మనమే ఆదుకోవాలి - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Maname Aadukovaali

వేసవి సెలవులకు తాతయ్య వాళ్ళ ఇంటికి తేలిసారి వచ్చారు పదిహేడేళ్ళ జివితేష్ ,పన్నెండేళ్ళ కన్యక ,ఇంటికి వస్తూనే పంచలోని దూలానికి వరి,జొన్న, సజ్జ కంకులు వేలాడ తీసి ఉండటం గమనించిన జివితేష్ " తాతగారు ఇన్ని రకాల కంకులు ఎందుకు ఇక్కడ వేళ్ళాడ తీసారు " అన్నాడు.

" నాయనా మనమే ఆహరం తీసుకోవడంకాదు మన సాటి ప్రాణుల ఆకలి గమనించాలి మన పొలంలో పండిన ధాన్యాలలో కొంతభాగం చిరు ధాన్యాల కంకులు ఏడాది పొడవునా ఇక్కడ వేళ్ళాడ తీస్తాను అవితిని చిన్న పక్షులు సంతోషంగా వెళతాయిఅయినా చేను పండాలేకాని పక్షులకొరకు రెండు సాళ్ళ గింజలు వదిలితేనేం! " అన్నాడు తాత పరంధామయ్య,

మధ్యాహన్నం భోజన సమయంలో ఇంటి పిట్టగోడపై ఒక గిన్నె నిండుగా ఆహరం,మరోగిన్నె నిండుగా వీధి అరుగుపైన పెట్టివచ్చింది కన్యక వాళ్ళనాయనమ్మ.

" కంకులు ఉంచాముకదా మళ్ళి అన్నం దేనికి రెండు గిన్నెల నిండుగా అక్కడ పెట్టారు? "అన్నాడు జివితేష్ .

" పిట్టగోడపన కాకులకు, వీధిగుమ్మం అరుగుపైన ఉంచేది కుక్కలకు "అన్నాడు పరంధామయ్య.

" అలాచేయడం వలన ప్రయోజనం ఏమిటి "అన్నది కన్యక.

" పుట్టుకతో మనకు బంగారు ఆభరణాలు రావు కాని వాటిని మించిన దయా,జాలి,కరణా, దానగుణం,సహకారభావం వంటి వెలకట్టలేని ఉత్తమ లక్షణాలతో మనం జన్మిస్తాం ఇవన్ని అలకరించుకోవడానికి కనిపించవు కాని ఆచరణకు వినియోగపడతాయి ,మీరుకూడా ప్రతిరోజు ఆహరం తీసుకునే ముందు దొసెడు ఆహరం దానం చేయండి అలాచేయడంవలన కలిగే ఆనందాన్ని,అనుభూతిని స్వయంగా అనుభవించండి "అన్నాడు పరంధామయ్యగారు.

" అలాగే నేను రేపటినుండి వీధి అరుగుపై కుక్కలకు ఆహరం పెడతాను "అన్నది కన్యక. "నేను రేపటినుండి ప్రహరి గోడపై ఆహరం పెడతాను " అన్నాడు జివితేష్ .

వారం రోజులు గడిచాయి ,ఆరోజు కన్యక పుట్టిన రోజు కావడంతో పట్టుబట్టలు ధరించి ,నానమ్మ పెట్టిన వడ్డాణం,కాసులపేరు వంటి పలు రకాల నగలు ధరించిన కన్యక ఆహరం తీసుకుని వీధిగుమ్మం దాటుతూనే కెవ్వున కేకపెట్టింది,అప్పటికే అక్కడ ఉన్న ఇద్దరు దొంగలలో ఒకడు కన్యక నోరు ముసాడు రెండోవాడు కన్యక కాళ్ళుపట్టుకు లేపి తమ వాహనం వద్దకు తీసుకు వెళ్ళసాగారు, ఎక్కడినుండోవచ్చిన వీధికుక్కలు ఒకటి కన్యక నోరు మూసిన విడి చేతిని కండ ఊడివచ్చేలా కరిచింది,రెండోకుక్క కన్యక కాళ్ళు పట్టుకున్న వాడి పిక్కపై బలంగా కరిచిలాగింది ఊహించని దాడికి అదిరి పడిన దొంగలు కన్యకను వదలి తమవాహనంలో పారిపోయారు వాళ్ళను తరమ సాగాయి కుక్కలు.. కన్యక కేక వింటూనే తాతయ్య,నాయనమ్మలతోపాటుగా జివితీషే పరుగులాంటి నడకతో వచ్చారు. భయంతో వణుకుతున్న కన్యకను దగ్గరకు తీసుకుని ఇంట్లోకి తీసుకు వచ్చారు,భయపడుతూనే జరిగిన విషయం వివరించింది కన్యక .

రాత్రి భోజనాలకు కూర్చున్న తన మనవరాలితో " తల్లి ప్రతిరోజు నువ్వు దోసెడు కూడు దానం చేయడంవలనే ఆపదలో ఆదుకోబడ్డావు

మనం చేసే ప్రతి పనిలోను లాభాపేక్ష ఉండకూడదు. ఆహరం,వైద్యం,విద్యలకు సాటివారికి మనవంతు సహకారం ఎప్పుడు ఉండాలి అన్నాడు తాతయ్య.

" అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఈవియయాన్ని ఎన్నడూ మేము మరచిపోము మావంతు సమాజ సేవలు జీవితకాలం అందిస్తాము అన్నాడు జివితేషే.

" అవును తాతయ్య నాజీవితాంతం మీరు చెప్పిన విషయాలు గుర్తుంచుకుంటాను రేపు మాపాఠశాలలో నాసహచర విద్యార్ధిని ,విద్యార్ధులు అందరికి చెపుతాను " అన్నది కన్యక.

మరిన్ని కథలు

Nijaayitee
నిజాయితీ
- సూర్య. మండా(MS)
Gurudakshina
గురుదక్షిణ
- భ్రమరాంబికా సాయిశ్రీ మిరియాల
Gruhame kadaa swarga seema
గృహమే కదా స్వర్గసీమ
- వేముల శ్రీమాన్
Bhakthi deepam
భక్తి దీపం
- డా:సి.హెచ్.ప్రతాప్
Flot No. 66-B
ఫ్లాట్ నెంబర్ 66-బి
- డా:సి.హెచ్.ప్రతాప్
SNEHAMANTE IDERAA
స్నేహామంటే ఇదేరా !
- సంధ్య కార్తీక్
Neelaveni pelli
నీలవేణి పెళ్ళి
- కొడాలి సీతారామా రావు