పక్షపాతి - అరవ విస్సు

Pakshapaathi

శ్యామ్ మాస్టారు పెదలంక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గత 5సం" పనిచేస్తూ అన్నిరంగాలలో పాఠశాలను తీర్చిదిద్దారు. ఆయన ఒక యూనియన్ లో చురుకుగా పాల్లోని, టీచర్స్ తలలోనాలుక . ఒకసారి ఆయన పాఠశాలకు కొత్తగా వచ్చిన విద్యాశాఖాధికారి భాస్కరరావు వచ్చారు . ఆయన మరో యూనియన్ కు నాయకుడు . "సర్ గత నాలుగు సంవత్సరాలుగా మా పాఠశాలకు నవోదయ కు విద్యార్ధులు ఎంపికవుతున్నారండీ " "అలాగా " "ఈమధ్య జరిగిన డ్రాయింగ్ పోటీలలో మా విద్యార్ధి జిల్లాలో ప్రథమ స్థానం పొందాడండీ "" " హి హి హి అలాగా " అన్నాడు భాస్కరరావు శ్యామ్ ఏం అర్థం కావడంలేదు కనీసం అభినందనలు కూడి చెప్పడం లేదేంటి అని మనసులో అనుకుంటూనంనే " సర్ గతంలో 50మంది విద్యార్ధులుండేవారండీ అందరూ డోర్ టు డోర్ తిరిగి 150వరకు రోల్ పెంచామండీ " " మాస్టారు మీరు ఏం చెప్పినా వింటానండీ ! నమ్మను -ప్రత్యక్షంగా నేను చూస్తేనే నమ్ముతా " అన్నాడు భాస్చరరావు " మీరే కదండీ ప్రత్యక్షంగా అన్నీచూసారు " "ఐనా నమ్మనండీ నా కళ్ళెదురుగా జరిగితేనే నమ్ముతానండీ " శ్యామ్ కు విషయం అర్ధం అయ్యింది ఇతను కులం వస్త్రాలను ధరించి, యూనియన్ కళ్ళజోడుతో చూస్తున్నాడని " అలాగా సర్ ! అంటే ఒలింపిక్స్ లో రన్నింగ్ లో గోల్డ్ మెడల్ పొందినవాడు కూడా వచ్చి ఆ మెడల్ చూపించినా నమ్మరన్నమాట " "అవును " అని నాలుక కరచుకున్నాడు " ఓహో ! మీ ముందు పరుగు పెడితేనే నమ్ముతారన్నమాట సంతోషం మీలాంటి అధికారులే విద్యావ్యవస్థకు భ్రష్టు పట్టడానికి కారణం సర్ " అన్నాడు శ్యామ్ తలవంచుకుని వెళ్ళిపోయాడు భాస్కరరావు సిగ్గుతో కాదు -ఎలా దెబ్బ కొట్టాలా ! అని కష్టపడేవారిని దేవుడూ కొట్టలేడు .

మరిన్ని కథలు

Naanna
నాన్న
- డా:సి.హెచ్.ప్రతాప్
The game changer
ది గేమ్‌ చేంజర్
- హేమావతి బొబ్బు
Adrustam kalisoste
అదృష్టం కలిసొస్తె...
- కందర్ప మూర్తి
Illaale Devatha
ఇల్లాలే దేవత
- డా:సి.హెచ్.ప్రతాప్
Hidimbi premakatha
హిడింబి ప్రేమ కథ
- హేమావతి బొబ్బు
Vimukthi
విముక్తి
- డా:సి.హెచ్.ప్రతాప్
Aadhaar OTP
ఆధార్ ఓటీపీ
- యస్. రాజేష్ కుమార్
Tappu
తప్పు
- మద్దూరి నరసింహమూర్తి