శ్రీరామచంద్రుని పూర్వికులలో ఒకరైన ఇక్ష్వాకుని కుమారుడు నృగు మహరాజు.ప్రతిదినం క్రమంతప్పక పూజా , దానం చేసిన అనంతరమే ఆహరం స్వీకరించేవాడు.
ఒకరోజునృగుడు యాగానంతరం పలువురికి దానం ఇస్తూ కశ్యపునికి కూడా అనేక గోవులు దానం చేసాడు. నృగుని సేవకుల తప్పిదంతో కశ్యపునికి దానం చేసిన గోవు ఒకటి నృగుని పసు సంపదలో కలుపుకున్నారు.
కొంతకాలం అనంతరం నృగుడు మరలా మరో యాగం చేసి పలువురికి గోవులు దానం చేస్తూ కస్యపుడు దానం పొంది తమ వద్ద ఉన్న ఆవును ఒకబ్రాహ్మణునికి దానం చేసాడు. అక్కడే ఉన్న కశ్యపుడు తన దానం పొంది తప్పిపోయిన ఆవు అదేనని గుర్తించి , అదితన ఆవు అని తిరిగి తనకు ఇప్పించమని అడిగాడు. ఆవు దానం పొందిన బ్రాహ్మణునికి ఎంతధనం ఇస్తానన్నా ఆవును తిరిగి ఇవ్వను అని నృగునికి చెప్పి వెళ్ళిపోయాడు.
కశ్యపుడుకూడా వేరే ఆవులు ,ధనం వద్దని తనకు ఆదే ఆవు కావాలని పట్టుపట్టాడు కశ్యపుడు. నిస్సహయుడిగా నృగుడు అపరాధిలా కశ్యపుని ముందు చేతులు కట్టుకు నిలబడ్డాడు.
బహిరంగంగా దానం చేసిన దాన్ని దొంగిలించి మరొకరికి దానం చేసేనీవు ఊసరవల్లి వంటి వాడవు మహతపస్వులమైన మావంటి వారిని అవమానించి ఆగ్రహనికి గురి ఐననీవు తగిన శిక్ష సందర్బోచితంగా అనుభవిస్తావు అని కశ్యపుడు వెళ్ళిపోయాడు.
అనంతరం కొంతకాలానికి నృగుడు మరణించగా యమభటులు వచ్చి నృపుని యమధర్మరాజు ముందు ఉంచారు. " రాజా నిత్య పూజాఫలం,నిరంతర దానంతో నీకు దీర్ఘమైన పుణ్యఫలం లభించింది.
కాని నీదాన విషయంలో జరిగిన పొరపాట్లకు నీవు కొంతకాలం నరకలోకంలో ఉండాలి. కనుక ముందుగా స్వర్గం వెళతావా?,నరకంలో ఉంటావా ? "అన్నాడు.
" యమధర్మరాజా తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కనుక నేను ముందుగా నరకలోకలోకంలోఉండి నాకు విధింపబడిన శిక్ష అనుభవిస్తాను "అన్నాడా నృగుడు. "సరే కశ్యపు మహర్షి నువ్వు ఊసరివల్లిగా జీవించకు అని అన్నాడు ఆకారణంగా నీవు భూలోకంలో మీపాపఫలం తీరేవరకు ఊసరవల్లివై జీవించు "అన్నాడు యమధర్మరాజు.
అలా భూమిపై నృగుడు జీవించసాగాడు.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కుమారులు పూలచెండును బంతిలా చేసి ఆడుతూ ఉండగా ఆబంతి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. బంతితోపాటు బావిలో ఊసరవల్లిని తీసుకువెళ్ళి తమతండ్రి శ్రీకృష్ణునికి చూపించారు. చిరునవ్వుతో శ్రీకృష్ణుడు ఊసరవల్లిని తాకగా నృగుడు తన నిజరూపంధరించి శ్రీకృష్ణుని అనుమతితో స్వర్గం చేరాడు.