నరికేస్తడు! - రాము కోలా.దెందుకూరు.

Narikestadu

"ఇదిగో రత్తాలు! చెరుకు తోటకాడ చిన్న పని పడింది,ఒక్కపూట విలుచుసుకుని వచ్చేయకూడదేటి?" "నీ కష్టం ఉంచుకోనులే! తుణమో ఫణమో సమర్చించుకుంటాలే?" "ఏటంటవు! " "సెప్పరాదే!రత్తాలు" లంక పుగాకు కాడ చీల్చి,పొరచుట్ట చుట్టి, అంటించుకుని, గట్టిగా ఓ దమ్ము లాగేసి! పొగలు పొగలు వదుల్తూ మోడలో వేలాడుతున్న పులిగోర్లు సరిచేసుకుంటూ, రత్తాల్ని పైనుండి కింది దాకా చూస్తూ, అదో రకమైన మాట విరుపుతో! కవ్వింపుతో మాట్లాడి,రత్తాలు ముఖ కవళికలు చూసే ప్రయత్నం చేసిండు,దొరబాబు భుజంగరావు. "దొరగారు!మా బాగా గుర్తుసేసిండ్రు." "పంట పోలం వైపు ఏ మాయదారి చూపులు పడ్డాయో!.దిష్టి బొమ్మ పెట్టాలని ఒకటే‌గోల మా మావ." "బొమ్మ పెడితే దిష్టిపోద్దా !మామా అంటే.? మనమేమన్నా అల్లాటప్పా బొమ్మ పెడతామా ఏటి?" "ఊరందరిని కాపుకాసుకునేది మన పెద్ద దొరగారే కదా!అయనా బొమ్మ పెట్టేస్తే పోలా!" "అంటు ఒకటే గోల చేస్తాడు." వాడితో ఏగలేక సత్తన్నా దొరగారు. "ఒక్కసారి పెద్దమనసు చేసుకుని మా పంపు సెట్టు పక్కకు కూడా రండి దొరగారు." మీది మాది పక్కపక్క పొలాలేగందా? ఓ మాట మా మావ సెవినేసి పొండ్రి." "వాడు సరేనంటే,మీ వెంట లేడిపిల్లలా లగెత్తుకుంటూ వచ్చేత్తను". "మా మావ కూడా మీకు ,తనకు తోచినట్లు ఏదో ఒకటి సమర్పించుకుంటాడు లేండి." "దెబ్బకే తల నరికి చేతిలో పెట్టెస్తాడు " ఆయ్...మీ మీదొట్టు.!" "తలలు నరకడంలో మా మావ స్టైలే వేరులేండి! "అలా భయం భయంగా సూత్తారేటి? వాడు నరకటంలో ముందూ ఎనకాల ఆలో చేయించుకోండండి." మీకు లెక్క మా మొండిఘటం,అంటారు అందరూ." "ఒక్క వేటుకు తల తెగిపడాల్సిందే." "తల లేని కాయ మీ చేతిలో ఎట్టెత్తాడండి.! చల్లచల్లగా తాగేద్దురు తీయ్యతియ్యని కొనసీమ కొబ్బరి కాయ నీళ్ళు." "ఏటంట్రూ!ఉలుకూ పలుకూ లేకుండా అట్టా గమ్మున కూర్చుంటే ఎట్టా?" "ఏటి వత్తారా!" "వత్తే సాయంత్రం కబురంపండి,మా మావని సిద్దంగా ఉండమని చెప్తా!" "మరి కత్తికి పదునెట్టుకోవాలి కదా.?" "అసలే పెద్దోరు!తల తెగిపడకపోతే మా కులపోల్ల ముందు మాకు చిన్నచూపు కదా!" అంటూ ముసిముసిగా నవ్వింది రత్తాలు. "నీ దుంపతెగ!ఏదో సరదాకి అన్న దానికి అలా కత్తులూ కేటాయించేస్తే ఎలా,? "తల నరకటం ఎందుకులే.?" "మీ పంటకు వచ్చిన ఇబ్బంది ,నరదోషం ఏదీ లేదులే." "మీ మావకు నా మాటలాగా చెప్పు!." అంటూ తలవంచుకు వెళ్ళిపోతున్నాడు గ్రామపెద్ద భుజంగరావు. తస్సదియ్యా!ఎంత తెలివిగా మాట్లాడింది. "వంకర పుల్లలోని అహంను ,పోయ్యి తీర్చినట్టు." మనసులో అనుకున్నాడేమో,వెనుతిరిగి చూడలేదు,పాపం భుజంగరావు దొరగారు. "ఏంటి!దొరగారు ఓ మాట చెప్పి పోదురు,ఆగండి," అంటూ నవ్వుకుంది రత్తాలు.

మరిన్ని కథలు

Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati