
దబ ద బా తలుపు కొట్టిన శబ్దం." చిరాకుగా తలుపు తీశాడు డార్విన్ ఎదురుగా నిల్చున్నది ఎవరో కాదు ప్రాణ స్నేహితుడు "ఐన్స్టీన్ '" . ఏడు పదులు దాటినా వయసు ఛాయలు మచ్చుకైనా కనిపించవు .చిరునవ్వు చిందు లాడే మోము నిరంతర శ్రమకు పర్యాయ పదం.హేతు వాదం మానవతా వాదం విజ్ఞాన శాస్త్రం తో సమాజములో ఉన్న మూఢాచారాలను కడిగిపారేయడానికి ,మనుషులందరూ ఒక్కటే అని చాటి చెప్పుటకు కొత్త ఆవిష్కరణలు చేసుకుంటూనే "విశ్వమానవ సంఘం " ను స్థాపించిన మహానుభావుడు. ఏంట్రా నాటి మనిషివా ? నేటి హైటెక్ మనిషివా ? కాలింగ్ బెల్ పెట్టు కోవచ్చు కదా ? అన్నాడు.
అమ్మ బాబోయి ! కాలింగ్ బెల్లా ? ఇంకేమున్నది ? కొంపలు మునిగినట్లే , ఆ బెల్ మా బావమరిది గుండె లో పిడుగు వేసింది అసలే వాడికి గుండె జబ్బు ప్రాణం ఉంటే ఒట్టు అన్నాడు డార్విన్ ఇదేంటి రా బాబు ! వింత గా ఉందే. తుమ్ముతేనే ఊడిపోయే ముక్కు,.శబ్దాలకు రాలి పోయే గుండె ఉంటే బతికి బట్ట కట్ట గలమా ! ఇంతకు ఆ బెల్ కొట్టింది ఎవరు ? అన్నాడు ఐన్స్టీన్ వాళ్ళ అమ్మే ఇంకెవరో కాదు పరమార్శకని వచ్చి...... అయ్యో పాపం ! ఎంత ఘోరం ! ఎంత ఘోరం ! తల్లి చేతిలో జరగరాని తప్పు జరిగింది ? పేగు బంధము కన్నీటి ధారలు కావచ్చు. అదొక్కటే కాదండోయి బాబు .కొడుకును చూసి గుండె ఆగి కన్ను మూసింది.
ఆమె శివ భక్తురాలు కాశి కైలాస్ పర్వతాలు పోయి పుణ్యం కట్టుకున్న మనిషి అన్నాడు బాధను దిగమింగు కుంటూ డార్విన్. కాశీకి పోయి నా హాజీ దర్శన చేసుకున్న , వాటికన్ లో ప్రార్థనలు చేసినా దేవుడు రక్షించ లేడు అసలు ఆయన ఉనికి ఎక్కడా ? ఏమి దేవుల్లో ఏమో ! ఒక్క భక్తుడిని బతికిస్తే ఒట్టు.ఇప్పుడు నిజం గానే నాకు గుండె నొప్పి వచ్చేలా ఉంది ఈ చావు కబుర్లతో అన్నాడు ఐన్స్టీన్ నీది స్టీల్ గుండె రా బాబు ! ,దేవుడికే యముండవు .ఆది సరే గాని ఆలస్యం అయింది గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో , నీ కిష్టమైన వంటకాలు సిద్దముగా ఉంటాయి. మరో మాట పోస్ట్ మ్యాన్ వచ్చే వేళ అయింది తలుపు చప్పుళ్లకు నీ గుండె పదిలం సుమా ! అన్నాడు నవ్వుకుంటూ డార్విన్ రాతి గుండెను రాతి దేవుడు చంప లేడు.నేను ఎంత కాలం బతుకాలో పరిశోధన చేసి నా జీవన శైలిని బట్టి నుదుటి రాత నేనే రాసు కున్న ఆ బ్రహ్మకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు అన్నాడు
ఐన్స్టీన్ నవ్వుతూ నీ మాటలు బలే చమత్కారం అంటూ డార్విన్ తన అభిప్రాయం చెప్పడం మొదలెట్టాడు." ఇది గుడ్డి నమ్మకాలకు గుణపాఠం " "మన భారతీయులకు జీవం లేని వాటి పై ఉన్న భక్తి ,ప్రేమ ప్రాణాలతో ఉన్న వాటిపై ఉంటే ఒట్టు .శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం లేదు జీరో . మేధస్సును లాకర్లో పెట్టారు రస్టెక్కి పోయింది. ఇంకా చైనా తో పోటీ పడగలదా ! జపాన్ తో సవాల్ విసరగలదా ! అమెరికా ను అధిగమించ గలదా ? ఎప్పుడైతే మనుషులంతా మానవ వాదులు గా హేతువాదులు గా మారినప్పుడే హింసలు నేరాలు అసలే ఉండవు అప్పుడే దేశం రాకెట్ స్పీడ్ లో అభివృద్ధి చెందుతుంది " నీవు చెప్పింది అక్షరాల నిజం బాబాలు , స్వామీలు,పీఠాధిపతుల తో ఒరిగింది ఏమి లేదు కుల మతాల చిచ్చు పెట్టీ దేశం అల్లకల్లోలం చేస్తు వ్యాపారం చేస్తున్నారు.అలాంటి వారిని కూకటి వేళ్ళతో పీకి వేయాలంటే యువశక్తి నడుం బిగించాలి అంటూ ఐన్స్టీన్ విశ్రాంతి గది లోకి వెళ్ళాడు తన స్నేహితుడు ఎప్పుడూ వచ్చిన తనకు ఇష్టమైన కంది పప్పు ,నెయ్యి గుమ్మడి వడియాలు,పెసర పప్పు గారెల తో వేడి వేడి గా మృష్టాన్నం భోజనం పెట్టించడం డార్విన్ కు ఎంతో ఇష్టం డైనింగ్ హాల్ లో వంట మనిషి అన్ని వంటకాలతో వడ్డించడానికి సిద్దముగా ఉంది.
తెల్లటి లాల్చీ పైజామా ధరించి ఐన్స్టీన్ డైనింగ్ హాల్ లో వచ్చి కూర్చున్నాడు . తన కిష్టమైన పౌష్టికారమైన వంటకాలు చూసి గుటక లేసుకుంటూ అన్నాడు." ఇలాంటి వంటకాలు రోజు ఉంటే కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ వంద సంవత్సరాల కన్నా ఎక్కువ బతుకుతాను అన్నాడు ఐన్స్టీన్ అందుకు డార్విన్ స్పందిస్తూ నీ ఆహారపు అలవాట్లు నీ ఆలోచనా విధానం నిన్ను నిత్య నూతనముగా నిండా నూరేళ్ళు గా ఉంచుతుంది .నీ లాంటి విజ్ఞాన పరిశోధకుడు ఉంటే మృత్యువును కూడా జయించవచ్చు వాటిని ప్రోత్సహించే పరిపాలకులు ఎక్కడా ? అన్నాడు డార్విన్ నా గురించి నాకన్నా నీ కే ఎక్కువ తెల్సు అన్నాడు అందుకే నా జీవిత చరిత్ర రాయమని పదే పదే చెబుతున్నా అన్నాడు ఐన్స్టీన్ తప్పని సరిగా రాస్తాను అన్నాడు డార్విన్ ఇద్దరు మృష్టాన్న భోజనాలు చేసి తాంబూలం పుచ్చుకొని ఇంటి ముందు మామిడి చెట్టు కింద కూర్చిండీ వసంత గాలి కి మావి చిగురు కొమ్మ రెమ్మలు ఊగుతుంటే చూసుకుంటూ ఇద్దరు హాయిగా కబుర్లకు దిగారు. ఇంతలోనే పక్కింటి నుండి మధుర మైన రేడియో పాట సన్నగా వినిపిస్తుంది."" ఎచటి నుండి వీచనో ... ..ఈ చల్లని గాలి తీవెల ల పై ఊగుతూ పువ్వుల పై తూగుతూ ప్రకృతి నెల్ల హాయిగా తియ్యగా పరిశింప చేయుచూ "".ఆ పాట రాసిన వారికి పాడిన మహానుభావుడికి దృశ్య చిత్రీకరణకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను అద్భుతం.నన్ను మరో లోకం తీసుకొని పోయింది..అన్నాడు ఐన్స్టీన్ .
మధుర మైన పాటలు సంగీత కచేరీ లు ఆస్వాదించే వారు ఉల్లాసముగానే గాకుండా వారి ఐ.క్యూ. రేట్ ఎక్కువగా ఉంటుంది అన్నాడు డార్విన్ అవునా ! అన్నాడు ఐన్స్టీన్ దీర్ఘాలోచలో పడి మౌనముగా ఉన్నాడు ఐన్స్టీన్ అతని మౌనాన్ని భంగం చేస్తూ నీవేమి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అరుంధతి గురించి కదా! అన్నాడు డార్విన్ అవును అది ఒక రీల్ గా తిరుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంవత్సరమే అరుంధతి మాట కాదనలేక పూరి జగన్నాథ రథ యాత్రకు తీసుకెళ్లా అప్పుడు ఆమె ఆరు నెలల గర్భవతి.రథ యాత్ర చూసినా రథం లాగినా మోక్షం కలుగుతుందని ఆమె నమ్మకం కిక్కిరిసిన జనం లోకి వెళ్లిన మేము ఒక్కసారి తొక్కిసలాట మొదలైంది. ఒకరికి ఒకరు కనిపించ కుండా పోయారు. ఆ క్రమము లోనే జనం హడావుడిగా ఆమెను తొక్కుకుంటూ పోయారు.
నేను ఆమెను చేరుకునే లోపే అపస్మారక స్థితికి పోయింది. డాక్టర్స్ ఆమెను బతికించలేక పోయారు. అప్పుడే ఆ జగన్నాథుడిని తిట్టుకున్నా .సరైన ప్రణాళిక లేని ప్రభుత్వం గుడ్డి నమ్మకాల జనం అరుంధతి ప్రాణం తీసింది. అప్పుడే మూఢనమ్మకాలను కూకటి వేళ్ళతో పీకి వేయాలని సంకల్పించాను. రిటైర్మెంట్ తర్వాత దానిపై ఫోకస్ చేశాను..,"ప్రతి రోజు అరుంధతి నా కలలోకి వచ్చి మీరు పెళ్లి చేసుకోండి.వయసులో ఉన్నారు.నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ""అని చెబుతూనే ఉంది.అయినా నేను పెళ్ళి చేసుకోలేదు .పుట్టబోయే బిడ్డను చూసే భాగ్యం లేదు అని కంటతడి పెట్టుకున్నాడు ఆ విషయం గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాను సారీ అన్నాడు డార్విన్ మనసు బాగా లేదు బొటానికల్ గార్డెన్ పోదాం.అన్నాడు.
ఇద్దరు కార్ లో ఎక్కి గార్డెన్ వచ్చారు.హరిత వనాల ను చూసి కోకిల గానం విని ఆహ్లాదాన్ని ఆస్వాదించారు. పూల తోటలో కూర్చొని మళ్ళీ కబుర్లకు దిగారు. ఇంతకు వదినమ్మ ఎక్కడుంది .ఆమె లేక ఇల్లంతా చిన్నబోయింది అసలు విషయం నీకు చెప్పనే లేదు.ఆమె కుంభ మేళా స్నానాలు చేసి కాలు జారి పడి పోతే వెన్ను పూస ఫ్రాక్చర్ అయి మంచానికే పరిమితం అయింది.అన్నాడు డార్విన్. ఇంతవరకు చెప్పనే లేదు.పదా నేను కూడా వచ్చి చూస్తాను.అన్నాడు ఐన్స్టీన్. ఆమె ఇక్కడికే వస్తుంది.అప్పుడే నిన్ను పిలుస్తాను అన్నాడు డార్విన్ . ఇప్పుడు మనసు ప్రశాంతముగా ఉంది.ఒత్తిడి తగ్గాలి అంటే.హరితవనాలు.సెలయేర్లు చూడాల్సిందే. అన్నాడు ఐన్స్టీన్ నీ విశ్వమానవ సంఘం.అందరి ప్రశంసలు అందుకుంటుంది.సోషల్ మీడియా లో చక్కర్లు గొడుతుంది. హత్యాచారాలు చేసే బాబాలను పూజారులను సాక్ష్యాధారాలతో పట్టించి జైలు లో పెట్టిస్తున్నావు.మహిళా సాధికారత గురించి అవగాహన సదస్సులు పెట్టీ చైతన్య పరుస్తున్నావు. నీ ఆశయాలు అన్ని నెరవేరినట్లే. ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి .అన్నాడు ఐన్స్టీన్ నేను ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాను.అన్నాడు డార్విన్ ఏమిటా నిర్ణయం అన్నాడు ఆశ్చర్యముగా నా నాలుగు కోట్ల ఆస్తిని నీ పేర రిజిస్ట్రేషన్ చేస్తాను.నా కొడుకు గాని నా బార్య గాని ఎలాంటి ఆ క్షేపణ చేయరు.వారి సంతకాలు కూడా పెట్టించాను.
నా చివరి కోరిక ఏమంటే నా ఆస్తి ని అనాథలకు ,మానసిక వికలాంగులకు స్వచ్ఛంద సంస్థలకు కొరకు ఖర్చు పెట్టాలి . అన్నాడు డార్విన్. ఎందుకా నిర్ణయం తీసుకున్నావు ? ఆశ్చర్యముగా అడిగాడు ఐన్స్టీన్ నేను రెండు నెలలు మాత్రమే బతుకుతాను .నాకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ నేను బతుకాలని అనుకున్నా నన్ను బతుక నియ్యదు. అన్నాడు డార్విన్ దీనంగా వెంటనే ఐన్స్టీన్ డార్విన్ ను కౌగలించుకొని ఏడ్చాడు. ఖచ్చితముగా నీ కోరికను నెరవేర్చుతాను. ఇద్దరు కలసి బాబాయ్ హోటల్ లో కాఫీ తాగి ఇంటి ముఖం పట్టారు.దారిలో శివాలయం ముందు.జనం కిక్కిరిసి ఉంది పోలీస్ వారిని తీసుకుంటూ పోతున్నారు.
ఆరోజు శివరాత్రి మహా పండుగ రామనాథ శాస్త్రి ప్రధాన అర్చకుడు భక్తుల కోరిక మేర అభిషేకం చేయుచుండగా సడెన్ కార్డియాక్ అరెస్టుతో శివలింగం పైనే పడి ప్రాణాలు వదిలాడు. అయ్యో ఎంత పని జరిగింది .ప్రతి రోజు శివుని పూజలు చేసి పుణ్యము కట్టుకునే పూజారిని శివుడు రక్షించలేకపోయాడే ? అన్నాడు డార్విన్ . పాపం ఆ శివుడు మాత్రం ఏ చేస్తాడు ఆయన తప్పే లేదు. .ఆ పూజారి ఆహారపు అలవాట్లు జీవన శైలి తల్లిదండ్రులు తో వచ్చిన జీన్స్ ఎలా ఉన్నాయో ఏమో మనకేమి తెల్సు ! అయినా చేసుకున్న పుణ్యాలకు చావుకు లంకేమి. ? పిచ్చి నమ్మకాలు మాత్రమే అన్నాడు ఐన్స్టీన్ అవును నీవు చెప్పింది అక్షరాల నిజమే అనిపిస్తుంది. చాలా విషయాలు మనసు విప్పి మాట్లాడు కున్నాము.వదినమ్మ రాగానే కబురు చెయ్యి.అప్పుడే వస్తాను. మరో విషయం నీ ఆస్తి నాపేర ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తావు అన్నాడు నవ్వుతూ ఐన్స్టీన్ బలే వాడివే మీ వదిన మరియు నా కొడుకు అశోక్ బెంగళూరు నుండి రాగానే వెంటనే చేస్తాను అన్నాడు డార్విన్ రేపటి నుండి నాకు సామాజిక కార్య క్రమాలు ఉన్నాయి బిజీ గా ఉంటా వస్తా మరి అన్నాడు ఐన్స్టీన్ హ్యాపీ జర్నీ అని చెప్పాడు డార్విన్ నెల రోజుల గడచి పోయినాయి.
అశోక్ తన తల్లిని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటిముందు మామిడి చెట్టు కింద కూర్చుండి కాఫీ తాగుతూ కొడుకు భార్యతో కులాసాగా మాట్లాడుతుండగా డార్విన్ కు పిడుగు లాంటి వార్త చెవిలో పడింది. ఐన్స్టీన్ మరియు జస్టిస్ చౌదరి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం సమావేశానికి హాజర్ అయి అమెరికా నుండి తిరిగి వస్తుండగా ఫ్లైట్ సాంకేతిక లోపముతో పసిఫిక్ మహా సముద్రములో కుప్పకూలి ఏబై మందికి పైగా చనిపోయారని " తన ప్రాణ స్నేహితుడి మరణం తట్టుకోలేక అసలే క్యాన్సర్ తో బాధ పడుతున్న డార్విన్ గుండె ఆగి కన్ను మూశాడు తన కళ్ళముందే ప్రాణం విడిచిన భర్త శవం పై పడి పోయింది.కొడుకు అశోక్ తల్లిని కదలించగానే నేలపై వాలి ఈ లోకము విడిచి పెట్టి పోయింది.ఊరు ఊరంతా కదలి వచ్చి కన్నీరు కార్చింది.
అశోక స్నేహితుడు హైదరాబాద్ కలెక్టర్ నవీన్ దగ్గర ఉండి దహన సంస్కారాలు చేయించాడు. డార్విన్ తన ఆస్తి గురించి వారు మాట్లాడుకున్న విషయాలగురించి రాసిన లేఖ చదివి అశోక్ ఎక్కి ఎక్కి ఏడ్చాడు.చిన్న తనంలో తనను అమ్మ ఎత్తుకొని పక్షులను చెట్లను చూయించుతూ తనకు తినిపించిన తీపి గుర్తులు .తండ్రితో చెరువులో ఈత గొట్టిన జ్ఞాపకాలు తన చదువు గురించి తండ్రి పడిన శ్రమ నెమరు వేసుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు.
ఇంటి ముందు మామిడి చెట్టు కొమ్మ కొమ్మ వీచే చిరు గాలి చిన్న బోయినాయి. డార్విన్ కోరిక మేర ఐన్స్టీన్ చేయ వలసిన పనులు అశోక్ చేయడం యాదృచ్చికం .అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి. అనాధాశ్రయానికి ఇల్లు ఇచ్చి వేయడం కడు బీదలకు భూమి పంపకచేయడం అన్ని నెల రోజుల లోపలే జరిగి పోయినాయి. తండ్రి డార్విన్ తల్లి సుగుణ ఐన్స్టీన్ బారీ విగ్రహాలను ఊరి కూడలిలో వారి జీవం ఉట్టి పడేలా ప్రతిష్టింప చేశాడు ఆణిముత్యాల్లాంటి మాటలను శిలా శాసనము పై చెక్కించాడు విజ్ఞాన స్పృహ తో మూఢనమ్మకాలను వీడాలి . చేసుకున్న పుణ్యాలు కర్మ ఫలితాలను మార్చలేవు. తోటి మనిషిని ప్రేమించి మనిషిగా బతుకాలి మానవ కులం మానవ మతం ఒక్కటే మనుషుల్లో మార్పు తను పుట్టిన ఊరు పుష్పశాల నుండి మొదలు కావడం కలెక్టర్ అశోక్ కు ఎంతో తృప్తి నిచ్చింది. """'''""""""""""""""""""""""""""""""""