చాందిని - వినాయకం ప్రకాష్

Chandini

హలో..! వరలక్ష్మి గారేనా మాట్లాడేది..? హా ..అవును.! మీరెవరు..? అంటూ సందేహం నిండిన గొంతుతో అడిగింది వరలక్ష్మి, మేడం మేము స్విమ్స్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాము, సుకుమార్ అనే వ్యక్తి నీకు ఏమవుతాడు..? "నా కొడుకు" ఏమైంది నా బిడ్డకి..? అని కంగారుగా అడిగింది, వరలక్ష్మీ. యాక్సిడెంట్ అయితే ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు అతని వద్ద ఉన్న పర్సు లో మీ వివరాలు చూసి నీకు విషయం చెప్పాలని మీకు ఫోన్ చేశాము మీరు త్వరగా రండి అని ఫోన్ పెట్టేశారు హాస్పిటల్ వారు. వరలక్ష్మి కి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఏమి చేయాలో పాలుపోవడం లేదు,వెంటనే బయలు దేరింది కూరగాయల కోసం వెళ్ళిన ఒక్కగానొక్క కొడుకు ఆసుపత్రిలో జాయిన్ అవడం ఏంటని ఆలోచనలో మునిగిపోయి బాధపడింది, స్విమ్స్ హాస్పిటల్ వద్దకు క్షణాల్లో చేరిపోయింది,ఎమర్జెన్సీ లోని రిసెప్షన్ సెంటర్ లో విచారించగా,సుకుమార్ సెకండ్ ఫ్లోర్ లోని ఐసియు లో ఉన్నాడని తెలిసి పరుగున వెళ్ళింది ఆ తల్లి ఐసీయూ మొత్తం రకరకాల పేషంట్ల తో హృదయవిదారకంగా ఉంది,ఆమె కళ్ళు సుకుమార్ ని వెతక సాగాయి, ఐ సి యు గదిలోని చివరన ఉన్న బెడ్ పై సుకుమార్ అచేతనంగా ఉన్నాడు,గాయాలకు కట్లు కట్టి రక్తం ఎక్కిస్తున్నారు,అలా కొడుకును చూసేసరికి ఆతల్లికి దుఃఖం కట్టలు తెంచుకుంది, కొద్ది సేపటికి తేరుకుని తన బిడ్డకు రక్తం ఇస్తున్నది ఎవరా..అని పరిశీలించి చూసింది, ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయింది, వెంటనే రక్తదానం చేస్తున్న ఆమె వద్దకు వెళ్లి కోపంతో ఛీ..చీ.. నువ్వు నా బిడ్డకు రక్తం ఇవ్వడమేంటి ..? ఎవరిని అడిగి ఈ పని చేస్తున్నావ్ ..! ,వచ్చేనెల నా బిడ్డకు పెళ్లి,ఇప్పుడు నీ రక్తం నా బిడ్డ లో ప్రవహిస్తే వాడి భవిష్యత్తు ఏమవ్వాలి..? అని అరుస్తూ చిరాకుతో రక్తదానం జరిగే పైపును సుకుమార్ చేతి నుంచి లాగేసి రక్తం ఇస్తున్న ఆమెను తిట్టి పంపించి వేసి నర్సులపై కోప్పడుతూ ఆవేశం గా అరుస్తుంది * * * తిరుపతి టౌన్ క్లబ్ ఎదురుగా మలబార్ జ్యువలరీ షాప్ వద్ద ఒక షేర్ ఆటో ఆగింది, అందులోంచి ఒక దేవకన్య లాంటి అమ్మాయి దిగి స్నేహితురాళ్లతో కలిసి షాపింగ్ కోసం వెళుతుంది, అందంలో ,అలంకరణలో మరియు ఆహార్యంలోనూ ఆడవారికి అసూయ పుట్టేలా ఉంది, తానే "చాందిని" .జోకులు వేసుకుంటూ ఆహ్లాదంగా నవ్వుల పువ్వులు విరుస్తున్న ఆ ప్రదేశంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినబడింది, వెనక్కి తిరిగి చూస్తే ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వేగంగా వెళ్తున్న ఒక కారు ఒక బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొని ఆగకుండా వెళ్ళిపోయింది జనాలంతా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు తప్ప గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు వెంటనే చాందిని మరియు వారి స్నేహితురాళ్లు అతన్ని సిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు సిచువేషన్ తెలుసుకొని వెళదామని అక్కడే వేచి ఉన్నారు, ఎమర్జెన్సీ వార్డ్ లోంచి డాక్టర్ వచ్చి చూడమ్మా చాందిని మీరు చాలా మంచి పని చేసారు ఇతన్ని కరెక్టు సమయానికి ఆసుపత్రికి తీసుకొని వచ్చారు లేకుంటే ప్రాణాపాయం జరిగేది, కానీ ...అంటూ నిట్టూర్చాడు డాక్టర్ డాక్టర్ ..ఏమైంది..? ఎందుకు ఏదో దాస్తున్నారు అని అడిగింది చాందిని , ఏమి లేదమ్మా చాందిని.. అతని తలకి బలమైన గాయం అయింది రక్తం ఎక్కువగా పోయింది అతనిది ఓ నెగిటివ్ రక్త వర్గం ప్రస్తుతానికి మన హాస్పిటల్ లో లేదు అందులోనూ ఇది కరోనా సమయం కాబట్టి తిరుపతిలో కూడా ఇప్పటికిప్పుడు ఆ రక్తం దొరకడం చాలా కష్టం, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము వారు కూడా వస్తే తర్వాత ఆలోచించాలి, అయ్యో డాక్టర్ కంగారెందుకు నా రక్తవర్గం కూడా ఓ నెగిటివ్ ఇక ఆలస్యం ఎందుకు సార్ నా రక్తం ఇచ్చి అతన్ని కాపాడుదాం అనగానే అలాగా సంతోషం " యు ఆర్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ప్రౌడ్ ఆప్ యు " ...అని చాందిని మెచ్చుకొని నర్స్ ని పిలిపించి రక్తదానం కు ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు సుకుమార్ కి చాందిని రక్తదానం చేస్తోంది. * * * ఐసియు నుంచి కేకలు వినబడడంతో ఏం జరిగిందో అని డాక్టర్ పరుగు పరుగున వచ్చాడు " ఏమిటి న్యూసెన్స్..? ఇది హాస్పిటల్ అనుకున్నారా లేదా చేపల మార్కెట్టా..? ఏంటి గొడవ.. కొద్దిగా అయినా కామన్సెన్స్ లేదా ...అవును ఇక్కడ ఉండాల్సిన చాందిని ఎక్కడికి వెళ్ళింది" అని అడిగాడు డాక్టర్, ఇంతలో డ్యూటీ నర్స్ కలగ చేసుకుంటూ,సార్ ఈమె పేషెంట్ వాళ్ళ అమ్మ అంట చాందిని యొక్క రక్తాన్ని వాళ్ళ అబ్బాయికి ఎక్కించ కూడదు అని గొడవ చేసింది, రక్తదానం జరిగే పైపు లాగేసి చాందిని వారిని తిట్టి పంపించేశారు అని జరిగిన విషయాన్ని డాక్టర్ గారికి వివరించింది. " ఏమ్మా అసలు మీ అబ్బాయి కండిషన్ మీకు తెలుసా..? రక్తం ఎక్కించుకుంటే నీ కొడుకు నీకు నీకు దక్కడు ..అసలు నీ ప్రాబ్లం ఏంటి..? చాందిని రక్తం ఇస్తే తప్పేంటి..? అని ఆవేశంగా అడిగాడు. సార్ వచ్చేనెల మా అబ్బాయికి పెళ్లి ఇప్పుడు చాందిని ఇలాంటి థర్డ్ జెండర్ యొక్క రక్తం అతనిలో ప్రవహిస్తే రేపు అతని భవిష్యత్తు ఏమవుతుందో అని కంగారుగా ఉంది సర్ అని.బదులిచ్చారు వరలక్ష్మి. "మీ కొడుకు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు ఇప్పటికిప్పుడు రక్తం ఎక్కించకుంటే మీ అబ్బాయి ప్రాణాలే దక్కవు చాందిని మీ అబ్బాయి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది రక్తం ఎక్కడా దొరకలేదు అందుకే ఇలా చేసాము, ఇంకో విషయం ఏంటంటే థర్డ్ జెండర్స్ కూడా మనుషులే వారి రక్తం మన రక్తం ఒకటే మనుషులకి లాగా భేదభావాలు కుల మత పట్టింపులు రక్తానికి లేవు ఉండవు కూడా చాందిని థర్డ్ జెండర్ గా మారడానికి ఆమె పెరిగిన వాతావరణం ఆమెలోని శారీరక మార్పులు కారణం అంతే , ఆమెకు నచ్చినట్టు ఉంటుంది అందులోనూ ఆమె ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది ,ఒక డాక్టర్ గా పేషంట్ ప్రాణాలకు ముప్పు ఉండే పని మేము ఎప్పటికీ చేయను కదా..! , ఆమె రక్తం ఇవ్వడం వల్ల మీ అబ్బాయికి మంచి జరుగుతుంది అంతేగాని చెడు ఎప్పటికీ జరగదు అందులోనూ ఆ అమ్మాయి కష్టపడి ఫార్మసీ వరకు చదివి బాలాజీ కాలనీ లో మెడికల్ స్టోర్ కూడా నిర్వహిస్తోంది, చాందిని గురించి నాకు బాగా తెలుసు తను చాలా మంచి మనిషి ఇప్పటికె చాలా మందికి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడింది. మీరు అనవసరంగా ఆమెను బాధపెట్టి పంపించివేశారు ఇప్పుడు మీరు మీ అబ్బాయి కి కావాల్సిన ఓ నెగటిప్ రక్తం తెచ్చే ఏర్పాట్లు చేయండి లేదంటే చాందిని బాలాజీ కాలనీ లో ఉంటుంది ఆమెను తీసుకురండి" అని చెప్పికోపంగా వెళ్ళిపోయాను డాక్టర్ వరలక్ష్మి తెలిపిన వారందరికీ ఫోన్ చేసింది తన బంధు వర్గంలో కూడా అందరికీ విచారించింది కానీ లాభం లేదు చివరికి తన రక్తం కూడా సరిపోవడం లేదు ఒకవైపు బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని తపన ఎక్కువగా ఉంది, ఆలోచన లేకుండా పిచ్చిపిచ్చిగా ఆలోచించి చాందిని ని అవమానించినందుకు ఎంతో పశ్చాత్తాపము పడింది చాందిని వద్దకు పరుగులు తీసింది. మెడికల్ షాప్ లో చాందిని బిజీగా ఉంది వరలక్ష్మిని చూసినా కూడా చాందిని ఏం మాట్లాడలేదు వెంటనే వరలక్ష్మి చాందిని వద్దకి వచ్చి "అమ్మా చాందిని.... నీ గురించి తెలియక అజ్ఞానంతో నానా మాటలు అన్నాను పిచ్చిపిచ్చిగా ఆలోచించి నా మాటలతో నిన్ను అవమానించారు నన్ను క్షమించు, నా బిడ్డకి ప్రాణదానం చేయమ్మా..." అంటూ కన్నీరుమున్నీరైంది వరలక్ష్మి. వెంటనే చాందిని అయ్యో...! ఆంటీ.. మీరు మొదట లేవండి మీరు పెద్దవారు మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి ముందు లేవండి అంటూ ఆమెను కుర్చీలో కూర్చో పెట్టింది, మొదట మీరు మంచి నీళ్లు తాగండి అంటూ ఒక గ్లాసు నీరు ఇచ్చింది, చూడండి ....అంటూ మీరు చేసిన అవమానానికి నేను బాధపడడం లేదు థర్డ్ జెండర్ గా పుట్టడం నా తప్పుకాదు ఎన్నో అవమానాలు మాలాంటి వారి ఎదుర్కొంటున్నారు, నాకు నచ్చిన జీవితం గడపాలని కోరుకోవడం నా వ్యక్తిగత విషయం మా లో వచ్చిన శారీరక మార్పుల వల్ల మేము ఇలా ఉన్నాము,మా రూపాన్ని ఎగతాళి చేస్తారు మేము కూడా మనుషులమే కదా...కొందరు నకిలీ థర్డ్ జెండర్లు రోడ్లపై తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు వేధిస్తున్నారు, నాలాంటి వారు అలా చేయడం ఇష్టం లేక బాగా చదువుకొని స్వశక్తితో జీవిస్తున్నారు, చెట్టును చూసి దాన్ని పండ్ల రుచి అంచనా వేయలేము కదా .అలాగే అందరు కూడా మీరు ఊహించినట్టు ఉండరు, అందుకే సమాజం యొక్క ఆలోచనా ధోరణిలో మార్పు వస్తేనే మా లాంటి వారు కూడా సమాజంలో గౌరవంగా ఉంటారు, మా కోరిక ఒక్కటే మమ్మల్ని అర్థం చేసుకొని సమాజంలో ఒకరిగా చూసి గౌరవిస్తే చాలు" అన్నది చాందిని. అమ్మ నేను తప్పు చేశాను క్షమించండి అంటూ మరోసారి వేడుకుంది వరలక్ష్మి ,అయ్యో నేను ఆ విషయం అప్పుడే మర్చిపోయా. ఇంతకీ మీ అబ్బాయి ఎలా ఉంది..? ఎవరైనా రక్తం ఇచ్చే దాతలు దొరికారా ..? అని అడిగితే...లేదమ్మా నీ కోసమే వచ్చానని చెప్పింది వరలక్ష్మీ. వెంటనే మొదట మీ అబ్బాయి ప్రాణాలు కాపాడుదాము తర్వాత మాట్లాడుకుందాం అంటూ హాస్పిటల్ వైపు ఇద్దరు వెళ్లారు, మనస్సున్న దేవతైన చాందిని మరోసారి మనసులోనే అభినందించింది వరలక్ష్మి.

మరిన్ని కథలు

Nene apaadhini
నేనే అపరాధిని
- సరికొండ శ్రీనివాసరాజు
Parasuraamudu
భాగవత కథలు - 16 పరశురాముడు
- కందుల నాగేశ్వరరావు
Jeevitaniki maro vaipu
జీవితానికి మరోవైపు ......
- జీడిగుంట నరసింహ మూర్తి
Sumangali
సుమంగళి
- మద్దూరి నరసింహమూర్తి
Yagnam
యజ్ఞం
- శింగరాజు శ్రీనివాసరావు
Chandra vamsham
భాగవత కథలు – 15 చంద్ర వంశం
- కందుల నాగేశ్వరరావు