అద్దంలో నేను - సంధ్య కార్తీక్

ADDAM LO NENU

"ఇప్పుడేమైందని ఎందుకిలా వెక్కివెక్కి ఏడుస్తున్నావ్" అని కోడలు తన మనవరాలు సింధూ ని అడుగుతా ఉంటే అక్కడే పేపర్ చదువుతున్న ప్రసూనమ్మ ఏమైందో తెలుసుకోవడానికి తన చెవి పెద్దదిగా చేసి ఆలకించసాగారు.

సింధూ ఏడుస్తూ "ఆ లయ కి అందరూ పట్టం కట్టబెట్టారు, నేనేమి తక్కువ సాధించాను , చదువులోనూ ముందుంటాను, ఆటపాటల్లోనూ చురుకుగా పాల్గొని ఎన్నో బహుమతులు సంపాదించాను, నాకే ఎందుకిలా జరిగింది ?"

" చూడ్డానికి చక్కగా ఉంటాను నా పేరు నా అందం, నా తెలివితేటలు మా క్లాసులో ఎవరితో సమానం కాదు, అట్లాంటిది..............

అని మళ్ళీ ఏడవటం మొదలు పెట్టింది,

ఏమైందో చెప్పవే ??? నీ తెలివితేటలు నీ రూపురేఖలు గురించి ఎవరైనా ఏమైనా అన్నారా ?అని సింధూ వాళ్ళ అమ్మ అడిగింది.

నాన్న ఎప్పుడూ నన్ను పొగుడుతూ నీలాంటి అమ్మాయి ఉండదని అంటా ఉంటారు ఇప్పుడు అవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది

నాకు ఎవరు క్లాసులో ముద్దతు తెలుపలేదు.

అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ఫణి కూతురు అలా ఏడవడం చూసి నా బంగారు తల్లికి ఏమైంది ?ఎవరు ఏమన్నారు ఎందుకు ఇలా ......

వె క్కివెక్కి ఏడుస్తుంది ఎవరైనా దాన్ని ఏమన్నా అంటే నేను సహించేది లేదు అని హడావిడి చేయసాగాడు.

దివాన్ మీద బోర్ల పడుకోని ఏడుస్తున్న సింధు ఒక్కసారి నాన్న గొంతు విని పరిగెత్తుకు నాన్న దగ్గరికి వచ్చి నాన్న నేను తెలివిగల అమ్మాయిని కాదా??

నాకు అందరినీ ఒక దారిన నడిపించే అర్హత లేదా??

అని ప్రశ్నల వర్షం కురిపించింది .....

ఎవరు నా చిట్టి తల్లి చేత కన్నీళ్లు పెట్టించింది అని అరిచాడు ఫణి .

ఫణి కి కూతురు అంటే ప్రాణం, తను ఏమి చేసినా ఫణి కి ముద్దే , ప్రసూన గారు పిల్లని అంత ముద్దు చెయ్యద్దు అంటే లెక్క చేయకుండా ఇలాంటి అమ్మాయి ఎక్కడ ఉండదు అని పొగడ్తలతో ముంచెత్తుతాడు.

సింధూ కి నాన్న బాగా గారం చేయడం వలన అమ్మ ,నాన్నమ్మ కంటే వత్తాసు పలికే నాన్న దగ్గరే చనువు ఎక్కువ.

వాళ్ళ నాన్న నీ గట్టిగా పట్టుకొని

సింధూ భోరున విలపించింది.

నాన్న మా పదో తరగతి మొత్తం లో నేనే తెలివిగల అమ్మాయిని ,కానీ నన్ను ఎవరు హెడ్ గర్ల్ గా ఎన్నిక చేయలేదు. నా స్నేహితురాళ్ళ ముందు నాకు తల తీసేసినట్టు గా ఉంది, ఏమి చూసుకొని వాళ్లు లయకి ఓట్లు వేశారు. నాకు ఇంకా ఈ స్కూల్లో చదవాలని లేదు, అందరూ నన్ను రేపటి నుంచి హేళన చేస్తారు, లయకి నా అంత తెలివి ,అందం లేవు.,ఏం చూసుకొని అందరూ తనని గెలిపించారో నాకు అర్థం కావట్లేదు.

నువ్వు మొదట ఏడవడం ఆపు తల్లి నేను నువ్వు ఏడుస్తా ఉంటే చూడలేను, గెలుపు ఓటమి సహజం, మనము రెండు సరి సమానంగా తీసుకొనవలెను , అయిన ఇవన్నీ మనకెందుకు , నువ్వు హాయిగా చదువుకో, అమ్మ నీకు ఇష్టమైనది చేసిపెడ్తుంది,తినేసి పడుకో,ఏడ్చి ఏడ్చి నా తల్లి మొహం కందిపోయింది, దీని గురించి పెద్ద ఆలోచన వద్దు , ఎక్కడ పొరపాటు జరిగిందో రేపు చూద్దాం అని కూతుర్ని సముదాయిచాడు.

ప్రసూనమ్మ బిగ్గర గా ఒక నవ్వు నవ్వి తప్పు ఎక్కడ జరిగిందో నాకు బాగా తెలుసు అన్నారు

నానమ్మ నీకు తెలుసా?? నీకు మా స్కూల్లో ఏమి జరగుతుంది ఎలా తెలుసు ? ఆశ్చర్యంగా అడిగింది సింధు

అప్పుడు ప్రసూన గారు

మీ పాఠశాలలో జరిగేది ఏమీ తెలీదు కానీ నీ గురించి బాగా తెలుసు అనింది

మీ నాన్న చెప్పినట్టు ఈరోజు దీని గురించి చర్చించడం వద్దు మీ అమ్మ చేసింది తిని పడుకో, ఈరోజు నేను చెప్పినా ఆ మాటలు

నీకు అర్థం కావు, రేపు ఎలాగో ఆదివారమే కాబట్టి నిదానంగా లేచిన తర్వాత మాట్లాడుతాను.

సింధు కూడా వినే మూడ్ లో లేదు , నానమ్మ మాట విని ఆ రోజు తినేసి బాగా ఏడ్చినందుకు అలసిపోయి పడుకుంది.

మరుసటి రోజు ఆదివారం కావడంతో ఎవరు సింధుని త్వరగా లేపలేదు,

సింధుకి మెలుకువ రాగానే నానమ్మ ఈరోజు తప్పు ఏమిటో చెబుతుంది అన్నది గుర్తుకి వచ్చి ఒక్క ఉదుటున నానమ్మ అంటూ పరుగున తీసింది .....

లేచావా తల్లి మొహం కడుక్కో పాలు తాగేసి రా మాట్లాడుదాం ......

ఏమి మాట్లాడుతుందో తెలుసుకోవాలని ఆతృతతో అన్ని గబగబా చేసేసింది, మామూలుగా అయితే సింధు నాన్నమ్మ మాట అస్సలు వినదు, తను చెప్పే నీతి వాక్యాలు అంటే సింధుకి చిరాకు.

కానీ ఈరోజు పరిస్థితి వేరు......... తనతో ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకోవాలని తపన మొదలైంది

ఒకసారి నానమ్మ దగ్గరికి వెళ్లి నిన్న ఏదో చెబుతాను అన్నావు కదా ఇప్పుడు చెప్పు??

ఇదే ఇదే నేను చెప్పబోయేది నేను నీకు ఒక సహాయం చేస్తున్న కానీ నువ్వు నాతో అడిగే పద్దతి ఇదేనా ?? సౌమ్యంగా మాట్లాడటం పోయి నన్నే గదమాయిస్తున్నావ్ ??

సరే నాన్నమ్మ చెప్పు అని మెల్లగ అడిగింది ,ఇలా మాట్లాడటం సింధుకు ఇష్టం లేదు అయినా సరే నానమ్మతో నా విషయం చెప్పించుకోవడానికి ముక్తసరిగా చెప్పింది.

ఒకసారి లయ అందరితో ఎలా ఉంటుందో చెప్తావా ?? అని అడిగింది నానమ్మ

ఇది అడగడానికా నిన్న నాతో మాట్లాడతానంది అని చిరాకుగా అంది సింధు??

సరే లయ గురించి చెప్పద్దు ఒక్కసారి నీవు అందరితో ఎలా మెలుగుతావో చెబుతావా అని అంది నానమ్మ

నానమ్మ అందరికీ నేనంటే ఇష్టం తెలుసా ?? నా తెలివితేటలతో ఎప్పుడు అబ్బురపరుస్తాను.

నేను అడిగింది ఇది కాదు తల్లి నీవు నీ స్నేహితురాలు నించి ఏమైనా సహాయం కావాలంటే ఎలా మాట్లాడుతావ్ ?

నేను చెయ్యి చాచి అడిగే అవసరం ఏముంది నానమ్మ

నేను చెబితే వాళ్ళు వెంటనే చేసేయాల్సిందే వాళ్లందరికీ నేనే డౌట్స్ తీరుస్తాను, నా దగ్గరికి వచ్చి సలాం కొట్టి వాళ్ల డౌట్స్ తీర్చుకుంటారు. నాకు ఏదైనా వస్తువులు కావాలంటే నాన్న ఉండనే ఉన్నారు.

నీకు ఎవరైనా ఇష్టపూర్వకంగా ఏదైనా ఇచ్చారా?? ఎందుకు ఇవ్వరు నాన్నమ్మ నాతో మా క్లాస్మేట్స్ మాట్లాడాలని ఉవీళ్ళురుతుంటారు,

అదికాదే తల్లి ,నీకోసం ఎవరైనా

అడగ కుముందే చేశారా ??? ఆ ప్రశ్న వినగానే సింధు ఆలోచనలో పడింది

అడగకముందే ఎందుకు చేస్తారు నాన్నమ్మ??

సరే ఇప్పుడు ఒకసారి వెళ్లి కాసేపు మౌనంగా కూచొని ఎవరినైనా మీ క్లాసులో ఎప్పుడైనా నవ్వుతూ పలకరించావా వాళ్ళ బాగోగులు అడిగావా? లేదా వాళ్ళ సహాయం కోరావా? కోరితే కూడా వాళ్లని ఎలా అడిగావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో అనింది.

వెళ్ళేముందు ఒక్కసారి మీ ఆమ్మ పని అమ్మాయితో ఏమి మాట్లాడుతుందో చూసి వెళ్ళు?

అందులోనే ఉంది నీ ప్రశ్నకి జవాబు?

అమ్మ పని అమ్మాయితో మాట్లాడే మాటల్లో నేనెందుకు ఓడిపోయాను అన్న జవాబు ఉందా???

అని అనుకుంటూ వంటింటి వైపు వెళ్ళింది

అప్పుడే వాళ్ళ అమ్మ లక్ష్మి నీకు ఇంట్లో బాగాలేదు అంటున్నావు పర్వాలేదు కొంచెం తినేసి చెయ్యు త్వరగా వెళ్ళిపో ఈరోజు ఈ పని రేపు చేద్దువు గాని అని అంటావుంది......

లక్ష్మీ " అమ్మ మీరు పెట్టింది తినిన తర్వాత కొద్దిగా ఓపిక వస్తుంది, ఈ పని చేసేసి వెళ్తానమ్మ గారు అని అంటా ఉంది.

సింధు ఇది విని దీనిలో ఏముందో అర్థం కాక మొదట నాన్నమ్మ చెప్పిన పని చేద్దామని రూమ్ లోకి వెళ్లి కూర్చుంది........

ఎంతసేపు ఆలోచించినా ఎవరితోటి తను నవ్వుతూ మాట్లాడినట్టుగానే ఎవరైనా తనకు తామే వచ్చి సహాయం చేసినట్టు గానీ గుర్తుకు రాలేదు??

తెల్ల కాగితం తీసుకొని వాళ్ల నాన్నమ్మ దగ్గరికి వెళ్లి నాకు ఏమీ గుర్తుకు రాలేదు నానమ్మ,?

ఎందుకు వస్తాయి తల్లి నువ్వు ఎప్పుడైనా ఎవరితో నన్న నవ్వుతూ మాట్లాడిస్తే కదా? అవతలి వాళ్ళ గురించి ఒక్కసారైనా ఆలోచించావా???? ఎంతసేపు నీ పని చేయించుకోవడానికి కూడా నువ్వు మాట్లాడే తీరు చాలా కటువుగా ఉంటుంది .....

ఎట్లాంటి విషయమైనా మనం మాట్లాడే పద్ధతి, ధోరణి లో ఉంటుంది.

నువ్వు చెప్పే మామూలు విషయమైనా నువ్వు మాట్లాడే ధోరణి అవతలి వాళ్ళని చాలా కష్టపడుతుంది.....

ఒకసారి నవ్వుతూ మాట్లాడ టం అలవాటు చేదుకో ,అందరి తో నిదానముగా మసులుకో , సహాయం చేయడానికి ముందు ఉండు నీకు తెలియకుండానే ఒక తెలియని ఆనందం,,నీవు అడగకుండానే పది చేతులు నీకు సహాయం చేయడానికి వస్తాయి.

అందరితో మాట్లాడే పద్ధతి ఎంతో ముఖ్యం , అలాగే నీ హావభావాలు కూడా ఎప్పుడూ

చిరాకు పడుతూ చిటపటలాడే నీ మొహం నీకు ఏ స్నేహితురాలని మిగల్చదు., చిన్న చిరునవ్వుతో మృదువుగా మాట్లాడితే అందరూ మనవాళ్ళు అవుతారు, ఎంతసేపు నీ వైపు నుంచే ఆలోచిస్తావు కానీ అవతలి వాళ్ళ వైపు కూడా ఆలోచించడం మొదలుపెట్టు అప్పుడు నీకు నీవే కొత్తగా కనబడతావు

అందం ,తెలివి చూసి నీకు స్నేహితురాలు అవుతారు అనుకుంటే

అది పొరపాటే, ఎలాంటి వారైనా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తుంటే అందంగానే కనబడతారు, ఎంత రూపు రేఖలు చక్కగా ఉన్నా ఎప్పుడూ చిటపటలాడుతూ ఉంటే ఎవరికి వారితో మాట్లాడాలని కూడా ఉండదు. నీ మాటలతో ఎందరి మందిని బాధ పెట్టావో ఆలోచించు తల్లి??

లయ ఓట్లతో నీ మీద గెలిచింది అంటావ్,కానీ ఆ లయ అందరినీ ఎప్పుడో తన మాటలతో, చేతలతో గెలిచింది అంటాను నేను.

ఇందాక మీ అమ్మ ఎలా మాట్లాడింది గుర్తుతెచ్చుకో? నీవు ఎవరితో నైన ఎప్పుడైనా అల సున్నితంగా

మాట్లాడావా??

మనం మాట్లాడే పద్ధతితో తో ఎన్నో సాధించవచ్చు తల్లి,నీవేమో అందరితో అధికారంగా మాట్లాడతావు.......

కేరళలో ఒక యదార్ధ ఘటన జరిగింది అది నీకు అది నీకు చెబుతాను విను

అని ప్రసూనమ్మ సింధుకి చెప్పసాగింది ఒక పెద్ద బిల్డింగ్ లో

ఆఫీసుకు వెళ్లే ఒక అమ్మాయి అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ తో పొద్దున సాయంత్రం చిరునవ్వు తో పలకిరించేది ....తీరా ఒక రోజు ఆ అమ్మాయి ఇంటికి రాత్రి అయిన చెరపోయేసరికి తనకోసం వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకి,ఇంటి వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ తను సాయంత్రo ఆ అమ్మాయి బైటకి వెళ్ళింది చూడలేదని ఖరాఖండిగా చెప్పాడు. ఈ బిల్డింగ్ లో ఇలా పలకరించే వాళ్ళు తను ఒక్కరే కాబట్టి తనకి బాగా గుర్తు ఉందని చెప్పాడు. ఆ విషయంతో పోలీసులు ఆ అమ్మాయి స్టోర్ రూమ్ లోనే లాక్ అయిపోయిందని కనుక్కొని ఆ అమ్మాయిని కాపాడారు, చూసావా ఒక చిన్న చిరునవ్వు అమ్మాయి ప్రాణాలే కాపాడింది...............

ఒక్కసారి నువ్వు అందరితో నవ్వుతూ,సున్నితంగా మాట్లాడి చూడు నీకే నీవు కొత్తగా కనిపిస్తావు అని చెప్పింది.

సింధు ఆ రోజు నుంచి స్కూల్లో తన క్లాస్మేట్స్ అందరూ ఎలా మాట్లాడుతారు

లయ అందరితో ఎలా మసులుతుందో చూడ సాగింది.....

తన ప్రవర్తన

ప్రవర్తన నువ్వు లోపం తన ప్రవర్తనలో లోపాలు మరియు ఎక్కడ తను ఓడిపోయిందో అర్థం అవ్వ సాగింది.

సింధూలో మెల్లమెల్లగా మార్పు రావడం మొదలైంది

అందరితో కోపంగా , అధికారం గా కాకుండా నవ్వుతూ స్నేహపూర్వకంగా మాట్లాడటం మొదలు పెట్టింది. తనకి తెలియకుండానే అందరూ మార్పుని, చాలా ఇష్టపడ్డారు. తనకి ఇప్పుడు ఎవరి మీద కోపం కూడా లేదు.

అద్దం ముందు నిల్చున్న ప్రతిసారి తన రూపురేఖలని పొగుడుకొనే సింధూ , ఈసారి తన నవ్వుతో ఎంతో ప్రసన్నంగా మరింత అందంగా కనిపించింది.

తనలో వచ్చిన మార్పుకి

అద్దం లో నే నే నా ???

అని సింధు చిన్న నవ్వుకొని ఆ ఓటమి వల్ల నిజమైన గెలుపు సాధించానని ఆనంద పడి నాన్నమ్మను హత్తుకుందామని పరిగెత్తుకుని వెళ్ళింది .

మరిన్ని కథలు

Betting bhootam
బెట్టింగ్ భూతం
- సూర్య. మండా (MS)
Nannamma manavadu
నాన్నమ్మ-మనవడు
- సంధ్య కార్తీక్
Devudu varamiste
దేవుడు వరమిస్తే !
- సంధ్య కార్తీక్
Pellichoopula padanisalu
పెళ్లి చూపుల పదనిసలు
- సంధ్య కార్తీక్
Vaikalyam
వైకల్యం
- డా:సి.హెచ్.ప్రతాప్
Nachhina jeevitham
నచ్చిన జీవితం
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు