ఆపన్న హస్తం - కందర్ప మూర్తి

Aapanna hastam
ప్రైవేటు కంపెనీలో ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ సేవల
అనంతరం పదవీవిరమణ చేసిన గోవిందరావు ఉధ్యోగ సేవల
తర్వా వచ్చిన గ్రాడ్యుటీ ఇతర ఎలవెన్సుల మొత్తం సుమారు
ఐదు లక్షల రూపాయలు వరకు అందినాయి.
తండ్రి రిటైర్మెంట్ విషయం ముందుగా తెల్సిన కొడుకు
సుధాకర్, కూతురు పద్మ అభినందనలు చెప్పే మిషతో
అమ్మా నాన్నల దగ్గరకు బట్టలు స్వీట్లు పూలగుచ్చం
పట్టుకు వచ్చారు.
తండ్రి తన చదువు కోసం ఎంత కష్టపడిందీ, దేవుడి
దయవల్ల ఫిట్టర్ గా షుగర్ ఫేక్టరీలో కొలువు దొరికిందని
పొగుడుతు, ఫేక్టరీకి దగ్గరలో ఇళ్ల స్థలాలు అమ్మకానికి
ఉన్నాయని రెండు లక్షలు ఇస్తే స్థలం కొనాలనుకున్నట్టు
మనసులో మాట స్వీటు పేకెట్ తో తియ్యగా చెప్పేడు
కొడుకు సుధాకర్.
పండగలకు అల్లుడితో రమ్మని పిలిచినా పెళ్లిలో
పెట్టుబడులు సరిగ్గా చెయ్యలేదని అత్తగారు అనరాని
మాటలు అంటున్నారని అలిగి రాని కూతురు, తండ్రిని
ఆప్యాయంగా పలకరిస్తూ ఇంట్లోకి అడుగు పెట్టడం
చూసిన గోవిందరావు దంపతులు ఆశ్చర్యానికి గురయారు.
భోజన కార్యక్రమాలు పూర్తైన తర్వాత తండ్రి నుదుటున
సింధూర బొట్టు పెట్టి బట్టల సంచితో యాపిల్ పళ్లు ఉంచి
కాళ్లకి నమస్కారం చేసి పక్కన కూర్చుంది.
పెళ్లయి సంవత్సరం దాటినా గమ్మంలో కాలు పెట్టని కూతురి
ఆప్యాయతకు తల్లి ముకుందమ్మ కళ్లప్పగించి చూడసాగింది.
తీపి కబుర్లు చెబుతు, అల్లుడికి ఉధ్యోగం పెర్మనెంటు కావాలంటె
లక్షన్నర రూపాయలు లంచం అడుగుతున్నారట. ఆ డబ్బు
సర్దుబాటు చేస్తే తన కాపరం నిలబడుతుందని తండ్రికి మస్కా
కొట్టసాగింది కూతురు పద్మ.
"బాబూ సుధాకర్, మీరెక్కడ ఉన్నా మీ క్షేమమే మాకు కావల్సింది.
ఈ ముసలి వయసులో మీరు కాక ఇంకెవరు మమ్మల్ని ఆదుకుంటారు.
అలాగే , నీకు కావల్సిన డబ్బు సర్దుబాటు చేస్తాను. చింత పడకు" అని
భరోసా ఇచ్చాడు కొడుక్కి.
"తల్లీ పద్మా , లోను పెట్టి నా తాహతుకు తగ్గట్టు నీ పెళ్లి ఉధ్యోగస్తుడితో
జరిపించాను. ఇంకా లాంఛనాలు తక్కువయాయంటే ఎలా? నీ కాపరం
బాగోడమే మాకు కావల్సింది. అలాగే అల్లుడి గారు అడిగిన డబ్బు
సర్దుబాటు చేస్తా, ఫికర్ కాకు " మాట ఇచ్చాడు కూతురికి.
కూతురు, కొడుకు వీధి వసారాలో కబుర్లు చెప్పుకుంటుంటే
భోజనం చేస్తున్న భర్తతో " ఏమయ్యా , ఒళ్లు గుల్ల చేసుకుని ముప్పై
ఏళ్లు కంపెనీలో చెమట తీసినావు. ఎప్పుడూ నీ బట్ట గురించి, తిండి
గురించి ఆలోచించ లేదు. ఎక్కువ డబ్బులు కోసం ఓవర్ డ్యూటీలు
చేసి కుర్రాడిని చదివించినావు. లోన్ పెట్టి కూతురు కోరినట్టు కొలువు
చేసే అబ్బాయితో కట్నం ఇచ్చి పెళ్లి చేసినావు.
పిల్లలు పెద్దోళ్లవుతున్నారు. ఉండటానికి ఒక గూడు చూడమంటె
పెడచెవిన పెట్టినావు. నేను మొక్కు ఉంది ,తిరపతి తీసుకెళ్లి వెంకన్న
దర్సనం చేయించమంటె డబ్బులు లేవని కాలక్షేపం చేసినావు.
ఇప్పుడు నీ కష్టం డబ్బులు వచ్చినాయి. ఒక చిన్న ఇల్లు కొంటె
ముందు జీవితం నిచ్చింతగా సాగుతాది. ఇలా పిల్లలకి పంచిపెడితె
రేపు మన బతుకేం కాను. నీకా పింఛన్ ఏమీ లేదు. ఇదివరకటిలా
వంట్లో శక్తి లేదు. ఉండటానికి చిన్న ఇల్లు ఉంటె మిగతా డబ్బులు
ఏ వడ్డీకో తిప్పుకుంటె రోజులు గడిచిపోతాయి." భర్తకి భవిష్యత్
నచ్చ చెప్పసాగింది ముకుందమ్మ.
" నువ్వేం ఫికర్ కాకే ముకుందా, రేపు మన పిల్లలు మనకి ఆసరా
అవుతారు. సుధాకర్ ఉధ్యోగంలో ఉన్నాడు. ఇల్లు కట్టుకుంటె
ఆడి దగ్గర ఉండవచ్చు. ఇంక పద్మ అంటావా, దాని పెళ్లి చేసినాం
కదా. అది పిల్ల పాపలతో కాపరం చేసుకోవడమే మనకి కావల్సింది."
అని పెళ్లాం మాటలు పెడచెవిన పెట్టి ఉధ్యోగ విరమణ తర్వాత
వచ్చిన డబ్బును కొడుకు, కూతురికి పంచేసాడు భోలా గోవిందరావు.
గోవిందరావు రిటైరై ఐదు సంవత్సరాలు గడిచాయి.
కొడుకు సుధాకర్ తండ్రి దగ్గర తీసుకున్న డబ్బుతో ఇంటి స్థలం
కొని లోను తీసుకుని ఇల్లు కట్టించాడు. కొడుకు పుట్టాడు.
అత్తామామలు వస్తె వారికి సేవలు చెయ్యాల్సి వస్తుందని, ఇల్లు
ఇరకాటం అవుతుందని పెళ్లాం మాటలు విని అమ్మానాన్నల
బాగోగులు పట్టించుకోవడం మానేసాడు.
కూతురు పద్మ , తండ్రి ఇచ్చిన డబ్బుతో మొగుడికి కొలువు
పెర్మనెంటు చేయించుకుని మజా చేస్తోంది.
జీవితమంతా కష్టార్జితంతో సంపాదించిన డబ్బులు పిల్లలకు పంచి
ముందుచూపు లేకుండా పెళ్లాం మాటలు విననందుకు తగిన శాస్తే
జరిగిందని ఆర్థిక ఇబ్బందులతో ముసలి వయసులో బాధపడుతున్నాడు
గోవిందరావు.
తన తోటి ఉద్యోగి ఖాసిం సాహెబ్ ఉద్యోగ పదవీవిరమణ తర్వాత
వచ్చిన డబ్బును చూసి చీమల్లా వచ్చి పడే బంధువులను దూరంగా పెట్టి
ఆ డబ్బుతో పొదుపుగా బట్టల వ్యాపారం మొదలు పెట్టి గోవిందరావును
ఆదుకున్నాడు. ఆపదలో ఆప్తులు వదిలేసినా కలిసి పనిచేసిన మిత్రుడు
ఖాసిం సాహెబ్ ఆపన్న హస్తం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసాడు
గోవిందరావు.
సమాప్తం

మరిన్ని కథలు

Vekuva velugu
వేకువ వెలుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Nischitardham
నిశ్చితార్థం
- కొడవంటి ఉషా కుమారి
Taatayya
తాతయ్య
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Malle malle raakoodani roju
మళ్ళీ మళ్ళీ రాకూడని రోజు
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Viramam
విరామం.
- Harish Babu
Prema viluva
ప్రేమ విలువ
- Lakshmi Priyanka
Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం