మంచి దెయ్యం - తాత మోహన కృష్ణ

Manchi deyyam

మాది ఒక మారుమూల పల్లెటూరు. నేనూ, అమ్మ, నాన్న ఒక పెంకుటింట్లో ఉంటాం.
నా పేరు శివ. ఊరిలో ఎప్పుడూ, నేనూ పిరికివాడినని ఏడిపిస్తూ ఉంటారు. మా అమ్మ మాత్రం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని చెబుతూ ఉంటుంది.

ఇలా ఉండగా, ఒక రోజు రాత్రి మా నాన్న కు తీవ్రంగా జ్వరం వచ్చింది. ఊరిలో ఉన్న డాక్టర్ వచ్చి చూసారు. ఏవో మందులు రాసారు. పక్క ఊరు వెళ్లి తేవాలి. అప్పుడు టైం రాత్రి 9 అయ్యింది. మా అమ్మ జాగ్రత్తగా వెళ్ళి రమ్మని పంపించింది.

బయట వెలుతురు అంతగా లేదు. చీకటి గానే ఉంది. కాలి నడకన బయల్దేరాను. పక్క ఊరు రెండు కిలోమీటర్ల దూరం. ఉదయం నుంచి ఆకాశంలో మబ్బు కూడా పట్టి ఉంది. చల్లటి గాలి వీస్తుంది.

కొంత దూరం వెళ్ళగానే, చినుకులు మొదలయ్యాయి. ఎక్కడైనా ఆగుదామంటే, ఎక్కడా ఇళ్లులు లేవు. దూరాన, ఒక పెంకుటిల్లు కనిపించింది. చాలా పాతది. అక్కడికి నడచుకుంటూ వెళ్ళాను. లోపలికి వెళ్ళి చూసాను. ఎవరూ లేరు. కొంచం భయంగా ఉన్నా, తప్పదు మరి.

లోపల వస్తువులు అన్ని చాలా పాతవి ఉన్నాయ్. చుస్తే ఇంట్లో ఎవరూ లేరనిపించింది. వాన ఎక్కువ అయింది. గోడమీద ఒక చోట ఎదో మెరుస్తునట్టు అనిపించింది. ఒక రంధ్రము ఉంది. అందులో ఒక సీసా మెరుస్తూ వుంది. ఏమిటో అర్ధం కాలేదు నాకు. దాని మూత తీసాను.

అందులోంచి ఒక తెల్లటి ఆకారం బయటకు వచ్చింది. భయంతో దెయ్యం అనుకోని బయటకు పరిగెత్తాను. అసలే నాకు దెయ్యం అంటే చాలా భయం.

"భయపడకు శివా " నేనూ ఏమి చేయను. లోపలికి రా!
గుండె రాయి చేసుకొని లోపలికి వెళ్ళాను. నా పేరు నీకు ఎలా తెలుసు?అని అడిగా!

నేనూ ఈ ఊరి వాడినే. కోరికలు తీరక చనిపోవడం వలన దెయ్యం అయి తిరుగుతూ ఉంటే, ఒక సాధువు నన్ను ఇక్కడ బంధించాడు. నేనూ చాలా మంచి వాడని. అందుకే మంచి దెయ్యాన్ని. నన్ను సీసా లోంచి విడుదల చేసావు. ధన్యవాదాలు.

కొన్ని రోజులలో ఈ ఆత్మ మాయమైపోతుంది. నా కోరికలు నెరవేర్చుకొని, నేనూ ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను.

నాకు చేసిన సహాయం కి ప్రతిఫలంగా నీకు రెండు కోరికలు తీరుస్తాను. నన్ను తలుచుకోగానే, నీ కోరికలు తీరుస్తాను. కానీ, నీకు కొంత వరకే సహాయం చేయగలను కానీ, పూర్తిగా పని చేసి పెట్టలేను. అది విని, బయటకు వచ్చేసాను.

దెయ్యం చెప్పిన కోరికలు పనిచేస్తాయా లేదా అని ప్రయత్నించాలని అనిపించింది. వర్షం మళ్ళీ ఎక్కువ అయింది. మనసులో దెయ్యాన్ని తలుచుకొని, " నేనూ వర్షం లో తడవకూడదని" కోరుకున్నాను.

ఆశ్చర్యం! నా మీద వాన పడట్లేదు. చక చకా.. నడుస్తూ గమ్యం చేరాను. మందులు తీస్కొని ఇంటికి చేరుకున్నాను. మనసులో దెయ్యానికి థాంక్స్ చెప్పుకున్నాను.

దెయ్యం ఇచ్చిన కోరికల్లో ఇంకా ఒకటి మాత్రమే ఉంది . జాగ్రత్తగా వాడాలి అని అనుకున్నాను.

ఊరిలో సైకిల్ పోటీలు పెట్టారు. మొదటి బహుమతి చాలా ఎక్కువగా పది వేలు. ఎలాగైనా గెలవాలి అనుకున్నాను. దెయ్యం సహాయం తీస్కోవాలనిపించింది.

పోటీ రోజూ, దెయ్యాన్ని తలచుకుని, కోరిక కోరాను. దెయ్యం రోడ్డు మీద సైకిల్ స్పీడ్ గా వెళ్లడానికి రోడ్డు నున్నగా శివ కోసం మాత్రమే తయారుచేసింది. ఈ ఉత్యాహం తో, శివ సైకిల్ ఫాస్ట్ గా తొక్కాడు. పోటీ లో గెలిచాడు. బహుమతి అందుకున్నాడు. ఇంటికొచ్చి తలిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు చాలా ఆనందించారు.

శివ దెయ్యం ఉన్న ఇంటికి మళ్లీ వెళ్ళాడు. అక్కడ మంచి దెయ్యం లేదు. మనసులో దెయ్యాన్ని తలచుకున్నాడు. దెయ్యం రాలేదు, కానీ దాని మాటలు వినిపించాయి.

"శివా, నువ్వు కోరుకున్న రెండు కోరికలు నేనూ తీర్చాను. నువ్వు చాలా మంచి వాడివి. నువ్వు ధైర్యం తో ముందుకు అడుగులు వేస్తే, నీకు ఈ దెయ్యం సహాయం అక్కరలేదు. ఆత్మవిశ్వాసం తో ముందుకు అడుగులు వేస్తే నువ్వు చాలా గొప్ప వాడివి అవుతావు.

ఆల్ ది బెస్ట్ శివా!

దెయ్యం ఇచ్చిన స్ఫూర్తి తో శివ ధైర్యవంతుడిగా, జీవితంలో ముందుకు సాగి, ఎన్నో విజయాలు సాధించగలిగాడు.

మరిన్ని కథలు

Marriages are made in heaven
మేరెజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్
- బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి
Adde talli
అద్దె తల్లి
- Madhunapantula chitti venkata subba Rao
Dongalu dorikaru
దొంగలు దొరికారు..!
- - బోగా పురుషోత్తం
Oddika
ఒద్దిక .
- Aduri.HYmavathi.
Maro konam
మరో కోణం
- గాయత్రి
Snanam
స్నానం
- మద్దూరి నరసింహమూర్తి
Swaadheenapatika
స్వాధీన పతిక
- వీరేశ్వర రావు మూల
Ekkadainaa baava
ఎక్కడైనా బావ..
- ఎం బిందు maadhavi