ప్రతీకారం - తాత మోహనకృష్ణ

Prateekaram


"మ్యాట్రిమోని లో నా ప్రొఫైల్ చూసి నన్ను ఇష్టపడ్డానని చెబుతున్నావు..నీకు నా మీద ఉన్న ప్రేమ ఓకే. నువ్వు చూడడానికి అందంగా ఉన్నావు, నాకు పెళ్ళి కాకపోతే, నిన్నే పెళ్ళి చేసుకునేవాడిని. కానీ, ప్రాబ్లెమ్ ఏమిటంటే, నాకు ఈ మధ్యే పెళ్ళైంది. మ్యాట్రిమోని లో స్టేటస్ ఇంకా అప్డేట్ చెయ్యలేదు..అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు.." అన్నాడు మహేష్

"మీ ప్రొఫైల్ చూసి, మీ కోసం, నేను చాలా మారాను. మీకు ఇష్టమని కూడా చెప్పారు కదా..!" అంది వందన

"మ్యాట్రిమోని లో నీతో చాట్ చేసిన మాట నిజమే, అప్పుడు నువ్వు నచ్చావు. కానీ..ఆ తర్వాత మా నాన్న ఆరు నెలల వరకూ ముహూర్తాలు లేవని అనడం తో..వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేసేసారు.."

"మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా మహేష్! ..నాది ప్యూర్ లవ్. నాతో మీరు అప్పట్లో మాట్లాడినదానికి నేను మీ భార్యగా ఉహించుకున్నాను. ఇంకొకరిని ఇప్పుడు పెళ్ళి చేసుకోలేను.."

"అయితే నన్ను ఏం చెయ్యమంటావు..?" అడిగాడు మహేష్

"నన్ను రెండో పెళ్లి చేసుకో.., 'రెండో పెళ్ళాం' సీరియల్ లో లాగ. లేకపోతే, మీ వైఫ్ ని నైస్ గా మర్డర్ చెయ్యండి - 'మర్డర్' సీరియల్ లో లాగ". కావాలంటే..మీ వైఫ్ మర్డర్ కి నేను హెల్ప్ చేస్తాను.. సీరియల్స్ చూసిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఉంది. బాగా ఆలోచించుకుని రేపు చెప్పు. రేపు సాయంత్రం బీచ్ లో కలుద్దాం.."

'తెలుగు సీరియల్స్ బాగా చూస్తుందనుకుంటాను..అందుకే మాటలు తూటాల్లాగా ఉన్నాయి..' అని అనుకున్నాడు మహేష్. ఎందుకో మహేష్ కు ఆశ పుట్టింది...వందన - నిజంగానే తన భార్య కన్నా చాలా అందంగా ఉంది. తన ఇష్టానికి యాభై శాతం మాత్రమే మ్యాచ్ అవుతుంది తన భార్య చందన. వందన అతని మనసుని ఆకర్షించడం మొదలైంది. అప్పట్లో చాట్ చేస్తున్నప్పుడు..వందన కి బోలెడంత ఆస్థి ఉందని చెప్పింది. మహేష్ కి ఇంకా ఆశ పుట్టింది. డబ్బంటే ఎవరికీ ఆశ ఉండదు మరి..? ఇంకేమీ ఆలోచించకుండా..సాయంత్రం బీచ్ కు వెళ్ళాడు మహేష్.

"ఏం డిసైడ్ చేసుకున్నావు.." అని అడిగింది వందన
"ఎస్! చంపేద్దాం. నాకు నువ్వే కావాలి.." అన్నాడు మహేష్
"గ్రేట్ మహేష్. ఐ యాం వెరీ లక్కీ..."

"అయితే, మీ ఆవిడకి రాత్రి పాలల్లో విషం ఇవ్వు. అప్పుడు.. నిద్రలోనే ప్రాణం పోతుంది. ఎవరికీ అనుమానం రాదు.." అంది వందన

వందన చెప్పినట్టే చేసాడు మహేష్. మర్నాడు ఉదయం, చందన ఇక లేవలేదు. మహేష్ వాళ్ళ అత్తా మామ లకు, అమ్మ నాన్న లకు కాల్ చేసాడు. అందరూ వచ్చి మహేష్ ను ఓదార్చారు. చందన దురదృష్టవంతురాలు అనుకుని అందరూ బాధపడ్డారు.

ఈ లోపు ఒక ఉత్తరం వచ్చింది, చందన వాళ్ళ నాన్నగార్కి. అందులో, "మీ అమ్మాయిది హత్య.. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి" అని ఉంది. వెంటనే పోలీసులు వచ్చారు. ఎంక్వయిరీ చేస్తే, విషం కలిపి చందనని హత్య చేసినట్టు రుజువైంది. పోలీసులు మహేష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

వందన జైలు కు వచ్చి, మహేష్ ను కలిసింది...

"నన్ను జైలు నుంచి విడిపించు వందన.. మనం పెళ్ళి చేసుకుందాం" అడిగాడు మహేష్
"నిన్ను చూసి పోవడానికే వచ్చాను..అంతే! విడిపించడానికి కాదు.. "
"నన్ను ఇష్టపడ్డావు కదా..?" అడిగాడు మహేష్

"నిజమే..! కానీ.." అని తన కథ చెప్పడం మొదలుపెట్టింది వందన

చందన, నేను మంచి ఫ్రెండ్స్. అలా ఉంటుండగా, ఒక రోజు మా అన్నయ్య, సిటీ నుంచి మా ఊరు వచ్చాడు. అప్పుడే చందనను చూసాడు. మొదటి చూపులోనే ప్రేమించాడు. తన ప్రేమ విషయం చందన కు చాలా సార్లు చెప్పాడు, కానీ తను ఒప్పుకోలేదు. అదే విషయం, నేను చందన ను అడిగాను.

"వందనా..! మీ అన్నయ్య, నాకు నచ్చలేదు.." అని సూటిగా చెప్పింది చందన
"మా అన్నయ్యకు ఏమిటి తక్కువ? చదువు, మంచితనం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి.."

దానికి సమాధానం చెప్పకుండా...వెళ్లిపోయింది చందన. ఆ తర్వాత వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందని నాకు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడే నేను ప్రతిజ్ఞ చేశాను. ఏదో ఒక రోజు చందన జీవితం, మా అన్నయ్య జీవితం లాగే సగం లో ముగిసిపోవాలని!

నిన్ను నిజంగానే ప్రేమించాను మహేష్. కానీ, ఆ తర్వాత తెలిసింది నువ్వు చందనని పెళ్ళి చేసుకున్నావని. నాకు నీ మీద ప్రేమ కన్నా, చందన పైన పగే ముఖ్యమని డిసైడ్ చేసుకున్నాను. అందుకే, నా ప్రేమను త్యాగం చేసేసాను. నేను పగ తీర్చుకోవడానికి నాకు చాలా సులభం అయింది. నీకు దగ్గర అయి..నీ చేత, నీ భార్యను హత్య చేయించాను. సాక్ష్యాలన్నీ, పోలీసులకు దొరికేటట్టు చేశాను. నా పగ చల్లారింది.

"చందన ను పెళ్ళి చేసుకున్న పాపానికి, నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సిందే..!" అని చెప్పి వెళ్లిపోయింది వందన

*****

మరిన్ని కథలు

Nishani
నిశాని
- DR Bokka Srinivasa Rao
Vachhindi ashadha masam
వచ్చింది ఆషాఢమాసం
- తాత మోహనకృష్ణ
Kathalo daagina katha
కథలో దాగిన కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neeve naa mantri
నీవే నామంత్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poola danda
పూలదండ
- ప్రమీల రవి
STREE
స్త్రీ
- chitti venkata subba Rao
Goddalupettu
గొడ్డలిపెట్టు (జాతీయం కథ)
- కాశీవిశ్వనాధం పట్రాయుడు