సమ్మోహనాస్త్రం - బొబ్బు హేమావతి

Sammohanastram

వినోద్ ఒక నటుడు. అతనికి ప్రేమ అంటే తెలియదు. అతనికి తెలిసింది కోరికలు తీర్చుకోవడం మాత్రమే. అమ్మాయిలతో ప్రేమ నాటకం ఆడుతాడు. అమాయకంగా అమ్మాయిలు ఆ నాటకాన్ని నిజమని నమ్ముతారు. అతను ప్యూహం పన్నితే ఇక గెలుపే. ఎంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేసి మోసం చేసిన అమ్మాయి తన పరువు పోతుంది అని పోలీస్ కేసు పెట్టదు అని ధీమా. రాగిణి కాలేజీలో చేరగానే ర్యాగింగ్ మొదలైంది. లేడీస్ హాస్టల్ నుండి రాగిణి మెస్సుకు వెళ్లేటప్పుడు, సీనియర్ మధురిమ తనతో మాట్లాడాలని హాస్టల్ కి ఎదురుగా ఉన్న పార్క్ లో కూర్చోబెట్టింది. ఇంతలో అక్కడికి వినోద్ వచ్చి రాగిణి పక్కనే కూర్చున్నాడు నవ్వుతూ. అతనిది సమ్మోహమైన నవ్వు. రాగిణి వినోద్ ని చూడగానే అక్కడి నుంచి లేచి వెళ్లబోయింది. వినోద్ వెంటనే ఆమె చేయి పట్టుకుని ఆమె వెళ్లకుండా ఆపాడు. అతను తన సీనియర్, ఇంకొక పక్క ర్యాగింగ్ జరుగుతూ ఉంది. కాదంటే ఏమౌతుందో అని అనుకుంటూ.... అతను చేయి పట్టుకోగానే సిగ్గుపడి రాగిణి చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. వినోద్ ఆమె చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాడు.వినోద్ ఎంతో అందగాడు, స్పుర ధ్రుపి. "నేను నీకోసం వస్తే నువ్వు వెళ్ళిపోతే ఎలా" చుట్టూ ఎవరైనా చూస్తున్నారేమో అని రాగిణి అటు ఇటు చూసింది. పక్కన ఎవరు ఎవరిని చూడట్లేదు. అబ్బాయిలు అమ్మాయిలు ఒకరు పక్కన ఒకరు కూర్చుని చాలా దగ్గరగా ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆమె వైపు సూటిగా చూస్తూ...రాగిణి చెయ్యి గట్టిగా పట్టుకుని వినోద్... "కూర్చో" అని ఆజ్ఞాపిస్తూ కూర్చోబెట్టాడు. రాగిణి భయం భయంగా ఒక పక్కకు ఒదిగి కూర్చుంది. ఆమె భయాన్ని చూసి నవ్వుకుంటూ వినోద్ ఆమె చేయిని వదలకుండా పట్టుకున్నాడు. ఆమె ఆలోచనలను ప్రతిబింబిస్తూ... ఆమె కళ్ళలోకి చూస్తూ.... "నువ్వంటే నాకిష్టం" "నువ్వు చాలా బాగుంటావ్ " "సినిమాల్లో సౌందర్య లా " "నీ పెదవి కింద ఉన్న పుట్టుమచ్చ....."అంటూ చటుక్కున ఆమె పెదవి కింద పుట్టుమచ్చని తాకాడు. ఆమె ఒక్కసారిగా వెనక్కి జరిగింది. అతను నవ్వుకుంటూ... ఆమె వైపు చూసి... "తినాలని అనిపిస్తుంది" అంటూ దూరంగా ఉన్న ఐస్ క్రీం ట్రక్ వైపు చూస్తూ.... ఐస్ క్రీం తింటావా అని అడిగాడు. అతను ఆమె పెదవులను చూస్తూ ఐస్ క్రీం వెహికల్ వైపు చూసి ఏమి తినాలని అంటున్నాడో అర్థమై రాగిణి సిగ్గుపడి భయపడుతూ వెనక్కి జరిగింది. అలా అతను ఆమెను అరౌస్ చేసాడు. అతను ఆమెను ఎన్నుకున్నాడు... ఎందుకంటే ఆమెకు ఏంపతీ ఎక్కువ. అతను మనస్సులో అనుకున్న మాటలు అతని చూపులు ఆమెకు అర్థమయ్యాయి. ఆమె చేయి పట్టుకుని వదలకుండా తన చేతిని ఆమె చేయి పైన వేసి మెత్తగా నలుపుతూ తన తల్లిదండ్రుల గురించి అడిగాడు. తలవంచుకుని సిగ్గుపడుతూ చెప్పింది.. "ఇద్దరు దుబాయ్ లో ఉంటారు" రాగిణి అతను తనను ప్రేమిస్తున్నాడు అనుకునింది.... క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి. లెసన్స్ అర్థం అవుతున్నాయా .... అర్థం కాకపోతే నన్ను అడుగు.... అంటూ ఆమె తనని చూస్తున్నదని గ్రహించి ఆమె చెస్ట్ వైపు చూసాడు. ఆ చూపులకి ఆమె వెంటనే తన చున్నీని సర్దుకుంటూ తన చెస్ట్ వైపు చూసుకుంది. అలా ఆమెను నెమ్మదిగా అరౌస్ చేస్తూ ఆమెలో మోహం రేకెత్తించాడు. ఆమెలో తన రూపం ముద్రించి... చీకటి పడింది రాగిణి అంటూ వదిలి వెళ్లలేక వెళ్తున్నట్లు రేపు కలుద్దాం అని బాయ్ చెప్పాడు. అతను తనను కోరుకుంటున్నాడు అని గ్రహించి అతని అందానికి దాసోహం అయ్యి ఆమెకు కూడా మోహము మొలకెత్తింది. వినోద్ కనిపిస్తాడేమోనని మరుసటి రోజు రాగిణి ఎంతో ఎదురు చూసింది. ఆమెకు అతను కనిపించలేదు... ఆమె మనసంతా అతని మీదే. అతని వెతుక్కుంటూ సీనియర్స్ క్లాస్ కి వెళ్ళింది. అక్కడ కూడా కనిపించలేదు. దిగులు పడింది. అతను కనిపించలేదని విరహంతో రూమ్ కి వచ్చి పడుకుంది. నెక్స్ట్ డే కూడా అతని కోసం వెతికింది. కనిపించలేదు... ఎవరినైనా అడగాలి అంటే సిగ్గుపడింది. ఎవ్వరితో కలవకుండా రూమ్ లో ఒంటరిగా కూర్చుంది. అప్పుడు సీనియర్ మధురిమ వచ్చి, నిన్ను మన సీనియర్ వినోద్ కలవాలంటున్నాడు, హాస్టల్ బయట ఎదురు చూస్తున్నాడు అని చెప్పగానే, ఒక్క గెంతులో లేసి, చక్కగా తయారై గబగబా వెళ్ళింది. ఆమెను చూడగానే వినోద్ దగ్గరగా వచ్చి, పలకరిస్తూ... "నన్ను మర్చిపోయావా" అనగానే... అతని కండ్లల్లో కండ్లు పెట్టి "లేదు" అన్నది. అతను స్పోర్ట్స్ బైక్ స్టార్ట్ చేసి ఎక్కు అనగానే ఎక్కింది. అతను ఫాస్ట్ గా వెళుతూ ఉంటే గాలికి మెలికలు తిరుగుతున్న తన వెంట్రుకలను లాగి వెనక్కి కట్టి సిగ్గుపడుతూ కూర్చొని ఉంటే.... ఒక్కసారిగా బండి జెర్క్ ఇవ్వడంతో అతన్ని గట్టిగా వాటేసుకుంది. ఆమె లో ఏదో దాహం ఆమెకు తెలియకుండా.... ఆమెకు తెలియని విషయం ఏమిటి అంటే అతను ఆమెను సెడ్యూస్ చేసాడు. అతను నవ్వుతూ.... ఆమెను క్రీగంట చూసి.... "ఈ రోజు మరింత అందంగా ఉన్నావు నువ్వు...." "నిన్ను ఎక్కడికైనా ఎత్తుకుపోవాలని ఉంది "... ఆ మాటకు సిగ్గు పడింది రాగిణి. ఇద్దరూ లాంగ్ డ్రైవ్ చేసి హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఒక ఫార్మ్ హౌస్ లోకి ప్రవేశించారు. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అతను రేకెత్తించిన మొహంతో ఒంటరిగా దొరికిన ఛాన్స్ తో ఎవరూ లేని ఏకాంతంలో ఆమె తనకు తానుగా అతడిని కౌగిలించుకుని అతనిని తన వాడిని చేసుకుంది. దానిని ప్రేమ అనుకునింది. ఇద్దరూ తిరిగి ఆ రోజు రాత్రి హాస్టల్ కి వచ్చేసారు. సప్తపదితో ఒక్కటై పదిమంది బంధువుల సాక్షిగా ప్రేమ చిగురించాల్సింది ఒంటరిగా చిగురించింది. మరుసటి రోజు అతనిని కలవాలని వెళ్ళింది. అతను ఆమెను చూసాడు. పలకరించలేదు. తల వంచుకుని ఎప్పుడు ఆమెతో అతనికి ఎటువంటి స్నేహం లేనట్లు స్నేహితులతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. సీనియర్ మధురిమ ని కలిసి వినోద్ గురించి అడిగింది. ఆమె రాగిణి వైపు చూసి..." నాకు అతని గురించి ఏమీ తెలియదు అన్నది ". క్లాస్ దగ్గరికి వెళ్లి అందరి ముందు అతడిని అడగలేక అతని స్నేహితుడు మురళి ని కలిసింది. మురళి ఆమె వైపు చూసి చెప్పాడు..."అతనికి పెళ్లి కుదిరింది... వాళ్ళ ఊరి పంచాయితీ ప్రెసిడెంట్ కూతురి తో... వాళ్ళు అతనికి చదువు చెప్పించారు. ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన వెంటనే పెళ్లి". "మోసపోయాను" అని అప్పుడు రాగిణి గ్రహించింది. తను ఎంత తప్పు చేసిందో గ్రహించింది. అమ్మాయిలు... తస్మాత్ జాగ్రత్త... "ప్రేమ" "మోహం" రెండూ వేరు వేరు. మనిషి మోహన్ని జయించడం చాలా అవసరం. కోరికలను సన్మార్గంలో తీర్చుకోవాలి. అంతేకాని ఆకర్షణ తో మోహం పుట్టి రుజు మార్గం లో ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం చేతకాక దుర్మార్గపు దారి లో తీర్చుకోవాలని చూస్తే మోసపోతారు. రాగిణి ఎవరికి చెప్పుకోవాలో తెలియక స్టూడెంట్ అడ్వైసర్ ప్రొఫెసర్ శ్రీజను వెళ్లి కలిసింది. రాగిణి చెప్పిందంతా విన్న తర్వాత.... ఎంత పని చేసావమ్మా. నువ్వు నాకు రిపోర్ట్ రాసి మా. ఏం చేయాలి అనేది నేను స్టూడెంట్ కౌన్సిల్లో పెట్టి ఆలోచిస్తాము. అతని మీద ఇంతకుముందు కూడా రిపోర్ట్ వచ్చాయి. ప్రూఫ్ లేదు.... అనగానే రాగిణి వెంటనే మొత్తం జరిగిందంతా వీడియో రికార్డ్ చేసి ఇచ్చింది. తర్వాత రిటర్న్ గా రాసి ఇచ్చింది. నీ పేరు బయటకు రాకుండా ఏం చేయాలి అనేది నేను ఆలోచిస్తాను. నువ్వు వెంటనే వెళ్లి డాక్టర్ని కలువు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీ జాగ్రత్తలు నీవు తీసుకో. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావా? రాగిణి వెంటనే " నో మేడం....అతను మోసగాడు. అలా ప్రేమ లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. మేడం నా దృష్టిలో అటువంటి పెళ్లిళ్లు నిలబడవు" అన్నది. గుడ్ డెసిషన్... ఐ విల్ కలెక్ట్ ది ప్రూఫ్స్. నీ పని నువ్వు చెయ్యి నా పని నేను చేస్తాను అని శ్రీజ అన్నది. అక్కడినుంచి వచ్చేశాక, వినోద్ ఎదురుపడి వంకరగా నవ్వుతూ " నువ్వు ఆరోజు నన్ను పట్టుకున్నావు.. అంతకుముందు ఎంతమందిని పట్టుకున్నావో" అన్నాడు. రాగిణి వాడి వైపు చూసి వెంటనే చెప్పు చేతికి తీసుకుని.... పోరా వెధవ అనింది. వెంటనే తలవంచుకుని వెళ్ళిపోయాడు. అతను కుయుక్తి తో తనను తప్పుదారి పట్టించాడని అర్థమైంది. మొదట్లోనే ఆ మాటనుంటే ఇంత దూరం వచ్చేది కాదు.. అని ఆమెకు అర్థమైంది. వారం తర్వాత, స్టూడెంట్ కౌన్సిల్ నుండి పిలుపు వచ్చింది. ప్రొఫెసర్ నారాయణ ఆధ్వర్యంలో వినోద్ మీద కేసు ఫైల్ చేశారు. అతను డార్క్ ట్రయడ్ లో ఒకటి అయిన మాకియవెల్లియనిజం అనే మానసిక వ్యక్తిత్వాన్ని కలిగివున్నాడని కమిటీ సభ్యుడైన సైకోలోజిస్ట్ మనోహర్ చెప్పాడు. అమ్మాయిలను ప్లాన్ గా ట్రాప్ చెయ్యడం, వినోదించడం, నైతికత లేకపోవడం, మోసం చేయడం ఒక ఆట గా తీసుకున్నాడని నిరూపణ చేసి అతనిని డిబార్ చేశారు కాలేజ్ నుండి. ఇక అతనిని ఎక్కడ కూడా ఏ కాలేజీలో తీసుకోకూడదని అతని మీద కేసు పెట్టి నోటీస్ బోర్డు లో పెట్టారు.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి