
“సుచిత్రా! మంచి నీళ్లు ఇయ్యి!”అన్నాడు అప్పుడే క్యాంప్ నుండి ఇంటికి వచ్చిన ఉదయ్. “ ఇదిగోనండి!”అంటూ మంచినీళ్ల గ్లాస్అందించింది సుచిత్ర. “ ఇల్లంతాహడావుడిగా ఉంది లోపల చాలామంది ఉన్నట్లున్నారు! ఏమిటిసంగతి!”యధాలాపంగాఅన్నాడు ఉదయ్. “ ఈ రోజు మీకుఎంగేజ్ మెంట్!”కళ్ళల్లో నీరు తిరుగుతూ ఉంటే అంది సుచిత్ర. “వాట్! నాకు ఎంగేజ్ మెంట్!”అదిరిపడ్డాడు ఉదయ్. “ అవునండి!నాకు పిల్లలు పుట్టరని టెస్టుల్లో తెలిసింది కదా!అందుకే!”కన్నీటితో చెప్పింది. ఏమిటీ విచిత్రమైన పరిస్థితి!ఎంగేజ్ మెంట్ అని భార్య భర్తకిచెప్పడమా! పిల్లలు లేనంత మాత్రాన వేరే పెళ్లికి సిద్ధపడాలా! నేను అంత కసాయి వాడినా!ఆలోచిస్తున్న కొద్ది బుర్ర గిర్రున తిరగసాగింది.మంచినీళ్లు తాగి కొంచెం స్థిమితపడ్డాడు. అతడు తను ఏం చేయాలో ఆలోచించడం మొదలు పెట్టాడు. “ఒరేయ్!ఉదయ్! వచ్చావా! తొందరగా భోజనానికి పద! అప్పుడే ఒంటిగంట అయింది! మూడు గంటలకు నీకు ఎంగేజ్ మెంట్!”గబగబా చెప్పింది శాంతమ్మ. “అమ్మా! ఏమిటిది! ఏం మాట్లాడుతున్నావ్! కోపంగా అన్నాడు ఉదయ్. “అదంతా తెలియదు!నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే! లేకపోతే నా మీద ఒట్టే!”మరింత గట్టిగా అరిచింది శాంతమ్మ. శాంతమ్మకి ఆమె పేరులోనే శాంతం ఉంది తప్ప, స్వతహాగా ఆమె విరుద్ధంగానే ఉంటుంది.ఉదయ్ లోపలికి వెళ్ళాడు. “ఎంగేజ్ మెంట్ కేఇంత హడావిడిఅయితే ఇంక పెళ్లి ఎలా ఉంటుందో!”అందరూ తలో మాట అంటున్నారు. వాళ్ళ మాటలు ఉదయ్ కి వెకిలిగా అనిపిస్తున్నాయి. అతడు చాలా గంభీరంగా ఉన్నాడు. అందరూ భోజనాలు చేస్తున్నారు. “ త్వరగా రా!నువ్వు తిను!” అంటున్న వాళ్లకేసి నిర్లిప్తంగాచూసాడు. “ నాది అయింది లే!మీరు తినండి అన్నాడు. సుచిత్ర ఏది? మనసులోనే అనుకున్నాడు పెరట్లోకి వెళ్లి కళ్ళు తుడుచుకుంటున్న సుచిత్ర ను చూస్తే మనసు బాధగా అనిపించింది. “సుచీ!నీకు అన్యాయం జరగదు! కళ్ళు తుడుచుకో!ప్రతి సమస్యకి కన్నీరే పరిష్కారం కాదు! జరిగేది చూడు! ధైర్యంగా ఉండు! అన్నాడు కన్నీరు తుడుస్తూ. “ ఒరేయ్ శివుడు!ఒక చిన్న సాయం చేయాలి! అన్నాడు ఉదయ్. “ చెప్పండి బాబు!” అన్నాడు శివుడు. “ ఇది పెన్ కెమేరా!దీన్ని జేబులో పెట్టుకో! అన్నాడు ఉదయ్. “ అలాగేబాబు!” “నువ్వేం చేయాలంటే వచ్చిన చుట్టాలని జాగ్రత్తగా గమనించు! వాళ్ళకి దగ్గరగా ఉంటూ ఏదో ఒక పని చేస్తూ ఉండు!ఫోన్ ఆన్ లో ఉంటుంది కనుక వాళ్ళు ఏం మాట్లాడినా దీనిలో రికార్డ్ అవుతుంది అంటూ ఫోను శివుడిజేబులో పెట్టాడు ఉదయ్. “ఇక చూడండి బాబు!నా పని నేను ఎంత బాగా చేస్తానోఅన్నాడు శివుడు. అందరూ భోజనాలు చేసి ఎవరికి వాళ్ళు ఏమో మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నారు.గంట తర్వాత తలుపు తీసుకుని ఉదయ్ గదిలోకి వెళ్ళాడు శివుడు.ఇదిగో బాబు నా పని పూర్తయింది. అంటూ పెన్ కెమేరాఅందించాడు. “థాంక్యూ శివుడు!” అన్నాడు. శివుడు వెళ్లాక అదంతా పెన్ డ్రైవ్ లోకి ఎక్కించాడు. కాసేపటికి బయటకు వచ్చి, “ హలో అందరూ హాల్లోకి రండి! మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి! సుచిత్ర! రా! అమ్మా! రా! అంటూ పిలిచాడు”అందరూ హాల్లోకి వచ్చారు. వియ్యాల వారు, పెళ్లికూతురు లలిత, వారి బంధువులు అందరూ వచ్చారు. “ఎంగేజ్ మెంట్ కి ఇంకా టైం ఉంది కదా! ఈలోగా నేను చెప్పేది వినండి!లలిత!ఇలా రా!” అంటూ పిలిచాడు. ఏం బావ అంటూ వచ్చి పక్కన నించుంది.ఆమె మొహం చూస్తేనే తెలుస్తోంది. ఈ పెళ్ళి ఇష్టం లేదని! కానీ పెద్ద వాళ్ళు ఆస్తి కోసం బలవంతంగాఒప్పించారు. “ లలిత!ఒక విషయం! నాకు ఇది రెండో పెళ్లి! నీకు తెలుసుగా! నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కారణం సుచిత్ర కి పిల్లలు పుట్టకపోవడం వల్లనే! ఒకవేళ నీకు కూడా పిల్లలు పుట్టలేదనుకో నేను మళ్ళీ మరొక పెళ్లికి సిద్ధమవుతాను!ఏమంటావు!అత్తయ్య,మామయ్య మీరేమంటారు!” గంభీరంగా అడిగాడు. “మళ్లీ మరో పెళ్లి అంటే ఊరుకోవడానికి నేనేమన్నా సుచిత్ర లాంటి దాన్ని అనుకున్నావా!” తీసుకెళ్లి జైల్లోతోఇస్తా!నిన్ను మీ అమ్మని!” కోపంగా అంది లలిత. “నేను అసలు నీ మీద,మీ అమ్మ మీద ఎన్ని కేసులు వీలైతే అన్ని వేస్తా!”అన్నాడు పెళ్లి కూతురు తండ్రి భుజంగ రావు. “అమ్మ నాయనోయ్!” అందిశాంతమ్మ గుండెల మీద చెయ్యి వేసుకుని. “సరే అందరూ జాగ్రత్తగా వినండి నేను వారం క్రితం క్యాంపుకు వెళ్లి ఈవాళేఇంటికి వచ్చాను.ఈ పెళ్లి సంగతి నాకు తెలియదు. నేను క్యాంపు కిఅని వెళ్ళింది ఆఫీస్ పని మీద కాదు!పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందికి వెళ్లాను! చేయించుకున్నాను కూడా! నేను కూడా ఇప్పుడు గొడ్రాలి నే అనుకుంటా! అయినా పెళ్లి నాటి ప్రమాణాలకి నీకు అర్థం తెలుసా అమ్మ! భార్య చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని దేవునికి ప్రమాణం చేయడం! నువ్వేమో ప్రతిసారి నీ మీద ఒట్టు పెట్టుకుని దేవునికి ఇచ్చిన మాటను తప్పమని చెప్తున్నావు! దేవునికి ఇచ్చిన ప్రమాణం గొప్పదా! నీ మీద పెట్టుకునే ప్రమాణం గొప్పదా!అయినా నువ్వు బెంగ పెట్టుకో పెట్టుకోవాల్సిన అవసరం లేదు! చెప్పానుగా పిల్లలు సుచిత్ర కే కాదు నాకు కూడా పుట్టరు!” “ ఒరేయ్ ఎంత పని చేసావు రా!”కుప్ప కూలిపోయింది శాంతమ్మ. శాంతమ్మ మొహం మీద నీళ్లు చల్లారు. లేచి కూర్చుంది. “మంచి వాడివే!ముందుగా చెప్పావు కనుక సరిపోయింది. అమ్మ! శాంతమ్మ! మేమీపెళ్లి మానుకుంటున్నాం! అన్నాడు లలిత తండ్రి!” “ సరే ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను! అందరూ చూడండి!” అంటూ ఆన్ చేశాడు అందరూ కుతూహలంగా చూడసాగారు. “కాంతమ్మ!ఈ మాయదారి శాంతమ్మ ఎంత పని చేస్తుందో చూడు! కోడలికి నరకం చూపిస్తుంది సుమ!” “అవును గంగమ్మ! ఎంత గయ్యాళి కాకపోతే కోడలు ఉండగానే కొడుకుకి మరో పెళ్లి చేస్తుంది.” “మరో వీడియో క్లిప్పింగ్! “ఈ ఉదయ్ఒట్టిచవట దద్దమ్మ!” “అవును మామయ్య! పైసాకు పనికిరాడు! ఏదో వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి ఉండబట్టి కానీ, వీడికి మరో పెళ్లి కావాల్సి వచ్చిందా!” “వీడిమొహం మరో పెళ్లి చేసుకున్నా సరిగ్గా ఉండనిస్తుందా!ఆగయ్యాళిశాంతమ్మ!” వీడియోలో అన్ని అలాంటి క్క్లిప్పింగ్సే ఉన్నాయి. “ మరో విషయం గయ్యాళిఇల్లు శాంతమ్మ గారి ఇల్లు ఎక్కడ అని ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు! మేము అలా తెలుసుకునే వచ్చాం!” అందరూ గొల్లున నవ్వుతున్నారు! శాంతమ్మ కళ్ళు నీటితో నిండాయి.తన గురించి అందరూ ఇలా అనుకుంటున్నారా ఆశ్చర్యం కోపం ఒకసారి వచ్చాయి. “కానీ మీరు అనే మాటలు నిజమే! నేను, మా అమ్మఇద్దరం మీనిందలకుఅర్హులమే! అమ్మ మారుతుందేమోఅని,సుచిత్రకష్టాలుపడుతున్నా సర్దుకోమనే చెబుతున్నాను ఇంతకాలం! కానీ తను మారలేదు! కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే అన్నాడు ఉదయ్.బంధువుల కళ్ళల్లో కత్తి వాటికి నెత్తుటి చుక్క లేదు.సరే మేం బయలుదేరుతున్నాం అన్నారు బంధువులు.చివరిగా ఒక మాట నేను, సుచిత్ర అనాధాశ్రమం నుంచి ఒక పాపను తెచ్చి పెంచుకోబోతున్నాం. మీరందరూ త్వరలోనే మళ్లీ రావాల్సి ఉంటుంది మా పాపని ఆశీర్వదించడానికి!” నవ్వుతూ అన్నాడు ఉదయ్. “ ఇక అమ్మ!ఈ విషయంలో నువ్వు ఎటువంటి సమస్య సృష్టించినా నేను ఊరుకోను!” “ చుట్టాలు నన్ను ఇంత గయ్యాళిగా అనుకుంటున్నారని విన్నాక కూడా ఇంకా అలాగే ఎందుకు ఉంటాను!నేనూమనిషినేఆ విషయం మీరందరూ త్వరలోనే గ్రహిస్తారు!”అంది శాంతమ్మ. సుచిత్ర మనసు వర్షం కురిసి వెలిసిన ఆకాశంలా ఉంది. చల్లటిగాలి నెమ్మదిగా వీచింది. ***