చిక్కటి చీకటి ఆవరించింది. కనుచూపు మేర ఎక్కడా కాసింత కాంతి లేదు. ఆస్పత్రి నుంచి ఆయాసంగా పరిగెత్తుకొత్తుకుంటూ వచ్చాడు చింటూ..
ఇంటి బయటే నిల్చొని ‘‘ అమ్మమ్మా..అమ్మమ్మా..’’ బిగ్గరగా అరిచాడు.
మంచం మీద పడుకున్న అమ్మమ్మ ‘‘ ఖల్‌ఖల్’ అని దగ్గుతోంది. ఊపిరాడక అల్లాడుతోంది. కూతురి బిడ్డ.. మనవడు చింటూ అరుస్తుంటే టక్కున లేచి కూర్చొంది.
‘‘ ఏరా ఈ సారి కూడా అమ్మాయేనా...?’’
ఆదుర్దాగా అడిగింది అమ్మమ్మ.
‘‘ అవును..అవును..’’ అన్నట్లు అయిష్టంగా తలూపాడు మనవడు.
లోపల పేపరు చూస్తున్న పుత్రుడు పుల్లయ్య పేపరు విసురుగా విసిరేసి బయటకు వచ్చాడు.
‘‘ అమ్మా..అమ్మా.. నువ్వు ప్రశాంతంగా పడుకో..’’ అన్నాడు పుల్లయ్య.
‘‘ అదేమిట్రా ఒక్కగానొక్క కొడుకువి..గారాబంగా పెంచాను..నీకూ వారసుడు..ఓ కొడుకు కావాలని లేదూ..?’’ నిలదీసింది తల్లి.
తల్లి మాటతో పుల్లయ్య మనసు పుండు మీద కారం చల్లినట్లయింది.
‘‘ కొడుకు కావాలని ఆశ వుంది.. ఏం చెయ్యమంటావ్? మళ్లీ ముచ్చటగా మూడోది కూడా ఆడపిల్ల పుట్టింది...’’ రుసరుసలాడుతూ బయటకు విసురుగా వెళ్లాడు పుల్లయ్య. ఆందోళనలో వున్న పుల్లయ్య మద్యం షాపు వద్దకు వెళ్లాడు. పీకల దాకా తాగాడు. అక్కడే తూలిపోయాడు.
ఆస్పత్రిలో పుల్లయ్య భార్య పట్టించుకునే దిక్కులేని అనాథలా వుంది. పక్క బెడ్‌లో వున్న ఇద్దరు ‘‘ మీ ఆయన లేదా..ఏమ్మా?బాలింతవి.. కొంచెం కూడా కరుణలేదా? నాల్గు రోజులుఅవుతున్నా ఒక్కరూ రాలేదు..?’’ జాలిగా అడుగుతూ అన్నం పెడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. పుల్లయ్య భార్య కు ఏం చెప్పాలో తెలియలేదు.
ఓ పక్క పురుటి బిడ్డ పాలులేక గుక్కపట్టి ఏడుస్తోంది. మరో పక్క ఇద్దరు ఆడబిడ్డలు దిక్కులేక ఆకలితో అలమటిస్తున్నారు.
పక్క బెడ్‌లో వున్న వాళ్లు తెచ్చుకున్న అన్నం పిల్లలకు కాస్త పెట్టారు. కొంత బాలింతకు పెట్టారు. నాల్గు రోజులైనా ఎవరూ రాకపోవడంతో పక్కనే వున్న వారు నిర్ఘాంతపోయారు. ‘‘ ఏమ్మా? మీ ఆయన ఎక్కడ? బాలింత ఆస్పత్రిలో వుందన్న జ్ఞానం కూడా లేదా?నీ కేదైనా అయితే ఎలా? ఏ చేస్తావ్? కనీసం పుట్టిన బిడ్డ ముఖం కూడా చూడలేదు..!’’ అంటుంటే నోటి నుండి మాట రాలేదు పుల్లయ్య భార్యకు. ‘ ఇంట్లోనే నన్ను ఎలా వున్నావ్?’ అనే పలుకరించే దిక్కులేదు.. ఇక బయట కూడా నాకు అంత భాగ్యమా?’ లోలోన కుమిలిపోయింది.
ఆఖరి రోజు డిశ్చార్జి చేస్తుండగా పుల్లయ్య భార్య తమ్ముడు వచ్చాడు. చంకలో ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్నాడు. బాలింత అయిన అక్క చంకలో బిడ్డను వేస్కోని నడవలేక నడుస్తోంది. తమ్ముడు ముందుకు నడుస్తున్నాడు. ఆయాసం, నీరసంతో కాసేపు కూర్చుంది పుల్లయ్య భార్య.
చేతిలో ఆటోకి కూడా డబ్బులు లేదు.
అక్కని అలానే నడిపించి ఇంటికి తీస్కొచ్చాడు.
పుల్లయ్య తాగి తాగి దగ్గుతూ ఇంటి లోపల కూర్చున్నాడు. ఇంటి బయట పుల్లయ్య తల్లి కట్టెల పొయ్యిమీద బియ్యం పెట్టి వండిరది. ‘‘ రారా కాస్త తిందువు.. ఎన్ని రోజులు అయ్యిందో ఏమో?’’ కంచంలో అన్నం, కూర వేసి అప్యాయంగా పిలుస్తోంది.
పుల్లయ్యతల్లి కట్టెల పొయ్యి మీద బియ్యం పెట్టి వండిరది. ’’ రారా..కాస్త తిందువు.. ఎన్ని రోజులు అయ్యిందో ఏమో..’’ కంచంలో అన్నం, కూర వేసి అప్యాయంగా పిలుస్తోంది.
పుల్లయ్య ఆ పిలుపు వినలేదు. నోట్లో చుట్ట ‘‘ గుప్..గుప్..’’ మని కాలుస్తున్నాడు. ఇంటి బయటే నిల్చొంది పుల్లయ్య భార్య. ఇంట్లో వున్న వారెవ్వరూ పలకలేదు. ఎవరి పనుల్లో వారు వున్నారు. బయటి నుంచే పిల్లల్ని ఇంటి లోపల దించాడు.
‘‘ ఇక వస్తాను అక్కా..!’’ కళ్లతో సైగచేసి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు పుల్లయ్య బావమర్ది.
పుల్లయ్య భార్యను చూసి అత్త ఈసడిరచుకుంది. ఛీదరించుకుంది. ఇలా ఆడపిల్లల్ని కంటుంటే పెంచేది ఎవరే? జుట్టు పట్టుకున్నంత పనిచేసి శివతాండవం చేసింది .
అది చూసి చిన్న పిల్లలిద్దరూ భీతిల్లి బయటకు పరుగులు తీశారు.
పుల్లయ్య భార్యకు తినడానికి ఏమీ ఇవ్వలేదు.. ఒకటే చీవాట్లు..
చీరకొంగు అడ్డంపెట్టుకుని కంటతడి పెట్టింది.
లోపల పట్టించుకోని భర్త.. తిండి లేక ఆవహించిన నీరసంతో బిడ్డకి పాలు కూడా ఇవ్వలేకపోయింది. ఆకలికి ‘‘ కేర్..కేర్..’’ మంటున్న బిడ్డ అరుపులకి తోకతొక్కిన నాగులా విరుచుకుపడిరది పుల్లయ్య తల్లి మంగతాయారు. ‘‘ మా ఇంట్లో దరిద్రు శని దాపురించింది. . నీ వల్ల మాకెలాంటి లాభం లేదే.. నువ్వు వున్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. ఎక్కడికైనా వెళ్లరాదటే ముదనష్టపు దానా..?’’ తిట్టడం ఆపలేదు మంగతాయారు.
ఆ తిట్టు భరించలేకపోయింది పుల్లయ్య భార్య. చెవులు మూసుకు కూర్చుంది. మరుసటి రోజు పక్కనే వున్న మంగయ్య సాయం అడిగి తన తమ్ముడ్ని రమ్మని ఫోను చేసింది.
ఆ సాయంత్రం పుల్లయ్య బావమర్ది ఇంటి గుమ్మంలో నిల్చున్నాడు.
లోపల అక్క బట్టలన్నీ సర్దుకుని చంకలో చంటి బిడ్డతో పాటూ ఇద్దరి పిల్లల్ని తీసుకుని తమ్ముడితో పుట్టింటికి చేరింది.
నాల్గు నెలలు అయ్యింది. ఆమె ఖర్చులు, తమ్ముడి పిల్లల ఖర్చులు తడిసి మోపెడైంది. తలకు మించిన భారంగా మారిందని తమ్ముడి భార్య సూటిపోటి మాటలు అనసాగింది. పుల్లయ్య భార్యకు ఇంటిమీద కలవరం పడిరది. రోజురోజుకు క్షీణిస్తున్న భర్త ఆరోగ్యం పై ఆందోళన పెరిగింది. ఇక పుట్టింట్లో ఆడబిడ్డ తిట్లు, శాపనార్థాలు భరించలేకపోయింది.
అదే ఊరిలో ఓ పూరి గుడిసె అద్దెకు తీసుకుని పిల్లల తో కాపురం పెట్టింది. ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పాచి పనిచేస్తూ పొట్టపోసుకుంది. పిల్లలకు ఐదేళ్లు వచ్చాయి. బడిలో చేర్చింది.
రెండేళ్లు గడిచాయి. రోజులు సాఫీగా సాగుతున్నాయి. పుల్లయ్య భార్యకు కాస్త మనశ్శాంతి లభించింది. ఇంట్లో భర్త, అత్త ఎలా వున్నారో ఇరుగుపొరుగు వారిని కనుక్కోసాగింది.
భర్త పుల్లయ్య బాగా తాగి తాగి ఆరోగ్యం క్షీణించిందని వేళకు తిండి లేక కిడ్నీలు పాడయ్యాయని తెలుసుకుని కంటతడి పెట్టింది. తను వుంటే బాగా చూసుకునేదాన్ని..’ అని లోలోన కుమిలిపోయింది. వున్న నిశ్చింత కాస్త కనుమరుగైంది. మళ్లీ ఆందోళన పెరిగింది. ఎలాగైనా ఇంటికి చేరాలని శతవిధాలా ప్రయత్నించింది. పిల్లల చదువులు కారణంగా వీలుకాలేదు.
ఓ రోజు పక్కింట్లో పాచిపని చేస్తోంది. తన కష్టానికి తోడు పిల్లలు బాగా చదివి తనకు చేదోడుగా వస్తున్నారన్న ఆనందం ఎంతో సమయం నిలువలేదు.
నాల్గు రోజులకు ముందు ఇంటి ఇంట్లోంచి వెళ్లిన భర్త పుల్లయ్య తాగి చెరువు గట్టుపై పడుకున్నవాడు పడుకున్నట్లే వున్నాడని పైకి లేవలేదని ఇరుగుపొరుగును అడిగి తెలుసుకుంది. చేస్తున్నపని వదిలి ఊరికి పరుగుపెట్టింది.
పుట్టింటికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వుంది వాళ్ల ఊరు. పరిగెత్తి చెరువు గట్టు దగ్గరకు వెళ్లింది.
అప్పటికే భర్త మృతదేహాన్ని ఇంటికి చేర్చారు.
ఇంటి ముందుకు వెళ్లింది పుల్లయ్య భార్య.
కోడల్ని చూసి దూరంగా తోసేసింది. దగ్గరకు చేర్చలేదు.
‘‘ అంతా నీ వల్లే.. నా కన్న కొడుకును కూడా పోగొట్టుకున్నా.. నా కూతుర్లు కూడా నన్ను తరిమేశారు.. ! ఇక నాకు దిక్కెవరే?’’ అని శాపనార్థాలు పెట్టింది.
పుల్లయ్య భార్యకు భర్త కడచూపు కూడా కరువైంది. ముఖం కూడా చూడనివ్వలేదు.
ఇక లాభం లేదనుకుని పుట్టింటికి వెళ్లి పాచిపనిచేసుకుని బతికింది.
భర్తను కోల్పోయిన దిగులు ఓ పక్క.. పిల్లలు చేతికి అందివస్తున్నారన్న ఆనందం ఓ పక్క.. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని తల్లడిల్లింది పుల్లయ్య భార్య.
కాలం గిర్రున తిరిగింది.
పుల్లయ్య భార్య పాచిపని చేయడం ఆపేసింది. పెద్ద కూతురికి ప్రభుత్వ టీచరుగా ఉద్యోగం వచ్చింది.
ఎంతో కష్టపడ్డ పుల్లయ్య భార్యకు అదృష్టం వరించింది.
ఆమె ఇద్దరు కూతుర్లు క్షేమంగా చూసుకుంటున్నారు.
పుల్లయ్య భార్యకు అత్త ఎలా వుందో మనసు తల్లడిల్లింది.
ఒక్క క్షణం ఆలోచించకుండా వెళ్లి భర్త పుల్లయ్య ఇంటి ముందు వాలింది.
బాగా పాడుపడిపోయిన పెంకుటిల్లు పైకప్పు పడిపోయింది.. గోడలు పడిపోయి వున్నాయి.. బయటి నుంచే లోనికి తొంగి చూసింది పుల్లయ్య భార్య.
లోపల మంచంపై ఓ మూల ముడుచుకు పడుకుని వుంది పుల్లయ్య తల్లి.. దేహం బాగా చిక్కిశల్యమైంది. బంధువులెవరూ దగ్గరకు రానట్లుంది.. తిండి తిని ఎన్ని రోజులైందో ఏమో.. కాస్త దగ్గరగా వెళ్లింది పుల్లయ్య భార్య.. నెమ్మదిగా ‘‘ అత్తయ్యా.. అత్తయ్యా...’’ తల నిమిరింది. పలకలేదు.. అన్నం వండి పళ్లెంలో పెట్టింది.
పుల్లయ్య తల్లికి అన్నం ముద్దలు నోట్లో పెట్టింది. పైకి లేపి కూర్చోబెట్టింది. కాళ్లు, చేతులు రాలేదు.
వెంటనే తన కూతుళ్లకి కబురు పంపింది.
వాళ్లు క్షణాల్లో వచ్చి అక్కడికి చేరుకున్నారు. తన నాన్నమ్మను చూసి కంట తడిపెట్టారు. తన స్కూటీలో చెరో పక్క పట్టి ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంచి వైద్యం అందించారు. ఆరోగ్యం కాస్త మెరుగైంది. కోడలు చేయి పట్టుకుని నెమ్మదిగా అడుగు మీద అడుగు వేసింది.. ఒకప్పుడు చీత్కరించి తోసేసిన చేతులే తనకు ఆధారంగా నిలిచాయి. వద్దని ఈసడిరచుకున్నా చెరో పక్క క్షణ క్షణం కంటికి రెప్పలా కాపడుతున్న మనవరాళ్లను చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది.. కంట్లో జలజలా రాలుతున్న కన్నీటి చుక్కలు మనవరాళ్లపై పడుతుంటే ఓదార్చసాగారు..
అటు కోడలు, ఇటు మనవరాళ్ల లాలనలో పుల్లయ్య తల్లి జీవిత చరమాంకం హాయిగా సాగిపోయింది