సమయపాలనా...!అదేక్కడ? - డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

సమయపాలనా...!అదేక్కడ?

ఏదైనా ఒకకార్యక్రమం ,లేదా శుభకార్యం చేయతలపెట్టినప్పుడు  సహజంగా ,ఒక మంచిరోజు చూస్తారు ,ఆరోజు మంచి మూహూర్తం , ముహూర్తసమయం కూడా ఎన్నుకుంటారు . ఆహ్వానాల్లో అందంగా  ముహూర్తం ,ముహూర్తసమయం ,అతిధులు హాజరుకావాల్సిన సమయం  అన్నీ ముద్రించబడతాయి . ఆహ్వానాలు అతిధులకు చేరిపోతాయి . ఈ  మధ్యకాలంలో ,ఆధునిక సదుపాయాలూ సద్వినియోగంచేసుకుంటూ  చక్కని సంగీతంతో వీడియో /ఆడియో ,ఆహ్వానాలు కూడా తయారు చేస్తున్నారు . వీటికి తోడు వాట్స్ ఆప్ మెసేజిలు ,ఆతర్వాత ఫోన్ కాల్స్  అంతా ,ఆహ్వానించడం వరకూ బాగానే ఉంటుంది . ఆహ్వానాల్లో ,వాళ్ళ  గొప్పతనం ,ఆధునికత్వం ,ఆర్ధిక స్తొమత ,అన్నీ కనిపిస్తాయి . ‘’ ఆహ్వానం  భలేవుండే !’’ అని అందరూ అనుకునేట్లుగా ఉంటుంది . అయితే చిక్కు  ఎక్కడ ఉంటుందంటే ,ఆ సమయాన్నీ ,ఆ ముహార్తాన్ని ,పాటించెదగ్గర ! ఇలాంటి సమయాల్లో కార్య స్థలందగ్గర సరైన సమయానికి ఆహ్వానించిన వారి జాడలు అక్కడ కన్పించవు . (అందరూ ఇలా .. అని కాదు !చాలా— మంది విషయంలో మాత్రం అంతే సుమండీ )ఆహ్వానితులు మాత్రం కార్య స్థలం దగ్గర వేచి చూడడం అవుతుంది . పోనీ ముహూర్తం సమయా నీకైనా అక్కడ వుంటారా అంటే ,అది కూడా అనుమానమే !ముహూర్త  సమయం దాటిపోయాక హడావిడిగా కార్యస్థలానికి వస్తారు . అక్కడినుంచి  అంతా హడావిడే . ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో ,ఈ ఆలస్యం వల్ల ఆరోజు విందు సమయం కూడా మారిపోతుంది . కొందరు మధ్య .. మధ్యలో ,చిరు తిళ్ళు ,శీతల పానీయాలూ అందిస్తారు కొందరు అదికూడాచేయరు .భోజ- నం దాటిపోవడంతో ,పెద్దవాళ్ళు ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆకలి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది . దీనివల్ల భోజనాలదగ్గర తొందర - పడటాలు తోసుకోవటాలూ ఎక్కువైపోతోంది . కొందరైతే ఎప్పుడూ అన్నం తినని వాళ్ళల్లా తొందరపాటు ప్రదర్శిస్తారు . మధుమేహవ్యాధిగ్రస్తులకు ఆకలి ఎలానూ తొందర పెడుతుంది . ఇలా కొన్నిచోట్ల భోజనాల దగ్గర యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది . చూడడానికి కాస్త అసహ్యం అనిపి– స్తుంది కూడా !దీనికి సమయపాలన లేకపోవడం ,ఏర్పాట్లు సరిగా లేకపో డం ,అతిధుల్లో సరయిన క్రమశిక్షణ లేకపోవడం ,ఆతిధ్యం ఇచ్చేవారి  పర్యవేక్షణ లేకపోవడం ముఖ్య కారణాలు .  ఇక సాహిత్య కార్యక్రమాలు విషయాలు చెప్పుకోవాలంటే ఇంకా భయంకర ముగా ఉంటాయి . ఎవరో కాస్త పలుకుబడి వున్న రచయిత,తాను రాసిన  పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకుంటాడు . దానికోసం తెలిసినవారం  దరినీ పిలుస్తాడు . అందులో రాజకీయ నాయకులుంటారు ,వివిధ వర్గాల కు చెందిన మిత్రులు శ్రేయోభిలాషులూ వుంటారు . అందులో సమయాని కి వచ్చేవాళ్ళు బహుతక్కువ ,రాజకీయనాయకులైతే వాళ్ళిష్టం . పనివత్తి డి వల్ల అలాచేస్తారో ,లేక కావాలని చేస్తారో తెలియదుగానీ ఈ నాయకులు  ఎప్పుడూ ఆలస్యమే !తద్వారా ప్రేక్షకులు విసుగు చెందడం ,కొందరు మధ్య లోనేవెళ్లిపోవడం ,మిగిలినవారు అసహనం పాటించడం జరుగు– తుంది . నిర్వాహుకుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా ఇక సాంస్కృతిక కార్యక్రమాల్లో ,ఇటు అథిధులుగానీ ,నిర్వాహకులుగాని  సమయపాలన పాటించకపోతే ,కార్యక్రమం అంతా చిన్నాభిన్నం అయి– పోతుంది . కార్యక్రమాల పట్ల ప్రేక్షకుల్లో నమ్మకం సడలిపోతుంది .ఇళ్లల్లో  ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ,కొందరు ,ముఖ్యంగా మహిళలు త్వరగా  తయారు కారు . సమయం దగ్గరవుతున్నా వారికి చీమ కుట్టినట్టు కూడా  ఉండదు . వారి .. వారి ధోరణిలో (దీనికి ఈ వ్యాసకర్త ఇంటావిడ అతీతం  కాదు సుమండీ )సమయం తీసుకుంటూ మిగతా వారిలో అనవసరపు టెన్షన్ ను పెంచుతారు . ఎలాంటి కార్యక్రమానికైనా సమయం -సమయ  పాలన అవసరం . అది వ్యక్తియొక్క వ్యక్తిత్వాన్నీ ,క్రమశిక్షణను చెప్పకనే  చెబుతుంది . సమయం వృధా చేయడం ఎంతతప్పో ,సమయ పాలన - పాటించక పోవడమూ అంతే తప్పు ! శుభ కార్యాలకు ఆహ్వానించడమూ ,గంటలు గడిచినా పట్టించుకోక పోవ– డం అనేది మరోవింత సమస్య . ఈ మధ్య (05-10-2022)నేను ఇలాంటి సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది ,నేను మాత్రమే కాదు ,నా కుటుంభం  అంతా ! మాకు అతిసమీప బంధువులు (హైదరాబాద్ )వాళ్ళ గృహ ప్రవేశానికి ప్రేమ పూర్వక ఆహ్వానం పంపారు . పదిగంటలకు గృహప్రవేశం (రిబ్బన్  కటింగ్ )ఆ తర్వాత ప్రార్ధనా కార్యక్రమం ,ఆ తర్వాత భోజనం (లంచ్ )ఇదీ  కార్యక్రమం . మేమందరం కార్యక్రమ స్థలికి సకాలంలోనే చేరుకున్నాం (అది గంట ప్రయాణం )ఇంటి పెద్ద తళుక్కున మెరిసి మాయమైపోయా  డు . మిగతా కుటుంబ సభ్యుల జాడలేదు . ఆహ్వానితులు ఒక్కరొక్కరే  వస్తున్నారు . సమయం ఉదయం పది .. దాటి చాలాసేపు అయింది .  షామియానాలూ ,కుర్చీలు వేయడం ఇంకా పూర్తికాలేదు . కార్యక్రమం  నిర్వహించవలసిన క్రైస్తవ బోధకుడు వచ్చికూడా చాలాసేపయింది .  ఇంటిపెడ్డల దర్శనం కాలేదు . పన్నెండు అవుతున్నది ,కనీసం త్రాగడా నికి మంచినీళ్లు లేవక్కడ . దాహంవేసి మంచినీళ్ళకోసం వెతుకుతూచాల మంది కనిపించారు . నాకు దాహం వేస్తున్నది ,నా మనవరాలి కేర్ టేకర్  స్వప్నకు చెప్పాను ,మంచి నీళ్లు ఉన్నాయేమో చూడమని . ఎక్కడా లేవని ఆమె చేతులు ఎత్తేసింది .  పది గంటలకు కార్యక్రమం అని చెప్పిన వాళ్ళు ,తయారై పన్నెండు గంటల తర్వాత వచ్చారు . మంచినీళ్లు కూడా వాళ్ళతోనే వచ్చాయి . ఆ  శుభకార్యం కోసం వచ్చిన అతిధుల సమయం ఎంత వృధా అయినట్టు .  అతిధుల్లో ,పిల్లలున్నారు ,పెద్దలున్నారు -అందులో మధుమేహ వ్యాధి - గ్రస్తులు వున్నారు . భోజనాల సమయం 1. 30 దాటిపోయింది . అతిధుల ను వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు . వాళ్ళతో సంతోషం పం– చుకోవడానికి వచ్చి ఇబ్బందులు పాడడం న్యాయమేనా ? నా ఇంట్లోకూడా నాకు ఇలాంటి అనుభవాలు (సమయపాలన )నా శ్రీమతి తో వున్నాయి . సమయానికి త్వరగా తయారు కావడం నేను ఆవిడకు నేర్పించలెకపొయాను అది నా అసమర్ధత కావచ్చు . మా సంసారిక జీవితంలో ,ఆమె మీద నేను ఎక్కువగా చికాకుపాడేది ఈ ఒక్క విషయం– లోనే . సమాజంలో బహుశః మాలాంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు .  ఇలాంటివారికె బస్సులు ,రైళ్లు ,విమానాలూ మిస్ అవుతుంటాయి ,కేవల ము ,సమయం పట్ల శ్రద్ధ చూపించక పోవడం వల్లనే ! ఆదివారం చర్చికి  వెళ్లాలంటే ,పెందలకడనే పనులు మొదలుపెట్టుకుని సకాలంలో ,అక్క డికి చేరుకోవాలి ,చందాలు పట్టే సమయానికి వెళ్లడం వల్ల ప్రయోజనం  ఏముంటుంది ?అలాగే ,శనివారం గుడికివెళ్ళేవాళ్ళూ ,శుక్రవారం నమాజ్ కోసం వెళ్లే ముస్లింలు ,తదితరులూనూ . దేనికైనా సమయపాలనలోనే  సర్వం మనం అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి . ముఖ్యంగా పోటీ పరీక్షలలోనూ ,ఇతరపరీక్షలలోనో ఒక్క నిముషం ఆలస్యం అయినా  పరీక్ష రాసే అర్హత కోల్పోతారన్న విషయం అందరికీ తెలిసిందే . ఏదైనా  నిర్ణీత సమయానికి పది నిముషాల ముందే ఉండడం అలవాటు చేసుకోవ డం లో తప్పులేదు . ఇది ఒకరు చెప్పేదికాదు ,ఎవరికివారు తెలుసుకో  వలసిందే . ముఖ్యంగా తల్లిదండ్రులు ఇవన్నీ పాటించగలిగితే ,పిల్లలకు  తప్పక అలవాటు అవుతాయి . లేకుంటే అది తల్లిదండ్రుల తప్పే అవు తుంది . గారాభంచేసి పిల్లలను పాడుచేసిన అపకీర్తి తల్లిదండ్రులకే దక్కు తుంది . నామట్టుకు నేను 99 శాతం సమయ పాలన పాటించడాని కి ప్రయత్నం చేస్తున్నాను /చేస్తానుకూడా !నా యావత్ కుటుంబం ఇది  పాటించాలని తాపత్రయ పడుతుంటాను . నా బంధువులు ,స్నేహితులు  శ్రేయోభిలాషులు కూడా ,సమయ పాలన పాటించి ,దాని ఫలితాలు పొందాలని కోరుకుంటాను ,నాది అత్యాశ కాదేమో !                                    సమయం అమూల్యం !                                    సద్వినియోగం చేసుకోవడమే -                                    కావాలి ….                                     సర్వ జనుల ధ్యేయం … !!