పక్కింటి అనిత - తాత మోహన కృష్ణ

Pakkinti Anitha

మా కాలనీ చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, పక్కనే ఉన్నమెయిన్ రోడ్ తో చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ కాలనీ లో ఇండిపెండెంట్ ఇళ్ళు పక్క పక్కనే ఉంటాయి .

ఒక రోజు సామాన్ల ట్రక్ మా పక్కింటి దగ్గర ఆగింది. ఎవరా? అని చూడాలని అనిపించింది. కొత్త ఫ్యామిలి రెంట్ కి వచ్చింది. ట్రక్ వెళ్ళగానే, కార్ లో ఇంటి సభ్యులు దిగారు. అందులో ఒక అందమైన అమ్మాయి దిగింది. 'అనితా' అని వాళ్ళింట్లో పిలవడం విన్నాను. ఆ అమ్మాయి మొదటి చూపులోనే చాలా నచ్చింది. తనతో మాట్లాడడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.

ఒకరోజు అమ్మ నాన్న కి క్యాబ్ బుక్ చేయడానికి బయటకు వచ్చాను. ఇంట్లో సిగ్నల్ తక్కువ. ఎంత సేపటికీ క్యాబ్ బుక్ అవట్లేదు. అప్పుడే, అనిత బయటకు వచ్చింది. బ్లూ కలర్ చుడిదార్ లో చాలా బాగుంది. జుట్టు లూజ్ గా ఉంచి క్లిప్ పెట్టింది. గాలికి కురులు ఊగుతుంటే, చాలా అందంగా ఉంది తన ముఖము. సుమారు 5 ఫీట్ పొడవు, ఛామన చాయ, అందమైన రూపం, చక్కటి ఎద సౌందర్యం, చూడడానికి కంటికి ఇంపుగా ఉంది. ఆ రోజు తర్వాత ఇప్పుడే దగ్గరగా చూడడం.

హలో ! ఇందాకలనుంచి క్యాబ్ కోసం చూస్తున్నట్టు అనిపిస్తుంది . నేను బుక్ చేయనా? అన్నది అనిత, చిన్న చిరునవ్వుతో.

పర్వాలేదు! క్యాబ్ ఆన్ ది వే! నో ప్రాబ్లెమ్ అన్నాను.

ఇదే ఛాన్స్ అనుకుని, నేను మీ పేరు ఏమిటి? అని అడిగా. 'అనిత' అని చెప్పింది.
నా పేరు 'అనిల్' అని పరిచయం చేసుకున్నాను. మన ఇద్దరి పేర్లు భలే కలిసాయి కదండీ!అన్నాను. ఫోన్ చూసుకుంటూ, కొంచం సీరియస్ గా లోపలికి వెళ్ళిపోయింది.

సెలవులు అయిపోయాయి. కాలేజీ తెరిచారు. మొదటిరోజు కాలేజీ కి నీట్ గా రెడీ అయ్యి, బ్యాగ్ వేసుకొని బయల్దేరాను. కాలేజీ ఎప్పటిలాగే ఉంది, కాకపోతే కొత్త పెయింట్స్ వేశారు.

క్లాస్ లో కూర్చున్న కొంత సేపటికి "మే ఐ కమ్ ఇన్ మేడం" అని తలుపు దగ్గర ఒక అందమైన గొంతు. ఎక్కడో ఆ గొంతు విన్నాను. ఆశ్చర్యం! నా కాలేజీ లో , నా క్లాస్ లో అనిత! చాలా ఆనందించాను.

కాలేజీ అయిపోయిన తర్వాత తనని ఎప్పుడు కలుద్దామా! అని తన వెనుకాలే బస్టాప్ కి వెళ్ళాను. మా కాలేజీ ఇంటికి చాలా దూరం. సిటీ బస్సు లో ౩౦ మినిట్స్ పడుతుంది.

బస్టాప్ లో అనిత దగ్గరకు వెళ్లి "అనితా! అనితా! ఆ రోజు నేను ఆలా అని ఉండకూడదు. ఐ యాం సారీ" అన్నాను.

"దానిలో ఏముంది". ఆరోజు నేను సీరియస్ గా వెళ్ళిందీ, నాకు వచ్చిన మెసేజ్ చూసి. మా ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అయ్యింది, అందుకే.

నేను చాలా భయపడ్డాను అనితా! నన్ను తిట్టుకున్నావేమోనని.

నిజం చెప్పనా అనిల్! ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నాకు చాలా నచ్చావ్. అందుకే నువ్వు ఉన్న కాలేజీ తెలుసుకొని మరీ జాయిన్ అయ్యాను.

నిజమా అనితా? నా పక్కింటి అనితా! నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం.

రోజూ అలా ఇద్దరమూ, బస్టాప్ నుండి కాలేజీ దాక, మరియూ రిటర్న్ చాలా సరదాగా మాట్లాడుకునే వాళ్ళము. ఒక రోజు కాలేజీ అయ్యాక, వర్షం పడుతోంది. బస్టాప్ లో అనిత, నేను తప్ప ఎవరు లేరు. కొంచం దగ్గరగా ఇద్దరమూ ఉన్నాము తడవకూడదని. ఒక ఉరుము ఉరిమింది. అనుకోకుండా అనిత ఒక్కసారిగా వెనుకకు తిరిగింది. తన పెదవులు నా పెదవులతో కలిసాయి. ఏదో కొత్త అనుభూతి కి లోనయ్యాను. మధురంగా వుంది.

ఇద్దరిలో ఒక చిరునవ్వు. ఈలోపు బస్సు వచ్చింది. ఇద్దరమూ ఇంటికి వెళ్ళాము. కొన్ని రోజుల వరకు, మేము మాట్లాడుకోలేదు. సిగ్గో, ఏమో మరి.

ఒక రోజు అనిత వాళ్ళింటికి, వాళ్ళ పెదనాన్నగారు వచ్చారు. ఇంట్లో ఎదో గట్టిగా మాట్లాడుకోవడం వినిపించాయి. ఎలాగైనా విషయం తెల్సు కోవాలని అనిత మేడ మీదకు వస్తుందేమో నని వెయిట్ చేశాను ఈవెనింగ్.

అనుకున్నట్టే వచ్చింది టెర్రేస్ మీదకు, ఆరేసిన బట్టలు తీయడానికి.

అనితా! నిన్న ఏమైంది ఇంట్లో? అని అడిగా.

మనిద్దరినీ, మా పెదనాన్నగారు కాలేజీ బస్టాప్ లో చూసారంట ఆ వర్షం రోజు. మా నాన్నగారు, చాలా సీరియస్ అయ్యారు. కాలేజీ మార్చేస్తారంట. అనితా! ఐ యాం సారీ! నువ్వు లేకుండా నేను ఉండలేను.

మర్నాడు మార్నింగ్ నిద్ర లేచేసరికి, పక్కింటి అనిత ఇంటికి తాళం ఉంది . హౌస్ వెకేట్ చేసి వెళ్ళిపోయారు. చాలా బాధ పడ్డాను. అనిత కోసం చాలా వెతికాను, కానీ తెలియలేదు. పక్కింట్లో ఎవరు దిగినా, తానే గుర్తు వచ్చేది.

తెలియకుండానే రెండు సంవత్సరాలు గడిచాయి. లాస్ట్ ఇయర్ ఆక్సిడెంట్ లో అమ్మ నాన్న చనిపోయారు. నేను ఒక్కడినే అయ్యాను. అనిత చాలా గుర్తు వచ్చింది.

నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది బెంగుళూరు లో. ఒక వారం లో జాయిన్ అవ్వాలి. అనుకున్నటైం కి ఆఫిస్ లో జాయిన్ అయ్యాను. ఒక ఫ్లాట్ కూడా రెంట్ కి తీసుకున్నాను.

మా పక్క ఫ్లాట్ లోకి కొత్తగా ఎవరో వచ్చారు. చుస్తే కొత్త జంట లాగా ఉన్నారు.
ఇంట్లోంచి ఎప్పుడూ అరుపులు వినిపించేవి. గొడవలు అవుతుండేవి. ఆ అమ్మాయిది బాడ్ లక్! మొగుడు శాడిస్ట్ లాగా ఉన్నాడు.

ఒకసారి నేను ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు, లిఫ్ట్ లో అనుకోకుండా అనిత కనిపించింది.
"బాగున్నావా? అనితా! అన్నాను" తనతో లిఫ్ట్ లో వెనకనుంచి.

వెంటనే తిరిగి అనిత ఆశ్చర్యంగా, కళ్ళలో నీళ్లు పెట్టుకొని బయటకు వెళ్ళింది. తన వెంటే వెళ్ళాను అపార్ట్మెంట్ బయటకు. తాను పార్క్ లో వెళ్లి కూర్చున్నది. నేనూ వెళ్ళాను.

"చాలా రోజులైంది నిన్ను చూసి అనిల్" అన్నది అనిత. అవును అనితా! అన్నాను. నువ్వు కాలేజీ మానేసిన తర్వాత నీ కోసం చాలా వెతికాను అనితా!

నీకు పెళ్లయిందా అనిల్?

లేదు! అన్నాను.

నీకు పెళ్లి అయినట్టుంది అన్నాను. వెంటనే తాను కళ్ళలో నీళ్లు పెట్టుకొని, నా పరిస్థితి ఏమీ బాగోలేదు అనిల్. అప్పుడు నీ పక్కింటి అనిత తప్పక ఇళ్ళు ఖాళీ చేసి వేరే వూరు వెళ్ళిపోయింది. మా నాన్నగారు తనకి తెలిసిన కాలేజీ కు మార్చేశారు. నాకు కాలేజీ ఇష్టం లేక పోయినా, మా నాన్నగారు మాట కోసం మారాను. నువ్వు కూడా నాకు చాలా గుర్తు వచ్చావు.

మా ఇంట్లో నాకు పెళ్ళి ఫిక్స్ చేసారు. అబ్బాయిని చూపించలేదు.పెళ్ళైన తర్వాత తెలిసింది, తనకి చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయని. ఒక శాడిస్ట్ కూడా. నన్ను టార్చర్ పెడతాడు. నేను వాడికి లొంగలేదు. మా నాన్నగారికి ఈ విషయం తెలిసి, చేసిన తప్పు కి బాధతో హార్ట్ఎటాక్ తో చనిపోయారు. నాకు ఇప్పుడు ఎవరూ లేరు. సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను.

ఇప్పుడు నువ్వు కనిపించగానే, జీవితం మీద ఆశ కలిగింది. నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో అనిల్.

సారీ అనిత! ఆలా చేయను. వాడికి తగిన బుద్ధి చెప్పి, విడాకులు తీస్కోని, అప్పుడు పెళ్లిచేసుకుందాం. నిన్ను టార్చర్ పెడుతున్న వీడియోస్ గాని, ఆడియో ప్రూఫ్స్ గాని కావాలి. నా ఫ్రెండ్ లాయరు. వాడితో నేను మాట్లాడతాను.

అంతా అనుకున్న ప్రకారం జరిగింది. ఇబ్బందులన్నీ అధిగమించి, విడాకులు వచ్చాయి అనితకి .

అనిత సంతోషానికి అవధులు లేవు. మళ్ళీ జన్మ ఎత్తినట్టు అనిపించింది.

అనిత, అనిల్ నుదిటి పైన ముద్దు పెట్టి, ఒక నవ్వు నవ్వింది.

"ఆ పక్కింటి అనిత మనసు దోచావు, ఈ పక్కింటి అనిత బాధను పోగొట్టావు, నీ పక్కన నిల్చునే అవకాశం ఇచ్చావు. నీ దానిని చేసుకున్నావు. ఐ లవ్ యు వెరీ మచ్ అనిల్" అని ఈ సారి లిప్ తో లిప్ కిస్ పెట్టింది అనిత.

మరిన్ని కథలు

Kurukshetra sangramam.14
కురుక్షేత్ర సంగ్రామం. 14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.13
కురుక్షేత్ర సంగ్రామం .13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.12
కురుక్షేత్ర సంగ్రామం .12.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.11
కురుక్షేత్ర సంగ్రామం . 11.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.10
కురుక్షేత్ర సంగ్రామం .10.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Iddarammalu
ఇద్దరమ్మలు
- తిరువాయపాటి రాజగోపాల్
Modu chiguru todigindi
మోడు చిగురు తొడిగింది
- బి.రాజ్యలక్ష్మి
Pellaina kottalo
పెళ్ళైన కొత్తలో
- తాత మోహనకృష్ణ