లాయర్ ఇన్ లవ్ - Moola Veereswara Rao

Lawyer in love

మధు ముత్తాత లాయరు.తాత లాయరు.తండ్రి లాయరు.కనుక మధు అలియాస్ మధుసూధన్ కీ వేరే కెరీర్ ఆప్షన్ లేక లాయర్ అవ్వ వలసి వచ్చింది.మధు కూడా డిఫెన్స్ లాయర్ దామోదరంకూతురు సాత్విక ను ప్రేమించాడు.ఇక కొద్ది రోజుల్లో పెళ్ళవుతుందన గా ఆ సంఘటన జరిగింది. ****** "అబ్బాయి గారూ,మీరు ఇలా దిగాలు పడి మందు కొడితే అమ్మాయి గారు దక్కదండీ " అన్నాడు మధు ఇంటి నౌకరు రంగాచారి.రంగాచారి కొన్నాళ్ళు తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉండి ,ఒక సినిమా "ఒరు వరుట్టమ్" కి నిర్మాత గా వ్యవహరించి,చేతులు కాలాక ఆంధ్రా వచ్చి , మధు కి ఉన్న లంకంత కొంప కి నౌకరు కమ్ మేనేజర్ గా వ్యవహరిస్తూ,అందరి తల లో నాలుక లా ఉన్నాడు. "నీకు తెలీదు రా ప్రేమించి ముంచింది రా ! ఆ పిల్ల చాప ఎక్కినప్పటి నుండి నా ప్రేమ మొదలయింది రా " అన్నాడు మధు "ఎందుకు కాదంది " ఉత్తి సోడా పోస్తూ.. "ఆడదానికి ఆడదే శతృవు అన్నారు కదా! కాని నా విషయం లో రివర్సయింది." "మగాడి కీ మగాడే శతృవా ? " అన్నాడు రంగాచారి హుషారు గా . కంగారు పడకు ఇక నా కధ పూర్తి గా చెప్పాలి రా అన్నాడు మధు కళ్ళు మూసుకుని. మధు వెనకాల చక్రాలు తిరగడం మొదలు పెట్టాయి. అంటే ఫ్లాష్ బ్యాక్ మొదలన్న మాట అనుకున్నాడు రంగాచారి మిగిలిన మందు తాగుతూ.. ****** మధు లాయర్ కోర్స్ పూర్తి చేసి ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లో ఒక విడాకుల కేస్ టేకప్ చేసాడు.అతను మధు క్లాస్ మేట్ సత్యం ,హైస్కూల్ చదివే టప్పుడు. "చెప్పరా ఎందుకు విడాకులు ? " "ఎందుకేమిటి, నాభార్యని చూస్తే పురాణ స్త్రీలు గుర్తుకు వస్తారు !" " సీత,సావిత్రి,మండోదరీ నా " " కాదు రా బాబు,పూతన,తాటకి,హిడింబి " "నిన్ను నీ భార్య బాధపెడుతోందా " సత్యం తన చేతి పై నల్లగా కాలిన మచ్చని చూపించాడు. "ఇది ?!" "నేను వంట చేస్తుంటే అట్ల కాడ తో వాత పెట్టింది" సత్యం తల ఒంచుకుని చెప్పాడు. "నీ భార్య లో శాడిజం శాతం ఎక్కువగా ఉందే " "మాటి మాటికీ 10.75 అంటుంది " "ఇప్పుడు లెక్కలు నేర్చుకుంటోందా " " కాదురా బాబు,వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నం పది లక్షల డెబ్బై ఐదు వేలు " "అంత భారీ స్ధాయి లో కట్నం తీసుకున్నందుకు తన మాట నెగ్గాలంటుంది " మధు లో ఆవేశం తన్నుకొచ్చింది. " ఇక చెప్పకు! నీకు విడాకలు వచ్చే దాక నేను విశ్రమించను " అని కుడి చెయ్యి పైకి లేపాడు.స్పీడు గా తిరుగుతున్న ఫ్యాన్ రెక్క తగిలింది మధు చేతీకి. రక్తం బొట్లు బొట్లు గా కారింది. " అందుకే అంటారు ఆవేశం కోర్టు లో చూపించమని " అన్నాడు రంగాచారి. "తంతాను. ఫ్లోకి అడ్డు రాకు " "ఆ తరువాత సత్యం కి విడాకులు మంజూరయ్యాయి. అప్పుడు తెలిసింది ఆ సత్యం భార్య ఎవరో కాదు నేను ప్రేమించిన సాత్విక క్లాస్ మేట్ అని అంతే కధ అలా మొదలయింది ! బాధ గా చెప్పాడు మధు. "ఆడ దానికి ఆడదే ఆప్తురాలు,అని తన స్నేహితురాలికి ద్రోహం చేసిన చేసిన లాయర్ మధు ,పచ్చని కాపురం చెట్టుని నల్లని విడాకుల గొడ్డలి తో కూల్చాడని, ప్రేమించ నిరాకరించి పెళ్ళికి ససేమిరా అంది." " వృత్తి ధర్మం అని నచ్చ చెప్పలేదా ? " అడిగాడు చారి. "చెప్పాను రా వింటే కదా ! వాళ్ళిద్దరిదీ గాఢ మైత్రి ట.ఒకే మంచం,ఒకే కంచం ట " "ఒకే బ్రాండు కూడానా ? " అన్నాడు రంగాచారి రాయల్ స్టాగ్ బాటిల్ కదుపుతూ. "అంత లోతుగా వివరాలు తెలుసు కో లేదు .నువ్వు బాటిల్ అక్కడ పెట్టు " " సార్ మూడు రౌండ్లయినా ఎలర్ట్ " అన్నాడు చారి "నువ్వు ఇప్పుడు నన్ను మెచ్ఛుకో నక్కర్లేదు.పని చూడు " "సార్,నాకు ఐదొందలు కావాలి. ఇస్తారా ? " "ఒ పని చెయ్యి.ఈ ఖాళి బాటిల్స్ గన్నీ బ్యాగు లో కూరి,మన వీధి చివర షాపు లో ఇస్తే నీకు కావలిసిన డబ్బులు వస్తాయి " "ఒరే మధు గా డబ్బులు ఇమ్మంటే ఇలా అంటావా ? నీ ప్రేమ విఫలమవు గాక " అని మన "సారా" శపించాడు రంగాచారి. ******* "మరో సారి ఆలోచించు " అన్నాడు మధు సాత్విక తో " నీకు,నాకు కుదరదు. నా ఫ్రెండ్ కి ద్రోహంచేసిన నిన్ను క్షమించను " "నీ గోల తగలయ్య ! అది ఆడదా .లంఖిణీ జాతికి చెందింది " " అదిగో నోరు జారుతున్నావు ! ఎంత మంచిది ,నా ఫ్రెండ్ నా బట్టలు ఉతికేది " అంది సాత్విక " బట్టలు ఉతికేది,బర్గర్ కి డబ్బులు ఇచ్చింది ఇది కాదు అసలు విషయం తెలుసు కో " అరిచాడు మదన్. " ఏమిటి తెలుసుకొనేది ,లాయర్ లు అంతా లయ్యర్లే" "అందుకే అన్నారు ఆడ వాళ్ళ కి ఆవేశం ఆనపకాయంత,ఆలోచన ఆవగింజంత " " నీ తొక్కలో తీర్మానాలు అక్కర్లేదు " " లాయర్ని ప్రేమించే కన్నా సాఫ్ట్ వేర్ కుర్రాడిని ప్రేమించినా సరిపోయేది " అంది సాత్విక. " ఈ రోజు ల్లో సాఫ్ట్ వేర్ వాడి కన్నా అండర్ వేర్ అమ్మేవాడు కోట్లు సంపాదిస్తున్నాడు." అన్నాడు మధు విసు గ్గా. " అవసరమయితే అండర్ వేర్ అమ్మే వాడిని చేసుకుంటా.నిన్ను చేసుకోను " అంది సాత్విక "ఎవరో కవి అన్నాడు న్యాయాన్ని ఏ కీలు కా కీలు విరిచే వాడు వకీలు అని " రోషం గా అంది సాత్విక. " ఈ సమస్యని కాలమే పరిష్కరించాలి " అనుకున్నాడు మధు ****** "1972 అలహాబాద్ తీర్పు లో జస్టీస్ సిన్హా ఏమన్నడబ్బా" అని గడ్డం కింద చెయ్యి పెట్టి అన్నాడు మధు తండ్రి రంగారావు. " నా శ్రార్ధం అన్నాడు" అన్నాడు మధు విసుగ్గా నల్ల కోటు సోఫా లో పడేస్తూ. "ఏంట్రా. మూడ్ బాగు లేదా " అడిగాడు రంగారావు. " ఇక ప్రపంచంలో ఏవి వృత్తులు లేనట్టు అందరూ లాయర్లే .తాత,తండ్రి,నేను " "తప్పేముంది రా .దాని లోనే డబ్బులు వచ్చాయి.అందుకే మన కుటుంబం నల్ల కోటుని నమ్ముకుంది.నాలుగు రోజుల క్రితం నువ్వు కొట్టించిన పల్లిపాలెం కేసు తోనే కదా నీ మొత్తం చదువు పూర్తయ్యింది. " అన్నాడు రంగారావు. "ఆ లాయర్ వృత్తే నా కొంప ముంచింది " "ఏం జరిగింది ? " జరిగింది చెప్పాడు మధు. రంగారావు నవ్వి " ఒకర్ని ప్రేమించి మరొకర్ని పెళ్ళి చేసుకుంటే పత్ని వ్రతుడి ధర్మాని కి భంగం కలగదు అన్నాడు యమగోల రావు గోపాల రావు లా ! మధు రూమ్ లో కి వెళ్ళాక రంగారావు " చారి సెక్షన్ 173 గురించి నేను రాసుకున్న నోట్స్ ను చదవాలి . పైన ఎడమ వైపు ఉన్న రాక్ లో నాలుగో ప్లేట్ లో అటునుంచి మూడో పుస్తకం తీసుకు రా " అని ఆజ్నాపించాడు. "ఒక్క సారి ఆ చరిత్ర పుటలు తిరగవేస్తే " అన్నాడు రంగారావు తన్మయత్వం తో "చెదలు రాల్తాయి " రంగాచారి విసుగ్గా " అంత ఎత్తున ఉన్న పుస్తకం ఎందుకు ? ఏదో వంక పెట్టితప్పు కోవాలి " అని మనస్సు లో అనుకుని "అయ్య గారు మొక్కలికి నీళ్ళు పొయ్యాలి " అన్నాడు రంగాచారి. "మబ్బు పట్టింది.వర్షం వస్తుంది .ముందు పుస్తకం సంగతి చూడు " "మబ్బులు " అని రంగాచారి పాత 173 పుస్తకాన్ని తీస్తుండ గా అందులో బలిసిన తేలు రంగాచారి ని కుట్టింది. "బాబోయ్ " అని కింద పడ్డాడు. "తిక్క కుదిరింది " అన్నాడు మధు. "ఒరు వరుట్టమ్ "(ఒక విషాదం) అని నాలుగు రోజులు బాధ పడ్డాడు రంంగాచారి. ****** " ఒరే చారి నీ భార్య ఎప్పుడూ రాదేమిటి చెన్నయ్ నుండి " అడిగాడు మధు " అది అక్కడ తంగ వేలుని తగులుకుంది ,నా దగ్గరికి రాదు " అని బాధ గా చెప్పాడు చారి " పోని విడాకులు ఇప్పించ మంటావా ? " " అదే సారు దానికి భరణం ఇస్తే నాకు మరణమే " " ప్రాస గురించి ప్రయాస తర్వాత ,చెప్పు అసలు విషయం " మధు అడిగాడు. " నెల కి పది లక్షలు భరణం ఇమ్మంటోంది " మధు కి ఒక్క సారి మత్తు దిగింది. "సర్లే ఏదో ఒకటి చేసి నీకు నష్టం లేకుండా డీల్ చేస్తాను గా ." అలా రంగా చారికి విడాకులు ఇప్పించి విడాకుల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు మధు ******** మధు బైక్ మీద కోర్టు కి వెడ్తుండగా సాత్విక వేరే అతని బైక్ మీద కనిపించింది. వాడు నల్ల గా ఉన్నాడు.కాకి ముక్కు కి దొండపండు అనుకున్నాడు మధు.సాత్విక మధు ని చూడ లేదు. "కొంప తీసి సాఫ్ట్ వేర్ కాదు కదా " అనుకుని ఆ రోజు త్వర గానే కోర్ట్ నుండి తిరిగి వచ్చాడు. "చారి ,వేడి వేడి కాఫీ తీసుకు రా " " అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్ని మంచికని అనుకోవడమే మనిషి పని " అని పాడుకుంటూ కాఫీ తీసుకొచ్చాడు రంగాచారి. " నీ టైమింగే టైమింగ్ రా చారి " అని కాఫి గడగడా తాగేసాడు. ఆశ్చర్యంగా చూసాడు రంగాచారి. ********** "అయ్య గారు మధు గారికీ రొంబ కష్టం " అన్నాడు చారి. "కష్టమే, రంభ స్వర్గం లో ఉంటుంది కదా ,దొరకదు "అన్నాడు రంగారావు. చారి కి రంగారావు గారి తమిళ భాషా జ్నానం గురించి ఆవగాహన వచ్చి తెలుగు లో చెప్పాడు. " వాడి పెళ్ళి సాత్విక తో కాక పోతే రిత్విక తో చేయిస్తా.లోకం లో ఆడ పిల్లలే లేరా " ఆవేశం తో ఉగిపోయాడు రంగారావు. ********* ఆరోజు ఆదివారం. ఒకమ్మాయి మధుని వెతుక్కుంటూ వచ్చింది. తన భర్త తో విడాకులు కావాలంది . "పెళ్ళంటే నూరేళ్ళ పంట.ఎందుకు ఆ పంటను పాడు చేసుకోవాలనుకుంటున్నారు ? " "పంట ఏమిటి ? మంట పెరిగి పోతుంటే " "మీ వారిని పిలవండి.కౌన్సిలింగ్ ఇస్తాను " " మీరు లాయరా లేక సైకాలజిస్టా ? " మధు వెంటనే సర్ధుకుని "వివరాలు ఇవ్వండి" అన్నాడు. "చేతన్ నా భర్త.నాకు విడాకులు ఇవ్వకుండా వేరే పెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు." "మీ భర్త వివరాలు ఇవ్వండి " అడిగాడు. "ఇవిగో వివరాలు మరియు ఫోటో " ఫోటోని చూసి ఉలిక్కి పడ్డాడు మధు. ఎక్కడ చూసాను అనుకొని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. "యస్ ! సాత్విక తో బైక్ పై కనిపించాడు ఈ తింగరి వెధవ.పెద్ధ గ్రంధ సాంగుడన్న మాట " అని మనసు లో అనుకుని "యాహూ" అని గట్టి గా అరిచి ,థాంక్యూ అంటూ ఆ అమ్మాయిని కౌగలించుకున్నాడు. " ఆడ క్లయింట్లను ఇలా కౌగలించుకుంటారా ? " " సారీ అది కాదు విషయం .నాకో సాయం చెయ్యండి.నేను చెప్పిన నెంబర్ కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనమని చెప్పండి " అర్ధించాడు మధు. "మీరే ఫోన్ చెయ్యచ్చుగా " " సాత్విక నేను చేస్తే రాదుగా " అని అసలు కధ మొదటి నుండి చెప్పాడు. సాత్విక తో ఆ అమ్మాయి మాట్లాడింది.మధు వలన ఎంత ప్రమాదం తప్పిందో సాత్విక గ్రహించింది. ******* మరుసటి నెల కళ్యాణ మండపం లో రంగు రంగు దీపాల లో "సాత్విక వెడ్స్ మధు " అక్షరాలు మెరుస్తున్నాయి. మధు ని కలవడానికి ఒక ఆవిడ వచ్చింది విడాకులు కావాలని కళ్యాణ మండపానికి. "ఆగమ్మా, ఇప్పుడు నువ్వు వెడితే పెళ్ళవ కుండా వాడు విడాకులు తీసుకోవాలి. " అన్నాడు రంగారావు. సాత్విక ,మధు ల వివాహం వైభవం గా జరిగింది END పై కధ నా స్వంతం. వెబ్ లో ప్రచురణ కాలేదు. భవదీయుడు వీరేశ్వర రావు మూల Ph:9494746228

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం