
“ఒరేయ్!స్వామి! నీ కథ పత్రికలో పడింది! చూసుకున్నావా!” ఎక్సైటింగ్ గా అడిగాడు శివ. “ లేదురా!!చూపించు! అంటూ శివచంద్ర చేతిలో నుంచి పత్రిక తీసుకొని చూశాడు రామస్వామి. అతడి మొహం లో ఆనందం చూసి ఎంతో సంతోషించాడు శివచంద్ర.
“పద!ఇంటికి వెళ్లి చెల్లమ్మకి,పిల్లలకు చెబుదాం అంటూ సంతోషంగా ముందుకు నడిచాడు. దారిలో స్వీట్స్ కూడా తీసుకున్నాడు. “ఒరేయ్!ఎందుకురా ఇవన్నీ?” “ ఏదో నా ఆనందం కోసం!” నవ్వుతూ ముందుకు నడిచాడుశివచంద్ర.ఇంట్లోఅంతాపండగలాఉంది..అందరిమొహాలు ఆనందంతో కళకళలాడాయి.
“సరే!ఈ ఆనందం ఇంకా ఇంకా ఎక్కువ కావాలి మన కొలీగ్స్ దగ్గరికి వెళ్దాం పద!”అంటూ బయలుదేరతీశాడు. “ ఒరేయ్!ఎందుకురా!” అంటున్నా వినిపించుకుంటే నా!రామస్వామి శివచంద్ర చిన్నప్పటినుండి కలిసి మెలిసి పెరిగారు. ఇద్దరికీ ఒకే ఆఫీసులో ఉద్యోగం రావడంతో వారి స్నేహంమరింతగాపెరిగింది.రామస్వామి చిన్నప్పటినుండికధలూ,నవలలూఆసక్తిగాచదివేవాడు.దాంతోతానూరాయాలనేతపనకూడాపెరిగింది.ఫలితంగా అతడుకథరాశాడు.ఒకసైనికుడిమనసుఎలాఉంటుందో,అతని దేశభక్తి ఎంత గొప్పదోఎంతోగొప్పగావివరించాడు. అతడు యుద్ధంలో తల్లి గురించి ఎంతో పరితపించాడు. అక్కడ తన తల్లి ఇక్కడ తాను ఇద్దరు ఒంటరి వాళ్ళమే! అని మనసులోనే విలపించాడు.
అతడుతీవ్రగాయాలుతో తల్లి దగ్గరికి చేరుకున్నాడు.కానీఅతనికిఅప్పుడేతెలిసింది తను ఒంటరిని కాననీ,ఎందరో తల్లులు అతని ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. ఎందరో అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు అతడి కోసం ప్రార్థనలు చేశారు దేశం యావత్తుఅతనివెనుకఉందిఅందరిప్రార్థనలుఫలించాయిసైనికుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సైన్యం లోకి ప్రవేశించాడు. ఇప్పుడు అతని వెనుక దేశ ప్రజల ఆశీస్సులుఆకాంక్షలుకూడాఉన్నాయికధఇలాముగించాడు.
దారిలోనే రవి,ఈశ్వరయ్య కనబడటంతో మరింత సంతోషించాడు శివ. “మీరు ఈ వారం కనకరాగం పత్రిక చూసారా!” అడిగాడు శివ. “కనకరాగం పత్రికా!ఈ మధ్యన చదవడం మానేశాం! ఎప్పుడూ పత్రికలుచదువుకుంటూకూర్చుంటామా!మాకు ఎన్నో పనులు ఉన్నాయి” అంటూ సీరియస్ గా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.ఏదో అనుబోయిన శివను కళ్ళతోనే వారించాడు స్వామి.వీడిమొహం చూస్తేనే తెలుస్తోంది వీళ్ళునీకథ చదివారని! వెధవలు!కుళ్ళు వెధవలు!” కసిగా తిట్టి ముందుకు కదలడు శివ. ముందుగా మనం ధనరాజ్ ఇంటికి వెళ్దాం అంటూ బయలుదేరతీశాడు.
“నువ్వుఈవారంకనకరాగంపత్రికచూసావా!ఆనందంగా అడిగాడు శివ. “ లేదు ఆ పత్రిక తప్పించడం మానేసాం. అందులో కథలు బాగుండడం లేదు” అన్నాడు. అతడి మొహంలో అనీజినెస్ తెలుస్తోందిఏదోమాట్లాడబోయినశివనివారించి “మేము వస్తాము!”అంటూ శివనిముందుకులాగాడు రామస్వామి. ” మరీ అంత ఇరుకుమనస్తత్వం ఏమిటి!చాలా వింతగా ఉంది సుమా!”అన్నాడు శివ.
“వాడు కధ చదివాడని నీకుఅర్థమైందికదా!” నవ్వుతూ అన్నాడు రామస్వామి. “సరేగాని మనం శరత్ ఇంటికి వెళదాం. వాడికి సాహిత్యం అంటే ఎంతో పిచ్చి.అంటూ ముందుకు నడిచాడు శివ. వాళ్ళు వెళ్లేసరికి ఇంట్లోనే ఉన్నాడు. “నువ్వు కనకరాగం పత్రిక చదివావా!” ఆత్రంగా అడిగాడు శివ.అబ్బా ఇప్పుడు పత్రికలగోల ఎందుకు? మీ ఇద్దరికీ ఒక విషయం తెలుసా కొంతమంది గిరిజనులు ఉంటారువాళ్ళు గోగుబా జాతి వాళ్లు! తలకి నేమలి ఈకలుచుట్టుకుంటారు. ఇంకా….”చెప్పడం ప్రారంభించాడు శరత్ .
చివరికి అర్థమైంది అతనలా అర్థం లేని విషయాలు ఎన్నైనా మాట్లాడుతాడని. ఒక్క కనకరాగం పత్రికలో రామస్వామి రాసిన కథ విషయం తప్ప మరి ఏదైనా మాట్లాడుతాడు అని. “వాళ్ళు ఎవరైనా మీ జఇంటికి వస్తే చెప్పు! వచ్చి కలుస్తా!”కసిగా అంటూ ముందుకు నడిచాడు శివ. రామస్వామి నవ్వాక్కుకుంటూ ముందుకు నడిచాడు.
“ఒరేయ్!వీళ్లంతా ఎందుకు ఇంత సంకుచితంగాఆలోచిస్తున్నారు” చిరాగ్గా ఆన్నాడు శివ. “నీకు అర్థమైందిగా! వీడు కూడా నా కథ చదివాడని.”నవ్వుతూ అన్నాడు స్వామి.నీకు నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో చెప్తాను.రేపు నేను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను ఓకేనా!” “మనసంతా కరాబ్!అయింది. ఎలాగా ఇంటికి వచ్చేసాం కదా! నీకు భయంకరమైన కూర చేసి పెడతా! ఆల్రెడీ చపాతీలు చేసే ఉంచానులే!” “ ఇదేదో కొత్త ప్రయోగమా! ముందుగా నా మీదేనా!”భయంగా అడిగాడు స్వామి.
“అవును! కూర పేరు ఆలూలబోదిబో!”నవ్వుతూ అన్నాడు శివ. “పేరే ఇంతభయంకరంగా ఉంది ఎలా చేస్తావ్!” “ఇప్పుడే చేసి చూపిస్తా! నువ్వు అలా కూర్చో!” అంటూ కుర్చీతెచ్చి వేసాడు శివ. స్టవ్ వెలిగించి “పోపు దినుసులు వేయాలి!తర్వాత ఉల్లిపాయలు,నెక్స్ట్ ఉడికించిన బంగాళాదుంపలు వేయాలి.ఇక తర్వాత పల్లీలు,జీడిపప్పు, టమాటాలు,క్యాప్సికం, క్యారెట్,క్యాబేజీ,క్యాలీఫ్లవర్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఆలూ కేసివిసిరి కొడుతూనే ఉండాలి. అప్పుడు ఆలూ గోల పెడుతుంది.ఇంకా మనకు వీలైనకూర ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్టు, జీరాపొడి ధనియా పొడి, కారం, మసాలా పొడి, ఉప్పు,కొత్తిమీర,కరివేపాకు అన్నీ వేసికలిపి మూత పెట్టాలి. ఉడికాక వడ్డించుకోవడమే!”నవ్వుతూ అన్నాడు శివ.
“కాస్తంత గడ్డి కూడా వేస్తే!”గంభీరంగా అన్నాడు స్వామి. “ అవును! పైగా అది బలంకూడా!అందుబాటులో ఉంటే గడ్డి కూడా వేసుకోవచ్చు!”చపాతీలు ఒక ప్లేట్లో పెట్టిచ్చాడు శివ. “ ఒరేయ్ ఏమో అనుకున్నాను గాని! ఇది కూడా బాగానే ఉంది సుమ!”అన్నాడు స్వామి. “మరి ఏమనుకున్నావ్! మరో కొత్త వంటకం ఆలూబాబా నలభైకూరలు! అంటే బంగాళదుంపలతో పాటు నలభైరకాల కూరలు వేయాలి. అన్ని రకాలూ సెట్ చేసుకుంటున్నా!అన్ని రకాలు కుదిరితే ఒక వంటల ఛానల్ ఓపెన్ చేస్తా!” “ ఇంకా కొత్త వంటకాలు ఏమైనా…” అంటున్న స్వామి నిమధ్యలోనే ఆపి , “ఇంకా కాకరకాయ కిచ కిచ,గోంగూర గందరగోళం పెద్దగా నవ్వుతూ అన్నాడు శివ. “నువ్వు అసాధ్యుడి విసుమా!అన్నాడుస్వామి నవ్వుతూ.మర్నాడు ఒక వృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్ళాడు రామస్వామి. “ స్వామి! వృద్ధాశ్రమానికి తీసుకొని వచ్చావ్!నన్ను గానీ జాయిన్ చేద్దామనా!నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు!వెళ్లిపోదాం పద!”అంటూ గోలగోలగా అరుస్తున్న శివని ఆపి, “ కాసేపు మాట్లాడకు! లోపలికి పదా!” అన్నాడు స్వామి.
లోపల రకరకాల పూల మొక్కలు పండ్ల చెట్లు ఉన్నాయి వాతావరణం ఆహ్లాదంగా ఉంది “చూడు వీళ్ళు జ్ఞానవృద్ధులు!వీళ్ళకి అపారమైన అనుభవం ఉంది! అదిగో చూడు ఆ చెట్టు కింద కూర్చున్నమనిషి!అతడురాజకీయాలగురించిఅనర్గళంగా మాట్లాడగలడు. ఇదిగో ఇతను తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ అతనికి రకరకాల పిండి వంటలు చేసి పెట్టేది! అవి ఎలా చేయాలో నోరూరించేలా చెప్పగలడు! ఇంకా ఈమె,శ్రీ శ్రీ నుంచి కీట్స్ వరకు ఏ కవిత గురించి అయినా చెప్పగలదు! కొంతమంది వాళ్లకి జరిగిన అన్యాయం గురించి కుటుంబ సభ్యుల అనాదరణ గురించి చెప్తారు! ఇలా ఎంతోమంది ఉన్నారు!వీళ్లంతా విజ్ఞాన భాండాగారాలు! వీళ్ళ అనుభవం వాళ్ళ కుటుంబాలకు అవసరం లేకపోయింది!వీళ్ళ అందరి గురించి ఆలోచించు!వాళ్ళ బాధలు పంచుకో! వాళ్ళ అనుభవాలు ఉపయోగించుకో!నీకు ఎంత మేలు జరుగుతుంది!” అన్నాడు రామస్వామి.
“ఛత్!ఆఫీసులో వాళ్ల గురించి ఆలోచించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను!” అలా అంటూనే శివ ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా మాట్లాడటం మొదలు పెట్టాడు! టైం ఎలా గడిచిందో ఇద్దరికీ తెలియలేదు.మళ్లీ వీక్ ఎండ్ కి వస్తావా బాబు!”అన్నాడు ఒక పెద్దాయన. రోజూ వస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా!”అన్నాడు శివ. “ అంతకన్నానా!”అన్నారు అందరూ. వసుదైక కుటుంబం లాఅనిపించింది శివకి. శరత్కాలపు వెన్నెల చల్లగా పలకరించింది.