ప్రేమ విలువ - Lakshmi Priyanka

Prema viluva

ఆకాశ్ ఒక ప్లేబాయ్. అమ్మాయిలు అంటే అందం అని.. అందం అనేది ఉన్నది ఆస్వాదించడానికి అని ..!! ఇంతే అతనికి తెలిసిన నీతి..!! అది నీతి అనేకన్నా కునీతి అనడం సరైంది కాబోలు..!! వాళ్ల అమ్మ నాన్నలు చేసే గారాబమో లేదా వాళ్ళు సంపాదించి పెట్టిన డబ్బు మూటలో.. అతనిలో ఉన్న సంస్కారాన్ని కప్పేశాయి..!! Kiఅమ్మాయి కనపడితే తన పక్కలోకి రావాలి అన్న దురాలోచన తనకు..!! ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్న అతని దినచర్యలో ఉన్నవి మూడే.. మందు విందు పొందు..!! ఇవి తప్ప చదువు సంధ్యలకు ఆస్కారం లేని సంస్కార హీనుడు ఆకాష్ ..!!

ఒక రోజు ఆకాష్ చదివే కాలేజ్ కి వచ్చింది వందన..!! సాంప్రదాయ కుటుంబం ఆ అమ్మాయిది.. ఇంటి దగర దించిన తల మళ్లీ క్లాస్ రూమ్ లోనే ఎత్తుతుంది. సుందరమైన రూపం, చక్కటి గుణం..అలాంటి వందన రావడం చూశాడు ఆకాష్.. వెంటనే అతని కన్ను ఆమె మీద పడింది..!! ఇక ఏముంది ఇంకా ఒకటే లక్ష్యం అతని ముందు ఉంది .. అదేంటంటే వందన ని ఎలాగైనా లొంగదీసుకోవాలని..!!

తన కుటిలమైన ఆలోచన తన స్నేహితులకు కూడా చెప్పాడు అలాగే వాళ్ల సహాయం కోరాడు ..!! వాళ్ళు సరే అనడంతో తన పని ప్రారంభించాడు ఆకాష్ ..!! తన స్నేహితులను ఆమెను అల్లరి చేయడానికి ఉసిగొలిపాడు.. వాళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు..!! దీనంతటికీ సూత్రధారి అయిన కూడా ఏమీ ఎరుగనట్లు ఆమెను రక్షించడానికి వచ్చిన ఆపద్బాంధవుడిలా ఆమె దృష్టిలో పడ్డాడు..!! ఆమె వెళ్లి వెళ్లి అతని గోతిలో పడడానికి రంగం సిద్ధమౌతోంది..!!

ఆకాష్: ఒరేయ్ ఆడపిల్లని ఏడిపిస్తారు రా మీకు పుట్టగతులు ఉండవు రా..!! సిగ్గులేని వెధవల్లారా మీకు అక్క చెల్లెలు లేరేమో అందుకే మీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది.. వెంటనే ఆమెకి క్షమాపణ చెప్పండి..!”

అతి వినయం ధూర్త లక్షణం అన్న సూక్తిని ఆమె మరచిపోయి అతని మాయలో పడింది “హాయ్ నేను వందన మీ ఫ్రెండ్షిప్ కావాలనుకుంటున్నాను .. నన్ను మీ ఫ్రెండ్ గా ఒప్పుకుంటారా?? అని అడిగింది.. వెత్కబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆకాష్ అనుకున్నదే చక చక జరిగిపోతోంది..!!

మొదట మాటలు.. నాలుగు మాటలతో మొదలై రాత్రింపగళ్ళు కబుర్లే అన్నట్లు అయింది పరిస్థితి..!! ఫోన్ బ్యాటరీలు అయిపోయేవరకు సాగేవి వాళ్ల మాటలు.. అయితే వందన తరపు నుండి మాటల్లో అభిమానం ఉంటే ఆకాష్ తరపు నుంచి తన మాటల్లో ఉన్నది ఒకే ఒక స్వార్ధం.. వందనతో శారీరక సుఖం..!! ఆకాష్ ఉద్దేశాలు తెలియని వందన అతనితో మరింత దగ్గర కాసాగింది..!!

ఒక రోజు ఆకాష్ వందనతో..”నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వందన.. హ్యాంగింగ్ గార్డెన్స్ లో కలుద్దామా అన్నాడు..!! అలాగే తప్పకుండా అని అండి వందన..!! వందనను మోసం చేసే క్రమంలో ఒక ముఖ్యమైన అడుగు వేశాడు ఆకాష్..!!

ఇక మరుసటి రోజు హ్యాంగింగ్ గార్డెన్స్ లో ఇద్దరు కలుసుకున్నారు.. ఒక చక్కని ఎర్ర చీర కట్టుకుంది వందన..!! తన శరీర ఆకృతికి ఎంతో చక్కగా పొందిగ్గా ఉంది ఆ చీర..!! తన నడుము వొంపు చూస్తే ఆ చంద్రుడిలోని ఒక ముక్క అలా అక్కడ అమరిందేమో అన్నట్టుగా ఉంది..!! ఆకాష్ తన పక్కన కూర్చుని నెమ్మదిగా తనకి దగ్గరగా వెళ్లాడు..!! ఎంత దగ్గరగా అంటే.. ఆమె శ్వాసల్లో తన శ్వాసలు కలిసేంతలా..!!

ఆ దగ్గరతనం వందనలో కూడా ఒక తెలియని తాపాన్ని పెంచింది..!! “ఏంటి ఏదో మాట్లాడాలి అన్నావు “ అండి వందన మెల్లనైన స్వరంతో..!! వందన చేయి పట్టుకుని “నాకు తెలుసు నేను ఏం ఆలోచిస్తునానో నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావని.. నాకు తెలుసు నేను ఏది కోరుకుంటున్నానో నువ్వు కూడా అదే కోరుకుంటున్నావని..!! నాకు తెలుసు నా మనసులో ఏం ఉందో నీ మనసులో కూడా అదే ఉందని.. ఆ ఆది ఇంకేదో కాదు ప్రేమ అని.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలాగే నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని..” అన్నాడు ..!!

వందన ఏమీ మాట్లాడలేదు.. నిజం చెప్పాలంటే తన నోట మాట రాలేదు.. ఆకాశ్ వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది.. !! ఆకాశ్ అమాంతం వందన నడుము చుట్టూ చేయి వేసి తన వైపుకి లాక్కుని..”నాకు తెలుసు నీ మౌనానికి అర్థం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని .. నేను నిన్ను ముట్టుకున్న కూడా నువ్వు ఏమీ అనలేదంటే.. నాకు తెలుసు నీ తనువు నా స్పర్శ కోరుకుంటుంది” అని..!!

ఆ మాటలకు ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి.. పెదాలు తొణికాయి.. అంతే ఆకాశ్ అదే అదునుగా తన పెదాలు వందన పెదాలపై ఉంచాడు..!!।మొదటి ముద్దు తప్ప ఇంకేం తెలీలేదు ఇద్దరికీ..!! వందన కి అది మొదటిదే.. కానీ ఆకాశ్ కు కాదు..!! వందనని పూర్తిగా తన వశం చేసుకుంటున్నాడు ఆకాష్..!!

వాళ్ల ప్రేమ మెల్లగా ముదిరి పాకాన పడింది..!! ఒకరోజు ఆకాష్ కి జ్వరంగా ఉందని ఇంట్లో కూడా చూసుకోడానికి ఎవరు లేరంటే.. అతనంటే వల్లమాలిన ప్రేమ కలిగిన v వందన వెళ్ళింది..!! కానీ తను చేస్తోంది తన జీవితంలోనే అతిపెద్ద తప్పు అని తెలీదు ..!!

ఆ రోజు వందన జీవితం మలుపు తిరిగింది… ఆమె ఆకాష్ ఇంట్లోకి అడుగు పెట్టిన ఆ క్షణం నుంచే ఆమె జీవితంలో గాలిలో ఎగురుతున్న కొమ్మలా అయిపోయింది. మూడో అంతస్తులోని ఒక రూమ్‌లో, మంచం మీద అస్వస్థంగా పడుకున్న ఆకాష్… వందన అటువంటి సందర్భంలో అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మందులు వేసి, సూప్ చేసి తినిపిస్తూ ప్రేమతో సమయం గడిపింది. ఆ రాత్రి ఆకాష్ మెల్లగా చెప్పాడు –

“వందన… నువ్వు నా జీవితంలో ఓ వెలుగు రాశి… నువ్వు లేని జీవితం ఊహించలేను!”

ఆ మాటలు వింటూ… వందన మనసు పరవశించింది. అయితే ఆకాష్ గుండెల్లో ఎక్కడా నిజంగా ఆ అనుభూతి లేదు. అతనికి ఒక్కటే ముఖ్యమైనదిగా కనిపించింది – వందనపై సంపూర్ణ ఆధిపత్యం.

ఆ రాత్రే అతను వందనను లోబర్చుకోవాలని చూశాడు కానీ వందన వెనక్కి తగ్గింది..!! తన సహజ గుణం తనని ఆ పని చేయడానికి మనస్కరించలేదు .. కానీ మెల్లగా ఆకాష్ ప్రవర్తన మారింది. వందనపై బలప్రయోగం చేయాలని నిశ్చయించుకున్నాడు .. “నిన్ను నేను ఏ రోజు నిజంగా ప్రేమించలేదు..!! జస్ట్ నిన్ను అనుభవించాలి అనుకున్నాను..!! నేను డైరెక్ట్ గా ఇదే విషయం చెప్తే నా చెంప పగలగొట్టి దూరం పెట్టేదానివి అందుకే నేను ప్రేమ అనే పేరుతో నీ జీవితంలోకి వచ్చాను.. నా మాట విని కోపరేటివ్ గా ఉంటే మన మధ్య ఎలాంటి గొడవ లేకుండా అంతా పీసిఫుల్ గా జరుగుతుంది.. నా మాట విను” అన్నాడు

వందన “నేను ప్రేమను కోరుకున్నాను కానీ అర్థం లేని కామాన్ని కాదు.. నా నుండి నువ్వు కామాన్ని మాత్రమే కోరుకుంటే నా శరీరం మాత్రమే నీకు కావాలి అంటే అది జరిగే పని కాదు..!! నన్ను వదిలేయ్” అంది..!! కానీ వందనని బలవంతం చేశాడు..!! తన బలంతో ఆమెని లొంగదీసుకున్నాడు..!! వందన అసహాయంగా మిగిలిపోయింది.. తన బలంతో ఆకాష్ ని ఎదుర్కోలేకపోయింది..! తన జీవితం నాశనం అయిపోయింది ..!!

వందన కళ్ళలో అప్పటివరకు ఆకాష్ మీద ప్రేమ ఉండేది కానీ ఒక్కసారిగా ఆమె చూపు మారిపోయింది ఒకప్పుడు అతడి కళ్లలో తాను ప్రేమ చూసేది కానీ ఇప్పుడు చూసేది ప్రేమ కాదు – కేవలం ఆకర్షణ,మోసం..!! తను ప్రేమించిన ఆకాష్ నుండి తనకి జరిగింది కేవలం అన్యాయం..!! తన ప్రపంచం పటాపంచలైపోయింది..!!

ఆమె కన్నీళ్ళతో మిగిలిపోయింది.. ప్రేమిస్తున్నాడు అనుకున్న ఆకాష్ తన జీవితం నాశనం చేసేసరికి ఆమె ప్రపంచం తలకిందులు అయింది, ప్రపంచాన్ని ఇపుడు ఎలా ఎదుర్కోవాలో ఎలా మనుగడ సాగించాలో తనకి అర్ధం కాలేదు.అయినా ధైర్యంతో – తన వస్త్రాల్ని సర్దుకుని బయటకు వెళ్లిపోయింది. ఆ చీకటి రాత్రిలో ఆమె నడక గంభీరంగా, గుండె బలంగా మారింది.

వందన ఆకాష్ ఇంట్లో నుంచి బయటకి వచ్చేటప్పుడు… ఆమె కన్నీళ్ళు జారి పడలేదు. ఎందుకంటే… ఆమెకి ఆకాష్ ప్రేమించలేదని కాదు, ఆమెని గౌరవించలేదని బాధగా ఉంది. ప్రేమలో శరీరం ఒక దశ. కాని ఆకాష్ దృష్టిలో అది మొదటి లక్ష్యంగా ఉండిపోయింది. ఆమె నోరులో మాటలు రాలేదు కానీ గుండె నిండింది – బాధ, నమ్మకద్రోహం, కలల పతనం.

ఆ రాత్రి ఇంటికి వెళ్లాక తలదించుకుని ఆలస్యం అయిన అనుకున్న తల్లి అడిగింది –

“ఏం జరిగింది అమ్మా, నీ ముఖం ఎందుకు మాయమైపోయింది?”

అప్పుడే వందన మనసులో పేలిన పిడుగు బయటపడింది –

“నాన్నా, అమ్మా… నేను మోసపోయాను. కానీ నా ఆత్మ మాత్రం మలినపడలేదు.”

ఆమె తల్లి కళ్లల్లో ఆశ్చర్యం కంటే గర్వం మెరిపించింది.

“ఒక అమ్మాయి తనని తాను రక్షించుకోవడమే నిజమైన విజయమమ్మా. నువ్వు నాకెంతో గర్వకారణం.”

అందులోంచి ఒక కొత్త వందన పుట్టింది. బాధని బలంగా మలిచిన ఆమె… చదువు మీద దృష్టిపెట్టి, మంచి స్కాలర్‌షిప్‌తో విదేశాల్లో చదువుకుంది. అక్కడే మానవహక్కుల కార్యకర్తగా మారి, ప్రపంచంలోని మహిళల కోసం గొంతుక ఇచ్చే గొప్ప వ్యక్తిగా ఎదిగింది.

ఇంతలో ఆకాష్ జీవితం లోపల నుంచే కలవరపడింది. వందన వెళ్లిన తర్వాత కొన్ని నెలలు అతను పశ్చాత్తాపంలో కునుమునుగులాడిపోయాడు. ఎందుకు ఆమె కన్నీళ్ళు తన కోసం? ఎందుకు తన వల్ల ఒక మనసు విరగాలి? ఎందుకు తన కోసం ఒక ఆత్మ తలదించుకోవాలి?

ఆ ప్రశ్నలన్నీ అతనిలోని ప్లేబాయ్‌ని చంపేసాయి. సిగ్గుతో తలదించుకున్నాడు. స్నేహితులను విడిచిపెట్టాడు. గోప్యంగా కౌన్సిలింగ్‌కు వెళ్లాడు. చివరకు అతను తన కోర్సు పూర్తిచేసి చిన్న ఉద్యోగం తీసుకున్నాడు.

ఒకసారి సోషల్ మీడియాలో వందన గురించి ఓ ఆర్టికల్ చదివాడు –

పెళ్లి కాకుండానే గౌరవంతో బతికిన మహిళవందన కథ

ఆ కథ చదివిన తర్వాత రాత్రంతా అతను నిద్రపోలేదు. ఒక్కసారి కనీసం ఆమెను కలవాలని తీర్మానించాడు. వందన ఎక్కడో పెద్ద సదస్సులో ప్రసంగిస్తోంది. మూడో వరుసలో కూర్చుని ఆమె మాట్లాడే ఒక్కో పదాన్ని ఆస్వాదించాడు.

“ప్రేమ అనేది శరీర సంబంధం కాదు… అది హృదయాల మధ్య గౌరవ సంబంధం. నన్ను మోసం చేసిన వ్యక్తే నాకు జీవితం నేర్పాడు. ఎందుకంటే అతని వల్లే నాకు నేను నిజంగా ఎవరో తెలుసుకుంది.”

అతని కళ్లలో నీళ్ళు ముడుచుకున్నాయి… ఎందుకంటే ఆమె పేరు ప్రస్తావించనప్పటికీ, ఆ బాధతో అతను జీవించి ఉన్నాడని ఆమెకు తెలుసు.

సదస్సు తర్వాత ఆకాష్ వందన ను కలిసాడు –

“వందన… నీ జీవితం చూసి నేను కూడా మనిషిగా మారగలుగుతానని నమ్మకం కలిగింది. నన్ను క్షమించాల్సిన అవసరం లేదు… కానీ నీవు గర్వపడేలా మారిన వ్యక్తిని కనీసం చూస్తే చాలు.”

వందన చిరునవ్వుతో అతని చేతిని పట్టింది –

“నిజంగా మారిన వ్యక్తిని చూస్తే, మన గతాన్ని కూడా క్షమించేయగలం. ప్రేమ కంటే… మార్పు విలువ గొప్పది ఆకాష్.”

ఒక అమ్మాయి తన స్వభిమానాన్ని నిలబెట్టుకుంది.

ఒక అబ్బాయి తన లోపాన్ని అర్థం చేసుకుని మారిపోవాలనుకున్నాడు.

ఇది ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తుంది–

ప్రేమ అనేది పొందడం కోసం కాదుఎదగడం కోసం. ప్రేమ విలువమనసును గెలుచుకునే ప్రయత్నం చేయడంలోఉందిమనిషిని గెలవడంలో కాదు…!!

మరిన్ని కథలు

Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం
Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.
Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు
Ati Garabam
అతి గారాబం (బాలల కథ)
- మద్దూరి నరసింహమూర్తి
Kotta kathalu kaavaali
కొత్త కథలు కావాలి
- తాత మోహనకృష్ణ