దాపరికం - వరలక్ష్మి నున్న

Daparikam

నాకు వయసు మీద పడుతుంది, ఉన్న ఒక్క కొడుక్కి సంసారం, ఆస్తులు అప్పగించినా, నా దగ్గర కొంత డబ్బు, నా పేరు మీద కొంత పొలం ఉంచుకుని నా కాల ధర్మం తర్వాత నా మనవరాలు భవాని కి చెందేలా వీలునామా రాయించాను, నా కొడుకు ప్రసాద్ వచ్చి అడిగాడు నన్ను అదేంటమ్మా ఎవరైనా కూతురికో, ఆమె పిల్లలకో ఇస్తారు ఉన్నదoతా, నా కూ తురి కి రాసావ్, చెల్లి వచ్చి గొ డవ చేస్తుందేమో ఒక్కసారి ఆలోచించమ్మ అని.. మీఇద్దరికీ సమానంగా ఇచ్చాను మీ నాన్న ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని.. నేను...నా తల్లి ఇచ్చిన దాన్ని నా ఇష్టాపూర్వకం గా నా మనవరాలికి రాసుకున్నాను, ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు, నువ్వు కంగారు పడకు వెళ్ళు అని సర్ది చెప్పి పంపాను.. అయినా నేను తప్పు చేశాను, దాన్ని కొంతవరకు అయినా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను అంతే.. అని మనసులో అనుకుని..భవాని ఎక్కడున్నావ్ తల్లి పడుకుందాం రామ్మా అని పిలిచి నా పక్కలో వేసుకుని పడుకున్నాను నా ముద్దుల మనవరాలిని.. నానమ్మ నేను డిగ్రీ పూర్తిచేసేసాను కదా, ఇంకా చదువుతాను అంటే అమ్మ పడనివ్వడం లేదు, నువ్వు అయినా చెప్పు అమ్మ కి అంది బేలగా, సరే నేను చెప్తాను లే నువ్వు పడుకో అని చెప్పాను గాని నాకు మనసులో ఆలోచనలతో నిద్ర రాలేదు.. మర్నాడు నా కొడుకు, కోడలిని పిలిచి భవానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం, ఈలోపు దాన్ని కాలేజీ లో వేయండి అని చెప్పాను, వాళ్ళు సరే అన్నారు... నా మనవరాలు కాలేజీ కి వెళ్తుంది చక్కగా, సంబంధాలు కూడ చూస్తూనే ఉన్నాము, ఏమి సెట్ అవడం లేదు... ఒకరోజు నా మనవరాలు వాళ్ళ కాలేజీ నుండి మేడం ఎవరో వచ్చారు, నాతో మాట్లాడాలి అన్నారు అని చెప్పింది.. ఆవిడని చూడగానే నా కాళ్ళ కింద భూమి కదిలింది, ఆవిడ నన్ను గుర్తు పట్టింది, మీరు గంగమ్మ కదా, అంటే భవాని మీ మానవరాలేనా అని సంతోషంగా మాట్లాడుతున్న ఆవిడ వచ్చిన కారణం తెలియ లేదు, మెల్లగా అడిగి తెలుసు కున్నాను, ఆవిడ తన కొడుక్కి భవాని ని ఇచ్చి పెళ్లి చేయమని అడిగింది, నేను ఖచ్చితంగా చెప్పేసాను చేయనని, కానీ ఆవిడ అంత తేలిగ్గా వదలేదు విషయాన్ని, నాకు వంకేమి దొరక్క మీ అమ్మాయి, మా మనవరాలు ఒక్కరోజే పుట్టారు, ఆతరువాత మీకు అబ్బాయి పుడితే, మా అమ్మాయి కన్నా చిన్న వాడు కదా అన్నాను.. దా నికి ఆవిడ నవ్వి, వాడు నా కొడుకు కాదు, నా మేనల్లుడు, పాప పోయాక, నా భర్త నన్ను వదిలేసాడు,... మళ్ళీ తల్లి అయ్యే భాగ్యం లేదని... నేను పుట్టింటికి చేరాను... అన్న వదిన లు ఒక రైలు ప్రమాదం లో చనిపోయారు...దాంతో నేను నా మేనల్లుడిని తెచ్చుకుని పెంచుకున్నాను..సరే అయితే అబ్బాయి వివరాలు అన్ని మా కొడుక్కి ఇచ్చి వెళ్ళండి, అని చెప్పి పంపాను.. నా కొడుకు ఒప్పుకోలేదు అయినా ఒప్పించి నా మనవరాలిని తన అత్త వారి ఇంటికి కాదు తన కన్న తల్లి దగ్గరికి పంపి, నేను చేసిన పాపాన్ని కడుక్కున్నాను.. నా కోడలికి పురిటిలోనే పుట్టిన బిడ్డ చనిపోయింది, మళ్ళీ పుట్టే అవకాశం లేదన్నారు డాక్టర్ లు.. దానితో ఏంచేయాలో తెలియలేదు, చనిపోయిన నా మనవరాలిని ఆ టీచరమ్మా పక్కలో పడుకోబెట్టి, ఆవిడ కూతురిని నా కోడలిపక్కలో పెట్టి చేయరాని పాపం చేశాను..ఆవిడ కి చచ్చే లోపు నిజం చెప్పాలి అని ఉన్నా దాచి పెట్టడమే మంచిది అని నా మనసు చెప్తుంది.. అందుకే ఈ దాపరికం.. నన్ను క్షమించు టీచరమ్మ, నా తప్పుని మన్నించి నన్ను క్షమించు భగవంతుడా....

మరిన్ని కథలు

Adde talli
అద్దె తల్లి
- Madhunapantula chitti venkata subba Rao
Dongalu dorikaru
దొంగలు దొరికారు..!
- - బోగా పురుషోత్తం
Oddika
ఒద్దిక .
- Aduri.HYmavathi.
Maro konam
మరో కోణం
- గాయత్రి
Snanam
స్నానం
- మద్దూరి నరసింహమూర్తి
Swaadheenapatika
స్వాధీన పతిక
- వీరేశ్వర రావు మూల
Ekkadainaa baava
ఎక్కడైనా బావ..
- ఎం బిందు maadhavi