అక్కయ్య గురుతులు - B.Rajyalakshmi

Akkayya Gurthulu

కిటికీ బయట నించి చల్లని గాలి చెవిలోకి రివ్వున టపటపా కొడ్తున్నది ,బస్సు వేగానికి తల దిమ్మెక్కుతున్నది ,మీనాక్షి కిటికీ మూసేసి శాలువ భుజం చుట్టూ తిప్పుకుని తలమీదినించి కప్పుకుని చేతులు శాలువ లో ముడుచుకుంది .బస్సు లో లైట్ తీసేసారు .అర్ధరాత్రి దాటింది ,తెల్లవారు ఝాము నాలుగింటికి కామాక్షక్కయ్య వూళ్లోబస్సు ఆగుతుంది ,అక్కడికి అక్కయ్య యిల్లు దగ్గరే ,నడిచి వెళ్లొచ్చు అనుకుంటూ మీనాక్షి కామాక్షక్కయ్య జ్ఞాపకాలలోకి వెళ్లిపోయింది .మీనాక్షి ,అక్కయ్య కామాక్షికి అనారోగ్యం గావున్నదని తెలిసి హైదరాబాద్ నించి చూడడానికి చిన్న వూళ్లోకిబయలు దేరింది

కామాక్షి మీనాక్షి మధ్యలో యిద్దరు మగపిల్లలు శ్రీకర్ ,జయకర్ .అందరిలో మొదటి ఆడపిల్ల కామాక్షి ,అందరిలో ఆఖరి ఆడపిల్ల మీనాక్షి .సుమారు యేడేళ్ల వయసు తేడావుంది .అమ్మకు అన్నిపనుల్లో చేదోడువాదోడు గా వుండేది కామాక్షి ..మీనాక్షికి స్నానం చేయించడం తలఁదువ్వడం , మధ్యమధ్య తమ్ముళ్లను చదివించడం అన్నీ చూసుకుంటూ తనుకూడా రెడీ అయి అందరూ కలిసి బడికి వెళ్ళేవాళ్లు.బడి వీధిమలుపులోనే వుండేది .ఒకవిధం గా కామాక్షక్కయ్య మీనాక్షికి అమ్మలాగా అనిపించేది .
వాళ్ళవూరు పెద్దపట్నం కాదు ,మరిచిన్నపల్లెటూరు కాదు .నాన్న గారు పోస్టాఫీసులో క్లర్క్.అమ్మ పొదుపుగా కుటుంబాన్ని లాక్కొచ్చింది .కామాక్షి కి పదహారేళ్ల వయసులో ,బంధువులబ్బాయి శ్రీధర్ తో పెళ్లి జరిగింది .శ్రీధర్ వాళ్లది వ్యవసాయ కుటుంబం .అతను డిగ్రీ వుత్తీర్ణుడయ్యి బ్యాంకు లో పనిచేస్తున్నాడు సుమారు యిరవైదు యిరవై ఆరేళ్లు వయసు .ఊళ్లో సంబంధం కాబట్టి కామాక్షి పుట్టింటికి వస్తూవుండేది .

అక్కయ్య ఆలోచనలలోనించి వర్తమానం లోకి వచ్చింది .బస్సు యేదో వూళ్లోఅగింది .డ్రైవర్ దిగుతూ అక్కడ పావుగంట ఆగుతుందని చెప్పాడు .మీనాక్షి చుట్టూ చూసింది ,కొందరు ఆడవాళ్లు దిగుతుంటే తనూ దిగి కాళ్లు సడలించుకుని కొద్దిగా నడిచింది .నెమ్మదిగా అందరూ యెక్కుతుంటే తనుకూడా యెక్కింది.ఇంకా రెండుగంటలము అక్కయ్య వాళ్ళ వూరొస్తుంది అనుకుంది మీనాక్షి .డ్రైవర్ యెక్కేసాడు.అందరూ యెక్కారో లేదో చూసుకున్నాడు .బస్ బయల్దేరింది .మీనాక్షి మళ్లీ అక్కయ్య జ్ఞాపకాల్లోకి వెళ్లింది

అక్కయ్య వూరికి ఆ రోజుల్లో బస్సు సౌకర్యము లేదు .రైల్ స్టేషన్ దూరం పొలాల్లో గుండా నడవాలి .మీనాక్షి వేసవి సెలవుల్లో కామాక్షి అక్కయ్య దగ్గరకు వెళ్లిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి .తెల్లసువారు ఝాము నే లేచి కామాక్షి వాకిలి చిమ్మి నీల్లు చల్లి ముగ్గేసేది .ఆ చప్పుళ్లకు మీనాక్షి నిద్రలేచేడి .అక్కయ్యకు యిద్దరాడపిల్లలు శ్రీదేవి ,శ్రీలక్ష్మి ఆఖరి పిల్లాడు శ్రీకర్ ,వెంటవెంట పిల్లలు వాళ్లను రెడీ చేసి బాక్సులు సద్దాలి బావగారు కూడా త్వరగా వెళ్లేవారు .సుమారు పదిగంటల వరకు అక్కయ్య మహాహడావిడీ ,పూజ ,శ్లోకాలు వంట అంతా టైంకుఅవ్వాల్సిందే .

అమ్మ తర్వాత అమ్మలాంటి అక్కయ్య పేగుబంధం తల్చుకుంటే మీనాక్షి కన్నీళ్లు ఆగలేదు .బస్బ వూళ్లో ఆగింది .తెల్లారింది .నెమ్మదిగా నడుస్తూ అక్కయ్యగారింటికి చేరింది .గుమ్మం లోనే కోడలు శ్రీలత “అత్తయ్యా “ అంటూ మీనాక్షి ని వాటేసుకుని యేడ్చేసింది. మీనాక్షి కాళ్ళుకడుక్కుని కన్నీళ్లు దిగమింగుతూ “ఎలావుందీ యిప్పుడు ?” అడిగింది మీనాక్షి .

“అత్తయ్య వెన్నెముక బలహీనమయ్యింది ,సరిగా నించోలేదు కూర్చోలేదు కుడికాలు పనిచెయ్యడం లేదు .మంచానికి అతుక్కుపోయింది . మాటలు వినపడుతున్నాయి మాట్లాడగలుగుతున్నది .ఇది ప్రస్తుత పరిస్థితి .మిమ్మల్న్ చూడాలని కలవరిస్తున్నది “అన్నది శ్రీలత .

కామాక్షి మీనాక్షి ని చూసి పేలవం గా నవ్వింది ,”పిచ్చిపిల్లా యెందుకేడుస్తావు ? అన్నిదశలు శరీరం చవిచూడాలి ,యెప్పుడు మనమేవుంటే భూమాతకు కూడా యిబ్బందీగా “కామాక్షి మీనాక్షిని ఓదార్చింది .

“అన్ని బావగారే చూసుకుంటున్నారు ,దేవుడులాంటి అయన సన్నిధిలో హాయిగా వెళ్లిపోతాను .నిన్నుచూసాను .కోడలు బంగారు తల్లి కూతుళ్లు బంగారుట్సల్లులు “ “ఆయాసం యో మాట ఆగింది .

మీనాక్షి బావగారి కాళ్లకు నమస్కరించింది .

కామాక్షి ఆ రాత్రి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది .బావగారు అక్కయ్య చేతిలో వాలిపోయారు .
అందమైన జీవితాల్లో మధురమైన మలుపులు కూడా చెరగని జ్ఞాపకాలేగా.

మరిన్ని కథలు

Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు
Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Amma sakshigaa
అమ్మ సాక్షిగా..
- బంటుపల్లి శ్రీదేవి
Nee nagumomu naa kanulara
నీ నగు మోము నా కనులారా....
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Bharya anukoolavathi shatru
భార్యా అనుకూలవతీ శత్రుః
- జి.ఆర్.భాస్కర బాబు
Mosam
మోసం
- వెంపరాల దుర్గా ప్రసాద్