లింగోద్భవము - మరింగంటి సత్యభామ

Lingodbhavamu

శ్రీమహావిష్ణుభగవానుడు యోగ నిద్రలో మునిగి ఉన్నాడు! కమలాసనుడైన బ్రహ్మ దేవుడు విష్ణు మూర్తిని చూసి... నిద్రలేపి.. నీవు ఎవరివి? అని ప్రశ్నించాడు. ప్రాణికోటిని సృష్టించే విధాత .. విష్ణు భగవానుని చూసి ఎవరో తెల్సుకోవాలని ఉత్సుకత .. అదికమై తేపాడు ! విష్ణుదేవుడు యోగనిద్ర నుండి లేచి "నాయనా! ఎందుకింత "మనో వేదన" పడుతున్నావు? నన్ను యోగనిద్ర నుండి ఎందుకు లేసావు? అని అడిగాడు ! నీ వేదన కారణం ఏమిటి? అని .....వాణీ వల్లభుని ....అడుగగా, అప్పుడు పద్మాసన బ్రహ్మ నన్నుచూసి " నాయనా" అని సంబోధించిన కారణమేమి? నేను నీకు తనయుడనా? నీవు నాకు తండ్రి వా ? బ్రహ్మాండాలన్నీ సృష్టించిన సృష్టికర్తను నేను! నీవు నా సృష్టిలోని వానివే కదా! అన్న ఆ మాటలకు విశ్వంభరుడైన శ్రీమహా విష్ణువు " సృష్టి ,స్థితి , లయ కారణమైన వానిని నేనే; నేనే జగన్నాధుడిని 'నేనే సర్వము ఐన వానిని; నా ఆజ్ఞప్రకారం నీవు సంచరించాలి! నీకు ఈ ఆలోచన రావడానికి నా'మాయే' కారణము! నువ్వున మాయామోహంలో ఉన్నావు; ' కొంత కాలానికి నీ కీ మాయ తొలగిపోతుంది! అని చెప్పాడు విష్ణుదేవుడు! అప్పుడు" విధాత ... విష్ణు దేవుడు "వీరిద్దరూ నేను ఆధిక్యత గల వాని నంటే' నేనే అధికుడిని అనే బేధభావం కలిగి... ఆభావన ఎక్కువై యుద్ధానికి దారితీసింది ! చాలా కాలము మహా అహంకారంతో పోరాడారు! ఆ యుద్ధ సమయంలో" పరమేశ్వరుడు" ఒక మహా" జ్యోతిర్లింగం" గా ఆవిర్భవించాడు.! ఆ"జ్యోతి స్వరూపo" అంతు పట్టలేదు. అపుడు" బ్రహ్మ' విష్ణువు' యుద్ధం ఆపి మనలో మనం ఆధిక్య భావంతో యుద్ధం చేస్తున్నాం! మనకన్న ఘనమైనది ఉద్భవించింది! దీని రూపం మనకి అర్థం కావటం లేదు: దీని ఆది అంతం తెలుసుకోవాలి! స్నేహ భావంతో ఆజ్యోతి స్వరూపాన్నిపరిశీలించాలి. అనుకున్నారు! అలా అనుకుని వాణీనాధుడు విధాత ... హంసరూపంలో ఆకాశ దిశ కేసి, లక్ష్మీపతి హరి వరాహ రూపంతో అధోలోకాలకి వెతకడానికి, తుది... మొదలు తెలుసుకోవడానికి వెళ్ళారు ! విధాత గగనవీధి పై పైకివెళ్తుండగా పై నుంచి కిందకి దిగుతున్న' కేతకీ పువ్వు' బ్రహ్మనుచూసి ఎక్కడికి ప్రయాణం? అని అడిగింది! జ్యోతిర్లింగాకారం మొదలు ఎక్కడో తెలుకో డానికి నభోవీధి పైపైకి వెళ్తున్నా అని సమాధానం చెప్పాడు! అప్పుడు ఆ మొగలి పువ్వు .. బ్రహ్మ దేవా! నీ ప్రయత్నంవృధా! ఆలింగాగ్రం తెలుసు కోవడం నీకు సాధ్యపడదు ! అని చెప్పింది! అప్పుడు విరించి... ఓ కేతకీ సుమమా ! నాకు ఒక సహాయం చేయగలవు! నేను విష్ణువుతో "లింగాగ్రము" చూశానని చెప్పగలను! నేను లింగాగ్రం చూచుట నీవు చూసినట్లుసాక్ష్యం చెప్పవలసిందిగా..కోరాడు హంస వాహనుడు! కేతకీసుమం.. అందుకు సమ్మతించింది.! నభోవీధి నుండి దిగిన సృష్టికర్త.. నారాయణా ! నేను" లింగా గ్రము" దర్శనం చేసి వచ్చానని చెప్పాడు ! విష్ణు భగవానుడు ...నేను అధోలోకం అంతా వెతికినా లింగము 'అంతము ' కనపడలేదు! అని చెప్పి విష్ణుమూర్తి... నీవే అధికునివి అని విధాతను నమ్మి ...పూజించెను! అప్పుడు" మహేశ్వరుడు" ప్రత్యక్షమై నీరజాక్షా! నీ సత్యనిరతి హర్షదాయకము! నన్ను పూజించు దేవాలయాలలో నిన్ను పూజించెదరని వరం ఇచ్చాడు.... ఓ పంచముఖా! నీవు అసత్యం పలికావు ! నీ ఐదవ ముఖం ఈ అబద్ధం చెప్పింది! కనుక ఆ ఐదవ ముఖాన్ని ఖండిస్తానని" ఫాలనేత్రము" నుండి " భైరవుని "పుట్టించాడు గంగాధరుడు! నలువ శివదేవుని క్షమించమని వేడుకున్నాడు! అప్పుడు ఉమాశంకరుడు ఆగ్రహించి "ఇప్పటి నుండి నీకు పూజార్హత లేకుండుగాక! అని శపించాడు! బ్రహ్మ.. విష్ణుమూర్తులు మహేశ్వరుని స్తుతించి ప్రార్థించారు. అప్పుడు కైలాసనాధుడు ఈ దినము "మహా శివరాత్రి" గా ప్రఖ్యాతి పొందగలదు! ఈ రోజు నాకు ప్రీతి పాత్రమైన" పర్వదినము" అవుతుంది అని చెప్పాడు శంకరుడు! "లింగోద్భవము " జరిగిన ఈ రోజు చాలా పవిత్ర మైనది'! ఈ తిథిమాఘ మాసమున బహుళ చతుర్దశినాడు ... ఈ పుణ్య లింగమును ఎవరు పూజిస్తారో వారు పుణ్యాత్ములు అవుతారు! మహాశివరాత్రి నాడు .. నిరాహారంగా.. జితేంద్రి యులై.. యధావిధిగా.. యధాశక్తిగా.. వంచన లేక నన్ను అర్చించిన సంవత్సరమంతా నన్ను పూజించిన ఫలం కలుగును! ఈ రోజు ఎక్కడ పూజించినా మంగళ ప్రదమే! అసత్య దోషమున "కేతకి "కి ఈశ్వర పూజకు అర్హత లేదని శపించెను. అన్యదేవతా పూజలు చేయవచ్చని' మొగలి పువ్వు'ను కరుణించెను ! పరమేశ్వరుడు ఆ నాటి నుండి లింగరూపమున పార్వతీ మాత "పాన వట్టము "గా అర్చించ బడుతున్నారు: ................ ఓం నమః శివాయ......................

మరిన్ని కథలు

Modati adugu
"మొదటి అడుగు"
- ప్రభావతి పూసపాటి
Tyaga falam
త్యాగఫలం
- డా:సి.హెచ్.ప్రతాప్
unyaaniki pote
పుణ్యానికి పోతే
- మద్దూరి నరసింహమూర్తి,
చిక్కుముడి
చిక్కుముడి
- డా:సి.హెచ్.ప్రతాప్
Batuku gampa
బతుకు గంప
- వై.కె.సంధ్య శర్మ
O illali katha
ఓ ఇల్లాలి కథ
- అనిసా తబస్సుమ్ sk
Gnanodayam
జ్ఞానోదయం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Tyaganiki pratiroopam
త్యాగానికి ప్రతిరూపం
- డా:సి.హెచ్.ప్రతాప్