కురుక్షేత్ర సంగ్రామం. 16 - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kurukshetra sangramam.16

కురుక్షేత్ర సంగ్రామం.(16) .

కురుక్షేత్రంలో శంఖారావాలు.

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ధరించడం వలన శంఖం అత్యంత పవిత్రమైనదనీ .. ఎంతో శక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శంఖాలలో దక్షిణావృత శంఖాలు మరింత విశేషమైనవిగా చెబుతారు. ఇక 'శంఖం' సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమనీ .. అందుకే శ్రీమన్నారాయణుడికి అది అంత ప్రీతికరమైనది కూడా అంటారు. శంఖం అంత పవిత్రమైనది కనుకనే .. శంఖ జలమే తీర్థమనేది మహర్షుల మాట.
శంఖు తీర్థంతోనే భగవంతుడికి అభిషేకాలు చేస్తుంటారు. పూజా మందిరాల్లో దక్షిణావృత శంఖం ఉంచుతుంటారు .. మరి కొంతమంది పూజా సమయంలో శంఖం ఊదుతుంటారు. ఎక్కడికైనా బయల్దేరుతున్నవారు .. శంఖ ధ్వనిని శుభ సూచకంగా భావిస్తుంటారు.

శివుడు, మహావిష్ణువు, శ్రీకృష్ణుడు మొదలైన దేవుళ్ళ చేతిలో శంఖం వుంటుంది. యుద్ధ భేరి మ్రోగించడానికి,

శంఖం ప్రాశస్త్యం.

శంఖే చంద్ర మావాహయామి

కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి

ధారాయాం సర్వతీర్థ మావాహయామి

శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్టాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మందిరాలలోను, శుభకార్యాలలోనూ దీని ధ్వని పవిత్రతను, శోభను పెంచుతుందని హిందువుల నమ్మకం. దీని పుట్టుక సముద్ర మథనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మథనంలో వచ్చిన పదునాలుగు రత్నాలలో శంఖం ఒకటి. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ. శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు ఉన్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజల వల్ల అభివృద్ధికలుగుతుందని విశ్వసిస్తారు. దీనికి అనేక రకాల పూజా విధానాలు ఉన్నాయి. పూర్వం కొన్నింటిని గృహకృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు. శంఖాలలో చాలా రకాలు ఉన్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు ఉంటాయి. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది.

శంఖం ఎలా పుట్టిందనడానికి బ్రహ్మవైవర్త పురాణంలోని ఒక కథ చెప్తారు. పూర్వ కాలంలో శంఖచూడుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ఇచ్చిన వరంతో కృష్ణకవచాన్ని పొందాడు. దానితో ఆ రాక్షసుడు విర్రవీగుతూ స్వర్గంపై దండెత్తి వచ్చాడు. దాంతో స్వర్గాధిపతి ఇంద్రుడు శివుడిని శరణు కోరాడు. శంఖచూడుని పీడ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించాడు. దానితో విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని అభిమానాన్ని చూరగొని కృష్ణకవచ ఉపదేశం పొందాడు. అనంతరం శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు.శంఖచూడుని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసీ తన పాతివ్రత్యమహిమతో శంఖంగా మార్చిందని కథనము.

శంఖాల రకాలు.

శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని 3 రకాలుగ వర్గీకరిస్తారు:

1. దక్షిణావృత శంఖం, 2. మధ్యావృత శంఖం, 3. ఉత్తరావృతవ శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు.

శంఖాల పేర్లు.

శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం,

మహాభారతంలోని వివిధ యోధుల శంఖాల పేర్లు ఇలా ఉన్నాయి:

శ్రీకృష్ణుడు - పాంచజన్యం

అర్జునుడు - దేవదత్తం,

భీముడు - పౌంఢ్రకం

ధర్మరాజు - అనంత విజయ

నకులుడు - సుఘోష

సహదేవుడు - మణిపుష్పక.

శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజలో ఆరతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు, దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణేశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో

పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలు పోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి. లక్ష్మి స్వయంగా శంఖం నా సహోదరి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవి యొక్క పాదాల వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్థాపించాలి. గణేశ శంఖాలలో నీరు నింపి, గర్భవతులకు త్రాగించినట్లయితే అంగవైకల్యంతో కూడిన సంతానం కలగదని కొందరు నమ్ముతారు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖాల మాలలను ధరిస్తారు కూడా. శాస్త్రవేత్తల అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు.

. శంఖ భస్మము వల్ల అనేక రోగాలు నయమౌతున్నాయి.

ఋష్యశృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని, శంఖము పాపనాశని అని కొందరి విశ్వాసం.

దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షిణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం. ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది, పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి.

సముద్ర తనయాయ విద్మహే

శంఖరాజాయ ధీమహీ

తన్నో శంఖ ప్రచోదయాత్‌

యుధ్ధ ప్రారంభంలో...అశ్వత్ధామ సూచన మేరకు దుర్యోధనుడు తన సర్వసైన్యాధ్యక్షునిగా కర్ణుని నియమించాడు.కౌరవసేనలు మకరవ్యూహంతో సిధ్ధమయ్యాయి. పాండవ సేనలు అర్ధచంద్ర వ్యూహం నిర్మించారు.,క్షేమధూర్తుడు భీమునితో తన ఏనుగు పైవచ్చి తలపడ్డాడు. కోపగించిన భీముడు తన గధతో క్షేమధూర్తుని ,అతని ఏనుగును నేలకూల్చిసింహా నాధం చేసాడు. అప్పుడు అశ్వత్ధామ భీమునితో తలపడ్డాడు.నకులుడు కర్ణునితో, కృపాచార్యుడు, శిఖండితో, కృతవర్మతో శృతకీర్తి,శల్యునితో సహదేవుడు పోరాడసాగారు.సాత్యకిపై అనువిందుడు శరాలు విడువసాగాడు, ఓ దివ్యాస్త్రంతో అనువిందుని తల నేల దొర్లించాడు సాత్యకి. అది చూసిన విందుడు ఆవేశంగా సాత్యకి పైకి కత్తితో వచ్చాడు. తనఖడ్గానికి విందుని బలిచేసాడు సాత్యకి.

అశ్వత్ఢామ భీముడు యుధ్ధంచేస్తూ మూర్చాగతులయ్యారు.

శల్యుడు అర్జునుని కుమారుడు శ్రుతకీర్తిని మూర్చలోముంచి, పాండవ సేనలను తురమసాగాడు.సహదేవునితో దుశ్శాసనుడు తలపడ్డాడు. కర్ణుని ధాటికి సారధిని రధాన్ని కోల్పోయిన నకులుడు ధర్మరాజు రథం ఎక్కి వెళ్లిపోయాడు. ధర్మరాజుతో తలపడిన దుర్యోధనుడు గాయపడి మూర్చనొందాడు.

సారధిని కోల్పోయిన కర్ణునికి దుర్యోధనుని కోరికమేరకు శల్యుడు సారధ్యం వహించాడు.యుధ్ధంచేస్తున్నంత సేపు,పాండవుల ప్రతాపాలను పోగుడుతూ 'కర్ణా నీశాపాలవిషయం మర్చిపోయి విర్రవీగకు'అని కించపరుస్తూ మాట్లాడసాగాడు శల్యుడు.మానసికవేదన అనుభవిస్తూ పోరాడసాగాడు కర్ణుడు.

'నిరాయుధుడిగా ఉన్న నాతండ్రిని సంహరించిన ధృష్టద్యుమ్నుని చంపిగాని నాకవచం విప్పను 'అని శపధం చేసిన అశ్వత్ధామ కనిపించిన పాండవ సైన్యాన్ని సంహరించసాగాడు.

కర్ణుడు తన తల్లి కుంతిదేవికి ఇచ్చిన మాటకొరకు అర్జునుని తప్ప పాండవులలో తనవలన ఎవరికి అపకారం జరగదు అని వాగ్ధానం చేసినందున చేతచిక్కినా వారిని గాయపరచి ప్రాణాలతో వదిలివేసాడు. దర్మరాజుపై దూసుకువస్తున్న కర్ణుని శూలంతో గాయపరచిన భీముడు కత్తి ఎత్తగా 'భీమసేనా అతని ప్రాణాలు అర్జునుని వంతు వదిలివేయి' అన్నాడు శల్యుడు.'మామా మామేలుకోరే నీవంటి పెద్దల మాటలు గౌరవిస్తాను అని నమస్కరించి.తన పైకి వచ్చిన శృతవర్మ,ఆరుగురు కౌరవకుమారులను ఓక్కవేటున యమపురికి పంపాడు భీముడు.

అర్జునుడు భుజంగాస్త్రం ప్రయోగించి సంశప్తకులను, నాగపాశ బధ్ధులను చేసాడు.త్రిగర్తేశ్వరుడు గరుడాస్త్రం ప్రయోగించి వారిని బంధవిముక్తులను చేసాడు.కోపించిన అర్జునుడు ఐంద్రాస్త్రంతో వారందరిని యమపురికి పంపాడు.

కృప, కృతవర్మలు,అశ్వత్ధామలు ఉమ్మడిగా పాండవసేనలను సంహరించసాగిరు.అప్పుడు శిఖండి తనసోదరుడు సుకేతుడితో వచ్చి,కృపుని ఎదుర్కొన్నాడు.కృపుని ధాటికి సుకేతుడు కూలిపోయాడు. సాత్యకి అశ్వత్ధామతో తలపడ్దాడు.కర్ణుడు వీరవిహారం చేస్తూ ఓ దివ్యాస్త్రంతో పాంచాలుని ఎనిమిదిమంది కుమారులను కూల్చాడు.అక్కడకు వచ్చిన అర్జునునిని అశ్వత్ధామ ఎదుర్కోన్నాడు.కర్ణుడు భార్గవాస్త్రం ప్రయోగించి పాండవసేనలను తరుమసాగిడు.అర్జునుని రథం కర్ణునివైపు రాసాగింది. భీముని ఎదుపడిన దుశ్యాసనుని రథంపై నుండి కిందపడదోసి 'నాటి నాప్రతిజ్ఞ నేడునెరవేరుతుంది' అని దుశ్యాసనుని గుండెను చీల్చి ఆరక్తాన్ని తన శరీరానికి పులుముకుని,కురుక్షేత్రం కంపించేలా సింహ ఘర్జన చేసాడు.

అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మస్త్రాన్ని నిరోధించిన కర్ణుడు అశ్వసేనుడు అనే నాగరాజు ఇచ్చిన నాగాస్త్రాన్ని అర్జునునిపై ప్రయోగించాడు కర్ణుడు. అది అత్యంత ప్రమాదకరమైన అస్త్రం,పట్టపగలే చీకట్లు కమ్మి,నిప్పులు కక్కుతూ వస్తున్నఆఅస్త్రం తమను సమీపించగా శ్రీకృష్ణుడు తనరథన్ని తోక్కిపట్టి భూమిలోనికి దిగేలా చెసాడు.గురితప్పిన ఆస్త్రం అర్జునుని కిరీటాన్ని తాకి వెళ్లిపోయింది.అంతకు మునుపే శ్రీకృష్టుడు విప్రుని రూపంలో వెళ్లి కర్ణుని కవచ కుండలాలు యాచించి పొందాడు .అదే సమయంలో కర్ణుని రధం, గతంలో భూదేవి శాపకారణంగా నేడు యుధ్థ భూమిలోనికి కుంగింది.అదే అదనుగా,శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో ఒక దివ్యాస్త్రంతో కర్ణుని శిరస్సు ఖండించాడు అర్జునుడు.అలా కర్ణుని ప్రాణాలు సూర్యునిలో లీనమయ్యాయి.యుధ్ధ విరామంతో ఇరువర్గాలు తమశిబిరాలకుచేరారు.

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ