వంశీకి నచ్చిన కథ - పగటివేషం - ఉపాధ్యాయుల గౌరీశంకరరావు

pagati vesham telugu story

కొత్తగా వ్యాపారం మొదలెట్టిన స్నేహితుడికి పుష్పగుచ్చం పంపాడు చెంగల్రావ్. దానిమీద 'ఆత్మశాంతికి... అని ఉండడంతో మండిపడ్డాడు స్నేహితుడు. అది తన తప్పు కాదంటూ బోకేషాపుకి స్నేహితుడిని తీసుకొనొచ్చి చెంగల్రావ్ కొట్లాటకు దిగాడు.

షాపు యజమాని 'సారీ' చెబుతూ, "కోపం తెచ్చుకోకండి. ఈ రోజు ఓ అంతిమయాత్రకు కూడా పూలు పంపాను. 'కొత్త స్థానాన్ని చేరినందుకు అభినందనలు' అన్న మీ కార్డు ఆ పూలతో వెళ్లింది. మరి అక్కడివాళ్ల పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోండి" అన్నాడు.

రాత్రంతా బాధగా ఉండేది. అతని భార్య మాటిమాటికీ ఎంతో ప్రేమతో చెబుతుంది.

"మీకు విశ్రాంతనేది లేకుండాపోయింది. ఇలాగైతే మీ ఆరోగ్యం ఏం కావాలి? మీకు విశ్రాంతి చాలా అవసరం. మీ యజమానిని అడిగి కొన్ని రోజులు సెలవుపెట్టండి".

"సెలవా! సెలవు పెడితే యజమాని జీతం తెగ్గోస్తాడు."

"అలాగయితే మీ యజమాని దగ్గర పని మానెయ్యండి."

"నేను కాకపోతే పని చేయడానికి చాలామంది దొరుకుతారు. కొన్ని రోజుల తర్వాత హమీద్ అనే వ్యక్తి ఇక్కడ పనిచేసేవాడన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోతాడు."

మళ్లీ అమ్మ ప్రేమ, ఆదరణ అతని ఆలోచనల్లోకి చొచ్చుకు వచ్చాయి. ఆలోచిస్తున్న కొద్దీ ఆమె కష్టాలని గుర్తించి సాయం చేయకపోగా, ఆమె ఖర్మానికి ఆమెని వదిలేసి
వచ్చానన్న అపరాధ భావం బాధించసాగింది.

నేను చేసిన ఈ క్షమార్హంకాని తప్పుని అమ్మతో చెబుతాను. అమ్మతో మాట్లాడుతాను.

అమ్మా, నీకేం కావాలో చెప్పమ్మా! నన్ను ఆ వూరికి తిరిగి వచ్చేయమంటావా లేక నువ్వు కూడా మాతోబాటుగా ఇక్కడే వుంటావా? కానీ. నేను ఇలా ఎందుకు అడగవలసి వచ్చిందని గాని, దీని వెనక ఉన్న కారణం ఏమిటా అని మటుకు నువ్వు నన్ను అడగొద్దు. ఓ దెబ్బతిన్న పక్షి బాధలాంటి బాధ తప్ప నాకు వేరే ఏ బాధా లేదు" అంటూ వివరంగా అమ్మకి చెబుతాను.

రేపట్నుంచి కొత్త జీవితం ప్రారంభించాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఆ సరికొత్త జీవనం ఏవిధంగా మొదలవుతుందో, ఇంకా ఏమేమి చేయదల్చుకున్నాడో అన్ని విషయాలు అమ్మకి చెబుతాను.

హమీద్ ఆలోచిస్తూనే వున్నాడు. ఇంతలో అతని వెనకాల ఎవరో వస్తున్నట్లుగా పాదాల అలికిడి వినిపించింది. చాటుగా పొంచి మాటలు వింటున్నాడన్న అనుమానం కలగకూడదనుకుని అతను వెంటనే తలుపు నెట్టి లోపలకు దూరాడు. అక్కడ అతని భార్య పిల్లలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

"అమ్మ ఏది?" అడిగాడు.

"మీ అమ్మా?"

"ఔను. మా అమ్మ. ఇప్పుడిప్పుడే మీతో మాట్లాడుతుండగా విన్నాను."

"ఈయనకి ఈ రోజు ఏమయ్యింది" అంటూ భార్య అతన్ని ఆశ్చర్యంగా చూడసాగింది.

హమీద్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. బాగా అలసిపోయినట్లయ్యి రెప్పలు వాలిపోతుండగా అతనికి నిద్రపోవాలని అనిపించింది.

గత మూడు రోజులుగా కల్లంలోనే ఉన్నానేమో విసుగ్గా ఉంది పనీపాటా లేక. మసూరి వరికుప్ప కూడా నలగడం ప్రారంభం అయ్యాక 'హమ్మయ్య నూర్పు అయిపోయినట్లే' అని నిట్టూర్చాను. దేవుడి దయవల్ల గాలి సక్రమంగా వీచి - గాలిపోత పూర్తయితే - నేను వెళ్లిపోవచ్చు.

ఇంటి తలపు రాగానే ఇల్లు, భార్యాపిల్లలు, స్నేహితులు గుర్తొచ్చి ఆలోచిస్తూ వాలుకుర్చీలో చేరబడితే నీరెండ వెచ్చదనానికి మాగన్నుగా నిద్రపట్టింది. అంతలోనే పెద్దగా వినిపిస్తున్న మాటలకి తెలివొచ్చింది. పక్క కల్లంలోంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి మాటలు.

"తాతా! ఓ మంచి పాట అందుకోమీ" ఒక కుర్ర గొంతు.

"నానేది పాడతాన్నాయినా ఇప్పుడు?

నా గొంతు ఏనాడో పోనాది కదా" ఒణుకుతున్న ముసలి గొంతు.

"నేరా! ఇదేటి కాంపిటీసనా? అమ్మానాయిన బాగా పాడకపోతే పీకల్దీసెత్తరా. ఒచ్చినట్టుగా పాడవో" మరొక గొంతు అదమాయింపు.

"గంగవైతే నీవు గగన మందుండకా
నీ మొగుడి శిరమెక్కి నాట్య మాడెదవేల
చేప కంపూదాన జాలరి దానా
నాచు నీచుల దాన నా సవితి కానా"

రాగయుక్తంగా గంగా వివాహం ఎత్తుకొంతి ముసలి గొంతు. ఒణుకుతున్న గొంతులో మాధుర్యం తగ్గలేదు.

"ఓర్నాయనో ఇదే పాటరా! ఇలపింటి పాటేలరా తాతా! సక్కగా సినిమా పాట పాడరా! కుర్రాల్లు హుషారుగుండాలంటే మంచి ఊపున్న పాట పాడాల్రా" మల్లీ అదే కుర్ర గొంతు.

"అయితే ఎన్టీవోడు పాట పాడతాన్రయ్యా"

"నా మది నిన్ను పిలిచింది గానమై - వేణుగానమై - నా ప్రాణమై ఎవ్వరివో నీవు నేనెరుగలేను..." రఫీ గొంతు అడుగుజాడల్లో జానపదయాస.

"ఎన్టీవోడి పాట వొద్దు ఏయన్నార్ పాటవొద్దు. నీకొస్తే సిరంజీవి పాటపాడు నేదంటే బాలకృష్ణ పాట పాడు"

"లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కొస్తావా నీ లిల్లిపువ్వు లాంటి సొగసు లీజు కిస్తావా..." పాటంటే అదిరా అలా గుండాలి" కుర్రగొంతు తాతకి హితబోధ చేసింది.

"అవున్రా గంగన్నా ఎవర్రా అది. ముసలాడిని అలా తింటున్నారు" అడిగాను సందేహం తీర్చుకుందామని.

ఆళ్లా మా గౌరుమామ కొడుకులు. గంటలు కాళీ దొరుకుతేసాలు బల్జిపేట సినిమాలు కెళ్లిపోవడమే దానికితోడు ఈ మద్దెన టీవి వొచ్చింది కదా. పెద్దకోడలు తెచ్చినాది. ఆళ్లిష్టమే అన్ని పాటలు అలకే వొచ్చు"

వాళ్ల గౌరుమామ గుర్తుకు వస్తున్నాడుగాని ఆయన పిల్లల పోలిక కూడా నాకు తెలియడం లేదు. తెలియడానికి మా ఊరితో నాకు సంబంధం ఉంటేకదా. చదువులకని కాలేజీలకి వెళ్లిన తరువాత సెలవుల్లో మా ఊరు వెళ్లినా, ఉద్యోగం వచ్చిన తర్వాత భార్యా, పిల్లలు, సంసారం ఏర్పడిం తర్వాత మా ఊరు వెళ్లడం చాలా తగ్గిపోయింది. జననీ జన్మ భూమిశ్చ అని సంవత్సరానికోమార మా ఊరు వెళ్లడం నాలుగు రోజులుండి వెళ్లిపోవడం. ఈ తరంలో యువతరంతో పరిచయాలు ఎలా ఏర్పడతాయి? అందరం రెక్కలొచ్చి ఎగిరి పోయినా ఇల్లు, భూమి వదులుకోలేక అమ్మ మాత్రం ఉండిపోయింది. పండుగ ముందు అమ్మకో చీర కొనిచ్చి చూచి వచ్చేద్దామంది. 'నాలుగురోజుల సెలవు పెట్టి నూర్పుకల్లంలో కూర్చో' అంది అమ్మ. తప్పనిసరి దొరికి పోవలసి వచ్చింది.

"ఇంతకీ ఆ ముసలాడెవర్రా గంగన్నా"

"తమరు పోల్సుకోనేదా మన అరసాడు జంగమయ్య"

"అ... జంగమయ్యా? ఏనాటివాడురా! ఇంకా బతికే ఉన్నాడా?"

ఆశ్చర్యపోవడం నా వంతయింది.

"ఆ... ఏం బతుకు బాబూ. కన్నూనేక... కాలూనేక... బతుకు తెరువూనేక ఏదో ఆడిబతుకలాగయిపోతంది" విచారంగా అన్నాడు మెందోడు.

గంగన్నా, మెందోడు, మరికొందరు కల్లంలో ధాన్యం నూరుస్తున్న రైతుకూలీలు. "ఓసారి పిలుమీ! చూస్తాను. నా చిన్నతనంలో జంగమయ్య ఆడవేషం కట్టి పాటలు పాడుతూ వీధుల్లో తిరుగుతున్నట్టే కనిపిస్తోంది."

"ఆడిని మనం పిలవనక్కర నేదు బాపూ. మరో క్షణానికి ఆడే మన కల్లానికొస్తాడు. చారెడో పిడికెడో గింజలిత్తే పట్టుకుపోతాడు"

"అవున్రా! ఏణూ... ఓ రేణుగోపాలా! తాతని మా కల్లంలో కోపాలి పంపురా బాబు సూత్తారుట" గంగన్న కేక వేశాడు.

"తాత గంగన్న నిన్ను రమ్మంతన్నాడు. బుగతోరి నూర్పుఅయిందట. ఓపాలి ఆ కల్లాని కెల్లు" కుర్ర గొంతు.

"ఎవల్ది? ముసలి బుగతమ్మదా? కల్లాని కెల్లకపోయినా ఇంటికాడి కెలితే నా గింజలు అయమ్మ ఇచ్చేత్తాది. దొంగోడివి. నీ సంగతి ముందు తేల్చు"

"ఓర్నాయినోయ్! ఈ ముసిలోడు మనల్ని ఒగ్గేటట్టు నేడ్రా..."

"అది కాదు తాతా! ఈ నూర్పు మరో ఐదు రోజులుంతాది. ఆ రెండు కుప్పలు మావే! రెండు రోజులు పొయిం తర్వాత మా కల్లానికి రా. నీకేల నీ గింజలు నానిడతాను కదా" నమ్మబలికింది కుర్రగొంతు.

తాత ఏదో గొణుక్కుంటూ కర్ర తాటించు కొంటు చుట్టూరా తిరిగి మా కల్లంలోకి వస్తున్నాడు. గంగన్నని పంపించాను. రెక్కపట్టుకుని జాగ్రత్తగా తీసుకురామ్మని.

"తాతా! బాగున్నావా? రా కూర్చో"

అరచెయ్యి కళ్లకి ఆనించికొని చూపులు సారించి పరికించి పరికించి చూసాడు. కానీ నన్ను పోల్చుకోలేకపోయాడు తాత.

"ఏవుల్లు. రాజా నువ్వు నాను పోల్చుకోలేకపోన్ను?"

"ఎప్పుడో నన్ను చిన్నప్పుడు చూసుంటావు కూర్చో" అన్నాను.

నవ్వుతూ నేను ఎవరినో చెప్పాడు గంగన్న.

"అలాగా బాపు. ఎంత పెద్దాడి వైపోనావు. ఏటిసేత్తన్నావేటి?"

తాత ప్రశ్నలకి గంగన్నే సమాధానాలు చెబుతున్నాడు.

గుండ్రటి మొగం, సోగకళ్ళు, పొడుగు పొట్టికాని రూపం. ఆడవేషం వేస్తే కుందనపు బొమ్మలా ఉండేవాడు తాత. ఇప్పుడు ఎలాగయిపోయాడు? వేలాడుతున్న చెవులు. కౌడుబారిన మొగం, వొళ్ళళ్ళా ఎముకలు కనిపిస్తూ పీక్కుపోయిన చర్మం. ఓహ్! వృద్ధాప్యం ఎలాంటి రూపాన్నయినా పాడుచేయగలదు కదా! వీపుకంటిన పొట్ట, చిరిగి మాసిన దుస్తులు, తైల సంస్కారం లేని జుట్టు అతని దైన్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. తాతని తొలిసారిగా చూడడం మా ఇంట్లోనే. చిన్నప్పుడే అయినా బాగా గుర్తున్న సంఘటన.

***

సూర్యుడు పడమటి పక్క జారిపోతున్నాడు. శీతాకాలం సాయంత్రపు ఎండపొడ వెచ్చగా గిలిగింతలు పెడుతోంది. ఆదరబాదరా ఎక్కాలన్నీ చదివేసి బడికి జనగణమన పాడేశాం. పుస్తకాలు సంచీలో కుక్కేసుకుని అరుచుకుంటూ బడి పాక దాటేశాం. 'ఒరేయ్ ఒరేయ్' అని అరుస్తున్న మాస్టారి కేకలకి అందకుండా పరుగులు పెట్టాం. భూషి, రామం, భాస్కరం, శ్రీను మా జట్టంతా మువ్వల ముసిలోడి పెసరమడిలో దూకి పెసర కాయలు తెంపి మాడతల దండులా ఎగిరి పోయి, కొబ్బరితోట దాటిపోయి మా వీధిమొగ చేరాం.

మా ఇంటి దగ్గర పెద్దగుంపు. ఆడ, మగ. పిల్లా, జెల్లా, గుమికూడి ఉన్నారు. అంతా గోలగోలగా ఉంది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గుంపును చీల్చుకొంటూ ముందుకెళ్తాను.

"బహుషా నానమ్మ చచ్చిపోయిందేమో!" మరి నానమ్మ చచ్చిపోతే బాధపడవలసింది నేనే కదా. నాన్న పెద్దవాడయిపోయాడు. ఏడిస్తే బాగుండదు. అయినా మగాళ్ళు పెద్దయిం తర్వాత ఏడవరు కదా. అత్తగారు చచ్చిపోయినందుకు కోడలు సంబరపడుతుంది కదా. అందుకు అమ్మ ఏడవదు. ముసలిదాని పీడ విరగడయిందని అక్కలు సంతోషిస్తారు. ఇక నేనే రోజూ కథలు చెప్పే నానమ్మ, డబ్బులిచ్చి తాయిలం కొనిపెట్టే నానమ్మ. చదవలేదని నాన్న కోప్పడితే మద్దతు ఇచ్చే నానమ్మ చచ్చిపోయిందంటే... కళ్ళంట నీరు గిర్రున తిరిగింది. అడ్డొచ్చిన వారిని గుద్దుకుంటూ అభిమన్యుడిలా ముందు కురికాను. నా చేతిలో పుస్తకాల సంచీ గిర్రున తిరిగి చావడిలో పడింది.

అరుగుమీద ఒక అందమైన ఆడది. ఆమె పక్కనే చిన్న సూట్కేసు. ఒక చిన్న బట్టలమూట. తలనిండా పూలు పెట్టుకొని విపరీతంగా అలంకరించుకొంది. ఆమె కట్టిన చీర జిగేల్ మంటూ మెరుస్తోంది. చేతినిండా బంగారు గాజులు, తలపై పాపిడి పేరు. చెవులకు దిద్దులు, జంకాలు. మెడలో రాళ్ళ జిగినీ గొలుసు, పూసల దండ, మొగంనిండా ఒత్తుగా పౌడరు. స్టేజిమీద చంద్రమతిలా ఉంది. అందంగా ఉన్నప్పటికీ ఎదోలాగనిపిస్తోంది ఆమెను చూడగానే. చెంపసవరాలు, నాగారం పెట్టి జడగంటలు వేసిన పెద్ద జడను చేత్తో తిప్పుతూ అందరితో మాట్లాడుతోంది. ఆమె మాట్లాడుతుంటే ఎర్రటి పెదాలు విచిత్రంగా కదులుతున్నాయి. ఏదో వింత పరిమళం అల్లుకుంటోంది. ఆమె వయ్యారంగా లేచి నిల్చుని అటుఇటు నడుస్తూ మధ్య మధ్య కిటికిలోంచి ఇంట్లోకి చూస్తూ మాట్లాడుతోంది. "ఏంటి పెద్ద సంసారం. పిల్లలు - జెల్లలూ, పాడి - పంటా, యువసాయం - కంబార్లు, నౌకర్లు - సాకర్లు... ఇన్నింటిని మా యప్ప ఎంతకని సూసుకుంతాది? అటు సూత్తే ఇటు నేదు ఇటు సూత్తే అటునేదు. మా బాయ్యికి 'సబ్బు' అందిత్తాదా? తువ్వాలే అందిత్తాదా? పిక్కురోళ్ళకి అన్నమే ఎడ తాదా? ముసల్దాయికి ఫలహారమే సేత్తాదా? అన్నీ సూసుకొని నిబాయించుకోడానికి మా యప్పకి ఈలు కావడం నేదని నానొచ్చినా! మా బాయ్యకి ఈపురుద్దితానమాడించి తలకి సంపెంగి నూనె రాసి, ఇత్తిరి బట్టలేసి గుండెల మీన పులిగోరుపలక మెట్టి. ఓలమ్మ నాకు సిగ్గేత్తంది... మా బాయ్య పనులన్నీ సూసుకోడానికి నానొచ్చినా!"

"ఓలమ్మా! కుల్లికుల్లి నా కాసి అలా సూడకండి. సిన్నప్పటికాడి నుండి మా బాయ్య అంటే నాకు పేనం. ఆ కొరమీసాలు. ఆ తెల్లటి పీట సెక్కనాటి నడ్డి, ఉంగరాలు జుత్తు, ఏనుగు నాటి మనిషి, తెల్లటి ఇత్తిరి బట్టలేసుకొని వత్తుంటే తడి కల మాటునుంచి ఎన్నిమార్లు తొంగి సూసినాడో, మనువాడితే ఇలపింటి వోన్నే మనువాడాలని అనుకొన్నానో. అందుకే 'వత్తావేంటి గుంటా' అని బాయ్య పిలవగానే పారొచ్చినా"

అదెవర్తో, ఎందుకొచ్చిందో అర్ధం కాగానే ఏమిటో తెలియని కోపం నన్ను ఊపేసింది. మా ఫ్రెండ్స్ అందరూ నా వైపు జాలిగా చూస్తున్నట్లనిపించింది. చావడిలో పడివున్న నా పుస్తకాల సంచీని తీసి ఆమె పైకి విసిరాను.

"ఎవత్తివే నువ్వు" ఇక్కడ నుండిపో. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళకపోయావో దుడ్డు కర్రతో చితక పొడిచేస్తాను" బుసకొడుతూ వీధి అరుగు ఎక్కాను. కర్ర తెద్దామని ఇంట్లోకి దూసుకుపోతున్న నన్ను ఆమె పట్టుకోబోయింది.

"రా నాయినా! అలా కోపమైపోకురా. నాను మీ యమ్మనురా. నిన్నెత్తుకొని సెందమామని చూపిత్తు గోరుముద్దలెడతాన్రా. నిన్ను సంకనేసుకొని ఊరల్లా తిప్పిపాలు బువ్వ లెడతాన్రా" మొగం తిప్పుకొంటూ చేతులూపు కొంటూ పైపైకి వస్తున్న ఆమెను ఒక్క తోపు తోసి ఇంట్లోకి పరుగందుకొన్నాను.

కిటికీలోంచి వీధి వరండాలో జరుగుతున్న తంతును అక్కలిద్దరూ చూస్తున్నారు. నా కోపం నషాళానికి అంటింది.

"ఏమర్రా! ఏంటలా చూస్తున్నారు? చిన్నవాడిని నాకే ఇంత బుద్ధి ఉందే పెద్దవాళ్లు మీకా మాత్రం లేదా? దాన్ని తన్ని తగిలేయకుండా ఏంటా నవ్వులు? నేను గయ్ న లేచేసరికి నవ్వుతున్న అక్కలిద్దరూ మూతులు బిగించి 'ఫోరా' అని కసురుకొన్నారు. 'మీ పని తరువాత చెబుతాను' అనుకొంటూ దుడ్డుకర్ర కోసం వెతుకులాడుతున్నాను. వీధిలోంచి దాని మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

"కురుపాం రాజావారు కోటిసార్లు కబురెట్టినారు. ఒక్కపాలన్నా మా ఊరు రాయే" అని సీ... సీ... సీ ఈ రాజులు సెపలచిత్తులు. ఎవరునమ్మాల. నాకన్నా ఎర్రగా బుర్రగా ఉన్నదాయి రేపు కనబడితే దానివెనక పడుతారు. మరి నానేటి గావాలి? చిక్కవరం జమిందారు సినరాణిని సేత్తానన్నారు. సమితి పెసిడెంటు పట్నంల పెద్ద మేడ కట్టిత్తానన్నాడు. ఎంతమంది ఎన్ని కబుర్లెట్టినా, ఎందరెన్ని సెప్పినా నాకేల ఈ పరిగెట్టి పాలుతాగడము? అని నా నొప్పుగోనేదు. పొన్నూరు మనువయితే ఏటున్నది? ఉన్నూరు మనువయితే కట్టానికో సుఖానికో తల్లితోడు నాగుంతాది అని బాయ్యకి ఊకొట్టినా..."

"ఏటినాయినా మొగోళ్ళు అలా సూత్తారు? ఏటో కాసి ఆడదాయి వొరగక పోతే మీలాంటోళ్ళు బతకనిస్తారా? 'నాను... నాను' అని సంపెయ్యరూ? అయినా బాయ్యకి మీకు పోలికేంటి? బాయ్య కాలిగోరికి మీరు సరిపోత్తారా? సాల్లెండి సంబడం. పకపక నవ్వులు కూడానూ..."

చెవుల్లో దూరుతున్న మాటలను మరి వినలేక నానమ్మ చేతి కర్ర కోసం వంటింట్లోకి పరుగు తీశాను. ఏడుస్తున్న అమ్మను ఓదార్చాలనుకున్నాను. సవితి వస్తుంటే ఏ అమాయకురాలైనా ఎలా భరిస్తుంది? పెద్ద రాణిని చిన్న రాణి ఎన్నో బాధలు పెడుతుంది కదా. అమ్మ కూడా కథల్లోలా బాధలు పడవలసిందేనా? దీనికంతటికి మూల పురుషుడు నాన్న. నాన్నమీద విపరీతమైన కోపం వచ్చింది. నాన్న కనిపిస్తే చేతిలో కర్రని ఆయన మీదికే విసిరేద్దును.

నడవా దాటి వంటింట్లోకి వెళ్లాను. అమ్మ ఏడుస్తూ కూర్చోలేదు. చేటనిండా బియ్యం. దాని మీద ఇన్ని వంకాయలు. జబ్బిలో ఉల్లిపాయలు, చింతపండు ఉంది. ఎండు మిరపకాయలు సద్దుతోంది. అమ్మ చేట పట్టుకొంది. జబ్బి నాచేతిలో పెట్టింది నానమ్మ కబుర్లు చెవుతోంది. అమ్మ ముసిముసిగా నవ్వుతోంది. వాళ్ళ వాలకం చూస్తే ఏ ఒక్కరూ బాధ పడుతున్నట్లుగా నాకనిపించలేదు. 'అనవసరంగా నేనే కోపం తెచ్చీసుకొన్నానేమో' అని నా కనిపించింది.

చేతికర్ర టకటక లాడించుకొంటూ నానమ్మ, ఆ వెనుక నేను వీధిలోకి వచ్చాం. నానమ్మని చూడగానే టక్కున మాటలు ఆపేసి వంకదండం పెట్టింది ఆమె. నానమ్మ చేతికర్ర గాల్లో అటూ ఇటూ ఊగింది. ఆమె మూటా - ముడి తీసుకొని చప్పున అరుగు దిగిపోయింది. నానమ్మ చేతి కర్రకి ఎంత పవరుందో మరోమార అర్ధమయింది నాకు. నానమ్మ చేతి కర్రని చూస్తే ఇంట్లోవారే కాదు, ఊళ్ళో వాళ్ళు కూడా జడుస్తారన్నమాట. నాకు బలే బలే సంతోషమయింది.

అరుగు దిగిన ఆమె ఎంతో వినయంగా మూటలోంచి సంచి తీసింది. జబ్బిలో ఉల్లి, చేటలో బియ్యం సంచీలో పోసుకొంది. నానమ్మ రొంటినుండి తీసిన రెండు రూపాయల బిళ్లలను ఆమె ఎంతో వినయంగా అందుకొంది నమస్కారాలు చెబుతూ వెళ్లిపోయింది. ఆ తరువాత నానమ్మ చెప్పింది. "భడవ ఖానా! అది ఆడది కాదురా. అయ్యావారు అరసాడ అయ్యవారు. వాడలా వేషాలు కడుతూ ఊరూరా తిరుగుతుంటాడు. ఎవరికీ కలిగింది వాళ్ళు ఇస్తుంటారు. వీడు ప్రతీ సంవత్సరం ఏదో వేషంతో మన ఇంటికి వస్తాడు. మనకు కలిగింది మనం ఇస్తామన్నమాట" అని. నిజంగా ఆశ్చర్యపోవడం నా వంతయింది. "మగవాడేనా. ఆ వేషం కట్టింది, అచ్చం ఆడదాన్లా ఉన్నాడే. నేను నమ్మేటట్టు చేశాడే" అన్నాను. నానమ్మ పకపకా నవ్వింది.

ఆ తరువాత అయ్యవారిని చాలా వేషాల్లో చూశాను. మరొకడితో కలిసి రాముడు - ఆంజనేయుడు వేషాల్లో తిరగడం, 'శివపార్వతులు' వేషం వేసి గంగా వివాహం పాడడం, జాలరి భాగవతంలోని జాలరి సాయబు వేశాలు కట్టడం నాకు తెలుసు. వీధి బాగోతులు - నాటకాలు ఆదరణ కోల్పోతున్న కాలంలో రకరకాల వేషాలు వేసుకొంటూ ఊర్లంట తిరగడం, ఇచ్చిన ఏ వేషం వేసినా ఇతడో గొప్ప వినోదం. అయ్యవారు వేషంతో ఊర్లోకి వచ్చాడంటే చాలు - వెళ్లి పోయేంతవరకు తిళ్లు తిప్పలు మాని చిన్నా పెద్దా అనకుండా అంతా అతని వెనుకే ఉండేవారు - అతని మాటలకు చేష్టలకు పొట్ట పగిలేటట్టు నవ్వుకొంటూ. కానీ ఖర్చులేని వినోదం పొందేవారు. అలాంటి కళాకారుడు ఈనాడు ఎలా అయ్యాడంటే...

"ఏంటి తాతా! మరి వేషాలు కట్టడం లేదా?" అన్నాను.

బోసి నోటితో భళ్ళున నవ్వాడు తాత.

"నా యేషాలు - నా పాటలు ఎవ్వరికి కావాలి కొడకా. మాదంతా పాతసింతకాయ పచ్చడి. ఇప్పుడు పెజలకి సినిమా పాటలు కావాలి. గుడ్డలూడదీసి చేసే డాన్సులు కావాల. అయినా మొగోడు ఏసం కడితే చూస వోడెవుడని? ఆ కలంలయితే అలా పెజలు బెమిసి పోయేవోరుగాని.

"ఏటి బాపూ ఏసాలంతాన్నారు మీరింకా. ఇప్పుడు గేమంలో ఏటి జరిగినా నాటకాలు, బుర్రకథలు, జముకుల పాటలు ఏటున్నాయేటి? అవి తెచ్చినా సూసేవాళ్ళు ఎవురున్నారు? ఏ పండుగొచ్చినా కార్యమొచ్చినా, యాతరొచ్చినా, పెళ్లయినా సమర్తయినా పోగ్రాం పెట్టించాలంతే. ఇప్పుడన్నిటికీ ఒక్కటే... సినిమా అరసాడరెడ్డోళ్ళ బావుకి సెబితే పెద్ద టీవి ఇసిపి తెత్తాడు. ఎత్తుగా టేబిల్ కాడ పెట్టేయడం, ఏ సిరంజీవి సినిమానో, బాలకృష్ణ సినిమానో ఏసేయడం. మరో నాల్గు డబ్బులు ఎక్కువ పారేత్తే చిన్న తెర సినిమా. ఆ సినిమా ముందు ఈ ఏసాలు ఏటి పడతాయి?" గంగన్న పెదవి విరిచాడు.

అంతా సినిమాలో పడి కొట్టుకుపోతన్నారు. ఇంక మాలాంటోల్లను ఎవరు సూత్తారు...? ఆ కాలమయిపోయింది... అంతే" తా మాటల్లో చెప్పలేనంత నిస్పృహ. ఆదరణ కంటే కళకు వృద్ధాప్యం లేదు కదా!

"తాతా! నీతో వేషం కట్టేవాడు - కొంచం పొట్టిగా ఉంటాడు అతను బాగున్నాడా?"

"ఆడా... మాసిన్నాయన కొడుకు. ఆడు సచ్చిపోయి సాన్నాళ్ళయిపోయింది. ఆడు నేను కలిసి తిరుగుతుండేవాళ్ళం. ఆడు పోయింతర్వాత నాను మరే ఊరు ఎల్ల నేదు. ఏ యేసము కట్టనేదు"

"ఈ వేషాలు కట్టడం నీకెప్పటినుండి అలవాటయింది. ఇది మీ కుల వృత్తి కాదు కదా. ఎలా దీన్లో ప్రవేశించావు" ఇంటర్వ్యూ చేస్తున్నట్లు ప్రశ్నించాను కాల క్షేపం కోసం.

"ఏటి సెప్పమంతావు నాయనా. అరసాడ శివకోవిల మాది - మా అయ్య పోయి నాక పెద్దరికమంతా మా సిన్నయ్య సేతికొచ్చింది. నానింతున్నప్పుడే మా అయ్య సచ్చిపోనాడు. మన కోవిల రాబడి తెల్సుకదా. కార్తీక సోమవారాలకి జనాలొత్తరు. మళ్ళీ శివరాత్రికొత్తరు. వుత్తప్పుడు ఎవులైనా అటుకాసి సూత్తరా? ఊహూ...! వొచ్చింది వోటాలేసుకోవా. మరి మాం బతకడమెలా? కోవిల మడిసెక్కల నాలుగు రైతుల కమర్సీసి నాడు మా సిన్నయ్య. అయ్యేల కాని, ఇయ్యేల బేడా బోడీసి ఆ బూములు క్రయం సేసీసినాడు. ఆడుమట్టుకు స్వయం పాకమంటూ సెంబొట్టుకొని ఇంటింటికి ఎల్లిపయేవోడు. మరో బతుకు తెరువు నేక కూలి పనులకెల్లిపోయే వోళ్ళం మేమంతా.

ఒకపాలి ఏసవుల్లో మనూరు బాగోతం వొచ్చింది. వాళ్ళ పాటలు, డేన్సులు, జిగేలుమనే బట్టలు నాకు నచ్చినాయి. ఇంట్లో కూడా సెప్పకుండా అల్లవెంట ఎల్లిపోనాను. దేశాలు తిరిగినాను. ఏసాలు కట్టినాను. పాటలు పాడినా. నాతో ఏసం కట్టే ఓ గుంతపాపతో నేస్తం కలిసింది. అలా అల్ల గుంటను లేపుకొచ్చి అన్నంటల్లా తిరిగి తిరిగి సివరకు మనూరు చేరినాను. నాను సచ్చినానో, బతికి ఉన్నానో, ఎన్నంట ఎల్లిపోనానో తెలియక ఓ ఏడు పేడ్చి మా వాల్లు నన్ను మర్సిపోనారు. ఆ గుంటతో నానొచ్చేసరికి - తిరిగొచ్చినందుకు సంతోసించినా కులం సెడినందుకు ఎలిపెట్టినారు. కోవిల్లోకి రానిచ్చినార కాదు. నాకేటి మంత్రాలా? పూజలా? ఏటి రావు కాబట్టి నానుకోవిల కాసెల్లలేదు. నాకు తెలిసిన ఇద్దే ఏసాలు కట్టడం గాబట్టి నలుగురు గుంటల్ని సేరదీసి బాగోతం కట్టి ఉర్లంట తిరగీసి బతికేసినాను. ఆ బాగోతాలకి కాలం సెల్లిపోతే మా సిన్నయ్య కొడుకు నాను మిగిలిపోనాం. ఆ ఏసాలతో ఊరు మీన బడి కానీ పరక దండుకొని కాలచ్చేపం సేసేసినాం. ఇప్పుడు మరా ఓపిక నేక ఇదో ఇలాగయిపోనాను" శూన్యంలోకి చూస్తూ చెప్పుకుపోతున్నాడు తాత.

"ఈ వయసులో ఇంకా ఎందుకిలా తిరుగుతావు? కసింత తిని నీడపట్టున కూర్చుని కృష్ణా రామా అనుకోక" యధాపలంగా అనేసాను. తరువాత ఎంతో విచారించాను. 'ఎందుకిలా మాట్లాడానా'? అని. కానీ అప్పటికే జరగవలసిన అనర్ధం జరిగిపోయింది. నా మాటలు చురకత్తులై తాత గుండెల్ని చీల్చేసాయి.

చిగురుటాకులా కంపించాడు తాత. ఊట చెలమలే అయ్యాయి కళ్ళు. గొంతులో సుడులు తిరిగింది దుఃఖం. ఎగిసిపడుతున్నాయి ఎండిన గుండెలు. తలను గుండెలకు ఆన్చి తనను తాను కంట్రోల్ చేసుకొంటున్నాడు తాత.

"నాయనా! కొన్ని కష్టజీవి పుట్టుకలు అలా ఎల్లిపోవలసిందే. పుడకల్లో కాలిపోయినప్పుడే ఆటికి విశ్రాంతి. కర్మాన్నెవ్వుడు తప్పించనేడు కదా. నా కర్మమిలా రాసి పెట్టి ఉంది. నా జల్మం ఇలా సాగిపోతోంది.

ఏ మూర్తాన పుట్టునానోగాని తండ్రిని తినేసినాను. కూలేసేసిందో - నాలేసేసిందో ఎన్ని ఇడుములు పడిందో నా తల్లి నన్ను పెంచడానికి. గాలోటంగానే పెరగేసినాను. ఆ ఆటలు, ఆ పాటు, ఆ తిరుగుళ్లు బతుకంతా అలాగే సాగిపోయేది. ఒక్క కొడుకు ఆడికేటి నాను నోపం సెయ్యనేదు. నాను తిన్నా తినకపోయినా ఆడికి పాలు, బువ్వా పెట్టినాను. ఆడు నానాగయిపోకూడదని పట్టాయుడి మేష్ట్రకాడికి సదువు కెట్టినాను. కొడుకన్నోడు సివరి దశలో సూసుకొంతాడనే కదా ఆస. నా కొడుకు అజ్జాడబడిలో పదోతరగతి సదివినాడు. టైలరింగు పని నేర్సినాడు. మెసను తిప్పి బట్టలు, పాతు కుట్టి పైసా పరక సంపాయించడం ప్రారంభించినాడు.

అంతా బాగానే ఉంది - కాలమంతా అలాగే గడిసిపోద్దనుకొన్నాడు. ఆడికి పెళ్లి చేసినాను. ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఆడిబతుకాడు బతికేత్తాడు. నా దినమిలా దిబ్బదీరిపోద్దని తలపోసినాను. ముండ బగమంతుడికి నా నేటి అపకారం చేసినాను కొడకా? నా కన్యాయం సేసినాడు బగమంతుడు. కలరా వొచ్చి నెట్టంత కొడుకు బుగ్గిల కలిసిపోనాడు. పిల్లల్ని సూసుకొంటు అత్తమామల్ని కనిపెట్టుకొంటు కూలికో నాలికో ఎల్తు ఆ ముండదాయి రెండు సంవత్సరాలు డేకెరింది. దానికేటి పోయేకాలమొచ్చిందో కాని, ఆ పెక్కురోల్లని ఒగ్గేసి మరో మొగుడి కెల్లి పోయాది. అద ఆగుంటలిద్దరు నా కాల్లకి సుట్టుకున్నారు. ఇనబడితే కనబడదు - కనబడితే ఇనబడదు నాగుంది ముసిల్దాయి ఏదో ఉడికించి పడేత్తంది.

నాయినా బతికనన్నాల్లు నాకీ యాతన తప్పదు కదా. సత్తే ఎవుడెలా పోతాడో అక్కర్నేదుగాని"

లోలోపల అణుచుకొంటున్న గుండెకోతను తన నోటంట చెప్పుకోవడం ఎంత దుర్భరం. నా అనాలోచితమైన మాట ఎంత వేదనను కలుగజేసింది. ఏమనాలో తెలియక తలపట్టుకొని కుర్చీలో అలాగే చేరబడ్డాను.

సూర్యుడు పడమటి కొండలవైపు జారి పోతున్నాడు. రెక్కల సాము చేసిన పక్షులు గూళ్ళకు మళ్ళుతున్నాయి. పశువులు ఇంటిమొకం పట్టాయి. గోర్జిలోంచి దుమ్ము రేగుతోంది. నూర్పుగొడ్లను కళ్లంలో వారగా విప్పారు. ఎడ్లను కుడితికి తోలతున్నాడు. మెందోడు. కొందరు రేకుపడుగు దులుపుతున్నారు. గంగన్న పడుగునుండి తోడిన గడ్డిని గడ్డి మేటుపై విసురుతున్నాడు.

"బాబూ మని నేను ఎల్లోత్తాను. సిత్తం సెలవిప్పించండి. సీకటి పడితే మరి నాకు కనిపించదు" తాత లేచాడు.

"గింజలలికిరిలో నాలుగు కల్లాలు తిరిగితే నాలుగ్గింజలు దొరికితే నెల్లాల్ల బత్తెం. ఏటి సేత్తాం మహారాజా. బుగ్గయే వరకు ఈ బతుకలా ఎల్లిపోవలసిందే" కర్రతో తాటించుకొంటూ తాత వెళ్ళిపోతున్నాడు.

ఎవరో గుండెల్ని నొక్కుతున్న అనుభూతి. మనిషి దరిద్రానికి తోడు వృద్ధాప్యం తోడయితే ఎంత దుర్భరం.

జనాలు లేకుండా బతికే కాలం ఎప్పుడైనా వస్తుందా? పిల్లలు స్వేచ్చగా ఆడుకొంటూ, యువత స్వతంత్రంగా శ్రమించి కూడబెడుతూ, వృద్ధులు బోసినవ్వులు నవ్వుతూ విశ్రాంతి పొందే రోజు - కలగానైనా కనిపిస్తే ఎంత బాగుండును. అటువంటి కలగూడా కనడం నాకు చేతగాదేమో!

దూరమవుతున్న తాత కంటికి మసకగా కనిపిస్తున్నాను. ఏదో విభ్రాంతి హృదయాన్ని పొడిచినట్లనిపించింది. జేబులోంచి పర్సు తీశాను. పదిరూపాయల నోట్లు మడిచి ఉన్నాయి. నా మధ్య తరగతి ఈవిని ప్రకటిస్తూ రెండో మూడో చేతికి వచ్చాయి. పరుగు పరుగున వెళ్ళి తాత చేతిలో కుక్కాను.

తాత కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపించే సంతృప్తి.

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Aparadhulu
అపరాధులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Prema lekha
ప్రేమ లేఖ
- వెంకటరమణ శర్మ పోడూరి
Adrusta chakram
అదృష్ట చక్రం
- కందర్ప మూర్తి
Sishya dakshina
శిష్య దక్షిణ
- వెంకటరమణ శర్మ పోడూరి
Pelliki mundu
పెళ్ళికి ముందు .....
- జీడిగుంట నరసింహ మూర్తి
Kodalu diddina kapuram
కోడలు దిద్దిన కాపురం
- - బోగా పురుషోత్తం.
Sarparaju
సర్పరాజు
- కందర్ప మూర్తి
Devaki Vasudevulu
భాగవత కథలు - 18 దేవకీ వసుదేవులు
- కందుల నాగేశ్వరరావు