
"ఏమిటిరా బాలు..అంత నిరుత్సాహంగా ఉన్నావు..?" అడిగాడు ఫ్రెండ్ చందు
"కొత్త కథలు కావాలి చందు..రాయడానికి కొత్త ఆలోచనలు రావట్లేదు..ఏం చెయ్యను?"
"మొన్నే కదా అరడగను కథలు రాసావు..కొన్ని పత్రికల వాళ్ళు నీకు బహుమతులు కూడా ఇచ్చారు..హ్యాపీ కదరా!"
"అవును నిజమే..ఇవి వేరే పత్రికలకు పంపించాలి"
"ఎందరికి కథలు పంపిస్తావు చెప్పు? నీకూ టైం ఉండాలిగా. కొత్త కథలు రాయడానికి ఆలోచనలు రావాలి కదా.."
"అవును..! కానీ అన్ని పత్రికలకు కథలు పంపించాలని నాకు ఉంది.."
"కొత్తలో అలాగే ఉంటుంది. అంత టైం నీకు ఎక్కడ ఉంటుంది? టైం లేనప్పుడు నీకు అన్ని కథలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు..? నీకూ ఇంటి పనులు, ఆఫీస్ పనులు చాలా ఉంటాయి కదా.."
"అయితే ఏం చెయ్యాలి..?"
"ఏ పత్రికల వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారో వారికే ప్రాధాన్యత ఇచ్చి కథలు పంపించు..మిగిలిన వారిని పక్కకు పెట్టు. ఉచితంగా కథలు పంపిస్తే, నీకు ఏం ప్రయోజనం లేదు..ఆలోచించు..! ఇలా అందరూ ఫ్రీ గా రాస్తే, ఆ పత్రికకు లాభం.. మీలాంటి వారికి టైం వృధా అంతే..! అలాంటివారికి కథలు పంపించడం మానేస్తే, ఆటోమేటిక్ గా వారే, బయట కాంపిటీషన్ తట్టుకోలేక, పారితోషకం ప్రకటిస్తారు..అప్పుడు వాళ్ళ గురించి అలోచించు..అర్ధమైందా..?"
"నువ్వు చెప్పినది నిజమే..అలాగే చేస్తాను.." అంటూ నవ్వుతూ అన్నాడు బాలు
******