కొత్త జంట - తాత మోహనకృష్ణ

Kotta janta


"ఏంట్రా కన్నా..! తొందరగా రెడీ అవ్వు..పెళ్లిచూపులకి టైం అవుతోంది.." అంది తల్లి జానకి
"నేను రెడీ అమ్మా..! నాన్నని కార్ తియ్యమను...వెల్దాము.." అన్నాడు బాలు

అలా.. అమ్మ, నాన్న ఒక అబ్బాయి పెళ్లిచూపులు కోసం బయల్దేరారు. కార్ స్టార్ట్ అయ్యింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మాటలు మొదలయ్యాయి.

"అమ్మాయి కావ్య ఎలా ఉంది రా..ఫోటో చూసి ఏమీ చెప్పనేలేదు..?" అడిగింది జానకి
"అమ్మాయి చాలా బాగా నచ్చింది అమ్మా...!"
(ఈ పెళ్ళిచూపులు ఒక ఫార్మాలిటీ మాత్రమే అని మనసులో అనుకున్నాడు బాలు)

కావ్య, బాలు ముందు నుంచి ఒకరికి ఒకరు బాగా తెలుసు. రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు పాపం..! ఇద్దరూ ఎంత ప్రేమించుకున్నా.. కావ్య ఎప్పుడూ బాలుని హద్దులు దాటనివ్వలేదు..

"ఇంతకీ మీకు అమ్మాయి నచ్చిందా అమ్మా..?" అడిగాడు బాలు
"అమ్మాయికేమి రా.. చాలా బాగుంది. నా కోడలు బంగారం.." అంది జానకి

అమ్మ చెప్పిన విషయాన్నీ బాలు ఆల్రెడీ కావ్యకి వాట్సాప్ చేసేసాడు. ఆల్రెడీ ఇద్దరూ ఇప్పుడు చాటింగ్ లోనే ఉన్నారు. కావ్య రిప్లై కూడా 'నేను హ్యాపీ' అని పెట్టింది..

"తొందరగా రా బాలు..నీకు నచ్చిన శారీ కట్టుకుని వెయిటింగ్ ఇక్కడ..." అని చాటింగ్ లో అంది కావ్య
"సరే కావ్య...ఎప్పుడెప్పుడు నిన్ను శారీ లో చూస్తానా..? అని చాలా ఆశగా ఉంది.."
"ఏమిటో శారీ లో అంత స్పెషల్..బాలు గారికి..?"
"శారీ లోనే అమ్మాయి నిజమైన అందం చూడగలము కదా..! ఆ గ్యాప్స్ అవీ.."
"నీలో చిలిపి బాలు లేచినట్టున్నాడు...కొంచం ఆపు బాలు..ఇవి పెళ్లిచూపులే..పెళ్లి కాదు బాబు..."
"నిన్ను ఎప్పుడూ శారీ లో చూడలేదు గా..అందుకే.." అని పింగ్ చేసాడు బాలు

"ఇంకో ఫైవ్ మినిట్స్ లో మీ ఇంటి ముందు ఉంటాను..ఓపిక పట్టు కావ్య"
"రండి బాబు..మీ కోసమే...నీకు నచ్చిన కాఫీ తో రెడీ గా ఉన్నాను.." అంది కావ్య ప్రేమగా

కాలింగ్ బెల్ మోగింది..బాలు తో పాటు అందరూ లోపలికి వెళ్ళారు.."అమ్మాయి వస్తుంది కూర్చోమని.." కాబోయే మావగారి మాటలు..

గ్రీన్ కలర్ శారీ లో కావ్య వచ్చి ఎదురుగా కూర్చుంది. పెళ్లి చూపులు క్వశ్చన్ బ్యాంకు విప్పారు అందరూ. ఆన్సర్స్ కూడా అన్నీ ఫార్మాలిటీ గా వచ్చేసాయి. ఇక అమ్మాయి, అబ్బాయి లోపలికి వెళ్లి ఒంటరిగా మాట్లాడుకుంటారు అని సైగ చేశారు అంతా..

బాల్కనీ లోకి వెళ్లిన ఇద్దరు..

"ఏమిటి సర్..శారీ లో అని తెగ స్పీచ్ ఇస్తున్నారు...?" కొంటెగా అంది కావ్య
"నువ్వు ఎప్పుడూ శారీ లో కనిపించలేదు గా..అందుకే.."
"పెళ్లి అయినా తర్వాత శారీ కూడా తీసేసి చూపిస్తాను గా..ఎందుకు తొందర..?"
"నా కావ్యయేనా.. ఇలా మాట్లాడుతున్నది...?"
"ఏమనుకున్నావు బాలు..మాకూ చాలా కలలు, కోరికలు ఉంటాయి..మరి"
"అయితే ఒక ముద్దు ఇవ్వొచ్చు గా కావ్య...ఆల్మోస్ట్ మనకి పెళ్లి అయిపోయినట్టే..నువ్వు కుడా మంచి మూడ్ లోనే ఉన్నావు.."
"అన్నీ పెళ్ళైన తర్వాతే..! ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను..కావాలంటే బోనస్ కుడా.."
"పెళ్ళైన తర్వాత చెబుతాను నీ పని..తొందరగా ముహుర్తాలు పెట్టించేస్తాను..అప్పుడు నీ మీద పూర్తి రైట్స్ తెచ్చుకుంటాను.." అన్నాడు బాలు

అబ్బాయికి అమ్మాయి నచ్చింది...పెళ్లి గ్రాండ్ గా జరిగింది. మొదటి రాత్రి..అమ్మాయిని గదిలోకి పంపించారు. కావ్య దూరంగా మంచం మీద కూర్చొని ఉంది..

"హే కావ్య..! ఎందుకో అంత దూరంగా కూర్చున్నారు..? దగ్గరకు రావొచ్చు గా..మనల్ని ఇక్కడకు పంపించి అందరూ బయటే ఉన్నారు..ఇక్కడ ఎవరూ లేరు లే.."

ఒక అంగుళం జరిగి.. "చాలా..?" అని నవ్వుతూ అంది కావ్య

"పెళ్ళికి ముందు చాలా హుషారుగా ఉన్నావు..ఇక మీదట మనిద్దరి మధ్య గాలి కుడా దూరే చోటు కుడా ఉండకూడదు తెలుసా..?"
"ఎంతైనా కొత్త పెళ్ళికూతురిని కదా..! సిగ్గు ఉండదా బాబు..! అసలే తమరు ఏదో శపధం కుడా చేశారు. ఇప్పుడు మీకు ఫుల్ రైట్స్ వచ్చాయి కదా...అందుకే మరి నాకు ఈ భయం.."
"ఎందుకు కావ్య..నీకు మాత్రం ఎంజాయ్ చెయ్యాలని ఉండదా చెప్పు. శారీ తీసేసి చూపిస్తాను అన్నావు కదా..! ఏది మరి..? నీ నిజమైన కొలతలు ఈ రోజు నేను తెలుసుకుంటాను.."
"కొంచం ఆగండి..ఎంత తొందరో.. నన్ను మాములుగా చూస్తేనే మీ మనసు ఉరకలు వేస్తుంది. ఈ రోజు ఎలా తట్టుకుంటారో అని ఆలోచిస్తున్నాను బాలు.."
"నీకూ కొత్త...నాకూ కొత్త...ఈ విషయం లో అందరికీ ఇంతే కదా.." అన్నాడు బాలు
"మీకేమైనా ముందు అనుభవం ఉందేమిటి..అలా అంటున్నారు..?" అంది కావ్య
"ఛ..ఛ..అలాంటిది ఏమీ లేదు. నీ ప్రేమతో నాకు అలాంటి అవకాశం రాదని నాకు నమ్మకం ఉంది కావ్య.."

"నిజమే...నేను అలాంటి అవకాశం ఇవ్వను..సినిమా లో చూపించిన ఫస్ట్ నైట్ సీన్స్ కన్నా బాగా ఎంజాయ్ చేస్తారు నాతో మీరు. నా దగ్గర మీ దాహం అంతా తీర్చుకోవచ్చు..నన్ను కూడా స్వర్గలోకం లో తెలియాడేటట్టు చేస్తారు గా..?" అని కన్ను కొడుతూ అడిగింది కావ్య

రాత్రంతా ఇద్దరూ.. ఆ స్వర్గపు అంచులలోనే ప్రయాణించారు. "ప్రతి రాత్రి ఇక మనకి మొదటి రాత్రే .." అన్నాడు బాలు
"రాత్రేనా..? " అని దీర్ఘం తీసింది కావ్య
"అంటే ఏమిటి కావ్య..? "
"మనది కొత్త జంట కదా..అని అన్నాను అంతే..!"

"నువ్వు కనిపించవు గానీ..చాలా చిలిపి.." అని బుగ్గ గిల్లి.."నువ్వు ఎప్పుడంటే అప్పుడే కావ్య..నేను నీ కోసం ఎప్పుడూ రెడీ. నీ ఆనందం కన్నా నాకేమి కావాలి చెప్పు. అంతే కాదు, ఇంట్లో ఏ పని చెయ్యమన్నా చేస్తాను.." అన్నాడు బాలు

*********

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం