Baava kosam - తాత మోహనకృష్ణ

బావ కోసం


"నన్ను ఇప్పుడే పెళ్ళిచేసుకుంటావా చెప్పు బావా..?" అడిగింది సుమ

"పెళ్ళి విషయం ఇప్పుడు ఎందుకు సుమ...?"

"నిన్ను చూడకుండా నేను అసలు ఉండలేను బావా..నేనేం చెయ్యను..! ఇలా అడగడం తప్పా చెప్పు బావా..? నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపొతే, మా నాన్న నన్ను ఎవరికో ఇచ్చి పెళ్ళి చేసేస్తాడు..నా గురించి కొంచం ఆలోచించు బావా..!"

"నేను బాగా చదువుకోవాలి..మంచి ఉద్యోగం చెయ్యాలి. అప్పుడు మనం పెళ్ళి చేసుకుని హ్యాపీ గా ఉండొచ్చు సుమ ..."

"అదేంటి..అలా అంటావు బావా..? నీకు ఉద్యోగం వచ్చేలోపు ..నాకు వేరే అబ్బాయితో పెళ్ళైతే, నా పరిస్థితి ఏమిటి చెప్పు..! అసలే మా నాన్న చాలా మొండి మనిషి..డబ్బు కోసం నా గొంతు కోస్తాడు. నా చిన్నప్పుడే.. నా పెళ్ళి తన ఫ్రెండ్ కొడుకుతో చెయ్యడానికి ఒప్పుకున్నాడు నాన్న. ఆ అబ్బాయికి లేని పాడు అలవాటు అంటూ లేదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి, నిన్నే నా పక్కన ఊహించుకున్నాను. నీ కళ్ళ ముందే నీ మరదలని ఎవడో పెళ్ళి చేసుకుని, రొమాన్స్ చేస్తుంటే నీకు కోపం రాదా..? నన్నుపెళ్ళి చేసుకున్న తర్వాత కుడా చదువుకోవచ్చు బావా..నేను నీకు సపోర్ట్ చేస్తాను.." అంది సుమ

"నీ అందం, నీ మంచితనం, నా పై నీ ప్రేమని చూస్తుంటే, నిన్ను ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని ఉంది. కానీ..మనం చిన్నవాళ్లం..మన పెద్దవాళ్ళు మనకి ఎలా పెళ్ళి చేస్తారు..? అలాగని పారిపోయి పెళ్ళి చేసుకోలేము కదా..! ఏం చెయ్యమంటావు చెప్పు సుమ..?"

"నేను అంత అందంగా ఉంటానా బావా ..?"

"ఇంకా సందేహమా చెప్పు సుమ..?"

"అయితే నేనంటే ఇష్టమే కదా.." అని సందేహంగా అడిగింది సుమ

"అవును సుమ..." అని గట్టిగా ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు..

"నేనంటే నీకు ఎంత ఇష్టమో తెలిసిందిలే బావా..! నువ్వు పెళ్ళికి ఓకే కదా..మిగతా కథ నేను నడిపిస్తాను..చూస్తూ వుండు బావా..నీకోసం నేను ఏం చేస్తానో.." అంది సుమ

ఒక రోజు మా అమమ్మకు వొంట్లో బాగోలేదని నన్ను, సుమని చూడాలని అంటే..వెళ్ళాము. మా ఇద్దరినీ చూసిన అమమ్మకు.. తను పోయే ముందు మా పెళ్ళి చూడాలని మా మావయ్యను అడిగింది. ఇదంతా నా మరదలి ప్లాన్ అని ఆ తర్వాతే తెలిసింది..

పెళ్ళైన తర్వాత, మొదటి రాత్రి గదిలో..

"మీ నాన్న మన పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు..? ఒప్పుకోడని అన్నావుగా సుమ..?"

"చాలా ఆలోచించాను బావా..! మా నాన్నకి నానమ్మ అంటే ప్రాణం. ఆమె ఏం అడిగితే, అది చేస్తాడు నాన్న. అందుకే, మా నానమ్మని కాకా పట్టి..నాటకం ఆడించి మన పెళ్ళి జరిగేలా ప్లాన్ చేసాను. మా నానమ్మ నాకే ఫుల్ సపోర్ట్.." అంది సుమ

"నువ్వు చాలా గడుసు పిల్లవి సుమా..!" అని పెళ్ళాం బుగ్గ గిల్లాడు

"నీ కోసమే బావా..ఏమైనా చేస్తాను..!" అని గట్టిగా వాటేసుకుంది సుమ

*******

మరిన్ని కథలు

Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Doutya vijayam
దౌత్య విజయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Teeru marchina reelu
తీరు మార్చిన రీలు
- ప్రభావతి పూసపాటి
Ido prema katha
ఇదోప్రేమ కథ
- కొడాలి సీతారామా రావు
Premonmadam
ప్రేమోన్మాదం
- డా:సి.హెచ్.ప్రతాప్
Nene
నేనే
- సింగనమల మస్తాన్ వలి
Achhiyamma
అచ్చియమ్మ
- అనిసా తబస్సుమ్ sk