సంకల్ప సిద్ధి - రాము కోలా.దెందుకూరు.

SankalpaSiddhi

ఎన్నోరకాల పూజలు, నోములు,వ్రతాలు,చేస్తున్న పార్వతమ్మగారు దైవాన్ని కోరిన ఒకే ఒక వరం!. తనకు "సంతాన భాగ్యం ప్రసాదించుము" స్వామి" అని. దైవం కరుణించిందేమో! , పార్వతమ్మగారు పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చేస్తూ పార్వతమ్మగారిని పరిక్షించాలి అనుకున్నదో?, లేక! పుట్టిన బిడ్డను పరిక్షించాలి అనుకున్నదో? పుట్టుకతోనే వైకల్యంతో జన్మించేలా చేసింది. పుట్టిన బిడ్డను హృదయానికి హత్తుకుంటూనే, చలనం లేని బిడ్డ కాళ్ళు చూస్తూ పార్వతమ్మగారు కన్నీళ్లు పెట్టుకుంది. బిడ్డ జీవితం ఎట్లాంటి సమస్యలతో సాగుతుందో, అనే బెంగతో పార్వతమ్మగారు తల్లడిల్లిపోతుండేది. తేజస్సు ఉట్టిపడుతున్న బిడ్డ ముఖం చూస్తూ.. "నా బిడ్డ రాజాలా ఉన్నాడు" అంతా మంచే జరుగుతుంది,అనో తనకు తాను సరైదిచెప్పుకుంటూ ముద్దుపెట్టుకునేది. బిడ్డలోనే తన సంతోషాలు,ఆనందాలు శోధిస్తూ,బిడ్డే తన ప్రపంచం అనేలా మురిసిపోయేది. "కుంటి రాజా" అంటూ వేళాకోళం చేస్తున్న సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం ఎలానో !బిడ్డకు ప్రతినిత్యం నేర్పుతూనే ఉండేది పార్వతమ్మ గారు. తెలియని ఏదో బాధ ఎదలో మెలిపెడుతుంటే.. కన్నీటిని దాచుకుంటూ,చిరునవ్వులు బిడ్డపై కురిపించేది. నాబిడ్డ నడవలేడే !ఆడుగులు వేయలేడే, అనే దిగులు కాలక్రమేణా, తన మనసు నుండి దూరం చేసుకుంది. తన బిడ్డ తప్పటడుగులు వేయాలంటే మరో మూడు కాళ్ళ చక్రాల బండి, తోడు తప్పదని తెలుసుకుని, ఏర్పాటు చేసింది! "అడుగు తీసి అడుగు వేయాలంటే.. మొత్తం ఐదు కాళ్ళు "అని వెక్కిరించే వారు. చుట్టూ నివాసముండే పోకిరిగాళ్ళు. అవహేళన చేస్తూ చూట్టూ చేరేవాళ్ళు ఎందరో.. అవమానం పంటి బిగువున భరించేది.. బిడ్డకు ధైర్యం చెప్పేది పార్వతమ్మ గారు.. పార్వతమ్మగారి బిడ్డ నిల్చోగలిగే వయస్సుకు వచ్చేసింది. చెక్క కర్రలతో అడుగులేస్తుంటే నాలుగు కాళ్ళతో కదలలేక కదిలే మరబొమ్మ అనేవారు.. చుట్టూ నివాసముండే ఆవారాగాళ్ళు. ఎందరు తన బిడ్డను గేలిచేస్తున్నా! పార్వతమ్మగారు మాత్రం బిడ్డను రాజులానే చూసుకునేది . ఎందరో వీరుల కథలు,పోరాడి జీవితం గెలుచుకున్న వారి స్ఫూర్తి గాథలు చెప్పేది . రామాయణ, భారత, భాగవతాలు, చదివించేది "అన్ని అవయవాలు సరిగావున్న మనిషి సాధించలేనిది ,నువ్వు సాధించి చూపాలిరా" అంటూ లక్ష్యాన్ని చూపేది. అమ్మ అంటే ఆదిగురువు అంటారు అందుకేనేమో!. విధి మరోసారి పార్వతమ్మగారిని పరిక్షిస్తూ,భర్తను దూరం చేసింది. కుటుంబం భారం మోయలేని స పార్వతమ్మగారికి బిడ్డ ఇంటి జీవనాధారమైయింది. రెండు చేతి కర్రలు వదిలేసి. మూడు చక్రాల ఆటో రిక్షాని ఆశ్రయించింది. చదువుని ఇంట్లో ఉండే కొనసాగిస్తూ ... పస్తులు ఉండే కుటుంబానికి అండగా నిలచి నాలుగు ముద్దలు తృప్తిగా తినే స్థితికి తీసుకువచ్చింది. నవ్విన వాళ్ళే సేహబాస్ అంటున్నారు.. జీవితం ఎక్కడ మొదలైనా! ఎలా మొదలైనా! సరైన మార్గంలో నడిపిస్తే .. జీవితం గెలుపు బాట ముందు నిలుస్తుందని.ఎందరో నిరూపించిన నిజాన్ని ,తనుకూడా అందుకోవాలి అనుకుంది పార్వతమ్మగారి బిడ్డ. గెలుపు అనుకున్నంత సులువు కాదని అనుభవం తెలియచేస్తున్నా, పట్టు వదలలేదు. అనుకున్నది సాధించే స్థితికి చేరుకుంది. నేడు అవమానాలు వినిపించడం లేదు . ఛీత్కారాలు కనిపించడం లేదు. పార్వతమ్మగారి బిడ్డ స్వశక్తి పట్టుదల ఆత్మాభిమానం ముందు తలవంచి నిలుచున్నాయేమో..! తనకు దూరంగా జరిగిపోయేవాళ్ళు తన కోసం నిరీక్షిస్తున్నారు .. .నేడు తన ఒక్కమాటకోసమ్ .. నిరీక్షిస్తున్నారు ఎక్కడ సహాయం అడుగుతుందో అని తప్పుకున్న వాళ్లు , నేడు తన సహాయం కోసం ఆర్థిస్తున్నారు.. పార్వతమ్మగారి అధరాలపై చిరునవ్వు..చెదరలేదు. పార్వతమ్మగారి బిడ్డ ఓ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ . శ్రమను నమ్ముకుని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ముందుకు సాగుతుంటే,ఆనందాశ్రువులు నిండిన కన్నులతో దీవిస్తుంది.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ, కృషి పట్టుదల ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ... పార్వతమ్మ గారు కన్నుల్లో సంతోషపు వెలుగు చూస్తుంది.పార్వతమ్మ గారి బిడ్డ.

మరిన్ని కథలు

Guruvugari sahanam
గురువు గారి సహనం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Jodedla bandi
జోడెడ్ల బండి
- మద్దూరి నరసింహమూర్తి
Naa laaga endaro
నాలాగా ఎందరో ?
- జీడిగుంట నరసింహ మూర్తి
Jgnana Pariksha
జ్ఞాన పరీక్ష
- - బోగా పురుషోత్తం
420
420
- మద్దూరి నరసింహమూర్తి
Aakali
ఆకలి
- అరవ విస్సు