మోహనరావు మంత్రిప్రగడ. ఎలాగైతే మొత్తానికి అవినాష్కీ అరుణకీ పెళ్ళైయింది. పుర్వం పెళ్ళిళ్ళు ఐదు రోజులు జరిగేవి. దానిగురించి మనకి బాగ తెలియిలంటే కాళ్ళకూరి నారాయణరావు గారి వరవిక్రయం నాటకం చదవాలి. ఒక్కొ కార్యక్రమానికి ఓరోజు కేటాయించేవారు. అంతేకాదు ఆడపిల్ల పెళ్ళంటే ఎంత భయంకరమో కూడా తెలుస్తుంది, ఇంకఎంత దగ్గర బంధులు వస్తారో కూడా తెలుస్తుంది. సరే అసలు కధకివద్దాం.
ఆరోజు పెళ్ళికొడుకు అలకపాన్పు కార్యక్రమం. జనరల్గ ఇప్పుడు ముందే పెళ్ళికొడుకు ఏంఅడగాలో నిర్ణయం అయిపోతోంది. ముందుఅసలు పెళ్ళికొడుకుగురించి ముందు చూద్దాం. అభ్యుదయభావాలు గల మనిషి, అంచేత ఆడపెళ్ళివారికి చాలా ఇబ్బంది తగ్గింది. వీడిదిగ పెళ్ళవారింటి పక్కిల్లే ఇచ్చారు, అనుకులంగ ఉండడానికి రెండళ్ళమధ్య గోడ బద్దలకొట్టి దారి కూడా ఏర్పాటుచేసారు. పెళ్ళకొడుకు తన ఫ్రండుతో సరదాగ బైటకివ చ్చాడు.
ఆవరణంతా కలతిరిగాడు నెమ్మదిగా రేండిళ్ళ మధ్య ఏర్పాటుచేసిన గుమ్మందగ్గరకి వచ్చాడు,అక్కడపనిచేస్తున్న మనిషిని పిలిచాడు. "బాబు నీపేరేవరోయి, నువ్వు ఈఇంటి యజమాని గారి మనిషివా" అడిగాడు అవినాష్, "ఆయి అవనండే నేనారి పాలికాపునండి" అన్నాడు అతను. "సరే ఇది మీ అయ్యగిరి సోంతఇల్లేనా" అడిగాడు అతను.
"అయ్యబాబఅలగంటిరేండి బాబు, ఈఇల్లు మాయజమాని తాతగారూ కట్టించరంటండి, ఆయనక మాయజమాని తండ్రిగారు ఉండే వారంటండి, ఇప్పుడు మాయజమాని గారు దీనికి మరమ్మత్తులు చెయించీ స్తనాలగదులు మరుగు దొడ్లు అందుబాటులో కట్టించుకొన్నారండి ఆయి" అన్నాడతగాడు. అయతే మీయజమానికి మొక్కలంటే పడద," అని అడిగాడు అవినాష్. "అదేంటడిబాబు పుసుక్కున అలగడిసినారేంటండి మాపోలం నిండా అరిటితోట కొబ్బరిచెట్లు, ఇంకా బోల్డు రకాలున్నాయండి," అని తలపాగ చుట్టుకొంటు అన్నాడు పాలికాపు. "అలాగ సర్లే మొత్తం ఇదంత ఎకరపైనే ఉంటుందేమో" అడిగాడు అవినాష్ , "సిత్తం రెండు ఎకరాలు లంటండీ" అన్నాడు. "సరే నువ్వేళ్ళి పని చూసుకో ఊరికె అడిగానులే" అని లోపలకి వేళ్ళి పోయాడు అవినాష్. ఆసాయంత్రమే అలక పాన్పు ఏర్పాటటు చేసారు,
పేళ్ళివారికోసం ఎదురుచూస్తున్నారు.ఎంతకి వాళ్ళు రావటంలేదని పెళ్ళిపెద్దఒకాయన విడిదికి వెళ్ళారు. అదిచూసి పెళ్ళికొడుకు తల్లి కంగారుపడి ఇదిగో పద్మ మనంరావటంలేదని వాళ్ళు కంగారు పడుతున్నారు, వీడేమో పదినిమిషాలని గదిలో దూరాడు, ఏంచేస్తున్నాడో తెలియటంలేదు, ఈలోగ నువ్వెళ్ళి ఏదో మేనేజ్చేయి" అంది.
పద్మ ఆవచ్చనాయన తో వెళ్ళి పాన్పుమీద దుప్పటి చూసి "ఇదేంటండీ ఇంత చవక దుప్పటివేసారు" అంది. "అయ్యో అదా అమ్మ సంగతి" అని మరో మంచి ఖరీదైన దుప్పటివేసింది పెళ్ళికూతురు తల్లి. "సరే నే వెళ్ళి మాఅన్నయ్యని అందర్ని తీసుకు వస్తా" అని వెళ్ళింది. అప్పటికి బైటకొచ్చిన వరుడు అవినాష్ దరితోకలిపి పెళ్ళివారింటికి దారితీసాడు. అల్లుడుగారు పాన్పుమీద కూర్చొన్నారు. "అడగండీ బాబు అల్లుడుగారు మీకు కావలసింది మీవగార్ని" అన్నారు పంతులుగారు. అవినాష్ ఓకవరు తీసి మాగారికి ఇచ్చాడు. ఆయన అయోమయంగా అతనికేసి చూసారు.
"చూడండి మావయ్యగారు. ఈకవరు మీ బీరువాలో బద్రంగ దాచండి, పెళ్ళి సందడి అంత ముగిసాక ఓపెన్చెసి చదవండి, అంతవరకు మీరెం భయపడకండి,ఈకవరుకి మీఅమ్మాయి నిమేంచూసుకోవడినికి సంభందంలేదు, ఆమే మాఇంటీ కోడలు అంచేత ఆమెకే ఇబ్బంది కలగకుండా చూసుకొంటాం అంచేత మిగత కార్యక్రమాలన్ని యధావీధిగా జరిపించండి" అన్నాడతను. అతనిమావగారు ఆకవరు బద్రపరచి మిగతా కార్యక్రమాలు జరిపించి పెళ్ళివారిని సాగనంపారు.
ఆరాత్రి ఆయనకి నిద్ర పట్టలేదు, ఆకవరులో ఏముందో అని దాని గురించే ఆలోచిస్తుండిపోయిడు. ఆమరనాడు ఆయన భార్య వంటింట్లో ఉండగ బీరువాతీసి కవరు వణకుతున్న చేతులతో విప్పారు ముందు కళ్ళు మసకబారాయాయి, నెమ్మదిగ కళ్ళు తుడుచుకొని మంచంమీద కూర్చొని కాగితం మడతలు విప్పాడు. "మావయ్కగారికి నమస్కారములు, గాబరాపడక, కంగారు పడక, విశిదంగా చదవండి, రెండుసార్లు చదవండి."" అని ముందు వ్రాసుంది. ఆయన కంగారు పడకుండా ముందుకి చదవసాగారు.
"మావయ్యగారు నేను ఎమ్ ఏస్సి అగ్రికల్చరల్ చదివానని, ఉద్యోగంచేయకుండా వ్యవసాయం ఆదధునిక పద్దతులలో చేస్తన్నానని మీకు తెలుసు, నేను ఎక్కడకెళ్ళిన పచ్చదనం కోసం చూస్తాను, అలాంటిది మీఇంటీ ఆవరణలో అసలు పచ్చదనమే కనిపించలేదు, రమారమి రెండేకరాలు కాళిగా ఉండటంచూసి నామనస్సు చివుక్కుమంది. మీ పాలికాపునడిగి వివరాలు సేకరించాను, వెంటనే మిమ్మళ్నీ కలవాలనుకొన్నాను, కాని పెళ్ళి హడివిడిలో ఈ విషయం మాట్లడం మంచిది కాదని ఉరూకొన్నాను, నాకు కట్నాలు కానుకలు అవసరంలేదు, మీఅమ్మాయే మాఇంటి ఐశ్వర్యం. అయతే ఈలేఖలోవ్రాసిందానికి మీఅమ్మాయిని మేం బాగా చూసుకోవడానికి సంభంధంలేదు. ముందుగా సందేహం ఏమిటంటే మీఇంటిలో అరటి కొబ్బరి లాంటి మొక్కలు నాటడం ఆనవాయితిలేదా మీపెద్దలుకూడా ఆస్దలాన్ని అలావదిలేసారు అందుకు నాకనుమానం వచ్చింది.
అలాంటిదేంలేదని, ఇంతకుముందు రెండు మావిడిచెట్లు ఉండేవని, గాలివానకి పోయాయని మీ పాలికాపు చెప్పాడు, మళ్ళా పాతడానికి మీరు చొరవ చూపలేదని చెప్పాడు. బహుశా అనాశక్తి, వయోభారం వల్ల మీరు ఉత్సాహం చూపలేదని నేను భావిస్తున్నాను. అందుకు మీరు అన్యదా భావించకపోతే నాదో సలహా, మీ ఇంటి చుట్టుస్తలంలో నేను కొన్ని అంటుమొక్కలు లాంటివి పాతించాలని అదంత నందనవనంలా చూడాలని అనుకొంటున్నాను, దానివిషయం అంతా మీకేం శ్రమ లేకుండా నేనే ఏర్పాటుచేస్తాను, మీరు మీమనిషిద్వారా పోషణకి ఏర్పాటుచేయిండి, ఈవిషయమై బాగా ఆలోచించి నాకు సమాధానం ఇవ్వండి, మీరు ఏమి సమాధానం చెప్పకపోయినా, అయిష్టంచూపిన నేను మరో నిర్ణయం తీసుకొంటాను. మరో నిర్ణయం ఏమిటంటె ఇంకముందు మీఇంటికి మీ అమ్మాయే వస్తుంటుంది, అందుకు ఏమి అభ్యంతరం ఉండదు, కాని నేను మాత్రం మీగుమ్మం తొక్కను, ఇదే నాఅలకపాన్పు కోరిక, ఈవిషయం అత్తయ్యగారితో కూడా ఆలోచించి మీనిర్ణయం తెలుపగలరు. ఈవిషయంలో ఇదే నా ఆఖరి నిర్ణయం, ఇంక దీనిపై మాట్లాడటం నాకిష్టంలేదు, ఈవిషయం మీ అమ్మాయికి తెలియదు, దయుంచి ఆమెకి చెప్పకండి, మీకు ఇంకా హందేహం ఉంటే మీతోటి రైతులనుకూడా సంప్రదించండి. దీనికి మీనిర్ణయంతప్ప మరే ఇతర విషయాలు గురించి నాతోకాని మాతల్లి తడ్రులతో కాని సంప్రదించకండి ఇది నాసూచన. వారంలో నాకుమీ నిర్ణయం తెలపలసుంటుంంది." ఆయన ఆఉత్తరం రెండుసార్లు చదివారు, భార్యకి కూడా చూపించారు, ఆవిడ "మంచివిషయమే అల్లుడు ఇంత విశాల హృదయం కలవాడైనందుకు చాలా ఆనందంగా ఉందండి, నేనింక ఏదైన పెద్దకోరిక కోరుతాడని బాగా భయపడ్డాను,
మీరు వెంటనే అతనికి మీ అంగీకారం తెలుపండి" అంది ఆనందంగ. ఆతరవాత ఆయన ఆలేఖ తన ముఖ్య స్నేహితునికి చూపించాడు, ఆయన "ఆహా ఎంత మంచి వాడండి, ఇంతమంచి కోరిక కోరిన అల్లుడ్ని నెత్తినెట్టుకోవాలి వెంటనే అంగీకారంతెలుపు" అన్నాడాయన. ***అంతే మరుసటి వారంలోనే ఆఇంటి స్దలం అంతా అనేక మామిడి సపోటా, అరటి, కొబ్బరి లాంటి ఫల వృక్షాలతో నిండి పోయింది*** అల్లుడిగారి అలకపాన్పుకోరిక విని గ్రామమంత ఆశ్చర్యపోయారు. అల్లుడు అమ్మాయి వస్తుపోతు ఉన్నారుఇంటాయన పడక కుర్చి మొక్కల ధ్య వేసుకు కూర్చోని ఆనందంగా గడుపుతున్నాడు,
**హృక్షో రక్షతి రక్షతి** . .