నీకు రెండు - నాకు మూడు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Neeku rendu naaku moodu

ఉలవపాడు గ్రామానికి వెలుపల ఉన్న చెరువుగట్టున గిడిసెవేసుకుని శివయ్య,పెద్దమ్మఅనే వృధ్ధ దంపతులు నివశిస్తుండేవారు . వారికి ఎవరూ బంధువులులేరు. శివయ్య వ్యవసాయ కూలిపనులకు వెళుతుండేవాడు.

ఒకరోజు " రాజమ్మ సంక్రాంతిపండగ వస్తుంది నాకు గారెలు తినాలనిఉంది ఎప్పుడో నువ్వు చేస్తె తీన్నగుర్తు "అన్నాడు తనభార్య రాజమ్మతో శివయ్య.

" మెదులులేదురా మొగుడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడంట నీలాంటోడు, కూలిపనులులేక తిండికే తిప్పలు పడుతుంటే నీకు గారెలు కావాలా అయీతె పోయీనూనె, మినపప్పు తీసుకురలాగే చెస్తాను "అన్నది రాజమ్మ.

పేద్దున్నే ఊళ్ళోకి వెళ్ళిన శివయ్య భోజనం సమయానికి రాజమ్మ చెప్పిన వస్తువులు తలగుడ్డలో మూటకట్టుకు వచ్చాడు శివయ్య. భార్యాభర్తలు ఇరువురు అన్నాం తిన్నతరువాత,కొంతసమయం తరువాత గారెలు చేయసాగింది రాజమ్మ,కేంసేపటికి ఐదు గారెలురెలు తయారయ్యాయి. వాటిని ఉట్టిపైన పెట్టిన రాజమ్మ "చల్లారనీయవయ్యా తిందాము "అన్నది.

"రాజమ్మ మినపప్పు,నూనె తీసుకురావడానికి నేను రంగయ్య గారి అంగడిలో ఎన్ని బస్తాలు బండ్లకు ఎత్తాను ఎంతో కష్టపడ్డాను కనుక నాకు మూడు గారెలు కావాలి "అన్నాడు శివయ్య ." ఏందయ్య నేను మాత్రం

కష్టపడలేదా ? పిండిరుబ్బింది గారెలు వండింది నేను కనుక నేనే మూడు గారెలు తింటాను "అన్నది రాజమ్మ. ఇద్దరు అలావాదులాడుకున్నాక "సరే ఇద్దరం మాట్లాడకుండా పడుకుందాం మనలో ఎవరు ముందు మాట్లాడితే వారికి రెండుగారెలు "అన్నది రాజమ్మ తనమంచం వేసుకుంటూ. "అలాగే అదీచూద్దాం " అని శివయ్య కూడా ఒమంచం వేసుకునీ పడుకున్నాడు. దంపతులు దుప్పటి నిండుగా కప్పుకునీఉన్నారు.

కిటికిలోనుండి లోనికివచ్చిన కోతి ఉట్టిపౌన ఉన్న ఐదు గారెలు అందుకుని వెళ్ళిపోయీంది.

తెల్లవారుతూనే శివయ్యను బస్తాలు బండ్లకు ఎత్తడానికి పిలవడానికి ,శివయ్య ఇంటీకి వచ్చి న రంగయ్య ,ఎంతపిలిచినా శివయ్య పలకకపోవడంతో తలుపులు తీసి ఇంట్లోకి వెళ్ళి పిలిచాడు ,ఉలుకు పలుకు లేకుండా నిండా దుప్పటికప్పుకున్న శివయ్యను తట్టిలేపాడు శివయ్యలో ఎటువంటి కదలిక లేకపోవడంతో ,రాజమ్మను గట్టిగా పిలుస్తూ తట్టిలేపాడు .దంపతులు ఇరువురు కేయ్యబొమ్మల్లా ఉండటంతో ఇద్దరు మరణించారని నిర్ధారించుకున్న రంగయ్య, ఊరిలో పెద్దలతో సంప్రదించి శివయ్య ,రాజమ్మ దంపతులను స్మశానానంలో చితిపై ఇద్దరిని ఉంచించారు. అందరూ వెళ్ళిపోగా అక్కడ రంగయ్యతోకలసి ఐదుగురు ఉన్నారు. చితిమంటల సెగ శరీరానికి తగలడంతో " అబ్బా నీకే మూడు నాకురెండు "అన్నది రాజమ్మ. "అవును నాకుమూడు నీకు రెండు "అన్నాడు శివయ్య. చనిపోయినవారు బ్రతికి మాట్లాడటం ఆమాటలువింటూ ,ఇక్కడ మనం ఐదుగురం ఉన్నాం శివయ్య,రాజమ్మ దెయ్యాలుగా మారి మనల్ని తినడానికి పంచుకుంటున్నారు అని పరుగుతీసారు ఆఐదుగురు ." ఇదిగో ఆగండి మీరే సాక్ష్యం నాకు మూడు నాభార్యకు రెండు "అని వాళ్ళవెంటపడ్డాడు శివయ్య,అతని వెంట రాజమ్మకూడా పరుగుతీయ సాగింది.

అసలు విషయం తెలుసుకున్న ఉలవపాడు ప్రజలు పగలపడినవ్వుతూ,నాటినుండి రాజమ్మ,శివయ్య దంపతులకు ఏలోటు రాకుండా అందరూకలసి ఆదుకున్నారు.

(అరవై ఏళ్ళనాటి కథ )

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు