నిజాయితీ - సూర్య. మండా(MS)

Nijaayitee

పూర్వం కుంచెలాపురం అనే రాజ్యంలో సూరయ్య అనే నిరుపేద కూలీ ఉండేవాడు.సూరయ్య రామయ్య అనే ఒక వ్యాపారి వద్ద తన చిన్నతనం నుండి నమ్మకంగా పనిచేస్తున్నాడు.సూరయ్య చాలా మంచివాడు అమాయకుడు. వచ్చిన కొద్దిపాటి కూలీతో భార్య బిడ్డలను పోషించుకునేవాడు. సూరయ్య రామయ్య దగ్గర నమ్మకంగా పనిచేయడం నచ్చని కొంతమంది సూరయ్య మీద లేని పోనీ నిందలు వేశారు అవి నిజమే అని నమ్మిన రామయ్య సూరయ్యని ఆకారణంగా పని నుంచి తీసేసాడు. ఏమి చెయ్యాలో తోచని సూరయ్య నిరాశగా ఇంటికి వెళ్లి జరిగినది అంత తన భార్య స్రవంతి కి చెప్పాడు. కుటుంబాన్ని ఎలా పోషించంలో తెలియక బాధపడుతున్న సూరయ్యకి అడవిలో కట్టెలు కొట్టి పొన్నూరులో అమ్మితే డబ్బులు వస్తాయని సలహా ఇచ్చింది.భార్య సలహా మేరకు సూరయ్య దగ్గరలో అడివికి వెళ్లి కట్టెలు కొట్టి పొన్నూరు పోయి అమ్మడం మొదలుపెడతాడు.ఇలా కొంతకాలం గడిచిన ఒక రోజు సూరయ్య స్రవంతితో “త్వరలో వర్షకాలం రాబోతుంది కట్టెలు కొట్టడం అమ్మడం రెండు కష్టమే, అందుకే నేను ఎక్కువగా కట్టెలు కొట్టి వేరు వేరు సంతలలో అమ్మి కొంత డబ్బును సంపాదించి తిరిగి వస్తా అప్పటివరకు పిల్లలను జాగ్రత్తగా చుసుకోమని”చెప్పి అడవికి ప్రయాణం అవుతాడు. సూరయ్య అడివిలో కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి, మళ్ళీ అడవికి వచ్చి కట్టెలు కొట్టి వేరే సంతకు పోయి అమ్మేవాడు అలా కొన్నాళ్ళు కట్టెలను అమ్మి సంపాదించిన డబ్బును తనవెంట పెట్టుకొని అడవి మార్గంలో ఇంటికి ప్రయాణం అయ్యాడు సూరయ్య. అలా కొంత దూరం పోయాక దొంగలు సూరయ్యని చుట్టూముట్టి సూరయ్య దగ్గర ఉన్న డబ్బును దోచుకున్నారు. చేసేది ఏమి లేక నిరాశగా ఖాళీ చేతులతో ముందుకు నడవ సాగాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి అలిసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుందాం అని కూర్చున్నాడు.చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సూరయ్యకి పక్కన ఉన్న పొదల్లో మెరుస్తూ ఎదో కనిపించింది, అది ఏంటా!అని వెళ్లి చూసేసరికి మిల మిల మెరుస్తూ ఒక మణి కనిపించింది.దానిని పట్టుకొని “ఆహా! భగవంతుడు నాకు ఈ మణి రూపంలో సాయం చేసాడు, దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో ఇంటికి వెళ్తాను” అని అనుకుంటూ ఆ మణిని పట్టుకొని ఇంటికి ప్రయాణమాయ్యడు. మణిని పట్టుకొని నడుస్తున్న సూరయ్యకి మనసులో ఎన్నో సందేహాలు కాలిగాయి “అసలు ఈ మణి ఎవరిదీ?, దీనిని పోగుట్టుకొని ఎంత బాధపడుతున్నారో?,చుస్తుంటే ఈ మణి ఎంతో మహిమగల మణిలా ఉంది, దీన్ని రాజుగారికి అప్పజేప్పడం మంచిది” అనుకుంటూ రాజభవనం దగ్గరికి వెళ్తాడు. కోట బయట ఉన్న సైనికులకు విషయం చెప్తాడు సూరయ్య. విషయం తెలుసుకున్న రాజు విక్రమాసింహుడు సూరయ్యని రాజభవనంలోకి పిలిచి “ఈ మణి నాదే ఇది సామాన్యమైన మణి కాదు!ఎన్నో మహిమలను కలది, దీన్ని ఆత్మనందుడు అనే గొప్ప మహర్షి తనకు బహుమానం ఇచ్చాడని, ఈ మణి మహిమ వలన శత్రురాజుల నుండి రక్షణ ఉంటుంది , దీనికి వేటకు వెళ్లి పోగొట్టుకున్న నువ్వు దీనిని తెచ్చి ఇచ్చావు కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకోమని” చెప్తాడు. దానికి సూరయ్య మహారాజ!అ మణి మీకు చెందినది అందుకే మీ చెంతకు చేరింది ఇందులో నా గొప్పతనం ఏముంది, నాకు ఏమి వద్దు నేను నా కుటుంబం కోసం కట్టెలు అమ్మి సంపాదించిన డబ్బును దొంగలు దొంగలించారు, నేను డబ్బు సంపాదించి తిరిగి వస్తా అని నా కుటుంబం ఎదురుచూస్తుంది, నాకు ఆ కొద్దీ మొత్తంలో డబ్బులు ఇవ్వగలరు, అని వినాయంగా చెప్పడు. సూరయ్యనిజాయితీకి విక్రమసింహుడు ఆశ్చర్యపోతాడు. “సూరయ్య నువ్వు ఏమి అడిగిన ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిసి కూడా ఏమి ఆశించకుండా కేవలం నువ్వు పోగుట్టుకున్నా డబ్బును మాత్రమే అడిగాడవు.నీలాంటి నిజాయితీపరులు నా రాజ్యంలో ఉండడం నాకు గర్వంగా” ఉంది.అంటూ కొన్ని విలువైన బంగారు నాణేలు, ఇంకా కొంత భూమిని బహుమానం ఇచ్చి వీటిని కాదనకుండా తీసుకోవాలని ఇది నీ నిజాయితీకి ఇచ్చిన బహుమతి అని బంగారు నాణేల మూటని సూరయ్య కి ఇస్తాడు.సూరయ్య ఆ మూటని తీసుకోని తన ఇంటికి వెళ్ళిపోతాడు. రాజు బహుమానంగా ఇచ్చిన భూమిలో పంటలు పండిస్తూ ఆనందంగా జీవిస్తాడు.

మరిన్ని కథలు

Gurudakshina
గురుదక్షిణ
- భ్రమరాంబికా సాయిశ్రీ మిరియాల
Gruhame kadaa swarga seema
గృహమే కదా స్వర్గసీమ
- వేముల శ్రీమాన్
Bhakthi deepam
భక్తి దీపం
- డా:సి.హెచ్.ప్రతాప్
Flot No. 66-B
ఫ్లాట్ నెంబర్ 66-బి
- డా:సి.హెచ్.ప్రతాప్
SNEHAMANTE IDERAA
స్నేహామంటే ఇదేరా !
- సంధ్య కార్తీక్
Neelaveni pelli
నీలవేణి పెళ్ళి
- కొడాలి సీతారామా రావు
MOLAKETTINA VITTANAM
మొలకెత్తిన విత్తనం
- డా:సి.హెచ్.ప్రతాప్