రేగి చిగురులు - Chandrasekhar Reddy

Regi chigurulu

"చెట్టు పై నున్న వాడు చెట్టు యజమానికి దొరకడం యదావిదిగా వస్తున్న ఆచారం"....

చెట్టు పైకి ఎక్కడంటే కనీసం ముప్పై పండ్లతొనైన జోబి నింపల్సిందే... పట్టుబడితే కిందున్న అందరు బడికి పరుగులు... చెట్టు పై నున్న వాడు చెట్టు యజమానికి దొరకడం యదావిదిగా వస్తున్న ఆచారం.... ఆ యజమాని నుంచి తప్పించుకునే దారి కొసం ఎప్పుడు ఎవ్వరు వెతకలేదెవ్వరు... మరో రోజు ముందుకు అడుగులు మరిన్ని రేగిపండ్ల కోసమే....ఆదివారం వస్తే ఆటలకి తలుపులు తెరవబడతాయి... ఆ రోజంత ఆదివారం అంతా ఆటలే....
లగొరి, పిగ్ (గొలిలాట లో ఒక ఆట), క్రికెట్,.. ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజులు ఆ రేగి చెట్టుకు దెబ్బలే....

ఎండాకాలం వచ్చేసింది....

రేగి పండ్ల చెట్ల నుండి చింత బోట్ల చెట్టుకి మారే సమయం ఆసన్నమైంది.... రేగిపళ్ళ చెట్టు ఉత్తరం వైపు ఉంది దానికి టాటా చెప్పి... దక్షిణం వైపు నున్న చింత బోట్ల కు హాయ్ చెప్పాము.... అప్పుడే పుట్టిన పాపలు చింతచిగురులు, అందిన ఎత్తులో చిగురు, అందనంత ఎత్తులో చింత బోట్లు... ఇంటి నుంచి పొద్దునెప్పుడో ఆడుకోడానికి బయటికొచ్చి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఆ చిగురు తీసుకెళ్తే ఆ రోజు దెబ్బలు తప్పవు... చింత చిగురు మాకు తినడానికే కాదు అమ్మ నుంచి దెబ్బలను కూడా తప్పిస్తుంది.... రాత్రికి అమ్మ చింత చిగురుతో పప్పు చేసి మళ్ళీ మా దగ్గరికే వస్తుంది.... చింత చెట్టు ఇంత మేలు చేస్తుందని నాకిప్పుడు తెలిసింది... దానికి తోడు కాలం మారుతున్నట్లు అప్పుడప్పుడు ఒక ఆకు నుంచి ఇంకో ఆకుకు మారాలి లేకపోతే ట్రీట్మెంట్ వేరెలాగా ఉంటుంది.. అదే చింత చిగురు నుంచి బచ్చలాకు పట్కరావడం.. అక్కడక్కడ పూల మొక్కలు, అరటి మొక్కలు, ఒక్కోసారి అరటి మొక్క అనుకొని పసుపు మొక్క పట్టుకొచ్చేవాళ్ళం... అది పసుపు మొక్కనా అని రెండు మూడు వారాలకు గాని తెలిసేది కాదు.... ఇవన్నీ ఒక ఎత్తు అయితే బురదల లో చేపలు పట్టడం వాటిని పెంచి మరో మూడు వారాలలో పెద్దగవుతాయి ఆ తర్వాత ఇక కోసుకొని తినడమే తరుణం అన్నట్లు ఆలోచనలు.. తీరా అన్ని ఆలోచనలు పటాపంచలు... మా వెంట వచ్చిన మేము పట్టిన చేపలు మరుసటి రోజు సాయంత్రానికే కొండెక్కాయి....
ఆకులు రాలాయి., పండ్లు పోయాయి., చేపలు చచ్చాయి., మొత్తానికి బడిలో పరీక్షలు ముగిశాయి....

బడికి సెలవులు:
ఇక వూరికి ప్రయాణం.... తిన్నకాడికి తినొచ్చు, దోచేకాడికి దోచుకోవచ్చు... ఎగిరే కాడికి ఎగరచ్చు, ఆడే కాడికి ఆడొచ్చు, ఇవన్ని యాబై రోజుల సెలవులోన్నే చెయ్యాలని లెక్కలేమి లేవు... ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయడమే....

నీటి ప్రవాహంలా గడిచిపోతున్న సమయంలో నాతో పాటు కాలం ముందుకు సాగింది దానితో పాటు నేను ప్రయాణించాను అప్పుడప్పుడే పుట్టిన పిల్లాడిలాగ ఆనందంలో మునిగితేలుతున్న సమయంలో ఒక ముప్పు వచ్చింది.
ఆ ముప్పుని తట్టుకోవడానికి మన పక్కన దేవుడున్న ఏం చెయ్యలేడు ఎందుకంటే అంతకన్నా ముందే నా తల పైన రాక్షసుడు తాండవమాడుతుంటాడు... ఆ తాండవానికి నా గుండెల్లో కొత్త గుబులు మొదలయ్యింది...
ఆ రాక్షస తాండవ గాలికి నేను కొట్టుకోపొడానికి సిద్ధంగా ఉన్నాను....
కొద్ది రోజుల్లో చదివిన చదువులకు రిజల్ట్స్ వచ్చాయి....
తెలిసిందే కదా. అవన్ని చెప్పకూడదు, చెప్పకూడదంతే....
చెప్పకూడని సంఘటనలన్నీ ముగిశాక.....అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో గుర్తొచ్చిన కొన్ని సన్నివేశాల తాకిడి ఒక్కసారిగా నా మెదడుని తాకింది...

రెగ్గాయల కోసం మోకాళ్ళ చిప్పలు పగల గోట్టుకున్నాం... తీరా నిద్ర లేచి చూస్తే అమ్మ అంగట్లో కొన్న రేగ్గాయలు ఇంట్లో
గంపకు పడి ఉన్నాయి.... మరి నేనెందుకు చెట్టులు పుట్టలు తిరిగాను...

చింత చిగురు చెట్టు ఇంటికెదురుగా మిద్దెకు రెండింతలు ఉంది...మరి నేను చింత చిగురు తెస్తే ఆనందంగా ఎందుకు తీసుకుంది...

రొచ్చులో ఎరుకొచ్చిన చేపలు మూడు వారాలలో పెద్దగై కోసుకొని తిందామనుకున్నాం కానీ తీరా చూస్తే మరుసటి రోజు మధ్యాహ్నానికి ఇంట్లో చేపల కూర... మరి నేనెందుకు రొచ్చులో ఉన్న చేపలు పట్టుకుని తీసుకొచ్చాను....

ప్రశ్నలన్ని సమాధానం లేక ఆలోచనలు అలల లాగా ముందుకు వెనక్కు వెళ్తున్న....

సమాధానం అందట్లేదు, దొరకట్లేదు, అంతుచిక్కట్లేదు,...
దాని కన్నా ముందు నాకు ఊపిరి ఆడట్లేదు....

ఫ్యాన్స్ గాలి రావట్లేదు....
అలా చమటలతో నిద్ర లేచ...
గట్టిగా గాలి పీల్చుకున్న...
.
..
...
ఇంట్లో చేపల కూర వాసన గాలికి వచ్చి తగిలింది.

మరిన్ని కథలు

Adde talli
అద్దె తల్లి
- Madhunapantula chitti venkata subba Rao
Dongalu dorikaru
దొంగలు దొరికారు..!
- - బోగా పురుషోత్తం
Oddika
ఒద్దిక .
- Aduri.HYmavathi.
Maro konam
మరో కోణం
- గాయత్రి
Snanam
స్నానం
- మద్దూరి నరసింహమూర్తి
Swaadheenapatika
స్వాధీన పతిక
- వీరేశ్వర రావు మూల
Ekkadainaa baava
ఎక్కడైనా బావ..
- ఎం బిందు maadhavi