చలనాలచందు - B.Rajyalakshmi

Chalanala chandu

రాము చందు ఒకే బళ్లో హైస్కూల్ దాకా చదువుకున్నారు .తర్వాత ఆ రెండుకుటుంబాలు తండ్రుల ట్రాన్స్ఫర్ ల వల్ల విడిపోయారు కానీ వాళ్లద్దరి మధ్య కాంటాక్ట్ వుంది .రాము చదువైపోయి విజయవాడ లో కంపెనీ లో చేరాడు యింకా పెళ్లి కాలేదు .చందు దగ్గరనించి రాము కు మెసేజ్ వచ్చింది అదేమిటంటే ఆ వూళ్లో చందు కు వుద్యోగం వచ్చింది .రాము దగ్గరకు తన లగేజ్ తో వచ్చాడు చందు .రాము తన రూమ్ లో వుండమన్నాడు కానీ చందు విడిగా వుంటానన్నాడు .ఒక ఆదివారం యిద్దరూ గది వేట మొదలుపెట్టారు చాలా మంది బ్రహ్మచారులకు అద్దెకివ్వమన్నారు .అతిప్రయాసల మీద ఒక రూమ్ దొరికింది .అయన పెట్టిన అన్ని కండిషన్లకు ఒప్పుకున్నారు .చందు గృహప్రవేశం చేసాడు .రాము వూపిరి పీల్చుకున్నాడు .పదిహేను రోజులతర్వాత చందు బిక్కమొహం వేసుకుని రాము దగ్గరకు వచ్చాడు “ నేను అర్జెంట్ గా రూమ్ మారాలి “అన్నాడు .”ఎందుకు “రాము ప్రశ్నించాడు .

“కుక్కల గోల భరించలేకపోతున్నాను రాత్రుళ్లు నిద్రలేదు “అన్నాడు చందు విసుగ్గా .రాము కు అర్ధం కాలేదు కానీ చిన్నప్పటిస్నేహం కదా అందుకే మళ్లీ గది వేట మొదలు పెట్టారు ఒక గది దొరికింది కానీ యింటియజమాని కాక యింకా రెండు అద్దెయిళ్లవాళ్లు వున్నారు .అంటే చందు తో పాటు ముగ్గురు అద్దెయిళ్లవాళ్లు వున్నారు రెండిళ్లవాళ్లు కుటుంబాలు చందు తలవంచుకుని వెళ్లాలి అటూయిటూ చూడకూడదు .సరే వాళ్ల రూల్స్ కు ఒప్పుకుని చందు రూమ్ లో చేరాడు .మళ్లీ ప్రాణవాయువు గట్టిగా పీల్చాడు రాము . ఇద్దరూ సాయంకాలం సరదాగా తిరిగేవాళ్లు చీకటిపడేటప్పటికీ యెవరి రూమ్ కు వాళ్లు వెళ్లేవాళ్లు .ఇద్దరూ డబ్బుఖర్చులో జాగ్రత్తగా వుండేవాళ్లు ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా జాగ్రత్తగా వుండేవాళ్లు . రెండునెలల తర్వాత మళ్లీ ఒక ఆదివారం చందు మొహం వేళ్ళాడేసుకుని రాము దగ్గరికొచ్చాడు .వాడి మొహం చూడగానే రాము కు కంగారేసింది .
“రామూ “అంటూ భోరున యేడ్చేసాడు .
“అద్దెలకుంటున్నవాళ్లు యెప్పుడూ కొట్టుకుంటూ తగాదాలు పడుతూ నేను వచ్చేటప్పటికి వాళ్ళకోపమంతా నా మీద చూపిస్తూ నేను వాళ్లను వెక్కిరిస్తున్నాని ఓనర్ కి చెప్తున్నారు నా వల్లకావడం లేదు యింకో గది వెతుక్కోవాల్సిందే “అన్నాడు చందు .రామూ మౌనం గా వుండిపొయాడు.మొత్తానికి చందు నాలుగైదు రూములు మారాడు .ఎక్కడా నిలకడ లేదు .ఈ గలాటాలలోనే చందు కు పెళ్లి నిశ్చయం అయ్యింది .పదిహేను రోజుల్లో పెళ్లయిపోయింది .ఇప్పుడు ఫామిలీ పోర్షన్ వెతకాలి .ఆ బాధ్యత కూడా రాముదే..భార్య కాపురానికి వచ్చేలోగా రెండుగదుల ఫామిలీ పోర్షన్ చూసిపెట్టాడు రాము . చందు భార్య కొత్తకాపురం మొదలుపెట్టారు .రాము వెళ్లి కాసేపుకూర్చుని భోజనం చేసివచ్చేవాడు .అప్పుడప్పుడు బయట సరదాగా గడిపేవాళ్లు .

మళ్లీ ఒకరోజు చందు దిగాలుగా ఒక్కడే రాము దగ్గరకు వచ్చాడు
“రామూ మా ఇంటిఓనర్ అర్జెంట్ గా యిల్లు ఖాళీచేయమంటున్నాడు “అన్నాడు చందు .
“ఎందుకు “అడిగాడు రాము
మొహమాటపడుతూ “ఏం చెప్పమంటావు ! మా ఆవిడ నీలిమ పెద్దగా సినిమాపాటలు పెట్టి పగలల్లా తాను కూడా బిగ్గరగా పాడుతూ నిద్రలేకుండా చేస్తున్నది అంతేకాదు రాత్రుళ్లు కూడా పాటలు పెద్ద సౌండ్ తో పెడుతున్నది చెప్పినా వినడం లేదు .వున్నపళం గా ఖాళీచేయమంటున్నారు “అన్నాడు చందు .

“నీ ఖర్మ నా వల్లకాదురా “అన్నాడు రాము .
ఆ మర్నాడే భార్యను పుట్టింటికి పంపి యిళ్ళవేటలో పడ్డాడు చందు .

అదండీ కథ ! ఇప్పుడు చందుపేరు
ఏమిటో తెలుసండీ ?? చలనాల చందు ! ఒక శుభముహుర్తం లో రెండుగదుల యిల్లు కొనేసాడు !
,

మరిన్ని కథలు

Avakaram
అవకరం
- డి.కె.చదువుల బాబు
Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు