వింత ఆచారం - తాత మోహనకృష్ణ

Vinta acharam

"సరోజా..! మన అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది..నాకు చాలా ఆనందంగా ఉంది" అన్నాడు ఆనంద్

"అవునండి..! నాకూ చాలా సంతోషంగా ఉంది. అబ్బాయిది మంచి ఉద్యోగం..కట్నం కూడా పైసా వద్దన్నాడు. ఇంతకన్నా మంచి సంబంధం మనకి అసలు దొరకదు..మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు.."

"అవును నిజమే..అమ్మాయికి కూడా అబ్బాయి బాగా నచ్చాడు..వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంది.."

"అయినా రోజులు బాగోలేవు కదండీ..! మన అమ్మాయిని.. అబ్బాయి బాగా చూసుకోవడానికి ఏమైనా ఆలోచించండి.."

"ఓహ్..! అదా..ఒక ప్లాన్ వేసాను..మన ఆచారం ఒకటి ఉందని చెబుతాను..వాళ్ళు కాదనలేరు. ఇప్పుడే మనం వాళ్ళింటికి వస్తునట్టు ఫోన్ చేసి చెప్తాను " అన్నాడు ఆనంద్

"ఏమండీ..పెళ్ళికూతురు తండ్రి మన ఇంటికి వస్తారని కబురు చేశారన్నారు..ఎందుకో..?" అడిగింది పెళ్ళికొడుకు తల్లి జానకి

"ఏమో..ఎంగేజ్మెంట్ అయిపోయింది..పెళ్లి దగ్గరలో ఉందిగా..ఏదో అడగడానికి అయి ఉంటుందిలే.." అన్నాడు భర్త రామ్

ఆ రోజు సాయంత్రం...

"రండి బావగారు..కులాసా..? కూర్చోండి.. జానకీ..! బావగారికి కాఫీ తీసుకురా.. "

"అలాగే తెస్తున్నా.."

"బావగారూ..! ఒక విషయం మీకు చెప్పడం మరచాను..."

"చెప్పండి బావగారు.."

"మీ అబ్బాయి మాకు బాగా నచ్చాడు. ఆ విషయం లో ఎటువంటి సందేహము పెట్టుకోకండి. కాకపోతే మా ఆచారం ప్రకారం పెళ్ళిలో వరుడు అందరిముందు ప్రమాణం చెయ్యాలి "

"అంటే..?"

"పెళ్ళిలో తాళి కట్టిన తర్వాత..వరుడు కోర్ట్ లో భగవద్గీత పై ప్రమాణం చేసినట్టుగా..పెళ్ళాన్ని జీవితాంతం హ్యాపీ గా చూసుకుంటానని ప్రమాణం చెయ్యాలి అంతే..ఇదే మా ఆచారం"

"అలాగే..మీ ఆచారం మేమెందుకు కాదనాలి..అయితే ఎవరి పైన ప్రమాణం చెయ్యాలి "

"మరో లాగ అనుకోకండి..పెళ్ళికొడుకు వారి తల్లిదండ్రుల మీద ప్రమాణం చెయ్యాలి బావగారు..ఇప్పుడు ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి బావగారు. ఒకవేళ ప్రమాణం తప్పితే, మీ జీవితంలో చాలా దారుణం జరుగుతుంది..అందుకే ముందుగా మీకు చెబుతున్నాను"

"అలాగే చేద్దాం బావగారు..! భలే ఉందే మీ ఆచారం.." అని తప్పక సరే అన్నారు రామ్ దంపతులు

*********

మరిన్ని కథలు

Nannu nadipinche uttaram
నన్ను నడిపించే ఉత్తరం
- రాము కోలా.దెందుకూరు.
Anubhavam
అనుభవం
- తాత మోహనకృష్ణ
Gummam bayata cheppulu
గుమ్మం బయట చెప్పులు
- కొడాలి సీతారామా రావు
Maal
మాల్
- తడకమళ్ళ మురళీధర్
Nachiketuni katha
నచికేతుని కథ
- హేమావతి బొబ్బు
Mosapoyina Raju
మోసపోయిన రాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు