్యాలి.” అన్నాడు చిన్నాయన. ఆయనే ఇంటికి ఫోన్ చేసి, “వెనక్కి వస్తున్నాము. పేడ తొక్కడానికి పెట్టండి. వాకిట్లో నీళ్ళు పెట్టండి, దీపం పెట్టండి” అని చెప్పాడు

అందరం ట్రాక్టర్ ఎక్కాము. పల్లెటూరి రోడ్డు గతుకులు, పొల్లాలోంచి పోతా ఉంది. కర్మ చేసిన యిద్దరు మాత్రం ముందుగా స్కూటర్లో బయల్దేరాము . మా నాయన ఎప్పుడో పోయాడు. మాకిద్దరికీ ఉండినది మా పెదనాన్న, చిన్నాన్నే. ఇద్దరికీ పెద్దగా ఆస్తి లేక పోయినా పెదనాయన ఉన్న దాన్ని వృద్ది చేసుకున్నాడు. ఆయనకి ఒక కూతురు కాబట్టి, మమ్మల్ని అందరూ కొడుకులుగా భావించుకునేవాళ్ళు. మా నాయన ఏమీ సంపాదించకుండానే పోయాడు. మా అమ్మ, మేము మా పెదనాయన ఇంట్లోనే ఉండేవాళ్ళము. పెదనాయన వ్యాపారాలు చేస్తా ఉండేవాడు. పెద్దమ్మ బాగానే చూసుకునేది. మేము పోయినాక అంతా మీదే కదరా అని మాటిమాటికీ అనేది. ఆ మాటలే మమ్మల్ని పనికి రాకుండా చేసాయేమో? అదే నమ్ముకొని ఏమీ చెయ్యకుండా ఉండిపోయాము. కూతురికి బాగా పెట్టి పెళ్లి చేసి పంపించాడు మా పెదనాన్న. ఆ పెళ్ళయిన ఆరు నెలలకే మా పెద్దమ్మ చనిపోయింది. కష్టపడి ఎదిగిన వాడు కాబట్టి మా పెదనాయన ఎప్పుడూ ఏదో పని చేస్తూనే గడిపేవాడు. మా ఇద్దరినీ సోమరిపోతులని అనేవాడు. మేము పెద్దమ్మ మాటలు విని ఆయన పోయిన తర్వాత అంతా మాదే అని కలలు కనే వాళ్లం.

“నాయనా ఎంతకాలం మీ పెదనాన్న ఔదార్యం మీద బతుకుతారు. ఏదైనా ఉద్యోగాలు చేసి స్వంత కాళ్ళ మీద నిలబడండి రా .” అని మా అమ్మ అనేది. అమ్మ మాటలు విని మేము ఏదైనా చేసినా బాగుండేది. ఎలాంటి చదువులు లేక నైపుణ్యం కూడా లేక ఉత్త పనిలేని మనుషులుగా తయారయ్యాము. మా చిన్నాయనకు ఆరోగ్యం బాగుండేది కాదు. ఇంట్లో తిండికి, బట్టలకి కాక పైన ఖర్చులకు ఏదైనా కావాలంటే ఆయన్నే అడిగేవాళ్ళం. డబ్బులుంటే లేదనుకుండా యిచ్చేవాడు. కానీ ఆయన ఆరోగ్యం సహకరించక ఇతరుల మీద ఆధారపడడం, చేసిన ప్రతి వ్యాపారంలో ఎదురు దెబ్బలు తిని నష్టాలు మూట గట్టుకున్నాడు. ఒక సంవత్సరం ఉన్నదంతా తీసుకెళ్ళి, షేర్లు కొని లావాదేవీలు చేసాడు. అది కూడా నష్టపోవడంతో అన్నీ ముగించుకుని మిగిలిన కొద్దిగా డబ్బుతో కాలం వెళ్లదీస్తున్నాడు. పెదనాయన సంపాదించినట్లు మా చిన్నాయన సంపాదించలేకపోయాడే అన్నదే మా బాధంతా. అదే ఆయన దగ్గిర డబ్బుoటే మేమిలాగ ఉండేవాళ్లం కాదు. ఎంతగా అణచుకుందామన్నా కోపం ఆగడం లేదు. చచ్చిపోతే కర్మ చేయాల్సింది మేమే అని తెలిసీ అలా చేస్తాడా ఆ మనిషి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కూతురు వచ్చి కర్మకాండ చేసిందా? నిన్న వచ్చింది రేపు వెళ్లిపోతోంది. బాగా లేనప్పుడు మంచం మీద మనిషిని చూసుకునింది మా అమ్మేగదా. అంతమాత్రం జ్ఞానం లేకుండా వీలునామా అలా రాస్తాడా? ఆస్తిలో తన కేమీ వాటా ఇవ్వలేదని మా చిన్నాయనకి కోపం లేదా? అదే విషయం చిన్నాయనని అడగాలి అని మనసులో అనుకున్నాను. మేము ముందు, మా ఎనకాల ట్రాక్టర్, బంధువుల కంటే మా చిన్నాయన స్నేహితులే ఎక్కువ వచ్చారు. డబ్బులు చేతిలో ఉంటే అన్న కర్మంతరం ఎంతో ఆర్భాటంగా చేసేవాడు కదా మా చిన్నాయన. అందరం ఇంటికి చేరుకున్నాము. మేము రాక ముందే కొంత మంది భోజనాలు చేసేసి వెళ్లిపోయారు. ఆ సాయంత్రం పెదనాయన కూతురు రైలుకి పోవడానికి తయారవుతావుoది. చిన్నాయన బీడీ కాల్చుతూ మూలన నులక మంచం మీద కూర్చున్నాడు. “ అన్న- పిన్నమ్మని బాగా చూసుకోండి. నాయన పోతా పోతా ఈ యిల్లు మీకు ఉండడానికి ఇచ్చి పోయాడు. నాయన మాట ప్రకారం మీరు నాకేమీ ఇవ్వద్దు. కానీ ఇంటి రిపేర్లు, పన్నులు మీరే చూసుకోండి. తొందర్లో ఇంకొక యిల్లు కట్టుకుంటే, ఈ పాత ఇంటి బయట మా ఆయన మిద్దె కడతానన్నాడు.” పెదనాయన కూతురు అన్న మాటలు గుర్తుకు వచ్చినై . “చిన్నాయన – పొలాలు అన్నీ మగతాకి ఇచ్చేశాను. సంవత్సరం – డబ్బులు నువ్వే తీసి నాకు పంపించాల, నీకు తెలుసు కదా – మా ఆయనకి లెక్క సరిగ్గా ఉండాలి. పది రూపాయిలు కూడా పట్టించుకుంటాడు. “ “ అమ్మాయ్ – నీ డబ్బు ఏడకీ పొదులే- మీ పిన్నమ్మకైనా ఫోన్ చేస్తా ఉండు. ఏదైనా ఖర్చులకి కావాలంటే ఆమెకు పంపించు.”

“అదేంది చిన్నాయన- ఒకరికి ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు. మీరు చేయలేనిది ఏముంది. ఫోన్ చేస్తా ఉంటాలే.” అందరికీ వస్తానని చెప్పేసి రైల్వే స్టేషన్కి వెళ్లిపోయి౦ది కవిత. అవతలి జంక్షన్కి పోయి రైలు ఎక్కాల్సిoది కాబట్టి టాక్సీ కట్టించుకుని బయల్దేరింది. ఆ పరిస్థితిలో కూడా మా అమ్మనడిగి రైల్లోకి భోజనాలు, చపాతీలు, బొంబాయికి పోయినాక ఇంట్లోకి పచ్చళ్లు, పొదులు అన్నీ చేయించుకునిoది. రెండు సంవత్సరాల కూతురు, అంజనతోనే పన౦తా. అంజూ-పాలు తాగు, అంజూ-డ్రస్ మార్చుకో, అంజూ- అమ్మమ్మనడిగి నీళ్ళు పోయించుకో. చనిపోయిన నాయన్ని తల్చుకున్నదో లేదో ఈ అమ్మి అని నాకు ఒకటే ఆలోచన. “ అమ్మ మాత్రం అడిగినది కాదనకుండా అన్నీ చేసి పెట్టింది. అసలు విసుగు చూపించనే లేదు.” మా అన్నతో ఈ మాటలన్నాను. “ అవున్రా- అయినా చిన్నప్పటి నుంచీ అమ్మ అంతే కదరా. ఈ అమ్మిని మన అమ్మే కదరా సాకిoది” అని మా అన్న అన్నాడు. అటువంటిది వెళ్లేటప్పుడు అమ్మకి మూడు పాత చీరలు ఇచ్చిపోతదా! ఆ అమ్మి బుద్ది పోనిచ్చుకోలేదు. నా ఆలోచనలు యిలా అక్కసుగా సాగుతున్నాయి. టాక్సీ రోడ్డు మలుపు తిరిగి కనుమరుగయ్యింది. సాయంత్రానికి వచ్చామన్నట్లు సూర్యుడు మా ఇంటి టెంకాయ చెట్ల కిందికి దిగిపొయ్యాడు. ఊరి చావిడి కాడి గుడిలోంచి కీర్తనకు మైకు సవరిస్తున్నారు. చెరొక నులక మంచం మీద మా అమ్మ, మా చిన్నాయన తల వాల్చుకుని పడుకున్నారు. మా అమ్మకి ఎందుకు ఉక్రోషం రాదో నాకు అర్థం కాలేదు. ఎప్పుడైనా అడిగితే పాత కథలు చెబుతుంది. “ మీ నాయన పోయినాక మీ పెదనాయన కాపాడాడు కాబట్టి బ్రతికామురా. లేకుంటే చెట్టుకొకరం, పుట్టకొకరం అయిపోయేవాళ్ళం” అనేది. మా చిన్నాయన అయితే సరేసరి, నా దగ్గిర డబ్బులుoటే ఖర్చైపోతాయని మా అన్నకు తెలుసురా. అందుకే నాకు ఆస్తిలో ఏమీ ఈయను అని చనిపోక ముందే అనేవాడు.” నాకు మా అన్నకి మాత్రం ఏమీ దారి చూపించలేదని చనిపోయిన మా పెదనాయన పైన కోపం మండతా ఉంది. కార్యం నిమిత్తం వచ్చిన కొద్దిమంది బంధువులు వెళ్లిపోయారు, “ ఇన్నాళ్ళూ ఈ ఇంటికి ఊడిగం చేశావు. నీకైనా, నీ కొడుకులకైనా కొద్దిగా పొలం, ఆస్తో ఇవ్వోచ్చు కదా బాబయ్య” అని ఒకరన్నారు. “ సరేలే- వేరే చోటు మారేoత వరకు ఈ ఇంటిలోనే వాళ్ళు ముగ్గురూ ఉండొచ్చు, గూడు అయినా చూపించాడు పెద్దాయన “ అని ఒకరంటే. “అదేందిరా – కవిత ఊళ్ళో పొలాలు వేరే ఎవరికో మగతాకి ఇచ్చే బదులు – అన్నలకే ఇవ్వొచ్చు కదా” – అని ఒకరన్నారు. ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు చేసి బంధువులు అందరూ వెళ్లిపోయారు.

అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో నిశ్శబ్దం ఆవరించింది. పెద్దాయన పోవడంతో మా అండ పోయిందని నాకు అర్థమైంది. ఇరవై ఏండ్లు నాకు ఏమీ తెలియనివ్వకుండా మా అమ్మను, మాయన్నను, నన్ను మా పెదనాయన ఏట్టా సాకతా వచ్చాడో నాకర్థమైంది. “ రేయ్ – మీకు ఆస్తి ఇస్తే మీరేం చేస్తార్రా- పెదనాయన మంచోడని చెప్పి – తిని తగలేస్తారు. మా అన్న తెలివైనోడురా. కొలత పెట్టి చేస్తాడు- ఉండడానికి ఇల్లిచ్చాడు. మీ మార్గం మీరు చేసుకోమని ఆయన ఉద్దేశ్యం. ఏదో ఒకటి చెయ్యండిరా. తేరగా తీసుకోని తినడానికి మీకు ఎందుకు ఇయ్యాలిరా పొలాలు ,డబ్బులు? కష్టపడడం నేర్చుకోండి. మా అన్న ఎట్టా కష్టపడి పైకి వచ్చాడో తెలుసుకోండి. శ్రమలోని విలువ గుర్తించి ఆయన మీకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వాడుకోండి” అని చిన్నాన్న అన్నాడు. అమ్మ ఇదంతా వింటూ మమ్మల్నే చూస్తూ వుంది. ఆ రాత్రి పడుకున్నా నిద్ర సరిగ్గా పట్టలేదు. పెదనాన్న ఏ విధంగా ఆలోచించి మాకు ఆ పొలం అప్పచెప్పాడో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. “నీ దగ్గిరికి ఏదీ రాదు నువ్వే ప్రయత్నం మొదలుపెట్టాలి “ పెదనాన్న తరుచూ చెప్పే మాటలు గుర్తుకు వచ్చాయి. స్వంతంగా ఏదైనా చేసి సాధించాలి . కూరగాయలు , పండ్లతో ఆ పొలంలో ఏమైనా చేయగలనేమో. తెలుసుకుని పని మొదలుపెట్టాలి అని అనుకోగానే మనస్సు తేలికైంది.

“ కొండ క్రింద మెట్ట చదును చేయడానికి పోతాండా.” మధ్యాహ్నం అన్నం తీసుకొని ఆడకి రా అన్నా” అని అన్నకి చెప్పి మరుసటి రోజు ఇంట్లోoచి బయల్దేరాను.

పెదనాన్న

“ కొండ క్రింద మెట్ట చదును చేయడానికి పోతాండా. మధ్యాహ్నం అన్నం తీసుకొని ఆడకి రా అన్నా” అని అన్నకి చెప్పి మరుసటి రోజు ఇంట్లోoచి బయల్దేరాను.

మరిన్ని కథలు

Aapada bandhuvu
ఆపదభంధువు
- కొడాలి సీతారామారావు
Antaa manchike
అంతా మంచికే
- కొడాలి సీతారామా రావు
Podupu baata
పొదుపు బాట.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nyayam jarigindi
న్యాయం జరిగింది
- సి.హెచ్.ప్రతాప్
Grahanam pattina chandrudu
గ్రహణం పట్టిన చంద్రుడు
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Ante..Nenu?
అంటే!... నేను!?.
- రాము కోలా. దెందుకూరు
Prajaswamyanike naa Otu
ప్రజాస్వామ్యానికే నా ఓటు
- రాపాక కామేశ్వర రావు
Srivarante maavare
శ్రీవారంటే మా వారే
- సి.హెచ్.ప్రతాప్